మనఊరు మనచెట్టు: February 2016

Monday, February 15, 2016

నాగ జెముడు

భారతీయ నాగజెముడు లేదా నాగజెముడు ఫికస్ ఇండికా కాక్టేసి కుటుంబానికి చెందిన పుష్పించే మొక్క. ఇది సుదీర్ఘకాలంగా కొన్ని దేశాలలో ఆహార 

కోసం పండించబడుతున్న ముఖ్యమైన వ్యవసాయ మొక్క.
దీని వృక్ష శాస్త్రీయ నామంOpuntia ficus-indica. ఇవి ఎక్కువగా ఇసుక ప్రాంతాలలో పెరుగుతుంటాయి. వీటి కాండం ఆకు రూపాన్ని కలిగి ఉంటుంది. ఇవి తక్కువ నీటితోఎక్కువకాలం బతుకుతాయి.
ప్రపంచం మొత్తం మీద ఎండిన, సారహీనమైన, నిర్జల, ఎడారి వంటి అన్ని నేలలో ఇది పండుతుంది. ఈ మొక్క సుమారు 12 నుంచి 16 అడుగుల ఎత్తు పెరుగుతుంది. ఈ మొక్క యొక్క మూలాలు మెక్సికో కు చెందినవిగా భావిస్తున్నారు.

పండు.

నాగజెముడు ఫికస్ ఇండికా మొక్క యొక్క కాయ ఆకు పచ్చరంగు నుండి బాగా మగ్గిన తరువాత ఎరుపు రంగుకు మారుతుంది.
బాగా మగ్గిన పండ్లను అతి జాగ్రత్తగా దాని పైన ఉన్న తోలును వలచి లోపలి కండను నములుతూ విత్తనాలను అతి జాగ్రత్తగా ఊసివేస్తారు.

భయం.

నాగజెముడు ఫికస్ ఇండికా మొక్క చాలా భయంకరంగా అనేక ముళ్ళను కలిగి ఉంటుంది. అదికాక ఇది నాగ అనే పేరును కలిగి ఉంది.
నాగుపాము పడగ విప్పినపుడు తల భాగం ఏ ఆకారంలో ఉంటుందో ఈ చెట్టు కాండం మొత్తం అదే పద్ధతి లో ఉంటుంది. అందుకే ఈ రకం మొక్కలను నాగజెముడు అని అంటారు.

తీసుకోవాలసిన జాగ్రత్తలు..

ఈ మొక్క యొక్క పండ్లను తినాలనుకునే వారు పెద్దల సలహాను తీసుకోండి. ఈ చెట్లు వుండే ప్రాంతాలలో చీకుగా ఉన్నందువలన పాములు సంచరిస్తుంటాయి.
ఈ చెట్టుంతా ముళ్ళతో ఉంటుంది. చాలా జాగ్రత్తగా పండును తీసుకోవాలి. ఈ పండుకు కూడా వందల సంఖ్యలో అనేక చిన్న ముళ్ళుంటాయి. ఈ ముళ్ళను ఏ మాత్రం కొంచెం తగిలినా అనేక ముళ్ళు గుచ్చుకుంటాయి.
ఈ పండుకు ఉండే కనిపించి కనిపించని సన్నని ముళ్లు అవేమి చేస్తాయిలే అని ఆజాగ్రత్తగా ఉన్నప్పుడు అనేక ముళ్ళు గుంచుకుని విపరీతమైన చురుకును కలుగజేస్తాయి.
ఈ పండును తినడం అనేక సమస్యలతో కూడుకున్నందు వలన ఈ పండును తినడం కన్నా ఊరకుండడం మేలు లేదా తినకూడదనే అభిప్రాయం భారతదేశంలోని అన్ని ప్రాంతాలలో ఉంది.