మనఊరు మనచెట్టు

Tuesday, June 02, 2026

పాఠశాలల్లో సరికొత్త పర్యావరణ విప్లవం: ఒక అడ్మిషన్ – ఒక మొక్క! (One Admission - One Sapling)


 పాఠశాలల్లో సరికొత్త పర్యావరణ విప్లవం!

​ఈ రోజుల్లో కాలుష్యం నానాటికీ పెరిగిపోతోంది. ఎండలు మండిపోతున్నాయి, వర్షాలు సకాలంలో పడటం లేదు. పర్యావరణాన్ని కాపాడుకోవడానికి ఎన్నో ఉద్యమాలు చూశాం, కానీ వాటన్నింటికంటే వినూత్నమైన, రేపటి తరాన్ని మార్చే ఒక అద్భుతమైన ఆలోచన ఇప్పుడు తెరపైకి వచ్చింది. అదే "ప్రభుత్వ మరియు ప్రైవేట్ పాఠశాలల్లో ప్రతి కొత్త అడ్మిషన్‌కు ఒక మొక్క నాటడం".
​చదువుతో పాటు పర్యావరణ పరిరక్షణను పిల్లల జీవితంలో ఒక భాగం చేయడానికి ఉద్దేశించిన ఈ కాన్సెప్ట్ గురించి ఈ రోజు పూర్తి వివరాలు తెలుసుకుందాం.
​"ఒక విద్యార్థి – ఒక మొక్క" అంటే ఏమిటి?
​సాధారణంగా ప్రతి విద్యా సంవత్సరం ప్రారంభంలో స్కూళ్లలో వేలాది మంది విద్యార్థులు కొత్తగా చేరుతుంటారు (Admissions). ఈ వినూత్న ఆలోచన ప్రకారం.. ఒక పాఠశాలలో ఎన్ని కొత్త అడ్మిషన్లు జరిగితే, అన్ని మొక్కలను నాటాలి. స్కూల్ యాజమాన్యం కొత్తగా చేరిన ప్రతి విద్యార్థి పేరు మీద ఒక మొక్కను కేటాయిస్తుంది.
​ఈ కార్యక్రమం ఎలా పనిచేస్తుంది?
​ఈ ప్రచారాన్ని క్షేత్రస్థాయిలో విజయవంతం చేయడానికి కొన్ని ముఖ్యమైన పద్ధతులు పాటించవచ్చు:
​నాటే స్థలం: పాఠశాల ఆవరణలో తగినంత స్థలం ఉంటే అక్కడే నాటవచ్చు. ఒకవేళ స్థలం లేకపోతే, విద్యార్థి తన ఇంటి వద్ద గానీ లేదా గ్రామాల్లోని ఖాళీ ప్రదేశాల్లో గానీ నాటవచ్చు.
​మొక్కల ఎంపిక: కేవలం అందం కోసం కాకుండా.. నీడను ఇచ్చే వేప, రావి మొక్కలతో పాటు, నిమ్మ, జామ, మామిడి లాంటి పండ్ల మొక్కలను ఎంచుకుంటే భవిష్యత్తులో అవి ఎంతో ఉపయోగపడతాయి.
​ట్రీ గార్డుల రక్షణ: నాటిన ప్రతి మొక్కను పశువుల నుండి, ఇతర ప్రమాదాల నుండి కాపాడటానికి విధిగా ట్రీ గార్డులను (Tree Guards) ఏర్పాటు చేయాలి.
​మొక్కతో పాటు పెరిగే బాధ్యత (పర్యవేక్షణ)
​మొక్క నాటడం ఒక ఎత్తైతే, దానిని బ్రతికించడం మరో ఎత్తు. దీనికోసం విద్యార్థుల్లో బాధ్యతను పెంచేలా ఒక చిన్న నిబంధన పెట్టవచ్చు. ప్రతి విద్యార్థి తాను నాటిన మొక్కతో ప్రతి సంవత్సరం ఒక ఫోటో (Selfie) దిగి స్కూల్లో సమర్పించాలి. ఆ మొక్కను ఆరోగ్యంగా పెంచే విద్యార్థులకు పాఠశాల తరపున ప్రత్యేక ప్రశంసా పత్రాలు లేదా అంతర్గత మార్కులు (Internal Marks) కేటాయిస్తే పిల్లల్లో ఉత్సాహం మరింత పెరుగుతుంది.
​"మన పిల్లలు పెరగాలి... వారితో పాటే ఈ మొక్కలూ పెరగాలి!"
​ముగింపు (Conclusion):
​విద్యతో పాటు పర్యావరణాన్ని ప్రేమించడం నేర్పడమే నిజమైన సంస్కారం. ప్రభుత్వాలు, ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు, మరియు తల్లిదండ్రులు చేతులు కలిపితే ఈ "ఒక అడ్మిషన్ - ఒక మొక్క" కార్యక్రమం మన భూమిని మళ్లీ పచ్చదనంతో నింపేస్తుంది. మీ ప్రాంతంలోని స్కూళ్లలో కూడా ఈ పద్ధతిని మొదలుపెట్టేలా అధికారుల దృష్టికి తీసుకెళ్లండి.
​మీ అభిప్రాయం చెప్పండి:
ఈ వినూత్నమైన ఆలోచన మీకు నచ్చిందా? మీ పిల్లల స్కూల్లో కూడా ఇలాంటి నిబంధన ఉంటే బాగుంటుంది అనుకుంటున్నారా? కింద కామెంట్ సెక్షన్‌లో మీ అభిప్రాయాన్ని మాతో పంచుకోండి! ఈ పోస్ట్‌ను మీ స్నేహితులకు, టీచర్లకు మరియు స్కూల్ యాజమాన్యాలకు షేర్ చేయండి.

.write by :- praneethkumarsharma
Founder of @manaurumanachettu 

Monday, January 31, 2022

పురాణాల్లో మొక్కల ప్రముఖ్యత

మొక్కలను నాటడమంటే ప్రస్తుత తరానికి, భవిష్యత్తరాలకూ నిలువ నీడను, ఆరోగ్యాన్నీ ప్రసాదించటమే.ప్రసాదించటమే.పద్మ పురాణం  ప్రకారం మొక్కలను నాటించిన వారికి మరణానంతరం స్వర్గ ప్రాప్తి కలుగుతుందట. నేేరేడు మొక్క నాటడం స్త్రీ సంతానదాయకమని, దానిమ్మ ను నాటితే మంచి భార్య వస్తుందని, రావి చెట్టు రోగాన్ని నాశనం చేస్తుందని, మోదుగ విద్యా సంపత్తిని ఇస్తుందని అంటారు. వేప సూర్య ప్రీతికరం. మారేడు శంకర ప్రీతికరం. చింత సేవకుల సమృద్ధిని కలిగిస్తుంది. మంచి గంధం మొక్క ఐశ్వర్యం, పుణ్యాన్ని, సంపెంగ సౌభాగ్యాన్ని, కొబ్బరి భార్య సుఖాన్ని, ద్రాక్ష మంచి భార్యను ఇస్తుందంటారు. ప్రతి వ్యక్తీ తాను నాటిన మొక్కను తన సొంత బిడ్డలాగా పెంచగలిగితే ప్రకృతంతా పచ్చదనం పెరిగి పుణ్యం కలుగుతుంది.

Wednesday, June 09, 2021

పుదీన లో ఉన్న అద్బుతమైన ఔషధ గుణాలు.


                                  manaooru manachettu

పుదీనా నుండి మెంథాల్ తయారు చేస్తారు. పుదీనానుంచి మెంథాల్‌ను లేదా మెంథా-ఆయిల్‌ను డిస్టిలేషన్ విధానం ద్వారా తీస్తారు. ఇది ఆవిరయ్యే తత్వం కలిగినది. నీళ్ల మాదిరిగా కనిపిస్తుంది. సింథెటికల్ ప్రోసెస్ ద్వారా కూడా మెంథాల్ ను తయారు చేస్తున్నారు . ప్రత్యేకమైన, ఆహ్లాదకరమైన వాసనతో ఉంటుంది. ప్రయోగానంతరం చల్లదనాన్ని ప్రసాదిస్తుంది. మన పరిసరాలలో దొరికే ఎంతో విలువైన మొక్కల్లో పుదీనా ఒకటి. దీని శాస్త్రీయనామం మిన్‌థా లామియేసి. ఇది మెంథా స్పైకాటా జాతికి చెందిన మొక్క. సంస్కృతంలో పూతిహ అంటారు. పూతి అంటే వాసన చూసేది అని అర్ధం. తెలుగులో పుదీనా అనీ, ఇంగ్లీష్‌లో మింట్‌ అని, లాటిన్‌లో మెంతా పైపరేటా అనీ పిలుస్తారు. ఇది చూడడానికి ఎంతో విలక్షణంగా ఉండి, దీని ఆకులు మందంగా, కొసలు రంపం ఆకారంలో ఉండి, చాలా మృధువుగా ఉంటుంది. మంచి వన్నె గల ఆకుపచ్చని రంగులో ఉండి, సంవత్సరమంతా ఆకుపచ్చ గానే ఉంటుంది. దీనికి పువ్వులు, ఫలాలు ఎండాకాలం తరువాత నుంచే ఏర్పడతాయి. వీటి ఫలాలు చాలా చిన్నవిగా ఉంటాయి. అనేక ప్రయోజనాలు కలిగిన పుదీనా నుండి చమురు తీసి దానిని వైద్య పరంగా వినియోగిస్తున్నారు. చాలా రకాల వ్యాధులకి తయారు చేసే ఔషధాల్లో పుదీనా (మింట్‌) ఎక్కువ శాతం వాడకంలో ఉండటం వల్ల ప్రపంచవ్యాప్తంగా దీనికి ఎంతో డిమాండ్‌ ఉంది. అందువల్లనే దీనిని వ్్వ్యవసాయ  పద్ధతిలో తగిన విధంగా తోటలు వేసి వ్యవసా యదారులు తగిన రాబడిని, లాభాలని అందుకుంటున్నారు. పుదీనా మొక్కలో ప్రతి భాగం ఉపయోగపడేదే. ఔషధతత్వాలు కలిగివున్నదే. ఒక కంపెనీ ఉత్పత్తి చేస్తున్న 'పుదీన్‌ హర' అనే ఔషధం దీనికి నిదర్శనం. 

ఔషధ గుణాలు

పుదీనా పూర్తి ఔషధ గుణాలు కలిగివున్న మొక్క. చికిత్సా విధానాల్లో దీనిని జీర్ణ సంబం ధవ్యాధులకి ఉపయోగిస్తారు. పుదీనా ఆకుల రసంలో అల్లంరసం, కలబంద గుజ్జు, ఏలకు లు, దాల్చిన చెక్క కలిపి నూరి, ప్రతి రోజూ, 2-3 చెంచాలు సేవిస్తూవుంటే అరుగుదల పెరుగుతుంది. జీర్ణకోశ వ్యాధులకి, కడుపు నొప్పికి, పుదీనా గింజలు కొన్ని నమిలి తిన్న తరువాత గ్లాసుడు వేడినీళ్ళు తాగితే ఎంతో ఉపశమనం కలుగుతుంది.

కొన్ని పుదీనా ఆకుల్ని గ్లాసుడు నీళ్లతో మరిగించి, ఆ కషా యాన్ని సేవిస్తే, జ్వరం తగ్గిపోవడమే కాక కామెర్లు, ఛాతిమంట, కడుపులో మంట, మూత్ర సంబంధవ్యాధులు సమసిపోతాయి.

నెల తప్పిన స్త్రీలు ఒక చెంచాడు పుదీనా రసంలో చెంచాడు నిమ్మరసం, చెంచాడు తేనె కలిపి, ఆరారగా చేతిలో వేసుకుని సేవిస్తూ వుంటే, వాంతులు, ఎసిడిటీ, వంటి వికారాలు తగ్గుతాయి. అలాగే నిద్రలేమికి, మానసిక వత్తిడికి, నోటి వ్యాధులకి కొన్ని పుదీనా ఆకులు గ్లాసుడు వేడి నీటిలో వేసి, మూతపెట్టి అర్ధగంట తరువాత తాగితే చాలా ఉపశమనం కలగజేస్తుంది. మంచి నిద్ర పడు తుంది.

పుదీనా ఆకులు అరచేతిలో బాగా నలిపి ఆరసాన్ని కణతలకి, నుదుటికి రాసుకుంటే, తలనొప్పి తగ్గిపోయి, చల్లదనా న్నిస్తుంది.

చెవి, ముక్కుల్లో ఏర్పడే ఇన్‌ఫెక్షన్‌కి తాజా పుదీనా ఆకులు కొన్ని రసం తీసి దూదిని ఆరసంలో ముంచి, ముక్కులోను, చెవి లోను డ్రాప్స్‌గా వేసుకుంటే వీటి సమస్య తక్ష ణం పరిష్కారమవుతుంది. పుదీనా ఆకులు ఎండబెట్టి చూర్ణం చేసి, అందులో తగినంత ఉప్పు చేర్చి ప్రతినిత్యం దంతధావనం చేస్తే చిగుళ్ళు గట్టిపడి, దంత వ్యాధులు కుండా అరికడుతుంది. అంతేకాక నోటి దుర్వాసనని కూడా అరికడుతుంది.

ఇక శరీరం మీద ఏర్పడే దురద, దద్దుర్లకి కొన్ని పుదీనా ఆకు ల్ని గ్లాసుడు నీటిలో మరగబెట్టి, తగినంత పటిక బెల్లం పొడిని కలిపి తీసుకుంటే ఈ సమస్యనుంచి త్వరగా బయటపడవచ్చు. చిన్న పిల్లలు కడుపునొప్పి ఉప్పరంతో బాధపడుతుంటే గోరువేచ్చని నీటిలో ఐదు ఆరుచుక్కలు పుదీనా రసం కాచి తాగించడం వలన కడుపు ఉబ్బరం, కడుపు నొప్పి తగ్గుతుంది. చిన్న పిల్లలకు జలుబు చేస్తే పుదీనా నుండి తయారయ్యే మెంథాల్ ముద్ద కర్పూరాన్ని .... కొబ్బరినూనెను కొంచెం తీసుకొని మిశ్రమం చేసి ఛాతికీ వీపునకు రాస్తే జలుబు తగ్గుతుందని ఆయుర్వేద వేద్యం సూచిస్తోంది