మనఊరు మనచెట్టు: 2015

Monday, November 30, 2015

చింత

చింత ( ఒక వృక్షం. దీన్ని 'భారతదేశపు ఖర్జూరం' అంటారు. ఇది ఫాబేసికుటుంబంలో సిసాల్పినాయిడే ఉపకుటుంబానికి చెందినది. దీని శాస్త్రీయ నామం టామరిండస్ ఇండికా.                                
తెలుగు భాషలో చింత పదానికి వివిధ పద ప్రయోగాలున్నాయి. పెంకుతోనున్న చింతపండును చింతగుల్ల అంటారు. కాయని చింతకాయ అని పండును చింతపండు అని అంటారు. పులిచింత ఒక ఆయుర్వేద మందుగా మరియు ఆవకాయగా వాడు చిన్న మొక్క Oxalis corniculata. Heyne.సీమ చింత చెట్టు, ఎర్రచింత, కారువేగి or చిందుగ అనగా Albizzia odoratissma. ఒక రకమైన చింతచెట్టు. చింతనాగు ఒక విషసర్పం Coluber naga, దీని శరీరం మీద చింతపువ్వు మాదిరి గుర్తులుంటాయి.   

వర్ణన.

చింతచెట్టు ఇంచుమించు 20 మీటర్ల ఎత్తు పెరుగుతుంది. ఇవి వేసవికాలంలో కూడా దట్టంగా ఉండి చల్లని నీడనిస్తాయి. చింతాకులలో 10-40 చిన్న పత్రకాలుంటాయి. చింతపండు గుజురు మధ్యలో గట్టి చింతపిక్కలు ఉంటాయి.

ఉపయోగాలు

దక్షిణ భారతదేశీయుల ఆహారంలో ఇది ముఖ్యమైన భాగం. రసంసాంబారు, రకరకాల పులుసులు,పచ్చడి లో చింతపండు రసం పుల్లని రుచినిస్తుంది.
  • చింతాకు: లేత చింతచిగురును ఆకుకూరలు మాదిరిగా ఉపయోగిస్తారు. కొన్నిరకాల పచ్చడిచేస్తారు. ఫిలిప్పైన్స్ లో చింతాకుతో చేసిన టీ మలేరియా జ్వరానికి వైద్యంగా వాడతారు.
  • చింతకాయ: పులిహోర, పచ్చడి తయారుచేస్తారు.
  • చింతపండు: పులుసు పుల్లదనానికి చాలా ఆహారపదార్ధాలలో ఉపయోగిస్తారు. దీనిని కూరలలోను, సాస్, పచ్చళ్ళు, కొన్ని పానీయాల తయారీలో విస్తృతంగా వాడాతారు. ఆసియాలోచింతపండు పీచు కంచు, రాగి పాత్రల్ని శుభ్రం చేయడానికి మెరుపు తేవడానికి వాడతారు.ఈజిప్టులో చింతపండు రసం చల్లని పానీయంగా సేవిస్తారు. థాయిలాండ్ లో తియ్యని ఒకరకం చింతపండును ఇష్టంగా తింటారు.
  • చింతపిక్కలుబిస్కట్ ల తయారీలో ఉపయోగిస్తారు. చింత గింజలను రైలుల ఇల్లనుండి కొందరు వ్వాపురులు వచ్చి కొంటారు. వాటిని పొట్టు తీసి యంత్రాలద్వారా మెత్తటి పొడి గా తయారు చేస్తారు. దానిని బిస్కెట్ వంటి వాటిల్లో, ఇతర ఆహార పదార్థాలలో వాడుతారు. ఎక్కువగా జిగురు తయారు చేయడానికి దీనిని వాడుతారు. గతంలో సినిమా పోష్టర్లు అంటించ డానికి ఈ పిండితో చేసిన జిగురునే ఎక్కువ వాడేవారు.
  • చింతకొమ్మ: పాఠశాలల్లో పిల్లల్ని శిక్షించడానికి వాడేవారు. (చింతబరిక అంటారు కోనసీమ ప్రాంతంలో)
  • చింతకలప: ఎరుపు రంగులో దృఢంగా ఉండడం వల్ల కలపగా ఇంటిసామాన్లు తయారీలో వాడతారు. చింత కలపను ముఖ్యంగా వంట చెరుకుగానే ఉపయోగిస్తారు. ఇటుకలు కాల్చడానికి ఇటుక బట్టీలలో వీటి ఉపయోగము ఎక్కువ.
  • చింతచెట్టు: రహదారి కిరువైపులా నీడకోసం వీటిని పెంచేవారు.
ఉపయోగాలు
దక్షిణ భారతదేశీయుల ఆహారంలో ఇది ముఖ్యమైన భాగం. రసం, సాంబారు, రకరకాల పులుసులు, పచ్చడి లో చింతపండు రసం పుల్లని రుచినిస్తుంది. చింతకాయలు లేతగా ఉన్నప్పుడు వాటి రసంతో చారు చేస్తారు.లేత చింతకాయలతో చట్నీ చేస్తారు. వాటి గుజ్జును పప్పులో కలుపుతారు, అయితే, లేత చింతకాయలను అధికంగా వాడకూడదు. ఎందుకంటే వీటిని ఎక్కువగా తింటే జలుబు చేస్తుంది. చింతకాయలు ముదిరి గింజ ఏర్పడినప్పుడు వాటితో నిలవ పచ్చడిని తయారుచేస్తారు. ఇవి ప్రత్యేకంగా సీజన్‌లో మాత్రమే లభిస్తాయి. చింతకాయలతో, మిరపపళ్ళను కలిపి నిలవ పచ్చడిని తయారుచేస్తారు కొంతమంది. ముదిరిన చింత కాయకు వేడిచేసే గుణముంది. అది త్వరగా జీర్ణంకాదు. అతిగా తింటే కడుపులో మంట ఏర్పడుతుంది. పండితే సులువుగా జీర్ణమవుతుంది. చింతగుల్లనుంచి వచ్చిన చింతపండును వాడని వారుండరు. చింతపండును ఎండలో కొంత సమయం ఉంచి ఆ తర్వాత వాడటం ఆరోగ్యకరం. ఇందులో ఉండే పుల్లలు, గింజలు తీసి భద్రపరిస్తే పురుగు పట్టదు. చింతపండు తేలికగా అరుగుతుంది. ఆహార పదార్థాలకు రుచిని కలిగిస్తుంది. అమిత దాహాన్ని అరికడుతుంది. కొత్త చింతపండు కంటే పాత చింతపండును వాడటమే ఆరోగ్యకరం. లేత చింత ఆకులను చింతచిగురు అంటారు. దీన్ని ఆకుకూరగా వాడుతారు. చింతచిగురును నీడలో ఎండబెట్టి చింత చిగురు పొడిని తయారు చేస్తారు. ఈ పొడిని అన్నింటిలో కలిపి తింటే ఎంతో రుచిగా ఉంటుంది. రక్తహీనతను తొలగించి, రక్తం పట్టేలా చేస్తుంది. చింతచిగురు రసంలో పటిక బెల్లం కలిపి తాగితే, కామెర్ల వ్యాధికి నివారణ కలుగుతుంది. వాతాన్ని హరిస్తుంది. మూలవ్యాధులకు ఉపశమనాన్ని కలిగిస్తుంది. చింతచిగురు ఉడికించి కీళ్లవాపులకు రాసినట్లయితే వాపు, నొప్పి తగ్గిపోతాయి. చింతపువ్వులను ఆహారంగా కూడా ఉపయోగిస్తారు. వీటితో పప్పు, చట్నీ చేస్తారు. కందిపప్పుతో కలిపి పొడి కూరను చేస్తారు.
  • చింతాకు: లేత చింతచిగురును ఆకుకూరలు మాదిరిగా ఉపయోగిస్తారు. కొన్నిరకాల పచ్చడి చేస్తారు. ఫిలిప్పైన్స్ లో చింతాకుతో చేసిన టీ మలేరియా జ్వరానికి వైద్యంగా వాడతారు.
  • చింతకాయ: పులిహోర, పచ్చడి తయారుచేస్తారు. చింతచెట్టులోని ప్రతి భాగామూ ఉపయోగపడుతుంది. చింతచెట్టు వుంటే చింతే ఉండదంటారు పెద్దలు. ప్రతిరోజు వండే ఆహారపదార్థాల్లో *చింతపండుకు ప్రత్యేకస్థానం ఉంది. చింతచిగురు, లేత చింతకాయలు, ముదురు చింతకాయలు, పండిన చింతగుల్లలు, చింతపువ్వు, చింతగింజలు ఎంతో ఉపయోగపడతాయి.
  • చింతపండు: పులుసు పుల్లదనానికి చాలా ఆహారపదార్ధాలలో ఉపయోగిస్తారు. దీనిని కూరలలోను, సాస్, పచ్చళ్ళు, కొన్ని పానీయాల తయారీలో విస్తృతంగా వాడాతారు. ఆసియాలో *చింతపండు పీచు కంచు, రాగి పాత్రల్ని శుభ్రం చేయడానికి మెరుపు తేవడానికి వాడతారు.
  • ఈజిప్టులో చింతపండు రసం చల్లని పానీయంగా సేవిస్తారు.
  • థాయిలాండ్ లో తియ్యని ఒకరకం చింతపండును ఇష్టంగా తింటారు.
  • చింతపువ్వులను ఆహారంగా కూడా ఉపయోగిస్తారు. వీటితో పప్పు, చట్నీ చేస్తారు. కందిపప్పుతో కలిపి పొడి కూరను చేస్తారు.
  • చింతపిక్కలు: బిస్కట్ ల తయారీలో ఉపయోగిస్తారు.
  • చింతకలప: ఎరుపు రంగులో దృఢంగా ఉండడం వల్ల కలపగా ఇంటిసామాన్లు తయారీలో వాడతారు.
  • చింతచెట్టు: రహదారి కిరువైపులా నీడకోసం వీటిని పెంచేవారు.

వైద్యపరంగా ఉపయోగాలు :

ఇక ఈ చింతచెట్టునుంచి లభ్యమయ్యే అతి ముఖ్య పదార్ధం చింతకాయలు, చింతపండు. వీటిని పచ్చళ్ళలో వంటకాలలో విరివిగా నిత్యం వినియోగిస్తూవుంటారు. గింజలు, ఉట్టి తీసిన
కడుపు ఉబ్బరానికి, జ్వరం, వికారం మొదలైన రోగాలకి మందులా వాడతారు. ఆకలి మందగించినవారు ఉదయాన్నే 4-5 చెంచాల చింతపండు రసాన్ని సేవిస్తే మంచి ఆకలి పుడుతుంది. శరీరంలోని వాపులకి, నొప్పు లకి చింతపండు రసంలో ఉపð కలిపి మసాజ్‌ చేస్తే మంచి ఉపశమనం ఉంటుంది. అలాగే కంకు దెబ్బల వల్ల వచ్చిన వాపులకీ, బెణుకులకి చిక్కటి చింతపండు రసం తీసి దానిని ఉడికించి గోరు వెచ్చగా ఉన్నపðడే ఆ వాపులపై పూస్తే వెంటనే తగ్గుతాయి. భోజనానంతరం రసం (చారు) పోసుకోడంలో ఉన్న మర్మం ఏమిటంటే, ఇది జీర్ణశక్తిని పెంచి తిన్నది తేలికగా జీర్ణం అవుతుంది. అజీర్ణరోగాలకి, జీర్ణశక్తిని పెంచ డానికి చింతపండు దివౌషధంగా ఉపయోగ పడుతుంది. నిత్యం ఈ ఇబ్బందులు ఎదు ర్కొనేవారు. గ్లాసుడు పాలలో కాచి చల్లార్చిన చింతపండు రసం 4-5 చుక్కలు వేస్తే పాలు విరిగిపోయి, పైన నీళ్ళు తేలతాయి. ఆనీటిని గనుక రోజుకు మూడు పూటలా తాగుతూవుంటే ఈ రోగాలనుంచి విముక్తి కలుగుతుందని ఆయుర్వేద శాస్త్రం చెప్తోంది. చింతచిగురు రసంలో పటిక బెల్లం కలిపి తాగితే, కామెర్ల వ్యాధికి నివారణ కలుగుతుంది. వాతాన్ని హరిస్తుంది. మూలవ్యాధులకు ఉపశమనాన్ని కలిగిస్తుంది. చింతచిగురు ఉడికించి కీళ్లవాపులకు రాసినట్లయితే వాపు, నొప్పి తగ్గిపోతాయి. పరకృతిదక్షిణ భారతదేశంలో ప్రజలు ఎక్కువగా చారు, సాంబారు మొదలైనవి ప్రతిరోజూ వాడుతూవుంటారు కాబట్టి మూత్రకోశ వ్యాధులు, మూత్రకోశంలో రాళ్ళు, మొదలైన వ్యాధులు తక్కుగా వుంటాయి. గుండె జబ్బులకు కూడా ఇది మంచి ఉపశమనాన్ని ఇస్తుంది. ఇక చింతగింజలు కూడా ఆరోగ్య విషయంలో ఆయుర్వేదపరంగా ఎంతో విలువైనవి. చింతగింజలు పొడిచేసి ప్రతిరోజు చెంచాడుపోడి నీటిలో కలిపి సేవిస్తూవుంటే ఆమశంక, జిగట విరేచనాలు తగ్గుతాయి. అలాగే తినే పదార్ధంగా అనుపానంగా చింతగింజల పొడిని సేవిస్తూవుంటే రక్తశ్రావం తగ్గుతుంది. చింతపిక్కల పొడిలో పంచదార కలిపి వారం రోజులపాటు తీసుకుంటే, వీర్యస్ఖలనాన్ని నివారిస్తుంది. వీర్యాభివృద్ధిచేస్తుంది. చింతచిగురులో విటమిన్‌ ఎ. సి. ఐరన్‌ పుష్కలంగా వున్నాయి. చింతచిగురుని వంటకాల్లో కూడా వాడడం మనందరికీ తెలిసిన విషయమే. ఇక చింత కర్ర బొగ్గుగా కాల్చి, ఆ బోగ్గుల పొడిలో ఉపð, పిప్పర్‌మెంట్‌ పువ్వు కలిపి పంళ్ళపొడి తయారు చేస్తారు. చింత బొగ్గులపొడిలో నువ్వుల నూనె కలిపి కాలిన చోట రాస్తే కాలిన గాయాలు మానిపోతాయి. అన్నకోశవ్యాదితో బాధపడేవారు లవంగాలు, దాల్చినచెక్క నూరి 10 మి్ప్పలీటర్ల చింతపండు రసంలో కలిపి ప్రతి 4 గంట్ల కొకసారి పుచ్చుకుంటూవుంటే, మంచిగుణం కనబడుతుంది. 120 మిల్లీలీటర్ల చింతపండు రసంలో ఆరు గ్రాముల పంచదార కలిపి సేవిస్తూవుంటే తలతిరగడం తగ్గుతుంది.చింతగింజల పొడి డయేరియాను నివారిస్తుంది. డిసెంటీకి చక్కని ఔషధంగా పనిచేస్తుంది. చింతచెట్టు వేరు గుండె ఆనారోగ్యాలను నివారిస్తుంది. ఈ చెట్టు బెరడు టానిక్‌లా ఉపయోగిస్తుంది. చింతగుల్ల నుంచి చింతపండులో విటమిన్‌ బి, కాల్షియం అధికంగా ఉంటాయి. ఈ విధంగా ఆసియా ఖండంలోని అనేక దేశాలతో పాటు ఆఫ్రికా మొదలైన దేశాలలో కూడా చింత వనరులు ఎంతో వినియోగంలో ఉన్నాయి. చింతలో ఉన్న వెరైటీల్లో తీపి చింత అని ఒకటుంది. ఆ పండు గుజ్జుతో శీతలపానీయాలు తయారు చేసుకుని సేవిస్తూవుంటారు. పులుపు చింతతో ఊర గాయలు తయారుచేసి దేశవిదేశాలలో విక్రయించడంతో దీనికి ప్రపంచ మార్కెట్‌లో ఎంతో స్థానాన్ని పొందింది. వైద్య పరంగా కూడా దీనికి ఉన్న ప్రాముఖ్యత వల్ల ఆయుర్వేదం, హౌమియోపతి, మొదలైన వైద్యవిధానాల్లో ప్రముఖస్థానాన్ని ఆక్రమించిం దంటే ఆశ్చర్యం ఏమీ లేదు.100 గ్రాముల చింతపండు 283 కేలరీల శక్తిని ప్రసాదిస్తుంది. సిట్రిక యాసిడ్‌ గుణాలు కలిగున్న చింతపండు ఆయుర్వేద పరంగా, పులితేనుపులు అరికట్టడానికి,

చింతాకు చిగురు.

చింత చిగురుతో చేసె వంటలు 

 
దీనినే చింత చిగురు అంటారు. అన్ని చెట్లు ఆకు రాల్చే కాలంలో దాని ఆకులన్ని రాలి పోతాయి. అదే విధంగా చింత చెట్టు ఆకులు కూడ రాలి పోతాయి. దాని తర్వాత వాటి స్థానంలో లేత చిగురులు వస్తాయి. ఈ చిగురులను సేకరించి కూరలలో వేసు కుంటారు. చింత చిగురు తోనే కొన్ని వంటకాలు చేసుకుంటారు. ఇది రుచికి పుల్లగా వుంటుంది. చింత చిగురు వేసిన కూరల్లో చింత పండు వేయరు.
  • చింత చిగురు, పళ్లీలు, కలిపి చట్నీ చేస్తారు.
  • చింత చిగురు కంది పప్పు
  • వంకాయలతో చింత చిగురు వేసి చేసే కూర,
  • చింత చిగురులో చేపలు వేసి చేసే కూర,
  • చింత చిగురు రొయ్యలు కూర చాల ప్రత్యేకంగా వుంటుంది.
  • ఇలా ప్రతి కూరలోను చింత పండు బదులు చింత చిరుగు వేస్తే అది చాల రుచికరంగా వుంటుంది.
  • చింత చిగురు ఎక్కువ దొరికి నప్పుడు దాన్ని కచ్చ పచ్చగా రుబ్బి వడల ఆకారంలో చేసి వాటిని ఎండ బెట్టుకొని భద్ర పరుచుకొని చాల కాల వాడు కుంటారు. ఇవి కొన్ని నెలలు నిలవ వుంటాయి. చింత పండు వేసిందానికన్న దీన్ని వేసి కూరలు చేస్తే ఆ కూరలు చాల రుచికరంగా వుంటాయి.

కృతజ్ఞతలు

ఈ బ్లాగుని ఆదరిస్తున్న ప్రతీ ఒక్కరికి నా హృదయ పూర్వక కృతజ్ఞతలు. మీ మనఊరుమనచెట్టు

www.facebook.com/manaurumanachettuofficial
http://manaurumanachettu.blogspot.in

Saturday, November 28, 2015

దానిమ్మ

 దానిమ్మ ప్రపంచ వ్యాప్తంగా గాలిలో తేమ లేని పొడి వాతావరణం గల ప్రదేశాలలో వాణిజ్యపరంగా దానిమ్మ (Pomegranate) సాగవుతోంది. దీనిని "దామిడీ వృక్షమ్" ఆని కూడా అంటారు. భారతదేశంలో కర్ణాటక రాష్ట్రంలోని చిత్రదుర్గ జిల్లా దానిమ్మ సాగులో ప్రథమస్థానంలో ఉంది. తెలంగాణా రాష్ట్రంలోని, మహారాష్ట్రలో షోలాపూర్, నాగ్పూర్ జిల్లాలలోని రాష్ట్రంలో కూడా దానిమ్మ సాగు జరుగుచున్నది. మనదేశం నుంచి 4000-5000 టన్నుల దానిమ్మ పండ్లు ఎగుమతి అవుతున్నాయి. దానిమ్మ భారతదేశంలో అత్యంత ఖరీదైన ఫలము.
లలితా సహస్రనామాల్లో అమ్మవారికి 'దాడిమికుసమప్రభ' అనే నామం కనిపిస్తుంది. దీని శాస్త్రీయ నామము " Punica Granatum". పండ్ల జాతులలో మేలైనది . తినడానికి రుచిగా ఉంటుంది . దీనిలో విటమిను -ఎ,సి, ఇ ,బి5, flavanoids ఉన్నాయి.
దానిమ్మ మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఎర్రగా నిగనిగ లాడుతూ కంటికి ఇంపుగా కనిపించేదానిమ్మ గింజలు ఆరోగ్యానికి అనేక విధాలుగా ప్రయోజనం కలిగిస్తాయి . పండులోని " ఇల్లాజిక్ యాసిడ్ " ను చర్మం పై రాస్తే సూర్యకిరణల తాలూకు ప్రభావము నుంచి రక్షింస్తుంది .
ఔషద విలువలు
అత్యంత శక్తిమంతమైన యాంటీఆక్సిడెంట్ల సమాహారం దానిమ్మ. ఇవి కణాల విధ్వంసానికి కారణమయ్యే ఫ్రీరాడికల్స్‌ పని పట్టి వృద్ధాప్యాన్ని దూరం చేస్తాయి. అల్జీమర్స్‌, వక్షోజ క్యాన్సర్‌, చర్మ క్యాన్సర్లను అడ్డుకుంటాయి.
దానిమ్మ సహజ యాస్పిరిన్‌. రక్తసరఫరాను తగినంతగా వేగవంతం చేస్తుంది. పావు కప్పు రసం రోజూ తాగితే మీ గుండె ఎంచక్కా భద్రంగా బీరువాలో ఉన్నట్టే.
ఎముకల ఆరోగ్యానికి కూడా దానిమ్మ చాలా మంచిది. ఆస్టియోఆర్థ్రయిటిస్‌తో బాధపడేవారికి అత్యంత రుచికరమైన మందు దానిమ్మ పండు, రసం.
సహజ ఆస్ప్రినే కాదు... దానిమ్మ ప్రకృతి మనకు అందించిన సహజ వయాగ్రా కూడా. దానిమ్మ రసం రక్తాన్ని ఉరకలు వేయిస్తుంది. అంగస్తంభన సమస్యలతో బాధపడేవారికి సరైన ఔషధం. సంతాన సాఫల్యతను పెంచే శక్తీ ఉంది దీనికి.
గర్భస్థశిశువుల ఎదుగుదలకు అత్యవసరమైన ఫోలిక్‌ యాసిడ్‌ ఈ పండులో పుష్కలంగా లభిస్తుంది. గర్భిణులు రోజూ ఒక గ్లాసు దానిమ్మ రసం తాగితే మంచిది. దీనివల్ల నెలలు నిండకుండానే ప్రసవం అయ్యే ముప్పు కూడా తప్పుతుందని ఒక అధ్యయనం.
వయసు పెరిగే కొద్దీ ఏర్పడే ముడతలను కూడా నివారిస్తుంది దానిమ్మ రసం. నీళ్లవిరేచనాలతో బాధపడేవారికి మంచి మందు ఇది.
ఇందులో ఉండే యాంటీ బ్యాక్టీరియల్‌, యాంటీ వైరల్‌ గుణాలు నోటి పూతనుంచి ఉపశమనాన్ని కలుగజేస్తాయి. అల్సర్లను నివారిస్తాయి. దంతాల చిగుళ్లను బలపరుస్తాయి.
రుతుస్రావ సమయంలో ఉండే ఇబ్బంది, ఒత్తిడి వంటి సమస్యలకు విరుగుడు దానిమ్మ రసం. దానిమ్మ రసము అంగసంభాన సమస్యలను నివారిస్తుంది ... శృంగార ప్రేరితంగా పనిచేస్తుంది గుండె (హృదయము) కు మేలు చేస్తుంది . దానిమ్మ రసములోని రసాయనాలు 'కొలెస్టరాల్ ' వల్ల జరిగే ప్రమాదాల జోరును తగ్గిస్తుంది . రక్తపోటును తగ్గించే గుణము దీనికి ఉంది - inhibit the angiotenson converting enzyme .రక్తనాళాలు ముసుకుపోయే గుణము నుండి రక్షిస్తుంది . ఫ్లవనోయిడ్స్ వలన కాన్సర్ వ్యాధి వచ్చే అవకాసము తగ్గుతుంది . దానిమ్మ గింజల ,నూనె ... రొమ్ము కాన్సర్ అదుపుచేయు లక్షణము కలిగివుంది .
వారానికోసారి దానిమ్మ రసము :
అధికరక్తపోటు తో బాధపడు తున్నా లేక ట్రైగ్లిసరైడ్స్ 100 దాటి వున్నా లేదా గుండెను కాపాడే హెచ్.డి.ఎల్. కొలెస్టిరాల్ 50 కన్నా తక్కువగా ఉన్నా... ప్రతివారము ఒకసారి గ్లాసు దానిమ్మరసము తాగడము మంచిది. . గుండెజబ్బులున్నవారికి మేలు చేస్తుంది . మూత్రపిండాల సమస్యలున్నవారికి బాధలను నివారిస్తుంది. దానిమ్మ రసమ్ జీర్ణక్రియ మెరుగుపరుస్తుంది [1]. దానిమ్మగింజలు నోటిలో వేసుకుని నమలడము కన్న దాన్ని రసము తీసుకొని తాగడము మేలు ... మంచిది .
దానిమ్మ చెట్టు
ముళ్ళతో ఎదిగే పెద్ద పొద లేదా చిన్న వృక్షం.
విపరీత అండాకారంలో గురు అగ్రంతో ఉన్న సరళ పత్రాలు.
గ్రీవాలలో ఏకాంతంగా గాని, నిశ్చిత సమూహాలుగా గాని అమరిన దట్టమైన ఎరుపురంగు పుష్పాలు.
గుండ్రంగా ఉన్న మృదుఫలాలు.
కోణయుత విత్తనాలు.
సాగు
దానిమ్మ సాగుకు తేమ లేని పొడి వాతావరణం, తక్కువ వర్షపాతం, నీరు నిలవని గట్టి గలస నేలలు అవసరం. చుట్టుప్రక్కల చెరువులు గాని, నదులు గాని, వరి పొలాలు గాని ఉన్న దానిమ్మతోటల్లో ఎక్కువ చీడపీడల ప్రభావం ఉంటుంది. దానిమ్మకు సాధారణంగా 2.50 అంగుళాల బోరు నీరు సరిపోతుంది. అందువల్ల దానిమ్మ రైతులు సాధారణంగా నీటి కరవు ఉన్న అటవీ ప్రాంతాలను ఎంచుకుంటారు. అంటు మొక్క నాటిన 18 నెలలకు పుష్పించి ఫలాలు ఇస్తాయి. ఒక్కొక్క దానిమ్మ మొక్క సగటున 2 నుండి 10 లీటర్ల నీరును పీల్చుకుంటుంది. ఎండాకాలంలో ట్యాంకర్లతో నీరు తెప్పించాల్సివుంటుంది. ఎరువులు - కలుపు - పురుగు మందుల యాజమాన్యం సకాలంలో ఉండాలి. చుట్టు ప్రక్కల ఇతర పంటలు ఉన్నా దానిమ్మకు వైరస్ తెగులు వచ్చే అవకాశాలు ఎక్కువ. మొక్కలు నాటిన మొదటిలో బొప్పాయి అంతర పంటగా వేస్తారు. వరుసగా సుమారు 5 సంవత్సరాలకు మించి దానిమ్మ ఒకే చోట సాగు చేయడం మంచిది కాదు. సముద్ర తీర ప్రాంతాలు, నదీతీర ప్రాంతాలు దానిమ్మ సాగుకు ప్రతికూలం.
ఉపయోగాలు
దానిమ్మ బెరడు, తొక్క, గింజలను విరోచనాల నివారణకు ఔషధంగా వాడుతారు.
దానిమ్మ పండు రసం కుష్టు వ్యాధికి పనిచేస్తుంది.
దానిమ్మ వేరు బెరడు, కాండం, ఆకుల నుంచి టానిన్‌లను తయారు చేయవచ్చు.
దానిమ్మ పండ్ల తోలు, పూలను బట్టలకు రంగు అద్దే పరిశ్రమలో ఉపయోగిస్తున్నారు.
పండ్ల నుంచి ద్రాక్ష వైన్స్‌ కంటే మేలైన వైన్‌ తయారు చేయవచ్చు.
ఈ ఆకులను కొద్దిగా దంచి కాచి కషాయం చేసి దానిలో తగినంత చక్కెర కలిపి సేవిస్తే.. ఉబ్బసం, అజీర్తి వంటి దీర్ఘ రోగాలే కాక, దగ్గు, వడదెబ్బ, నీరసం నుండి ఉపశమనం కలుగుతుంది. కాళ్ళ వాపులకు ఈ ఆకును వాపు ఉన్న చోట కడితే.. తగ్గుతాయి.
ఔషధ గుణాలు
1.దానిమ్మ సహజ యాస్పిరిన్‌. రక్తసరఫరాను తగినంతగా వేగవంతం చేస్తుంది. పావు కప్పు రసం రోజూ తాగితే మీ గుండె ఎంచక్కా భద్రంగా బీరువాలో ఉన్నట్టే.
2.ఎముకల ఆరోగ్యానికి కూడా దానిమ్మ చాలా మంచిది. ఆస్టియోఆర్థ్రయిటిస్‌తో బాధపడేవారికి అత్యంత రుచికరమైన మందు దానిమ్మ పండు, రసం.
3.వయసు పెరిగే కొద్దీ ఏర్పడే ముడతలను కూడా నివారిస్తుంది దానిమ్మ రసం. నీళ్లవిరేచనాలతో బాధపడేవారికి మంచి మందు ఇది.
4.దానిమ్మ రసాన్ని శరీరం మీద రాయడం చేత అలర్జీలు, కిటకాలు కుట్టడం వలన వచ్చిన పొక్కులు మానిపోతాయి.
5.దానిమ్మ పండు తొక్క గాయాలకు ఔషధం, వాపును అరికడుతుంది.
6.గొంతు రోగాలకు ఔషధం దానిమ్మ. దానిమ్మ పళ్ళు, పువ్వులు, ఆకులు, వేర్లు అన్ని ఔషధ గుణాలు కలిగినవై ఉంటాయి.
7.దీని ఆకులకు నూనె రాసుకుని వాపు ఉన్న చోట కడితే కల్లవాపులు తగ్గుతాయి.
దాడిమీ పత్రిసవరించు
ఈ పత్రి దాడిమీ వృక్షానికి చెందినది. వినాయక చవితి రోజు చేసుకునే వరసిద్ధివినాయక ఏకవింశతి పత్రి పూజా క్రమములో ఈ ఆకు పన్నెండవది.
భౌతిక లక్షణాలుసవరించు
ఈ ఆకు ఎరుపు రంగులో ఉంటుంది. ఆకారం గుండ్రంగా ఉంటుంది. పరిమాణం చిన్నది. ఈ చెట్టు గుబురుచెట్టుగా పెరుగుతుంది.
సువాసన గుణంసవరించు
ఈ పత్రి పసరు వాసన వస్తుంది.
ఇతర ఉపయోగాలుసవరించు
ఈ పత్రితో ఉన్న ఇతర ఉపయోగాలు :
1.పండ్ల నుంచి ద్రాక్ష వైన్స్‌ కంటే మేలైన వైన్‌ తయారు చేయవచ్చు.
2.దానిమ్మ పండు రసం కుష్టు వ్యాధికి పనిచేస్తుంది.
3.దానిమ్మ బెరడు, తొక్క, గింజలను విరోచనాల నివారణకు ఔషధంగా వాడుతారు.
4. దానిమ్మలొ యాంతిఆక్సిదెంత్స్ ఉందతంవలన ఆరొగ్యనికి చాలా మంచిధి .
ఆయుర్వేదంలోసవరించు
ఈ పత్రి ఉల్లేఖన ఆయుర్వేదంలో ఉంది. ఇది కుష్టు వ్యాధికి, రోగాల నివారణకు ఉపయోగపడుతుంది.

రేగు

రేగు ఒక పండ్ల చెట్టు.[1] ఇది జిజిఫస్ ప్రజాతికి చెందినది. ఇందులో 40 జాతుల పొదలు మరియు చిన్న చెట్లు రామ్నేసి (Rhamnaceae) కుటుంబంలో వర్గీకరించబడ్డాయి. ఇవి ఉష్ణ మండలం అంతటా విస్తరించాయి.
లక్షణాలు
వీని ఆకులు ఆల్టర్నేట్ పద్ధతిలో ఏర్పడి 2–7 సెంమీ (0.79–2.76 in) పొడవు ఉంటాయి. వీని పుష్పాలు చిన్నవిగా పసుపు-ఆకుపచ్చ రంగులో ఉంటాయి. రేగు పండు 1–5 సెంమీ (0.39–1.97 in) పొడవుగా ఉండి, డ్రూప్ జాతికి చెందినది. ఇవి పసుపు-కాఫీ రంగు, ఎరుపు లేదా నలుపు రంగులో గుండ్రంగా ఉంటాయి. ఇవి తినడానికి తియ్యగా చిన్న పులుపు రుచితో ఉంటాయి. రేగు పండ్లు వాటి పరిమాణము, రంగు, రుచి ని బట్టి సుమారు తొంబై రకాలున్నాయి. సాధారణంగా మనకు కనుపించేవి రెండు రకాలు. ఒకరకం కొంచెం ఎరుపు రంగు కలిగి గుండ్రంగా వుంటాయి. వీటిలో గుజ్జు తక్కువగా వుండి గింజ పెద్దవిగా వుంటాయి. తినడానికి ఇవి కొంత పులుపు దనం తియ్యదనం కలిసి బా వుంటాయి. రెండో రకం కోలగా వుండి పెద్దవిగా వుంటాయి. వీటి రంగు కూడ చిన్న వాటి లాగె వుంటుంది. కండ ఎక్కువగా వుండి కొరికి తినడానికి బాగా వుంటాయి. ఇవి కొంత తీపిదనం కలిగి కమ్మగా చాల బాగ వుంటాయి. వీటినే పెద్ద రేగు లేదా గంగ రేగు అంటారు.
Fresh jujube fruits.
రేగు పండ్లు
రేగు పండ్లు పుల్లపుల్లగా, తియ్యతియ్యగా వుంటుంది. వీటిని భానుడికి చిహ్నంగా భావిస్తారు. సంక్రాంతి సమయంలో భోగి రోజున పిల్లలు భోగభాగ్యాలతో తులతూగాలని ఈ పండ్లను పోస్తారు. భోగినాడు పోస్తారు కాబట్టి వీటిని భోగిపండ్లు అంటారు. రేగు పళ్లకు రకరకాల పేర్లున్నాయి. వీటిని జిజిఫుస్‌ మారిటియానా, నార్‌కెలి కల్‌, బెర్‌, బోరీ, బోర్‌, బెరి అని వివిధ రకాలుగా వివిధ ప్రాంతాలలో పిలుస్తారు. ఈ చెట్లు త్వరగా పెరుగుతాయి. మూడు సంవత్సరాల్లోనే పండ్లనిస్తాయి.
తినే విధానాలు
ఎండిన పండ్లను స్నాక్స్‌లాగా, టీ తాగేప్పుడు తీసుకుంటారు. రేగిపళ్ల గుజ్జుతో టీ కూడా చేస్తారు. రేగు పళ్లతో జ్యూస్‌, వెనిగార్‌లను కూడా తయారుచేస్తారు. పశ్చిమ బెంగాల్‌లో, బంగ్లాదేశ్‌లో వీటితో పచ్చడి చేసుకుంటారు. చైనీయులు వీటితో వైన్‌ను కూడా తయారుచేస్తారు. వారు బెరుజు అనే ద్రవంలో వాటిని నిలవ చేస్తారు. అలా అవి మూడు నాలుగు నెలల వరకు తాజాగా ఉంటాయి. రేగు పళ్లను ఎండబెట్టి వాటిలోని విత్తనాలు తీసి చింతకాయలు, ఎర్రని పచ్చిమిరపకాయలు, ఉప్పు, బెల్లం వేసి దంచుతారు. దీన్ని భోజనంతో కలిపి తింటారు. వీటితో వడియాలు కూడా చేస్తారు. రేగుపళ్లలో మంచి పోషకాలే కాక 'సి' విటమిన్‌ సమృద్ధిగా ఉంటుంది. జామకాయ తరువాత ఎక్కువగా ఇందులోనే ఉంటుంది. మనదేశంలో ఎక్కువగా వీటిని నేరుగా తింటారు. వీటితో రేగు తాండ్ర కూడా చేసుకుంటారు. ఒంటెలు, మేకలు, ఇతర పశువులకు వీటి ఆకులు మంచి పోషకాహారం. ఇండోనేషియన్లు ఆకులతో కూర చేసుకుని తింటారట.
నమ్మకాలు
ఈ పండ్ల తియ్యటి వాసనకు టీనేజ్‌ వాళ్లు ప్రేమలో పడతారట. అందుకే హిమాలయ, కారకోరమ్‌ ప్రాంతాలలోని పురుషులు స్త్రీలను ఆకర్షిండానికి పూత ఉన్న రేగు కొమ్మను టోపీల మీద పెట్టుకుంటారు. అంతేకాదు గర్భధారణ శక్తిని పెంచుతుందని చైనీయులు తమ పడకగదిలో రేగు పండ్లను, ఆక్రోటు కాయలను పెట్టుకుంటారు. భూటాన్‌లో సువాసన కోసం ఇళ్లలో సాహిత్య సంకలనం లాగా ఉపయోగిస్తారు. వాటిని ఇంట్లో పెట్టుకోవడం వల్ల కీటకాలు రావట.
రేగు సాగు
భారతదేశంలో 90 రకాలకు పైగా రేగుపళ్లను సాగుచేస్తున్నారు. ఒక చోట మొలిచిన రేగు పళ్ల చెట్టును ఇంకో చోట నాటితే అవి బతకవు. అందుకే ముందుగా ఎక్కడ వెయ్యదలచుకుంటే అక్కడ విత్తనాలను పెట్టాలి. మనదేశంలో ఈ పండ్లు అక్టోబర్‌ ప్రారంభంలో, ఇతర ప్రాంతాలలో ఫిబ్రవరి, మార్చి నెలల్లో వస్తాయి. మనదేశంలో సంవత్సరానికి ఒక్కో చెట్టు 5,000 నుండి 10,000 పండ్లను ఇస్తుంది. అంటు కట్టిన చెట్లైతే 30,000 వరకూ ఇస్తాయి. ప్రత్యేకంగా సాగు చేస్తే అధిక ఉత్పత్తిని సాధించవచ్చు. పాకిస్తాన్‌, బంగ్లాదేశ్‌, ఆస్ట్రేలియాలోని కొన్ని ప్రాంతాలలో వీటి సాగు చేస్తారు.
బదరీపత్రి
ఈ పత్రి రేగు వృక్షానికి చెందినది.దీనిని ‘రేగు’పత్రి అని కూడా పిలుస్తారు. ఇది చిన్న పిల్లలకు సంబంధించిన వ్యాధుల నివారణకు దివ్యౌషధంగా పనిచేస్తుంది. ఒకటి లేదా రెండు ఆకులను ప్రతిరోజూ ఒకటి లేదా రెండు పూటలు తినిపిస్తే వ్యాధులు పూర్తిగా నయమవుతాయి. (ఎక్కువగా తింటే కఫం వచ్చే ప్రమాదముంది).వినాయక చవితి రోజు చేసుకునే వరసిద్ధివినాయక ఏకవింశతి పత్రి పూజా క్రమములో ఈ ఆకు ఐదవది. ఈ ఆకు ముదురు పచ్చ రంగులో ఉంటుంది. ఆకారం గుండ్రంగా ఉంటుంది. పరిమాణం చిన్నది. ఈ చెట్టు గుబురుచెట్టు గా పెరుగుతుంది.
ఔషద గుణాలు
రేగు పండు చూడ్డానికి చిన్నగా వుంటుంది.పచ్చిగా వున్నప్పుడు ఆకుపచ్చ రంగులో వున్నా, పక్వానికొచ్చాక రంగు మారుతుంది. పసుపు, ఆ పై ఎరుపు రంగుకు వస్తుంది. మన దేశంలో 90 రకాల రేగుపండ్లను పండిస్తున్నారు. ఇది మంచి ఔషధకారి. రేగు పండులో ఔషద గుణాలు చాల వున్నాయి. వీటిని తింటే కడుపులో మంట తగ్గుతుంది. అజీర్తికి చాల మంచిది. గొంతు నొప్పిని,ఆస్తమాని కండరాల నెప్పిని తగ్గించే గుణం దీనిలో వుంది. రేగు పందు గింజ చాల గట్టిగా వుంటుంది. వీటిని పొడి చేసి నూనెతో కలిపి రాసు కుంటే కీళ్ల నొప్పులు తగ్గుతాయి. రేగు చెట్టు బెరడును నీళ్లలో మరిగించి డికాక్షన్ గా తాగితే నీళ్ల విరేచనాలకు బలేబాగ పని చేస్తుంది. కొన్ని ప్రాంతాలలో రేగు పండ్ల గుజ్జుతో వడియాలు పెట్టుకుంటారు.
చేతి నిండుగా రేగుపండ్లను ఒక అరలీటరు నీళ్లలో వేసి అవి సగం అయ్యే వరకు మరగనివ్వాలి. దానికి పంచదార కానీ తేనె గానీ కలిపి దానిని రోజూ పడుకోబోయే ముందు తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది. రక్తంలోకి గ్లుంటామిక్‌ ఆమ్లం ఎక్కువగా విడుదలై మెదడు బాగా పనిచేయడానికి ఉపకరిస్తుంది.
రేగు పండ్లు తరచూ జ్వరం, జలుబు రాకుండా చేస్తాయి. శూలనొప్పి, డయేరియా, రక్త విరేచనాలను అరికట్టడానికి రేగి చెట్టు బెరడును ఉపయోగిస్తారు. బెరడు కషాయం మలబద్ధకానికి బాగా పనిచేస్తుంది. రేగు ఆకులను నూరి దాన్ని కురుపులు వంటి వాటి మీద రాసుకుంటే త్వరగా నయమవుతాయి.
రేగు పండు తీయని పండే కాదు మంచి హెర్బల్‌ మందుగా కూడా పనిచేస్తుంది.
ఇవి బరువు పెరగడంలో, కండరాలకు బలాన్నివ్వడంలో, శారీరక శక్తినివ్వడంలో ఎంతగానో ఉపయోగపడతాయి.
కాలేయం పనిని మరింత చురుకు చేయడానికి చైనీయులు ప్రత్యేకంగా రేగిపండ్లతో చేసినా టానిక్‌ను ఎంచుకుంటారు.
ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుందని జపనీయుల పరిశోధనలో తేలింది. ఇవి విరుగుడుగా, కఫోత్సారకంగా, మూత్ర స్రావకానికి ప్రేరకంగా ఉపయోగపడుతుంది.
అంతేకాదు బాధానివారిణి, క్యాన్సర్‌ వ్యతిరేకి, ఉపశమనకారి. ఇది రక్తాన్ని శభ్రం చేస్తుంది. జీర్ణశక్తిని పెంచుతుంది. ఆకలి లేమి, *క్తహీనత, నీరసం, గొంతునొప్పి, శ్వాసనాళాల వాపు, విసుగు, హిస్టీరియా వంటి వాటి నివారణా మందులలో దీన్ని వాడతారు.
విత్తనాలు కూడా అనేక ఔషధగుణాలను కలిగి ఉంటాయి. నిద్రలేమి నివారణకు విత్తనాలను వాడతారు. అజీర్తిని అరికట్టడంలో దాని వేర్లను ఉపయోగిస్తారు.
వేర్లను పొడి చేసి పాత గాయాలకు పెడితే త్వరగా ఉపశమనం కలుగుతుంది. ఆకులు జ్వరసంహారిగా ఉపయోగపడతాయి.
వెండ్రుకలు పెరగడానికి రేగుపండ్లు దోహదం చేస్తాయి. వేళ్లతో, బెరడుతో చేసిన రసం కీళ్లవాతానికి బాగా పనిచేస్తుంది.
అయితే ఎక్కువ తీసుకుంటే ప్రమాదం. పూలతో చేసిన కషాయం ఐ లోషన్‌గా ఉపయోగపడుతుంది.
ఇది 5 నుండి 10 మీటర్ల పొడవు వరకు పెరిగే ఆకురాల్చే చెట్టు లేదా పొద. మంచి పండ్లను ఇవ్వడానికి దీనికి ఎక్కువగా నీరు అవసరమైనా అధిక ఉష్ణ్రోగ్రతను, అతి శీతలాన్ని కూడా తట్టుకుంటుంది. 7-13 డిగ్రీల సెల్సియస్‌ల నుండి 50 డిగ్రీల వరకు ఈ చెట్లు తట్టుకుంటాయి. చైనీయులు, కొరియన్లు వత్తిడి తగ్గించడానికి సాంప్రదాయక మందులలో వీటిని వాడతారు. చైనీయులు వీటిని 'హోంగ్‌ జావో లేదా హెయి జావో' అని అంటారు.
ఆయుర్వేదంలో
ఈ పత్రి ఉల్లేఖన ఆయుర్వేదంలో ఉంది. ఇది రక్తహీనత, నీరసం, గొంతునొప్పి, శ్వాసనాళాల వాపు, విసుగు, హిస్టీరియా రోగాల నివారణకు ఉపయోగపడుతుంది.
పోషకాలు
100 గ్రాముల తాజా రేగు పండ్లలో
కార్బో హైడ్రేట్లు - 17 గ్రా
చక్కెర - 5.4 నుండి 10.5 గ్రా
కొవ్వు పదార్థం - 0.07గ్రా
పీచు పదార్థం - 0.60గ్రా
ప్రోటీన్లు - 0.8 గ్రా
నీరు - 81.6 - 83. 0 గ్రా
తయామిన్‌(బి1 విటమిన్‌) - 0.02 నుండి 0.024 మిగ్రా(2శాతం)
రైబోఫ్లేవిన్‌(బి2) - 0.02 నుండి 0.038 మి.గ్రా(3శాతం)
నియాసిన్‌(బి3) - 0.7 నుండి 0.873 మి.గ్రా(5 శాతం)
కాల్షియం - 25.6 మి.గ్రా(3 శాతం)
ఇనుము - 0.76 నుండి 1.8 మిగ్రా
ఫాస్పరస్‌ - 26.8 మిగ్రా ఉంటాయి

పనస

పనస (ఆంగ్లం Jackfruit) ఒక పండ్ల చెట్టు. పనస మల్బరీ కుటుంబానికి చెందిన చెట్టు. తూర్పు ఆసియా దీని జన్మస్థలం. ప్రపంచంలోనే అతి పెద్ద పండును ఇచ్చే చెట్టు ఇదే. దాదాపు ఒక్కోటి 36 కేజీలుంటుంది. 90 సెంటీమీటర్ల పొడవు, 50 సెంటీమీటర్ల వ్యాసం కలిగి ఉంటాయి. పనసపండును కోసేప్పుడు చాకుకు, చేతులకు నూనె రాసుకోవడం వల్ల దాని జిగురు చేతులకు అంటదు. పండ్లు మానవుడికి ప్రకృతి ప్రసాదించిన అపురూపమైన వరము .ఆయా సీజన్లలో పండే పండ్లను ఆరగించడం మనకు తరతరాలు గా తెలుసును . అన్నం తో అవసరం లేకుండా ప్రకృతిసిద్ధమైన పండ్లు , కూరగాయలు ఇతర త్రుణధన్యాలను ఆహారం గా ఆహారముగా తీసుకుని జీవించినట్లయితే శరీరానికి కావససిన అన్నిరకాల పోషకాలు లభిస్తాయి ... ఇదే అసలు ఉత్తమమైన జీవన విధానమని ప్రకృతి వైద్యుల నమ్మకం . పనస తొనలు తినడానికి చాలా రుచిగా ఉంటాయి . మనప్రాంతములో పనసను ఎక్కువగా విందు భోజనాలలో కూరగా వాడుతారు . పనస పొట్టు తో ఆవపెట్టినచో ఉరగాయగా వాడవచ్చును . దీనిని సంస్కృతంలో “స్కంధఫలం” అని, హిందీలో “కటహక్‌-కటహర్‌-చక్కీ” అని, బంగ్లా‌లో “కాంటల్”‘ అని, మరాఠిలో “పణస” అని, ఆంగ్లంలో “ఇండియన్‌ జాక్‌ ఫ్రూట” అని‌ అంటారు.
ఔషధ విలువలుసవరించు
వైద్య పరము గా : జీర్ణ శక్తిని మెరుగు పరచును , జారుడు గుణము కలిగివున్నందున మలబద్దకం నివారించును , పొటాసియం ఎక్కువగా ఉన్నందున రక్తపోటు ను తగ్గించును , విటమిన్ సి ఉన్నందున వ్యాధి నిరోధక శక్తిని మెరుగుపరచును , ఫైటోన్యూట్రియంట్స్ (phytO nutriyants) , ఐసోఫ్లేవిన్స్ (isOphlavins) ఉన్నందున కాన్సెర్ నివారణకు సహాయపడును . పనసలో విటమిన్లు, ఖనిజాలు ఎక్కువగా ఉండడం వల్ల మంచి ఆరోగ్యాన్నిస్తుంది. దానిలోని యాంటీఆక్సిడెంట్లు, ఫైటోన్యూట్రియెంట్స్‌ క్యాన్సర్‌ వ్యాధిని నిరోధిస్తాయి. అజీర్తి, అల్సర్లను కూడా నయం చేస్తుంది. పొటాషియం మెండుగా లభించడం వల్ల అది రక్తపోటును తగ్గిస్తుంది. పనస ఆకులు, మొక్క జొన్న, కొబ్బరి చిప్పలను కాల్చి చేసిన పొడి పుండ్లను నయం చేయడానికి ఉపయోగిస్తారు. పనస ఆకులను వేడి చేసి గాయాల మీద పెట్టుకుంటే త్వరగా ఉపశమనం లభిస్తుంది. చర్మవ్యాధులు, ఆస్తమా, జ్వరం, డయేరియా నివారణకు పనస వేర్లు ఉపయోగపడతాయి. అధిక బరువును, టెన్షన్‌ను, మలబద్ధకాన్ని తగ్గిస్తుంది. అజీర్ణం, పాండు వ్యాధి, నంజు, కడుపునెప్పి, అగ్నిమాంధ్యం, క్షయ, శుక్ర నష్టం, అండవాతం మొదలైన వ్యాధులున్నవారు పనసపండును తినరాదు. చెట్టున పండిన కాయను, కోసిన వెంటనే తింటే, అదంత రుచికరంగా ఉండదు. తయారైన కాయను కోసి, నిలువ ఉంచితే, ఆ పనస తొనలు చాలా తియ్యగా ఉంటాయి. పనస చెట్టు ఆకులతో విస్తర్లు కూడా కుడుతుంటారు. ఈ పండు విరేచనాన్ని బంధిస్తుంది. ఎక్కువగా తింటే అతిసారం కలుగుతుంది. పనస పాలను, ద్రాక్షా సారాయంలో నూరి పట్టు వేస్తే, దెబ్బ, వాపులు తగ్గుతాయి. పండిన పనస ఆకులను, వేరును చర్మ వ్యాధులకు ఉపయోగిస్తుంటారు.
పోషక విలువలు (ప్రతి 100. గ్రాములకుసవరించు
Sodium - 3 mg Total Carbohydrates - 24 g Dietary Fiber - 2 g Protein - 1 g Vitamin A - 297 IU Vitamin C - 6.7 mg Thiamin - 0.03 mg Riboflavin - 0.11 mg Niacin - 0.4 mg Vitamin B6 - 0.108 mg Folate - 14 mcg Calcium - 34 mg Iron - 0.6 mg Magnesium - 37 mg Phosphorus - 36 mg Potassium - 303 mg Sodium - 3 mg Zinc - 0.42 mg Copper - 0.187 mg Manganese - 0.197 mg Selenium - 0.6 mcg Total Fat - 0.3 mg Saturated Fat - 0.063 mg Monounsaturated Fat - 0.044 mg Polyunsaturated Fat - 0.086 mg Calories - 94
రకాలుసవరించు
భారతదేశంలో రెండు రకాల పనసను పండిస్తారు. ఒకటి కూజా చక్క. దీనిలో చిన్న చిన్న తొనలుంటాయి. అవి చాలా తియ్యగా, పీచుగా ఉంటాయి. అవి మృదువుగా ఉండడం వల్ల అందులోని తొనలను వలవడానికి చాకు వంటి పరికరాల అవసరం లేదు. వీటిని బార్కా, బెర్కా అని కూడా అంటారు. రెండవది కూజా పాజమ్‌. ఇవి వాణిజ్య పరంగా ముఖ్యమైనవి. వీటిలో తొనలు పెళుసుగా ఉంటాయి. వీటిని వలవడానికి చాకును తప్పకుండా ఉపయోగించాలి. వీటిని కప, కపియా అని అంటారు.పనస కాయలు పండిన తరువాత త్వరగా పాడవుతాయి. అయితే వీటిని 11 నుండి 13 డిగ్రీల ఉష్ణోగ్రత దగ్గర నిల్వ ఉంచితే 3 నుండి 6 వారాల వరకు ఉంటాయి. పచ్చివాటిని ముక్కలుగా కోసి బాగా ఎండబెడతారు. వాటిని డబ్బాల్లో వేసుకుని సంవత్సరమంతా ఉపయోగించుకుంటారు.
వాతావరణాన్ని బట్టి ఒక్కో ప్రాంతంలో ఒక్కో సమయంలో పక్వానికి వస్తాయి. కొన్ని చోట్ల మార్చి నుండి జూన్‌ మధ్యలో, మరి కొన్ని చోట్ల ఏప్రిల్‌ నుండి సెప్టెంబర్‌ మధ్యలో, ఇంకొన్ని చోట్ల జూన్‌ నుండి ఆగస్టు మధ్యలో అవి కాస్తాయి. వెస్ట్‌ ఇండీస్‌లో జూన్‌లోనూ, ఫ్లోరిడాలో వేసవి చివరిలోనూ వస్తాయి.
పనసకాయ పైతొక్క తీసి లోపలి భాగాన్ని చిన్న చిన్న ముక్కలుగా కోసి కూర చేస్తారు. దీన్ని పనస పొట్టు కూర అంటారు.నేపాల్‌, బంగ్లాదేశ్‌, శ్రీలంక, ఇండోనేషియా, కంబోడియా, వియత్నాం దేశాలవారు పనసను వంటల్లో విరివిగా వాడతారు. కొందరు దీన్ని ప్రధానమైన వంటగా చేసుకుంటారు
లక్షణాలుసవరించు
ఒక సతతహరిత వృక్షం.
కాండంపై అమరిన కంకి పుష్పవిన్యాసాల్లో ఉన్న తెలుపు రంగు పుష్పాలు.
సంయుక్త సోరోసిస్ ఫలం.
కలప ఉపయోగాలుసవరించు
పనస పండే కాదు ఆ చెట్టులోని అన్ని భాగాలూ మనకు ఉపయోగపడేవే. పనస కలపతో వీణలు, మద్దెలలు చేస్తుంటారు. దీని కర్రను ఎక్కువగా చిన్న చిన్న పడవలను తయారు చేయడానికి ఉపయోగిస్తుంటారు.మృదంగం, కంజీర వంటి సంగీత పరికరాలను తయారు చేస్తారు. ఫర్నిచర్‌, తలుపులు, కిటికీలు వంటి గృహోపకరణాల తయారీలోనూ ఉపయోగిస్తారు. ఫిలిప్పైన్స్‌లో కుతియాపి అనే పడవ భాగాలను కూడా తయారు చేస్తారు. పనస ఆకులను, పండ్లను పశువులకు మేతగా వేస్తారు. మనదేశంలో పనసాకులను వంటల్లో ఉపయోగిస్తారు. వీటిని ఇస్తరాకులుగా కూడా ఉపయోగిస్తారు. పనస జిగురును పింగాణి పాత్రలకు, బకెట్‌లకు పడిన చిల్లులను మూయడానికి ఉపయోగిస్తారు. దీన్ని వార్నిష్‌లలో కూడా ఉపయోగిస్తారు. పనస చెట్టు వేర్లను చెక్కి ఫొటో ఫ్రేములు తయారు చేస్తారు. కొన్ని ఉత్సవాల్లో ఎండిన పనస కొమ్మలను రాకుతూ నిప్పును పుట్టిస్తారు. బౌద్ధ సన్యాసుల దుస్తులకు పనస బెరడుతో తయారు చేసిన డై వేస్తారు. తీర ప్రాంత వాసులు పనస కర్రతో చిన్న చిన్న పడవలను తయారు చేస్తారు.

అరటి

అరటి ఒక చెట్టులా కనిపించే మొక్క (నిజం చెప్పాలంటే ఇది ఒక హెర్బ్ మాత్రమే). ఇది మూసా అను ప్రజాతికి, మరియూ మూసేసి కుటుంబానికి చెందినది. కూర అరటి కి దగ్గర సంబంధాన్ని కలిగి ఉంటుంది . అరటి చెట్టు కాండము, చాలా పెద్ద పెద్ద ఆకులతో (సుమారుగా రెండు నుండి మూడు మీటర్లు పొడుగు) నాలుగు నుండి ఎనిమిది మీటర్లు ఎత్తు పెరుగును. అరటి పండ్లు సాధారణంగా 125 నుండి 200 గ్రాములు బరువు తూగుతాయి. ఈ బరువు వాటి పెంపకం, వాతావరణము, ప్రాంతముల వారీగా మారుతుంది. ఈ బరువులో 80% లోన ఉన్న తినగల పదార్థము, 20% పైన ఉన్న తోలు.
వ్యాపార ప్రపంచములోనూ, సాధారణ వాడకములోనూ వేలాడే అరటికాయల గుంపును ఓ గెల అంటారు. గెలలోని ఒక్కొక్క గుత్తిని అత్తము(హస్తము) అంటారు. చరిత్ర పరంగా అరటిచెట్లను పశ్చిమ పసిఫిక్, దక్షిణ ఆసియా దేశాలలో, భారత దేశంతో కలిపి, సాగుచేసినారు.
చాలా రకాల అరటి పండ్ల రంగూ, రుచీ, వాసన, అవి పక్వానికి వచ్చే దశలోని ఉష్ణోగ్రతల ఆధారంగా మారుతుంటాయి. తక్కువ ఉష్ణోగ్రతల వద్ద అరటిపండ్లు పాడయిపోయి పాలిపోతాయి, అందువల్లనే వీటిని ఇళ్ళల్లో ఫ్రిజ్జు లలో పెట్టరు, అలాగే రవాణా చేసేటప్పుడు కూడా 13.5 డెగ్రీ సెల్సియసు కన్నా తక్కువ ఉష్ణోగ్రతకు తీసుకొనిరారు.
కేవలం 2002 వ సంవత్సరములోనే 6.8 కోట్ల టన్నుల అరటిపండ్లు ప్రపంచ వ్యాప్తంగా ఉత్పత్తి చేయబడినాయి. ఇందులో 1.2 కోట్ల టన్నులు దేశాల మధ్య వ్యాపారంగా రవాణా చెయ్యబడినాయి. ఈక్వడార్, కోస్టారికా , కొలంబియా, ఫిలిప్పైన్సు దేశాలు ప్రతి ఒక్కటీ పది లక్షల టన్నుల కన్నా ఎక్కువ అరటి పండ్లు ఎగుమతి చేస్తున్నాయి.
అరటిలో పిండిపదార్థాలు/చక్కెరలు (కార్బోహైడ్రేటులు) ఎక్కువ. ప్రతి 100 గ్రాముల అరటి లో 20 గ్రాముల కార్బోహైడ్రేటులు, 1గ్రాము మాంసకృత్తులు (ప్రోటీనులు), 0.2 గ్రాములు కొవ్వు పదార్థాలు, 80 కిలోక్యాలరీల శక్తి ఉన్నవి. అరటి సులభంగా జీర్ణమై, మలబద్ధం రాకుండా శరీరాన్ని కాపాడుతుంది.
భారతదేశములో మొత్తం 50 రకాల అరటిపండ్లు లభిస్తున్నాయి. వాటిలో కొన్ని రకాలు: పచ్చ అరటిపండ్లు, చక్కెరకేళి, పసుపు పచ్చవి, కేరళ అరటిపండ్లు, కొండ అరటిపండ్లు,అమృతపాణి(ముకిరీ),కర్పూరం. వీటినుండి చిప్సు కూడా తయారు చేస్తారు.
అరటిని కూరగా, అలంకరణ వస్తువులను, ఔషధంగా వాడతారు. పచ్చి అరటి కాయలను వివిద రకాల కూరలలో కూడ వాడతారు. అరటి చెట్టు నుండి గెలను కోసిన తర్వాత అరటి బోదేను విడదీస్తే అది అర్ద చంద్రాకరంగల పొడవాటి దళసరిగా వున్న పట్టలు వస్తాయి. వాటినుండి సన్నని పట్టు దారం లాంటి దారాన్ని తీసి దాంటో అందమైన అలంకరణ వస్తువులను తయారు చేస్తారు. అవి చాల మన్నిక కలిగి చాల అందంగా వుంటాయి.
చరిత్రసవరించు
అరటి చెట్ల పుట్టుక అనునది ఆసియా వాయువ్య దేశాలలో సంభవించినది. ఇప్పటికీ కూడా చాలా రకాల అడవి అరటి చెట్లు న్యూ గినియా, మలేసియా, ఇండోనేషియా, ఫిలిప్పైన్సు లలో కనపడతాయి. ఇటివల దొరికిన పురావస్తు, శిలాజవాతావరణ శాస్త్ర ఆధారాలను బట్టి పౌపా న్యూ గినియా లోని పశ్చిమ ద్వీప ఖండములోని కుక్‌ స్వాంపు వద్ద క్రీస్తుకు పూర్వం 8000 లేదా క్రీస్తు పూర్వం 5000 సంవత్సరాల నుండే అరటి తోటల పెంపకం సాగినట్లు నిర్ధారించినారు. దీని వల్ల న్యూ గినియా లో తొలి అరటి తోటల పెంపకం జరిగినట్లు నిర్ధారించవచ్చు. తరువాత తరువాత ఇతర అడవి అరటి జాతులు దక్షిణ ఆసియా ఖండములో పెంపకము చేసినట్లు తోచుచున్నది.
వ్రాత ప్రతులలో మొదటిసారిగా అరటి ప్రస్తావన మనకు క్రీస్తు పూర్వం 600 సంవత్సరములో వ్రాసిన బౌద్ధ సాహిత్యమునందు కనపడుతుంది. అలెగ్జాండరు తొలిసారిగా వీటి రుచిని క్రీస్తు పూర్వం 327 వ సంవత్సరములో భారత దేశం నందు చూసినాడు. చైనాలో క్రీస్తు శకం 200 సంవత్సరము నుండి అరటి తోటల పెంపకం సాగినట్లుగా మనకు ఆధారాలు లభ్యమవుతున్నాయి. క్రీస్తు శకం 650 వ సంవత్సరములో ముస్లిం దండయాత్రల వల్ల అరటి పాలస్తీనా ప్రాంతానికీ, తరువాత ఆఫ్రికా ఖండానికీ వ్యాప్తి చెందింది.
క్రీస్తు శకం 1502 వ సంవత్సరాన పోర్చుగీసు వారు తొలిసారిగా అరటి పెంపకాన్ని కరేబియను, మధ్య అమెరికా ప్రాంతములలో మొదలుపెట్టినారు.
ధర్మాలుసవరించు
'ఆంధ్ర ప్రదేశ్ లో అరటి తోట'
అరటిపండ్లు రకరకాల రంగులలో మరియు ఆకారాల్లో లభిస్తున్నాయి. పండిన పండ్లు తేలికగా తొక్క వలుచుకొని తినడానికీ, పచ్చి కాయలు తేలికగా వంట చేసుకుని తినడానికీ అనువుగా ఉంటాయి. పక్వ దశను బట్టి వీటి రుచి వగరు నుండి తియ్యదనానికి మారుతుంది. మాగని 'పచ్చి' అరటికాయలు, అరటిపండ్లు వండటానికి ఉపయోగిస్తారు. కొన్ని ఉష్ణమండల ప్రాంతాల్లోని ప్రజలకు ఇది ప్రధాన ఆహారం.
నిఖార్సయిన అరటి పండ్లు చాలా పెద్ద పెద్ద విత్తనాలను కలిగి ఉంటాయి, కానీ విత్తనాలు లేకుండా రకరకాల అరటి పండ్లను ఆహారం కోసం అభివృద్ధి చేసినారు. వీటి పునరుత్పత్తి కాండం యొక్క తొలిభాగాల ద్వారా జరుగుతుంది. వీటిని పిలకలు అంటారు. కొన్ని పర్యాయములు ఈ పిలకలను పూలు అనికూడా పిలవడం పరిపాటి. ఒక సారి పంట చేతికి వచ్చిన తరువాత అరటి చెట్టు కాండాన్ని నరికివేసి, ఈ పిలకలను తరువాతి పంటగా వాడుకొంటారు. ఇలా నరికిన కాండం బరువు సుమారుగా 30 నుండి 50 కేజీలు ఉంటుంది.
అరటి శుభ సూచకం అని అందుచేత అరటిని శుభకార్యాలలో తప్పకుండా వినియోగిస్తారు. దీని వెనుక ఒక ఇతిహాస సంబంధమైన కథ కూడా ఉన్నది. ఒకప్పుడు దుర్వాసమహాముని సాయంసంధ్యవేళ కూడా ఆదమరచి నిద్రపోతున్నప్పుడు ఆయన భార్య(కదలీ) సంధ్యావందనం సమయం అయిన కారణమున ఆయనను నిద్ర నుండి మేలుకొల్పుతుంది. దుర్వాసుడు నిద్ర నుండి లేచి చూస్తే ఆయన నేత్రాల నుండి వచ్చిన కోపాగ్నికి ఆవిడ భస్మరాశి అయిపోతుంది. కొన్ని రోజుల తరువాత దుర్వాస మహర్షి మామ గారు తన కూతురు గురించి అడుగగా ఆవిడ తన కోపాగ్ని వల్ల భస్మరాశి అయినది అని చెప్పి, తనమామ గారి ఆగ్రహానికి గురి ఉందేందుకు, దుర్వాసముని భార్య శుభపద్రమైన కార్యాలన్నింటిలో కదలీ ఫలం(సంస్కృత పదానికి తెలుగు అర్థం అరటి) రూపం లో వినియోగించబడుతుంది అని వరాన్ని ఇస్తాడు. ఈ అరటి ఆకులను రక రకాల పనులకు ఉపయోగిస్తారు, ముఖ్యముగా భోజనము చెయ్యడానికీ, పెండ్లిళ్ళలో మండపాల అలంకరణకు వాడతారు.
అరటితో రకరకాలైన వంటకాలు చేసుకోవచ్చు. అరటి కూర,అరటి వేపుడు, అరటి బజ్జీ మెదలైనవి. అరటి తో అల్పాహారాలు, అరటి పండు రసాలు కూడా చేసుకోవచ్చు. బనానా చిప్స్‌ అనునది అరటి కాయ నుండి తయారు చేయు ఓ అల్పాహారం. ఇది ప్రపంచ వ్యాప్తంగా బహు ప్రసిద్ధి. చాలా కంపెనీలు దీని వ్యాపారం లాభదాయకంగా నిర్వహిస్తున్నాయి. భారతదేశంలో, ముఖ్యముగా ఆంధ్ర ప్రదేశ్ లోని నగరాలు, పట్టణాలలో ఇవి చాలా విరివిగా లభిస్తాయి. మామూలు బంగాళదుంప లేదా ఆలూ చిప్స్‌ కన్నా కొద్దిగా మందంగా ఉంటాయి. కేరళ వాళ్ళు వీటిని కొబ్బరి నూనెతో వేయించి తయారు చేస్తారు. అవి ఓ ప్రత్యేకమైన వాసన, రుచి కలిగి ఉంటాయి. అరటి పండ్లను జాం తయారు చెయ్యడంలో కూడా ఉపయోగిస్తారు. అరటి పండ్లను పండ్ల రసాలు తయారు చేయడం లోనూ, ఫ్రూట్‌ సలాడ్‌ లలోనూ, ఉపయోగిస్తారు. అరటి పండ్లలో సుమారుగా 80% నీళ్ళు ఉన్నప్పటికీ, చారిత్రకంగా వీటినుండి రసం తీయడం అసాధ్యంగా ఉండినది, ఎందుకంటే వీటిని మిక్సీలో పట్టినప్పుడు అది గుజ్జుగా మారిపోతుంది. కానీ 2004 వ సంవత్సరంలో భాభా ఆటామిక్‌ పరిశోధనా సంస్థ (బార్క్‌) వారు ఓ ప్రతేకమైన పద్ధతి ద్వారా అరటి పండ్లనుండి రసాలు తయారు చేయడం రూపొందించి, పేటెంటు పొందినారు. ఈ పద్దతిలో అరటి పండ్ల గుజ్జును సుమారుగా నాలుగు నుండి ఆరు గంటల పాటు ఓ పాత్రలో చర్యకు గురిచేయడం ద్వారా పండ్ల రసాన్ని వెలికితీస్తారు.
అరటి పువ్వులు
అరటి చెట్లతో పాటు అరటి పువ్వును (దీనిని తరచూ అరటి పుష్పం లేదా అరటి హృదయం అని అంటారు) బెంగాలీ వంటలలో , కేరళ వంటలలో ఉపయోగిస్తారు. అరటి కాండములోని సున్నితమైన మధ్య భాగం (దూట) కూడా వంటలలో ఉపయోగిస్తారు - ముఖ్యముగా బర్మా , కేరళ, బెంగాలు, ఆంధ్ర ప్రదేశ్ లలో. అరటి పూవు జీర్ణ క్రియ తేలికగా జరిగి సుఖ విరోచనము అగును . ఇందులోని ఐరన్ ,కాల్సియం , పొటాసియం, మెగ్నీషియం , ఫాస్ఫరస్ , వగైరాలు నాడీ వ్యవస్థ మీద ప్రభావంచూపి సక్రమము గా పనిచేసేటట్లు దోదాపడును . ఇందులోని విటమిన్ సి వ్యాధినిరోధక శక్తిని అభివృద్ది చేయును . ఆడువారిలో బహిస్తుల సమయం లో అధిక రక్తస్రావము అరికట్టడానికి ఇది పనికొచ్చును . మగవారిలో వీర్య వృద్ధికి దోహద పడును .
అరటి ఆకులు
అరటి ఆకులు చాలా సున్నితంగా, పెద్దగా సౌలభ్యంగా ఉంటాయి. ఇవి తడి అంటకుండా ఉంటాయి, అందువల్ల వీటిని గొడుగుకు బదులుగా వాడతారు. చైనా, జోంగ్జీ, మధ్య అమెరికా లలో వీటిని వంటకాలు చుట్టడానికి ఉపయోగిస్తారు. మనము ఇంతక్రితమే చెప్పుకున్నట్లు వీటిని ఆంధ్రా లో చక్కని భోజనమునకు పళ్ళెరము బదులుగా ఉపయోగిస్తారు.
కూర అరటిలోని రకాలుసవరించు
అరటిపండ్లు
అరటి కాయలలో రెండు విధాలున్నాయి. ఒక పండించి తినడానికుపడేవి. రెండో రకం కేవలం కూరలలో ఉపయోగించడానికుపయోగ పడేవి. ఇవి కూడ మాగతాయి కాని అంత రుచిగా వుండవు. వీటికి తోలు చాల మందంగా వుండును. వీని కూరలలో మాత్రమే ఉపయోగిస్తారు.
కూర అరటి రకాలు
పచ్చబొంత
బూడిద బొంత
పచ్చబొంత బత్తీసా
బూడిద బొంత బత్తీసా
పచ్చగుబ్బబొంత
పలకల బొంత
నూకల బొంత
సపోటా బొంత
నేంద్రం
సిరుమల అరటి
వామనకేళి

అరటి సాగుసవరించు
చీకటిగల కోసము అరటిచెట్ల పరిశీలన
అరటి పంటకు మంచి సారవంతమైన ఒండ్రునేల కలిగిన డెల్టా భూముల్లో మరియు నీరు బాగా ఇంకిపోయే భూములు అనుకూలం. ఇసుకతో కూడిన గరపనేలల్లో కూడా ఈ పంట పండించవచ్చు. భూమి 1మీ. కంటే లోతుగా ఉండి, 6.5-7.5 మధ్య ఉదజని సూచిక కలిగి, ఎలక్ట్రికల్ కండక్టివిటి 1.0 మీ.మోస్ కంటే తక్కువ కలిగిన భూములు అనుకూలము. నీరుసరిగా ఇంకని భూముల్లో, చవుడు భూములు, సున్నారపు నేలలు, గులక రాల్లు, ఇసుక భూములు ఈ పంటకు పనికి రావు. [1]
అరటికి చీడపీడల బెడద కొద్దిగా ఎక్కువ. దానికి కారణాలలో ఒకటిగా జన్యుపరమైన వైవిద్యములేకపోవడము చెపుతారు. జన్యుపరమైన వైవిద్యము లేకపోవడానికి కారణము ఇవి ఎక్కువగా స్వపరాగసంపర్కము వల్ల వృద్దిపొందటము అని చెపుతారు. కాండము ద్వారా ఫలదీకరణము చేయుపద్దతి వల్ల వైరసులు చాలా తేలికగా వ్యాపిస్తాయి. బనానా బంచీ అనునది ఆసియాలో చాలా ప్రమాదకరమైన బనానా వైరసు. ఇది వ్యాపించిన చేయగలిగినదేమీ లేదు - పంటను తగలబెట్టి మిగిలిన పొలాలకు వ్యాప్తి చెందకుండా చూడటము తప్ప.
పోషక విలువలూ, ఆహార పద్ధతుల మీద ప్రభావముసవరించు
శ్రీలంకలోని ఎర్ర అరటి రకము
అరటిపండులో ముందే చెప్పుకున్నట్లు 74% కన్నా ఎక్కువగా నీరు ఉంటుంది. 23% కార్బోహైడ్రేటులు, 1% ప్రోటీనులు, 2.6% ఫైబరు ఉంటుంది. ఈ విలువలు వాతావరణాన్ని, పక్వదశనుబట్టి, సాగు పద్దతిని బట్టి, ప్రాంతాన్ని బట్టి మారుతుంటాయి. పచ్చి అరటిపండులో కార్బోహైడ్రేటులు స్టార్చ్ రూపములో ఉంటాయి, పండుతున్న కొద్దీ ఇవి చక్కరగా మార్పుచెందబడతాయి. అందుకే పండు అరటి తియ్యగా ఉంటుంది. పూర్తిగా మాగిన అరటిలో 1-2% చక్కర ఉంటుంది. అరటిపండు మంచి శక్తిదాయకమైనది. అంతే కాకుండా ఇందులో పొటాషియం కూడా ఉంటుంది. అందువల్ల ఇది రక్తపోటుతో బాధపడుతున్నవారికి చాలా విలువైన ఆహారం. అరటిపండు, పెద్ద పేగు వ్యాధిగ్రస్తులకు చాలా చక్కని ఆహారం. అందుకే అరటి పండు పేదవాడి ఆపిలు పండు అని అంటారు. ఎందుకంటే, రెండింటిలోనూ పోషక విలువలు సమానంగానే ఉంటాయి. కాని, అరటి పండు చవక, ఆపిలు పండు ఖరీదు.
వందగ్రాముల అరటిలో వున్న పోషకాలు
నీరు - 70.1 గ్రా.
ప్రోటీన్ - 1.2 గ్రా.
కొవ్వుపదార్థాలు - 0.3 గ్రా.
పిండిపదార్థాలు - 27.2 గ్రా.
కాల్షియం - 17 మి.గ్రా.
ఇనుము - 0.4మి.గ్రా.
సోడియం - 37 మి.గ్రా.
పొటాషియం - 88 మి.గ్రా.
రాగి - 0.16 మి.గ్రా.
మాంగనీసు - 0.2 మి.గ్రా.
జింక్ - 0.15 మి.గ్రా.
క్రోమియం - 0.004 మి.గ్రా.
కెరోటిన్ - 78 మైక్రో గ్రా.
రైబోఫ్లెవిన్ - 0.08 మి.గ్రా.
సి విటమిన్ - 7 మి.గ్రా.
థయామిన్ - 0.05 మి.గ్రా.
నియాసిన్ - 0.5 మి.గ్రా.
శక్తి - 116 కిలోకాలరీలు

అరటి వ్యాపారంసవరించు
అరటి ప్రపంచంలో ఎక్కువగా తినే పండు. కానీ చాలామంది అరటి సాగుబడిదారులకు మాత్రం మిగిలేది, లేదా గిట్టుబాటయ్యేది చాలా స్వల్ప మొత్తాలలోనే. మధ్య అమెరికా ఎగుమతులలో అరటి, కాఫీ సింహభాగాన్ని ఆక్రమిస్తున్నాయి. ఎగుమతులలో ఇవి రెండు కలిపి 1960 లో 67 శాతం వాటా కలిగిఉన్నాయి. బనానా రిపబ్లికు అను పదం స్థూలంగా మధ్య అమెరికాలోని అన్ని దేశాలకూ వర్తించినప్పటికీ నిజానికి కోస్టారికా, హోండూరస్, పనామా లు మాత్రమే నిజమైన బనానా రిపబ్లికులు. ఎందుకంటే వీటి ఆర్ధికవ్యవస్థ మాత్రమే అరటి వ్యాపారంపై ఆధారపడి ఉన్నది.
అరటిపండు పట్ల జనాల వైఖరిసవరించు
అరటి పండు చాలా ప్రముఖమైన, ప్రసిద్ది పొందిన పండు. ఇది చాలా మందికి ఇష్టమైన పండు. కానీ కోతులు, కొండముచ్చులు అరటిపండును రకరకాల పద్ధతిలో తినే ఫోటోలు చాలా ప్రసిద్ది పొందటంవల్ల ఈ అరటి పండు అనే పదాన్ని కొన్ని ప్రాంతాలలో జాతిపరమైన అపహాస్యములకు ఉపయోగించినారు. ముఖ్యముగా ఆటగాళ్ళపై అరటిపండు తొక్కలు విసిరివేయడం, కుళ్ళిన టమాటాలు, కోడిగుడ్లు అంత ప్రసిద్ది. మలేషియాలోనూ, సింగపూరులోనూ అరటిపండును చైనీసు భాష రాని, లేదా ఎక్కువగా ఆంగ్లేయుడిలాగా ప్రవర్తిస్తున్న చైనీయునికి పర్యాయపదంగా వాడతారు. ఎందుకంటే అరటిపండుకూడా పైన పసుపు, లోన తెలుపు కాబట్టి.
అరటి తో వైద్యముసవరించు
అరటి కాయలు\పాకాల సంతలో తీసిన చిత్రము
అరటి ఆనారోగ్యానికి ఔషధంగా వాడతారు.
దీనిలో అత్యధికంగా ఉండే పొటాషియం బీపీ, అధిక ఒత్తిడిని తగ్గిస్తుంది.
శరీరంలోని విషపదార్థాల (టాక్సిన్స్)ను తొలగిస్తుంది.
అరటిపండ్లలో ఉండే ట్రిప్టోఫాన్ అనే అమైనో యాసిడ్ శరీరంలో ప్రవేశించగానే సెరటోనిన్‌గా మారి ఒత్తిడిని తగ్గిస్తుంది. అందుకే రాత్రిపూట పాలు, అరటిపండు తీసుకుంటే నిద్ర బాగా పడుతుందని చెబుతారు.
అరటిపండులోని పొటాషియం శరీర కండరాల్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. డైటింగ్ చేస్తున్నవాళ్లు ఒకపూట భోజనం లేదా టిఫిన్ మానేసి అరటిపండు, వెన్న తీసిన పాలు తీసుకుంటే శరీరానికి కావలసిన పోషకాలన్నీ అందుతాయి.
జీర్ణసంబంధమైన సమస్యలకూ అరటిపండు మంచి ఔషధంలా పనిచేస్తుంది. జబ్బుపడినవాళ్లు దీన్ని తింటే తొందరగా కోలుకుంటారు.
పచ్చి అరటి కాయలు విరేచనాలనూ, పండిపోయినవి మలబద్ధాన్నీ అల్సర్ల నూ అరికడతాయి.
అరటిపండ్లలో కణోత్పత్తిని ప్రోత్సహించే గుణం, జీర్ణాశయం గోడలకున్న సన్నటి పొర నాశనం కాకుండా కాపాడుతుంది.
పొట్టలో ఆమ్లాలు ఎక్కువైతే ఓ అరటిపండు తినండని సూచిస్తున్నారు నిపుణులు. ఇవి ప్రకృతిసిద్ధ యాంటాసిడ్‌గా పనిచేస్తాయి. వీటిలో ఉండే యాంటాసిడ్‌ల ప్రభావం పొట్టలో పుండ్లను తగ్గిస్తుంది.
అమెరికాలో పాయిజన్ ఐవీ (poison ivy) అనబడే చెట్లు చర్మానికి తగిలిన వచ్చే ఓ రకమైన చర్మ వ్యాధిని అరటిపండు తోలు లోపలి భాగంతో రుద్ది నయం చేస్తుంటారు
అరటికి ఎయిడ్స్‌ వైరస్‌పై పోరాడే శక్తి ఉంది.అరటిలోఉండే 'బాన్‌లెక్‌' అనే రసాయనం ఎయిడ్స్‌ వైరస్‌పై శక్తిమంతంగా పోరాడుతుందని తేల్చారు. ప్రస్తుతం వైరస్‌ నిరోధానికి వాడుతున్న 'టీ20, మారావిరాక్‌' మందులతో సమానంగా ఈ రసాయనం పని చేస్తుంది..అరటిలోని లెక్టిన్‌ రసాయనం వైరస్‌ను శరీరంలో ప్రవేశించనీయకుండా అడ్డుకుని ఇన్‌ఫెక్షన్‌ను నిరోధిస్తుంది.ఈ రసాయనం ప్రొటీన్‌పై పరచుకుని హెచ్‌ఐవీ జన్యుపదార్థం మూసుకుపోయేలా చేస్తుంది.[2]
అరటిలో పొటాషియం ఎక్కువగా ఉంటుంది. రక్తపోటు తగిన మోతాదులో ఉండేలా చేస్తుంది. గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది. పొటాషియం అధికంగా ఉండే ఆహారపదార్థాలు తీసుకోవడం వల్ల పక్షవాతం ముప్పు తక్కువగా ఉంటున్నట్టు పలు అధ్యయనాల్లో గుర్తించారు.
◾అరటిపండులో పీచు పదార్థాలు అధికంగా ఉంటాయి. ఇవి గుండెజబ్బుల్ని నివారించడమే కాకుండా ఎముకల ఆరోగ్యాన్నీ కాపాడతాయి.
◾అరటి తొక్క లోపల బాగాన్ని దోమ కరచిన దగ్గర రుద్దడం వలన దురద మరియు వాపు తగ్గిపోతుంది.
అంతరించే ప్రమాదంసవరించు
ఓ దశాబ్దంలో ఆహారంగా స్వీకరించు అరటి జాతి అంతరించు ప్రమాదంలో ఉన్నది. ప్రస్తుతము ప్రపంచ వ్యాప్తముగా తిను కావెండిషు అరటి (మన పచ్చ అరటి ?) జన్యుపరంగా ఎటువంటి వైవిద్యాన్నీ చూపలేకపోవడం వల్ల వివిధ రకాల వ్యాధులకు గురిఅవుతుంది. ఉదాహరణకు 1950 లో పనామా వ్యాధి, ఇది నేల శిలీంధ్రము (ఫంగస్) వల్ల వచ్చి ‌బిగ్ మైక్ రకానికి చెందిన అరటి జాతిని పూర్తిగా తుడిచిపెట్టినది. నల్ల సిగటోక (black sigatoka)వ్యాధి. ఇది కూడా మరో రకం శిలీంధ్రము వల్ల వచ్చిన వ్యాధే కానీ చాలా త్వరితగతిన వ్యాపించినది. ముఖ్యముగా మధ్య అమెరికా లోనూ ఆఫ్రికా, ఆసియా ఖండములలో ఇది వ్యాపించినది.
ట్రోపికల్ జాతి 4 అనబడు ఓ క్రొత్త వ్యాధికారకము కావెండిషు (పచ్చ అరటి?) జాతికి చెందిన అరటితోటలపై ఆశించుతుంది. దీని ప్రభావము వల్ల... వాయువ్య ఆసియాలో అందువల్ల ఇక్కడినుండి వచ్చే అరటి ఎగుమతులపై కొద్దిగా జాగ్రత్త వహించడం ప్రారంభం అయినది. ఈ వ్యాధి వ్యాపించకుండా ఇతర దేశాలవాళ్ళు తగిన జాగ్రత్తలు తీసుకొంటూ మట్టినీ, అరటి పండ్లను జాగ్రత్తగా పరిశీలించసాగినారు.
గ్రాస్ మికేలు లేదా బిగ్ మైక్ అను రకానికి చెందిన అరటిది ఒక విషాద కథ. ఇది పనామా వ్యాధి వల్ల 1950 లో పూర్తిగా తుడిచిపెట్టబడినది. ఈ బిగ్ మైక్ రకం సమ శీతల, లేదా శీతల దేశాలకు ఎగుమతి చేయడానికి చాలా అనువుగా ఉండేది. కొంతమంది ఇప్పటికీ దీని రుచిని మరిచిపోలేక ప్రస్తుతము లభిస్తున్న పచ్చ అరటి కన్నా బిగ్ మైక్ రుచికరంగా ఉంటుంది అంటూ వాదిస్తుంటారు! అంతే కాకుండా రవాణాకు కూడా బిగ్ మైక్ చాలా అనుకూలంగా ఉండేది, అదే పచ్చ అరటి రవాణా విషయంలో చాలా శ్రద్ధ తీసుకోవలసిన అవసరం ఉంది.