Fb.com/manaurumanachettu. పెళ్లి కూతురి వింత కోరిక... ఏమి అడిగిందో తెలుసా?
పెళ్లిలో ఆడ పెళ్లివారు అబ్బాయికీ, మగ పెళ్లీ వారు అమ్మాయికీ కానుకలు చదివించడం సహజం. అయితే, 22 ఏళ్ల అమ్మాయి, పెళ్లి పీటలు ఎక్కబోతున్న తరుణంలో తన కాబోయే అత్తమామలను ఒక వింత కోరిక కోరింది. వజ్రాల హారం కొనియ్యమనో లేక పెద్ద కారు కొనియ్యమనో కాదండీ... 10,000 మొక్కల్ని నాటించమని...!! ఆశ్చర్యంగా వుంది కదూ... అవునండీ ఈ ఉదంతం మధ్య ప్రదేశ్ లోని భిండ్ లో చోటు చేసుకుంది. ఆమె ఎవరంటే కిషిపురా అనే గ్రామానికి చెందిన 22 ఏళ్ల ప్రియాంకా భడొరియా.
అక్కడ ఆచారం ప్రకారం వధువుని తనకు కావలసిన నగలో లేక ఇంకోటో పెళ్లి కానుకగా మగపెళ్లి వారు ఇస్తారు. ఇలా మగ పెళ్లివారు వచ్చి ప్రియాంకాను ఏమి కావాలి? అని అడడితే ఆమె తనకు నగలు, డబ్బులు ఏమీ వద్దు ... 10,000 మొక్కల్ని నాటించండి.. అని కోరింది. దీనికి వారు సంతోషంగా అంగీకరించారు. 5,000 మొక్కలని తన తల్లి గారి ఇంటి వద్ద, 5,000 మొక్కల్ని తన అత్త వారి ఇంటి వద్ద ఉంచి అక్కడ చుట్టు పక్కల వారికి పంచి ఇచ్చింది ప్రియాంకా. కరువు వల్ల తన తండ్రి పడిన కష్టాలను చూస్తూ వచ్చిన ప్రియాంకా చిన్నప్పటి నుంచి ఎన్నో మొక్కలను నాటుతూ వచ్చింది. మరో విశేషం ఏమిటంటే, ఆమె వివాహం ఎర్త్ డే రోజునే జరిగింది. ఆమె ముందు చూపు కీ, పర్యావరణం పట్ల అవగాహన చూసి ఆమె భర్త రాజీవ్ చౌహాన్ మురిసిపోయాడట.ఈ మొక్కల లాగే వారి జీవితం కూడా కొత్త చిగురులు వేయాలనీ, మూడు పూవులూ, ఆరు కాయలుగా వర్ధిల్లాలనీ ఆశిద్దాం.