మనఊరు మనచెట్టు: August 2020

Saturday, August 01, 2020

పిస్తా గురించి రహస్యాలు మీ కోసం 😍👌

పిస్తా లో పోషక పదార్థం ఎక్కువ . పొటాసియం అత్యధికం గా లబిస్తుంది-శరీరము లో ద్రవాల నియంత్రణకు పొటాషియం పనికొస్తుంది . దీనిలో ఉండే బి 6 ప్రోటీన్ల తయారీ , శోషణము లో ఉపయోగపాడుతుంది .మిగిలిన ఎందు పండ్ల తో పోలిస్తే పిస్తా లో కేలరీలు ఎక్కువ . anti-oxidants ఉన్నందున ఇవి గుండె జబ్బులను తగ్గించే గుణం కలిగి ఉన్నాయి . కాన్సర్ రాకుండా కాపాడతాయని తేలినది . పిస్తా లో మోనో శాచ్యురేతేడ్ క్రొవ్వులు అధికం గా ఉన్నందున ఎక్కువగా తినకూడదు ... వారం లో 15 - 20 గ్రాములు మించి తీసుకోకూడదు . రక్తం లో కొలెస్టిరాల్ ను తగ్గిస్తాయి , అతి తక్కువ తిన్నా కడుపు నిండినట్లు గా ఉంటుంది . అందువల్ల ఆహారము తక్కువగా తీసుకోవడం జరుగుతుంది . పొట్టను పెరగ నీయదు . ఏం తింటే మన శరీరానికి తక్కువ కేలరీలతో తక్షణశక్తి సమకూరుతుందో దాని పేరే 'పిస్తా'! ఒక ఔన్సు పిస్తా తింటే మన శరీరానికి160 కేలరీల శక్తి సమకూరుతుంది. 30గ్రాముల పిస్తాకు 87 కేలరీల శక్తి మాత్రమే వస్తుంది.                                  
                              
  • ఇందులో మిగతా నట్స్‌కన్నా ఎక్కువ ప్రోటీన్‌శాతం ఉంది.
  • Pistacchio di Bronte.jpg                              Pistachio macro whitebackground NS.jpg
    ...........
  • ఇందుళొ ఫైబర్‌ ఎక్కువే. మనం తింటే కాదనదు.
  • పిస్తాలో విటమిన్‌ బి6 సమృద్ధిగా ఉందని 'శాస్త్రం' ఘోషిస్తోంది. దాంతోపాటూ చర్మానికి మేలు చేస్తానంటూ విటమిన్‌ ఇ సైతం ఉంది.
  • అసలే కొత్త కొత్తరకాల వ్యాధులు వ్యాపిస్తున్న ఈరోజుల్లో ఇవితింటే రోగనిరోధకశక్తి పెరుగుతుందట!
  • పిస్తాలో పొటాషియం(శరీర సమతుల్యతను కాపాడేది), ఫాస్ఫరస్‌(ఎముకలకు, పళ్లకు బలాన్నిచ్చేది), - మెగ్నీషియం(శరీరశక్తిని సమకూర్చేది) దండిగా కలవు * జీర్ణశక్తిని మెరుగుపరిచే థియామిన్‌ పిస్తాలోనే కొలువుతీరిందిట!
  • ఇవి ఎక్కువగా తిన్నా కొలెస్ట్రాల్‌ పెరగదట. మామూలుగా నట్స్‌ తినాలంటే కొలెస్ట్రాల్‌ పెరుగుతుందనే కదా దూరంగా ఉంటాం?! మరి ఆ దోషం ఇందులో లేనేలేదట!
  • కంటికి అత్యంత అవసరమైన 'ల్యూటిన్‌', 'జియాజాంథిన్‌' ఇందులో ఉందని పరిశోధకులు చెప్పుతున్నారు.
  • హానికారక కొవ్వు అంటూ ఆమడదూరానికి పరుగెత్తుతామే, అది ఇందులో దాదాపు శూన్యమట!
  • మరి ఆరోగ్యపరమైన కొవ్వు సంగతో! సందేహంలేకుండా సరిపడా కలదు. అందుకే సాయం సమయాలు పకోడీ, చిప్స్‌ల వెంట పడకుండా కాసిని పిస్తా పప్పులు నోటిలో వేసుకుంటే ఇన్ని లాభాలు పొందొచ్చు! ఎవరైతే పిస్తా తింటారో వారికి నిండైన ఆరోగ్యం, పొందికైన సౌందర్యం చిక్కుతుంది .