మనఊరు మనచెట్టు: 2016

Friday, December 16, 2016

మొక్కలు సజీవసమాధులు అవుతున్నాయి.

మిషన్ భగీరథ పనుల్లో కొంత అలసత్వం వహించడం వల్ల  హరిత హరం లో  మనం నాటిన మొక్కలు అంతరించుకు పోతున్నాయి.
సరిగ్గా హరితహారం లో నాటిన మొక్కలకి దగ్గరగా మిషన్ భగీరథ పనులు జరుగుతూ ఉండటం వల్ల పూడికలు తీసిన మట్టిని మొక్కల పై వేయడం వల్ల మొక్కలు సజీవసమాధులు అవుతున్నాయి. కనుక మనం మొక్కలను ఎంత శ్రద్ధతో నాటామో  అంతే శ్రద్ధతో కాపాడవలసిన భాద్యత కూడా మనపై ఉంది.
           ప్రభుత్వం దీనిపై దృష్టి సారిస్తే బాగుంటుంది.
  •  నేను మిషన్ భగీరథ కు వ్యతిరేకిని కాదు. 
  • ప్రభుత్వ వ్యతిరేకిని  అస్సలు కాదు. 
  • నేను ఎంచుకున్న ప్రభుత్వానికి వీరాభిమానిని. 

Thursday, December 15, 2016

కుండీలలో మొక్కలు పెంచడం ఎలా!?



కుండీలలో మొక్కలు పెంచటం నేడు ప్రతి ఇంట్లో కనిపిస్తుంది. కుండీలలోని మొక్కలకు ఏ మోస్తరు నీరు పోయాలనేది అప్పుడప్పుడు సమస్యగా ఎదురవుతుంది కొందరికి. నీరు తక్కువైతే మొక్క ఎండి పోతుంది. నీరు ఎక్కువైతే కుళ్ళిపోతుంది. అయితే విషయం ఆలస్యంగా బయట పడుతుంది. అప్పటికి మొక్కను తిరిగి బతికించే అవకాశముండదు. అలాంటప్పుడు ఏం చేయాలి....

* మొక్కకు ఏ మాత్రం నీరు పోయాలి అనేది ఆ మొక్కను మీరు ఎక్కడ ఉంచుతారనే దాని మీద ఆధారపడి ఉంటుంది.

* వేడి అధికంగా ఉండే గదిలో పెట్టే మొక్కకు ప్రతి రోజూ కొద్దిగా నీరు పోయాలి. ఆరు బయట కాక పోర్టికోలో వుండే మొక్కలకు రెండు రోజులకు ఒకసారి పోస్తే చాలు.

* కుండీని చేతితో ఎత్తి చూడడం ద్వారా లోపల నీరు ఉన్నదీ లేనిదీ చెప్పవచ్చు.

* కుండీ లోపల పెంకులు, ఇసుక మట్టి ఉంచితే కుండీలో పోసిన అధిక నీటిని పీల్చుకుంటుంది.

* కుండీ కింద మట్టి ప్లేటుంచితే అధికంగా పోసిన నీరు బయటకు వచ్చి అందులో చేరుతుంది.

Sunday, December 11, 2016

Saturday, December 03, 2016

Saturday, July 16, 2016

కాబేజీ

కాబేజీ (Cabbage)  ప్రాంతములో కనిపించే ఆకులు మెండుగా ఉన్న అడవి ఆవాల మొక్క నుండి 100 వ సంవత్సరము ప్రాంతములో ఉద్భవించినది. కాబేజీ అన్న పదము నార్మన్-పికార్డ్ పదము కబోచే ("తల") నుండి వచ్చినది.

క్యాబేజీ ఒక ఆకుకూర

ఎందుకంటే సాధారణముగా కాబేజీ మొక్కలో ఆకులతో నిండిన శీర్ష భాగము మాత్రమే తింటారు. ఇంకా ఖచ్ఛితముగా చెప్పాలంటే వృత్తాకారములో ఉండలా ఉండే లేత ఆకులు మాత్రమే ఉపయోగిస్తారు. విచ్చుకొని ఉన్న బయటి ముదురు ఆకులను తీసేస్తారు. ఈ క్యాబేజీ తలను పచ్చిగా, ఉడకబెట్టి లేదా ఊరబెట్టి అనేక వంటకాలలో ఉపయోగిస్తారు. పచ్చి కాబేజీని చేత్తోనే తినేస్తారు కానీ కానీ చాలా ఇతర ఉపయోగాలకు దీన్ని చిన్న ముక్కలుగా లేదా పట్టీలుగా తురుముతారు. కాబేజీ పైన ఉన్న తొక్కలు గట్టిగా అంటుకొని ఆకులు పచ్చగా ఉండవలె, పగుళ్ళు ఉన్న క్యాబేజీ త్వరగా చెడిపోతుంది. ఎరుపురంగు క్యాబేజీ కొన్ని ప్రదేశాలలో మాత్రమే లభిస్తుంది. ముదురు ఆకుపచ్చ రంగు బాగుంటుంది. రక్తములో చెక్కెరస్థాయి సమతుల్యము చేస్తుంది . శరీరములొ కొవ్వు నిల్వలు పేరుకు పోకుండాచేస్తుంది . రక్తములో చెక్కెర స్థాయిని అదుపు చేసేందుకు గ్లూకోజ్ టోలరెన్స్ (glucose tolarence) లో భాగమైన ' క్రోమియం ' ఈ లెట్యూస్ లో పుష్కలముగా ఉంటుంది . నిద్ర పట్టేందుకు దోహదం చేసే " లాక్ట్యుకారియం (Lactucarium)" అనే పదార్ధము ఇందులో ఉంటుంది .

పోషక విలువలు, ప్రతి 100 గ్రాములకు

శక్తి 20 kcal 100 kJ పిండిపదార్థాలు 5.8 g చక్కెరలు 3.2 g పీచుపదార్థాలు 2.5 g కొవ్వు పదార్థాలు 0.1 g మాంసకృత్తులు 1.28 g థయామిన్ (విట. బి1) 0.061 mg 5% రైబోఫ్లేవిన్ (విట. బి2) 0.040 mg 3% నియాసిన్ (విట. బి3) 0.234 mg 2% పాంటోథీనిక్ ఆమ్లం (B5) 0.212 mg 4% విటమిన్ బి6 0.124 mg 10% ఫోలేట్ (Vit. B9) 53 μg 13% విటమిన్ సి 36.6 mg 61% కాల్షియమ్ 40 mg 4% ఇనుము 0.47 mg 4% మెగ్నీషియమ్ 12 mg 3% భాస్వరం 26 mg 4% పొటాషియం 170 mg 4% జింకు 0.18 mg 2%

ఔషధ గుణాలు

కాయగూరల్లో క్యాబేజీ అతి శ్రేష్టమైనదనీ ముఖ్యంగా క్యాన్సర్‌ను నిరోధించటంలో ఇది క్రియాశీలకంగా పనిచేస్తుందని వైద్యులు సూచిస్తున్నారు. క్యాబేజీ ద్వారా శరీరానికి అవసరమైన "ప్లేవనాయిడ్స్" సమృద్ధిగా అందుతాయనీ, తద్వారా "పాంక్రియాటిక్ గ్రంథి క్యాన్సర్" ప్రభావాన్ని తగ్గించవచ్చునని వారు చెబుతున్నారు. ఈ క్యాన్సర్ రావటం అరుదుగా సంభవిస్తుందనీ, అయితే క్యాబేజీతో దానికి చెక్ పెట్టవచ్చు క్యాబేజీని ఆహారంలో క్రమం తప్పకుండా తీసుకున్నట్లయితే అధిక బరువుకు చెక్ పెట్టవచ్చునని వైద్యులు చెబుతున్నారు. అంతేగాకుండా.. పిల్లలకు పాలిచ్చే తల్లులు ఎక్కువగా క్యాబేజీని తిన్నట్లయితే పాలు బాగా పడతాయి. క్యాజేజీ దగ్గుకు కూడా మంచి మందుగా పనిచేస్తుంది. క్యాబేజీ ఆకులను నమిలినా లేదా క్యాబేజీ ఆకుల రసం తీసి తాగిన దగ్గు మటుమాయమవుతుంది. క్యాబేజీ ఆకుల రసాన్ని అలాగే తాగలేనివారు కాస్త పంచదార కలుపుకుంటే సరి. అదే విధంగా అతిగా పొగతాగే పొగరాయుళ్లను ఆ అలవాటునుంచి మాన్పించేందుకు నానా కష్టాలు పడేవారికి క్యాబేజీ సాయపడుతుంది. అయితే వారిని పూర్తిగా పొగతాగటం మాన్పించటం కాదుగానీ.. పొగ తాగినప్పుడు శరీరానికి కలిగే దుష్ఫలితాల తీవ్రతను తగ్గించుకోవాలంటే మాత్రం తప్పనిసరిగా క్యాబేజీ తినాల్సిందే.

https://www.facebook.com/manaurumanachettu

ఇతర ఉపయోగాలు

క్యాబేజీ ఒక ఆకుకూర. ఎందుకంటే సాధారణముగా కాబేజీ మొక్కలో ఆకులతో నిండిన శీర్ష భాగము మాత్రమే తింటారు. ఇంకా ఖచ్ఛితముగా చెప్పాలంటే వృత్తాకారములో ఉండలా ఉండే లేత ఆకులు మాత్రమే ఉపయోగిస్తారు. విచ్చుకొని ఉన్న బయటి ముదురు ఆకులను తీసేస్తారు. ఈ క్యాబేజీ తలను పచ్చిగా, ఉడకబెట్టి లేదా ఊరబెట్టి అనేక వంటకాలలో ఉపయోగిస్తారు.
పచ్చి కాబేజీని చేత్తోనే తినేస్తారు కానీ కానీ చాలా ఇతర ఉపయోగాలకు దీన్ని చిన్న ముక్కలుగా లేదా పట్టీలుగా తురుముతారు. కాబేజీ పైన ఉన్న తొక్కలు గట్టిగా అంటుకొని ఆకులు పచ్చగా ఉండవలె, పగుళ్ళు ఉన్న క్యాబేజీ త్వరగా చెడిపోతుంది. ఎరుపురంగు క్యాబేజీ కొన్ని ప్రదేశాలలో మాత్రమే లభిస్తుంది. ముదురు ఆకుపచ్చ రంగు బాగుంటుంది.
https://www.facebook.com/manaurumanachettu

పాల కూర

మనం తీసుకునే ఆహారంలో ప్రతిరోజూ ఆకుకూరలను తప్పనిసరిగా తీసుకోవాలి. ముఖ్యంగా పాలకూర. పోషకాహార నిధి అయిన పాలకూరలో లభించే ఫ్లేవనాయిడ్స్ వయసుతోపాటు వచ్చే మతిమరపును దూరం చేస్తాయి. పాలకూరలో పదమూడు రకాల యాంటీ ఆక్సిడెంట్‌లు ఉన్నాయి. ఇవి యాంటీ క్యాన్సర్ ఏజెంట్లుగా పనిచేస్తాయి. పాలకూర , spinach—ఇది భారతీయులు అహారానికి ఉపయోగించే ఆకు కూరలలో ఒకటి. విటమిన్‌ ' కె ' సమృద్ధిగా ఉంటుంది . * ఆకు కూరలు వండే ముందు శుభ్రముగా కడగాలి. * మొక్కలోని ఆకులను ఆహార పదార్ధాలుగా ఉపయోగించే మొక్కలను ఆకు కూరలు అంటారు. * దాదాపు వెయ్యికి పైగా ఆహారయోగ్యమైన ఆకులు గల మొక్కలు ఉన్నాయి * ఆకు కూరలు సాధారణముగా పొట్టిగా,గుబురుగా పెరిగే, స్వల్పకాల పరిమితి గల చిన్న చిన్న మొక్కలు ఉన్నాయి. * కొన్ని కొన్ని సార్లు ఈ మొక్కలలోని ఆకులతో పాటు కాండాలను, లేత ఆకుకాడలను కూడా తినటానికి ఉపయోగిస్తారు. పాలకూరలో లభించే విటమిన్ సి, ఏలు మరియు మెగ్నీషియం, ఫోలిక్ యాసిడ్లు క్యాన్సర్‌ను నివారించటంలో తోడ్పడతాయి. ముఖ్యంగా ఊపిరితిత్తులు, బ్రెస్ట్ క్యాన్సర్‌ను అదుపు చేయటంలో ఇవి ప్రముఖ పాత్ర పోషిస్తాయి. గుండె జబ్బులు రాకుండా అడ్డుకుంటాయి. ఈ కూరలో ఇంకా క్యాల్షియం, సోడియం, క్లోరిన్, ఫాస్ఫరస్, ఇనుము, ఖనిజ లవణాలు, ప్రొటీన్లు, విటమిన్ ఏ, విటమిన్ సీ‌ తదితరాలుంటాయి.

ఔషధ ఉపయోగాలు

పాలకూరను ఆహారంలో ఎక్కువగా తీసుకునే వారికి ఒవేరియన్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు తక్కువని ఇటీవలి పరిశోధనల్లో సైతం వెల్లడయ్యింది. శరీరానికి అవసరమైన ఇనుము పుష్కళంగా ఉండే పాలకూర రక్తహీనతను తగ్గిస్తుంది. రోగ నిరోధక శక్తిని కూడా పెంచుతుంది, జ్వరం, పిత్త, వాయు శ్వాస సంబంధిత రోగాలను కూడా పాలకూర దూరం చేస్తుంది. పాలకూరకు రక్తాన్ని శుద్ధి చేసే తత్వం కూడా అధికంగా ఉంది. స్త్రీల సౌందర్యానికి కూడా పాలకూర ఎంతగానో తోడ్పడుతుంది. పాలకూరను వెజిటబుల్ సూప్‌లోనూ, చపాతీలు చేసుకునే పిండిలోనూ, పకోడీల పిండిలోనూ, పన్నీర్‌తో కలిపి వండే కూరల్లోనూ.. అనేక రకాలుగా వాడుకోవచ్చు. ఇతర ఆకుకూరల్లాగా పాలకూరను కూరలాగా, వేపుడు చేసుకుని కూడా తినవచ్చు. ఎలాగైనా సరే ప్రతిరోజూ తినే ఆహార పదార్థాలలో పాలకూరను భాగం చేసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచి చేస్తుందని చెప్పక తప్పదు ఆకుకూరలతో కలిగే మేలు: * ఆకుకూరల్లో పోషక పదార్ధాలు సమృద్ధిగా ఉంటాయి. అందుకే శరీర పెరుగుదల, దృఢత్వానికి, చక్కని ఆరోగ్యానికి ఇవి చాలా ముఖ్యమైనవి. * భారతదేశంలో అనేక రకాల ఆకుకూరలు వినియోగంలో ఉన్నాయి.వీటిలో పాలకూర, తోటకూర, గోంగూర, మెంతికూర, మునగాకులు, పుదీన తదితరాలు ప్రముఖమైనవి. * ఆకుకూరలు ఎక్కువగా ఖనిజ పోషకాలు, ఇనుముధాతువు కలిగిఉంటాయి.శరీరంలో ఇనుములోపం కారణంగా అనీమియా వ్యాధికి గురవుతారు. గర్భవతులు, బాలింతలు(పాలిచ్చే తల్లులు), పిల్లలు ఈ వ్యాధికి ఎక్కువగా గురవుతారు. * ప్రతిరోజూ తీసుకొనే ఆహారంలో ఆకుకూరలను తప్పకుండా చేర్చాలి. తద్వారా అనీమియాను నివారించి, చక్కని ఆరోగ్యాన్ని పొందవచ్చు. * ఆకుకూరల్లో కాల్షియం, బీటాకెరోటిన్, విటమిన్ - సి కూడా పుష్కలంగా ఉంటాయి. * విటమిన్-ఎ లోపం కారణంగా భారతదేశంలో ప్రతీ యేటా ఐదేళ్ళ లోపు వయస్సు పిల్లలు సుమారు 30 వేల మంది కంటిచూపును కోల్పోతున్నారు. ఆకుకూరలద్వార లభించే కెరోటిన్ మనశరీరంలో విటమిన్-ఎ గా మారి అంధత్వం రాకుండా చేస్తుంది. * విటమిన్-సి ఆరోగ్యకరమైన ఎముకలు, దంతాలకు చాలా అవసరమైన పోషకం. వంటచేసేటపుడు ఆకుకూరలను ఎక్కువసేపు మరిగిస్తే, వీటిలో ఉన్న విటమిన్ సి ఆవిరైపోతుంది. దీన్ని నివారించటానికీ అకుకూరలను స్వల్ప వ్యవధిలోనే వండాలి. ఆకుకూరల్లో కొన్ని రకాల బి- కాంప్లెక్స్ విటమిన్లు కూడాఉంటాయి.

గోరింటాకు

గోరింటాకును ముద్దగా నూరి చేతికి, పాదాలకు పెట్టుకుంటే ఎర్ర్రని రంగుతో అందంగా ఉంటాయి. ఈ పొడిలో లవంగం పొడి కలిపితే ఎరుపు, ఉసిరి పొడిని కలిపితే నలుపు రంగు తల జుట్టుకు వస్తాయి.భారతీయులు పెళ్ళి సమయంలో దీన్ని తప్పనిసరిగా వాడతారు. మెహందీ లేదా హెన్నాఅనేది "మెంధిక" అనేసంస్కృతపదంనుండిఉద్భవించింది. మెహందీ మరియు పసుపులయొక్క ఉపయోగంముల గురించి హిందూమ తవేదకర్మ పుస్తకాల్లోవర్ణించబడింది. హల్దిని(పసుపుముద్ద)అభిరంజనముగా, అలాగే మెహందీని బాహ్య ప్రతీకగా వేదాలలో చెబుతారు. వేద సిద్దాంతమూలలొ ఇది "అంతర్గతంగ కాంతి లేవడం" అనే అర్ధం వస్తుంధి. సాంప్రదాయభారతనమూనాలలో మెహందీని చేతులు మరియు కాళ్ళుగుర్చిఉద్దేశించబడింది.
పాశ్చాత్య ప్రపంచంలో హెన్నా(గోరింట)అని పిలుస్తారు. భారతదేశం మరియు నేపాల్ దేశాలాలో మేహేందిని శరీర అలంకరణగా వాడతారు. భారతీయ సినిమా అయిన బాలీవుడ్, పాకిస్తాన్, బంగ్లాదేశీలు మరియు అలాగే ఇతర దెశాలు కూడా మేహేందిని ఉపయోగిస్తారు. కోఆపరేషన్ కౌన్సిల్ ప్రకారం ఈ సంప్రదాయం గల్ఫ్ జాతీయులు అయిన ఆరబ్ దేశాల మహిళలు ఎక్కువగ ఉపయొగించుట ద్వారా విస్థరించింది.. మెహందీ అలంకరణను వారు కొన్నిసార్లు గోరింట పచ్చబొట్లు(హెన్నాటటూ) అని పిలుస్తుంటారు. 1990 ల చివరిలో పశ్చిమములోఇది ఒక నాగరీకంగా మారింది.
మెహందీని సాధారణంగా వివాహనికి మరియు ఖర్వ చౌత్, ఆషాడ శుద్ద పూర్ణిమ, దీపావళి, భైదూజ్ మరియు తీజ్ వంటి పండుగలు వంటి ప్రత్యేక హిందూ మతం సందర్భాలలో సమయంలో వాడతారు. హిందూ మతం పండుగలలో చాలామంది మహిళలు హెన్నాని వారి చేతులుకు మరియు కాళ్ళుకు అలంకరించుకుంటారు. ఇది చర్మంపై సహజంగా ఉండే అలంకరణగా కనిపిస్తుంధి. హెన్నా నిజానికి ప్రధానంగా హిందూమతం వధువులకు ఒక అలంకరణరూపంగా ఉపయోగించబడింది.ముస్లింలు పండుగలు అయిన ఈద్ ఉల్ ఫితర్ మరియు ఈద్ ఉల్ అధా సమయంలో మెహందీని వాడతారు.
భారత సాంప్రదాయ మెహందీని పెట్టేకళాకారు లుపరిమితసంఖ్యలో ఉండటం కారణముగా,ఆధునిక యుగంలో ప్రజలు రెడీమేడ్ హెన్నాన్ని(హెన్న ఛొనెస్) ఉపయోగిస్తున్నారు. రెడీమేడ్ హెన్నా ఆలంకరణకు సులభంగా ఉంటుంది.అయితే, భారతదేశం లో గ్రామీణ ప్రాంతాల్లో వృత్తిపరంగా దొరికే గోరింట ఆకులుని శుద్ధి చేసి,వీటికి ఆయిల్ కలిపి రాళ్ళుతొ నూరి ఆ మిశ్రమన్ని మెహందీగా వాడతారు. మెహందీని చాలా సందర్భలలో తాత్కలిక పచ్చబొట్లుగా ఉపయోగిస్తారు.దీన్నే గోరింట పచ్చబొట్టు అలంకరనగా పిలుస్తారు. నల్లని పచ్చబొట్టును ధరించడం కొసం,అనేక మంది గోరింటాకుకు కృత్రిమరంగును కలపడం ఆరంబించారు. దీని వల్ల చర్మానికి చాలా హానికరమైన మరియు శాశ్వతగాయాలు,తీవ్రమైన ఇబ్బందులు కలుగుతాయి. ఆలాటా అనే ఒక రకమైన గొరింటను వధువల పాదాల అలకరణకు ఉపయోగిస్తారు. ఈ సంస్క్రుతి ఇప్పటికి బెంగాల్లొ వాడుకలొ ఉన్నధి.

Saturday, July 02, 2016

మొక్కతో సెల్ఫీ

మిత్రులందరికీ నమస్కారములు  అందరికీ తెలియచేయునది  ఏమనగా   మనవంతుగా   ఈ ప్రకృతి కోసం  ఒక్క మొక్క అయినా నాటుదాం.    నాటి  వాటిని చెట్టు చేదాం .  మీరు నాటిన మొక్కతో  సెల్ఫీ తీసుకొని   మీ ముఖ పుస్తకం  యొక్క  ప్రొఫైల్  పిక్  గా  పెట్టండి ఇలా చేయడం  వలన  ఎందరికో  మొక్కలను  నాటాలి  అనీ ఆలోచన  కలగా చేసిన వారము అవుతాము.  ఈ  కార్యక్రమం లో భాగంగా నేను  నా ప్రొఫైల్ పిక్ ని మార్చుతున్నాను. మరి మీరు.........

Friday, July 01, 2016

అశోక చెట్టుని............

🌳అశోక చెట్టుని నాటడం, పూజించడం వలన సోక నాశనమని తెలుస్తుంది. వృక్షాలను తడపడం, రోగాలు లేకుండా కాపాడడం చేస్తే స్వర్గలోక ప్రాప్తి కలుగుతుందని విష్ణుధర్మోత్తర పురాణం ద్వారా తెలుస్తుంది..🌻🌳.. http://manaurumanachettu.blogspot.in/....✍

Tuesday, June 28, 2016

సీతమ్మజడ, పట్టు కుచ్చులు

🌸 manaurumanachettu 🌸                           కోడిజుట్టు ఆకారంలో పూచే పూలు. ఈ పూల మొక్కలు  ప్రజాతి కి చెందుతాయి.                                👉మన ప్రాంతములో  సీతమ్మజడ, పట్టు కుచ్చులు. అని కూడా  పిలుస్తారు.
వర్ణన
◾ఈ కోడిజుట్టు పూల గింజలు చాలా చిన్నవిగా ఉంటాయి. ఒక ఔన్స్ లో (30ml) 43వేల గింజలు ఉంటాయి. వివిధ రంగులలో పూచే ఈమొక్కలు రకాలను బట్టి ఇవి 1 నుంచి 4 అడుగుల ఎత్తు వరకు పెరుగుతాయి.
◾తెలుపు, ఎరుపు, ఆరంజి వంటి రంగులలో పూచే ఈ పువ్వులు మెత్తగా, మృదువుగా ఉంటాయి. ఆకులు ముదురాకు పచ్చ రంగులో ఉంటాయి.
◾వీటిని అలంకరణలోను, పూలదండల తయారిలోను వాడుతారు. ముఖ్యంగా తెలంగాణ ప్రాంతం వారు బతుకమ్మ తయారీలో ఈ పూలను ఎక్కువగా ఉపయోగిస్తారు.                 🌼🌸🌷🌻....http://manaurumanachettu.blogspot.in/.....✍🌿🌳🌿

Wednesday, June 22, 2016

తెలంగాణ ముఖ్యమంత్రి గారు ప్రతి సంవత్సరo

🌿*మనఊరు-మనచెట్టు*🌿
 తెలంగాణ ముఖ్యమంత్రి  గారు    ప్రతి సంవత్సరం  ప్రతి గ్రామంలో  40,000 వేల మొక్కలు  నాటాలి  అని పిలుపునిచ్చారు. మొక్కలు  ఉచితంగా  ప్రభుత్వమే  పంపిణీ చేస్తుంది అన్నారు. మరీ మీ గ్రామంలో/ ఊరిలో  ఎన్ని  నాటారు  అసలు పంపిణీ చేసారా.   ఇక్కడ లోపం కేవలం  క్షేత్రస్థాయిలో  మాత్రమే జరిగింది ప్రభుత్వం  నిధులు ఇచ్చిన కూడా మొక్కలే కదా  మనల్ని ఏమిచేస్తాయి అని అలసత్వాన్ని ప్రదర్శించారు. గుర్తుంచుకోండి  ఇప్పుడు నీళ్లు డ్రమ్ముకు 50 నుండి 100 రూపాయలకి  కొంటున్నాం.  ముందు ముందు  గాలిని కూడా కొనాల్సి వస్తుంది తస్మాత్ జాగ్రత్త.  మొక్కే కదా అని తీసేస్తే  మనుగడే ఉండదు.                           
🌻*మొక్కనాటుదాం! చెట్టుచేద్దాం*🍂 !!......................................................................✍https://manaurumanachettu.blogspot.in/🌻

Monday, June 20, 2016

పుత్రులు లేని వారు చెట్లు నాటడం వలన ఎలా స్వర్గప్రాప్తి కలుగుతుంది..?

      🌿*మనఊరు-మనచెట్టు*🌿


swargam కోసం చిత్ర ఫలితం"







🌻పుత్రులు  లేని  వారు చెట్లు  నాటడం  వలన  నాటిన వారు  కాలం చేస్తే   వాన పడినప్పుడు  చెట్టు  ఆకుల నుండి జాలువారే నీటి బిందువుల వలన  అవి  నాటిన  వ్యక్తికి(అంటే  పుత్రుడు చేసే శ్రాద్ద కర్మలలో చేసే  తర్పనాలు   చెట్లు తమ ఆకులనుండి నుండి జారే నీటి  ద్వార)  స్వర్గప్రాప్తి  కలగచేస్తాయట.  కనుక       
*మొక్కనాటుదాం! చెట్టుచేద్దాం* !!...✍https://manaurumanachettu.blogspot.in/

Sunday, June 19, 2016

🎇🎉🎌

https://m.facebook.com/manaurumanachettu

ఋతుపవనాలు వచ్చేసాయి


*🌿మనఊరు-మనచెట్టు🌿*                      🌺🌳ఋతుపవనాలు వచ్చేసాయి🌳🌺            👉 ఇక  ఆలస్యం  చెయ్యకుండా  మొక్కలు నాటండి.  నాటే ముందు  వాటిని  మళ్లీ తొలగించడానికి వీలు లేని  చోట, విద్యుత్ తీగల  కింద, కరెంట్  స్తంబాలకి  దగ్గర  రహదారికి  అతి సమీపంలో  నాటకుండా.    ఇంట్లో  సరైన  ప్రదేశంలో  రహదారికి  కనీసo  10 నుండి 15 ఫీట్ల దూరం లో  నాటండి. ఎందుకంటే  ఒకవేళ  రోడ్డు వెడల్పు  పనుల్లో  మనం నాటిన  మొక్కకు  ఎలాంటి  హాని జరగకూడదు కదా.🌱🌺(మొక్కనాటుదాం! చెట్టుచేద్దాం !!🌳🌺... https://manaurumanachettu.blogspot.in/.....✍🌻

Thursday, June 16, 2016

🕉ఓ కోవెల కడితే హిందువులే వెళతారు....👣
☪ఓ మసీదు కడితే మహ్మదీయులే వెళతారు...👣
✝ఓ చర్చి కడితే క్రైస్తవులే వెళతారు...👣
అదే
🌱🌱🌿🌿ఓ మొక్క నాటితే
🌳🌲🌳🌲అది చెట్టయితే....
👨‍👨‍👧‍👦దాని నీడకు కుల, మత, జాతి బేధాలు లేకుండా సకల జీవజాతులతో పాటు మనషులందరం వెళతాము.....
☘కనుక ప్రార్థనాలయాలతో పాటు
☘ ప్రాణవాయువునిచ్చే....☘
కాలుష్యాన్నినివారించే ..☘
భూతాపాన్ని తగ్గించే ... ☘
గ్లోబల్ వార్మింగ్ తగ్గించే ..☘
చల్లని వాతావరనాన్నిచ్చే☘
వర్షాలు కురిపించే ......☘
భూగర్భ జలాల్ని పెంచే ..☘
భూ సారాన్ని పెంచే ..... ☘
ఔషధాలనిచ్చే ........

నేల కోతను అరికట్టే ..... ☘
ఆహారానందించే .....

స్వాంతననిచ్చే .......

సుగంధ ద్రవ్యాలనిచ్చే .. ☘
కలప నిచ్చే .........

ఓజోన్ ను రంక్షించే .. ☘
జీవ వైవిధ్యాన్ని కాపాడే .☘
సకల జీవులకు ప్రాణాదారమై .........

సునామీల నుండి కాపాడే
తుఫానులు నుండి రక్షించే .....

ప్రకృతి వైపరీత్యాల నుండి రక్షణ నిచ్చే ...

కరువు కటకాలు నుండి రక్షించే .....

సంపదలను సమకూర్చే ..

మానసిక, శారీరక, సామాజిక ఆరోగ్యాన్నిచ్చే ......

సాగునీరు, త్రాగునీరిచ్చే .
🌍 మన ప్రాణాధారమైన చెట్లను కనీసం ఒక్కటైనా నాటుదాం, సాకుదాం....🌱...... M Sanyasi Rao garu.

కలబంద ఒక రకమైన ఔషధ మొక్క

*🌿Manaurumanachettu🌿*.     
 *🌵🌾కలబంద ఒక రకమైన ఔషధ మొక్కలు.
ఇంట్లో మొక్కలు పెంచుకోవాలనే ఆసక్తి, కావలసినంత స్థలం ఉండికూడా కొంతమంది ఏం మొక్కలు పెంచుకోవాలో తెలియక అలాగే కాలాన్ని, సమయాన్నివృధా చేసుకుంటుంటారు. అయితే మీరు ఇంకా అదే ఆలోచనలో ఉన్నట్లైతే కనుక మీ పెరటి గార్డెన్ లో పెంచుకొనే సాధారణ మొక్కలే కాకుండా..ఔషధ మొక్కలను పెంచుకొనే మార్గాలున్నాయి. వీటిని పెంచుకోవడం వల్ల ఇంటికి అందంతో పాటు ఇంట్లో వారికి ఆరోగ్యానికి బాగా ఉపయోగపడుతాయి. ఈ కలబంద చూడటానికి కొంచెం దట్టాం గా ముళ్ళు స్వభావం కలిగి ఉండి, జిగురులాంటి గుజ్జు పదార్థాంతో నిండి ఉంటుంది. కలబంద మొక్క అన్ని రకాలైనటువంటి భూముల్లో..కుండీల్లో కూడా పెరుగుతుంది. ఈ మొక్కను చాలా సులభంగా పెంచుకోవచ్చు. దీని నిర్వాహణ కూడా సులభమే..ఇది పొడవు తక్కువగా ఉంటుంది కాబటి గాలిలో ఉన్న తేమను పీల్చుకొనే జీవించే గుణం కలిగి ఉంటుంది. వేసవిలో దీనికి పూలు పూస్తాయి.
ఉపయోగాలు
◾దీనిని కాస్మోటిక్స్ లోను, ఆయుర్వేద వైద్య విధానాల్లోను విరివిగా వాడుతున్నారు.
◾దీనితో లోషన్లు, యోగర్ట్స్‌ క్రీంలు, పానకాలు తయారు చేస్తున్నారు.
◾జీర్ణశక్తిని పెంపొందించుకోడానికి, గుండె మంటని తగ్గించుకునేందుకు, అజీర్తివల్ల ఏర్పడే వ్యాధులు అరికట్టడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది.
◾కలబంద గుజ్జుని రోజ్‌వాటర్‌లో కలిపి శరీరానికి పూస్తే, శరీరంలోని మృత కణాలుపోతాయి. శరీరం కాలిన చోట కలబంద రసాన్ని వాడితే పూర్తి ప్రయోజనం చేకూరుతుంది.
◾ఉదయాన్నే పరగడుపున కల బంద ఆకుని తింటే, కడుపులో ఉన్న అన్ని రకాల వ్యాధుల్ని మటుమాయం చేస్తుంది. అలాగే సాధారణ వినియోగంలోకి వస్తే, కలబంద ఆకుల రసంలో కొబ్బరినీటిని కలిపి శరీరంలో ఉండే నల్లని భాగాలలో రాస్తూ వుంటే నల్ల మచ్చలుగానీ, మూలల్లో ఏర్పడిన నలుపుగానీ వెంటనే పోయి శరీర కాంతి పెరుగుతుంది.
◾కలబందలో అలోయిన్ అనే రసాయనిక పదార్ధం ఉన్నది. అలోయిన్ నందు
◾తాజా కలబంద గుజ్జు కీళ్ళ నొప్పులు తగ్గించడానికి చాలా ఉపయోగపడుతుంది.

పెంచుకొనే విధానం...
◾ఈ కలబంద మొక్కకు ముఖ్యంగా కావల్సిందే తగినటువంటి సూర్యరశ్మి. రోజంతా ఎండలో ఉన్నాకూడా మొక్కకు ఎటువంటి ఇబ్బంది కలగదు. నేలమీదైనా, కుండీలోనైనా బాగా పెరుగుతుంది.
◾అప్పుడప్పుడు ఈ మొక్కకు నీళ్ళు పోస్తే సరిపోతుంది.
◾దీనిని పెంచుకోవాలనుకొనే వారు జూన్‌, జూలైలో నాటుకొంటే బాగా పెరుగుతుంది. వేరు పిలకలు, కొమ్ము కత్తిరింపుల ద్వారా ప్రవర్ధనం చెందుతుంది. అలాగే ఈ మొక్కకు సాధారణ ఎరువు సరిపోతుంది.
◾అన్నిరకాల జాగ్రత్తలు తీసుకొంటున్న మొక్క పసుపు వర్ణంలోనికి మారితే అప్పుడు నీళ్ళు ఎక్కువ అవుతున్నట్టు గమనించి జాగ్రత్తపడాలి. తగినంత నీరు మాత్రమే పోయాలి.
◾శీతాకాలంలో ఈ మొక్కను అవుట్ డోర్ లో పెట్టుకోవడం కంటే ఇన్ డోర్ లో పెట్టుకోవడమే మంచిది. లేకుంటే మొక్కకు ఎక్కవ తేమ అంది మొక్క పెరగకుండా చేస్తుంది.

చర్మ సౌందర్యం కొరకు....
◾కలబంద రసంలో ముల్తాని మట్టి లేదా చందనం పౌడర్ కలిపి ముఖంపై లేదా చర్మంపై పూస్తే చర్మంలోనున్న మృతకణాలు మటుమాయం చేస్తుంది.
◾కలబంద గుజ్జు ముఖ వర్చస్సును పెంపొందించటంలో కీలక పాత్ర పోషిస్తుంది. కలబంద గుజ్జులో మోతాదుకు సరిపడా పుసుపు జోడించి ముఖానికి అప్లై చేసి 15 నిమిషాల తరువాత చల్లటి నీటితో శుభ్రం చేసుకుంటే, ముఖం పై పేరుకున్నమురికి తొలగిపోయి కొత్త రూపును సంతరించుకుంటుంది.
సన్ ట్యాన్‌ రిమూవల్‌ ప్యాక్‌....
◾సహజమైన చర్మపు మెరుపును పోగొట్టి రంగు తగ్గిస్తుంది ట్యాన్‌. అలొవెరా జెల్‌లో కొన్ని చుక్కల నిమ్మరసం కలిపి ముఖం, మెడ మీద రాసుకోవాలి. పావుగంట తరువాత గోరువెచ్చని నీళ్లతో కడిగేస్తే ముఖం వెలుగును సంతరించుకుంటుంది.
పిగ్మెంటేషన్‌ తొలగాలంటే...
◾ముఖ చర్మం మీద చోటుచేసుకునే మచ్చలను తొలగించాలంటే అలోవెరా జెల్‌లో రోజ్‌ వాటర్‌ కలిపి ముఖంపై రాయాలి. బాగా ఆరాక వేళ్లతో వలయాకారంలో రుద్దుతూ కడిగేయాలి. ఈ ప్యాక్‌ను వారానికోసారి క్రమం తప్పక వేసుకుంటే పిగ్మెంటేషన్‌, వయసు, మొటిమల వల్ల ఏర్పడిన మచ్చలు పోతాయి.
ఆయిలీ స్కిన్‌ ఉంటే..
కలబంద ఆకుల్లో ముళ్ల కొసలను కత్తిరించి మిగతా ఆకును ముక్కలుగా కోసి నీళ్లలో ఉడికించి గుజ్జలా చేయాలి. ఈ గుజ్జులో తేనె కలిపి ముఖానికి రాసి 20 నిమిషాలయ్యాక కడిగేయాలి. ఇలా వారానికి ఒకసారి చేస్తే చర్మంపై జిడ్డు పోయి ప్రకాశవంతంగా తయారవుతుంది.
సున్నితమైన చర్మానికి...
అలోవెరా జెల్‌, కీరా రసం, పెరుగు, రోజ్‌ నూనెను కలిపి ముఖం, మెడపై రాయాలి. పావుగంట తరువాత చల్లటి నీటితో కడిగేయాలి. చర్మంపై ర్యాష్‌, మురికి వదిలించటంలో ఈ ప్యాక్‌ అద్భుతంగా పనిచేస్తుంది.
పొడి చర్మానికి...
అలోవెరా జెల్‌, కాటేజ్‌ చీజ్‌, ఖర్జూరం, కీర దోస రసాలని మిక్సీలో వేసి గ్రైండ్‌ చేయాలి. దీనికి నిమ్మ రసం కలిపి ముఖానికి రాసి అరగంట తరువాత కడిగేయాలి. పొడిబారిన చర్మం మృదుత్వాన్ని సంతరించుకోవాలంటే ఈ ప్యాక్‌ వారానికోసారి వేసుకోవాలి.
డిటాక్సిఫికేషన్‌ ఫేస్‌ప్యాక్‌
చర్మం తక్షణ మెరుపు సంతరించుకోవాలంటే అలోవెరా జెల్‌, మామిడి గుజ్జు, నిమ్మరసం కలిపి ప్యాక్‌ వేసుకోయాలి. 20 నిమిషాలాగి కడిగేస్తే చర్మం కాంతులీనుతుంది.
అలోవెరా స్క్రబ్‌
చర్మపు మృతకణాలు తొలిగి కోమలంగా తయారవ్వాలంటే అలోవెరా జెల్‌, కీర దోస ముక్కలను కలిపి గుజ్జుగా చేసి ఇందులో ఓట్‌మీల్‌ కలపాలి. ఈ మిశ్రమాన్ని ఐదు నిమిషాలపాటు చేతి వేళ్లను గుండ్రంగా తిప్పుతూ ముఖం మీద మర్దనా చేయాలి. పది నిమిషాల తరువాత నీళ్లతో కడిగేయాలి. ఈ ప్యాక్‌లను ఎక్కువ మొత్తంలో తయారుచేసి గాలి చొరబడని డబ్బాల్లో నింపి ఫ్రిజ్‌లో నిల్వ చేసుకోవచ్చు. ఇంట్లోనే అలోవెరా జెల్‌ ప్యాక్స్‌ తయారుచేసుకోవటం వల్ల బ్యూటీపార్లర్‌ ఖర్చు తగ్గటంతోపాటు దుష్ప్రభావాలు లేని సౌందర్యం సొంతమవుతుంది.
                     https://manaurumanachettu.blogspot.in/
దంత క్షయ నివారిణిగా
నోటిలో దంతక్షయానికి కారణమయ్యే బ్యాక్టీరియాను నిర్మూలించటంలో కలబంద జెల్‌ ప్రభావవంతంగా పనిచేస్తుందని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. సాధారణ టూత్‌పేస్ట్‌లు కనబర్చే సామర్థ్యం కంటే కలబంద జెల్‌ రెండింతలు ఎక్కువగా సత్ఫలితాలను ఇస్తున్నాయని ఆ అధ్యయనాల ద్వారా తెలుస్తోంది. పిప్పిపళ్లకు, దంతక్షయానికి కారణమయ్యే బ్యాక్టీరియాను నివారించటంలో కలబంద కీలకంగా పనిచేస్తుంది. సున్నితమైన దంతాలు ఉన్నవారు కలబంద జెల్‌తో తయారైన పేస్టులతో పళ్లు తోముకుంటే దంతాలు ఆరోగ్యంగా ఉంటాయి. అదే విధంగా కలబంద గుజ్జు మధుమేహం,కీళ్లనొప్పులు, జీర్ణకోశ,స్త్రీ సంబంధమైన వ్యాధులకు దివ్యఔషధంగా పనిచేస్తుంది. ఈజిప్టు రాణి క్లియోపాత్ర తన చర్మాన్ని మృదువుగా, అందంగా ఉంచుకునేందుకు ఆ కాలంలోనే కలబందను వాడినట్లు చరిత్ర ద్వారా తెలుస్తోంది. దాన్నలా పక్కనబెడితే.....కలబంద గుజ్జుతో తయారైన జ్యూస్‌ను తాగటం వల్ల సుదీర్ఘకాలం ఎలాంటి అనారోగ్యాలు దరిచేరకుండా ఆరోగ్యంగా ఉండవచ్చు. ఈ జ్యూస్‌లో 15 రకాల పోషక పదార్థాలు మిళితమై మంచి శక్తిని ఇస్తాయి.

కలబంద నూనె
కలబంద నూనె వల్ల జుట్టు రాలటం, వెండ్రుకలు తెల్లబడటం, ఎఱ్ఱబడటం, చుండ్రు, ఇంకా తలలో వచ్చే అనేక కురుపులు, దురద వంటి సమస్యలు పోవటమే కాకుండా ఎప్పటికి రావు.
తయారూ విధానం
◾కలబంద గుజ్జు పావు కిలో తీలుకోవాలి.
◾కొబ్బరి నూనె పావు కిలో తీసుకోవాలి.
◾కలబంద మట్టను తీసుకుని, దానిని చీల్చి లోపల వున్న గుజ్జును గీరాలి,ముద్దలు గా వేయవద్దు, గీరితె సాగుతూ వస్తుంది.
◾ఒక బాండి లొ కొబ్బరి నూనె ను పో సి, అందులో, ఈ కలబంద గుజ్జును వేసి బాగ నూనెలో కలిసిపోయెటట్టు కలపాలి, బాండి పొయ్యి మీద పెట్టి సన్నని సెగ పెట్టి, కలుపుతూ వుండాలి అడుగు అంటకుండ, నీరు అంతా ఆవిరి ఆయిపోయి నూనె మాత్రమే మిగులుతుంది.
◾దించెముందు మర్వం లేక ధవనం వేసి కలపాలి, వాసనకు మాత్రమే, వెయ్యక పోయిన పరవాలేదు .
◾ఈ నూనెను రోజు గోరువెచ్చగా చేసి తలలో కుదుళ్ళకు వ్రాసి బాగ మర్దన చేయాలి .
                     https://manaurumanachettu.blogspot.in/
కలబందతో ఆయుర్వేదం
1.కలబంద(ఆలోవీర) తో ఆయుర్వేదం
2.కలబంద గుజ్జును చెక్కెర తో కలిపి సేవించడము గాని ,రసాన్ని తీసి కలకండతో సేవించిన గాని శరీరానికి చల్లదనాన్ని ,ఆరోగ్యాన్ని పొందవచ్చు.
3.కలబంద రసం ,పాలు ,నీళ్ళతో కలిపి సేవిస్తే ,సెగ రోగం ,గనేరియా మెహ వ్యాధులు ఉపశామిస్తాయి.
4.కలబంద గుజ్జును ఉడికించి వాపులు ,గడ్డల పై కడితే తగ్గి పోతాయి.
5.కలబంద రసం లేదా వేరు ను పసుపు తో నూరి లేపనము చేసిన స్థానవాపు తగ్గి పోతుంది.
6.కలబంద రసాన్ని పసుపు తో కలిపి సేవిస్తే లివర్ ,స్ప్లీన్ వ్యాధులు ఉపశామిస్తాయి.
7.కాలిన పుండ్లపై కలబంద ఆకులను వేడిచేసి రసమును పిండిన బాధ తగ్గటమే కాక వ్రణాలు త్వరగా మానిపోతాయి.
8.రోజు ఉదయం సాయంత్రం 1 1/2 అంగుళాల కలబంద ముక్కను బుజించిన చిరకాలంగా నున్న మలబద్దకము తగ్గిపోతుంది.
9.కలబంద రసం నిత్యం సేవించుచుండిన స్థౌల్యము తగ్గుతుంది.
10.కలబంద రసాన్ని లేపనము చేసిన అన్ని రకములయిన చర్మ వ్యాధులు ,సూర్య తాపము వలన ,X-RAY వలన ఏర్పడు చర్మ రోగాములతో సహా ఉపశామిస్తై.
11.చర్మ సౌందర్యానికి ,ముకములో స్నిగ్దత్వాన్ని కలిగించడానికి కలబందను ప్యాకులలోను ,వివిధ ముకలేపనాలలో ఉపయోగించటమే కాక ,దీని గుజ్జును కూడా అంటించవచ్చు.
12.కఫా వ్యాదులలో కలబంద రసాన్ని పసుపులో కలిపి ఎదురురొమ్ముపై రుద్దిన ఉపశమనం కలుగుతుంది.
13.పంటి నొప్పి ,పండ్లు కదులుట యందు కలబంద రసముతో చిగుల్లపై రుద్ధటము గాని ,కలబంద ఆకు ముక్కను నములుట గాని చేయాలి.
14.దగ్గు నివారణకై 1 స్పూన్ ,మిరియాలు 1/4 స్పూన్ , శొంటి 1/4 స్పూన్ ,తేనె లో కలిపి సేవించాలి.
15.కడుపు నొప్పి లోను ,కడుపు లో గ్యాస్ ఏర్పడినపుడు ,గోధుమ పిండి ,కలబంద గుజ్జు పై వాము ,సైంధవ లవణము ,జీలకర్ర కలిపి చపాతీలు చేసుకుని బుజించాలి.
16.అర్శ మొలల యందు 10 నుండి 30 గ్రాముల కలబంద రసం తాగిస్తూ ,కలబంద గుజ్జు పసుపు కలిపి అర్శమొలల పై లేపనము చేయాలి.
17.చెవి పోటు యందు కొంచెము వేడి చేసి పిండిన కలబంద ఆకు రసాన్ని 1,2 చుక్కలు చెవిలో వేయాలి.
18.కండ్ల కలక యందు కలబంద ఆకు గుజ్జు కండ్లపై వేసి కట్టాలి.
19.ఎండాకాలము వడదెబ్బ నందు కలబంద రససేవనం గ్లుకోస్ వలె పనిచేస్తుంది.
20.కలబంద గుజ్జు ను నీళ్ళల్లో బాగా కడిగిన తరువాత మాత్రమే లోపలికి గాని బయటకు గాని తీసుకోవాli .................                                   https://manaurumanachettu.blogspot.in/...✍🌵☘🌾🌾


Tuesday, June 14, 2016

ఇంటిని నందనవనంగా మార్చే పూల మొక్కలు





బంతి పూలు చేమంతిపూలు, జాజి పూలు ముఖ్యంగా పారిజాత పుష్పాలు ఇవి ఉన్న ఇల్లు నిజంగా నందనవనమే మరి. ఆయా సీజన్లలో ఇంటికి శోభనిచ్చే పూల మొక్కలను పెంచుకునే వీలుంటే ఆలస్యం చేయకుండా మీ ఇంటిని పూల కుండీల, తీవెల మయం చేయండి మరి. బంతి చేమంతి పూలు వర్షాకాలంలో నాటడానికి అనువైన మొక్కలు జూన్ జూలై మాసాల్లో వర్షాకాలం మొదలైనప్పుడు ఈ మొక్కలను నాటితే ఆగస్టు సెప్టెంబర్ నాటికి పూలు పూసి ఇంటికి శోభనిస్తాయి. నారు మళ్లు లేదా కొద్దిగా ఎత్తైన మురుగు నీటి సౌకర్యమున్న ప్రదేశంలో విత్తనాలను విత్తండి.
విత్తనం మొలకెత్తేందుకు...విత్తనాలు వేశాక దానిపై ఎక్కువ మట్టిని కప్పకూడదు. విత్తనం పరిమాణానికి మూడు నాలుగింతల వరకే ఈ మట్టి ఉండాలి. అంతకు మించితే లోతు ఎక్కువై విత్తనాలు మొలకెత్తడం కష్టమైపోతుంది. నీరు ఎక్కువైతే మొలిచిన నారు కుళ్లిపోయే అవకాశముంది. తక్కువైతే ఎండిపోవచ్చు. అందుకే విత్తనాలు విత్తిన తర్వాత కనీసం మూడు వారలపాటయినా అవసరమైన మేరకే నీటిని పెట్టేలా జాగ్రత్త పడాలి. నీరు మరీ ఎక్కువైనా లేదా మరీ తక్కువైనా ఇబ్బందే అని గుర్తెరగండి.విత్తనం మొలకెత్తి నాలుగైదు ఆకులు రాగానే మొక్కను కుండీలు, ఫ్లవర్ బెడ్‌లలో నాటుకోవచ్చు. నాటడానికి ముందు కుండీలో మట్టి వదులుగా ఉండేలా చూసుకోవాలి. మొక్కలు నాటాక నీటిని మోతాదుగా పోస్తూరావడం మర్చిపోవద్దు. నర్సరీలో దొరికే చేమంతి నారు లేదా పిలకలను నాటిదే ఏపుగా పెరిగే అవకాశముంది. మొక్కకు అన్ని వైపులా ఎరువులు వేసేలా జాగ్రత్త వహించాలి. అయితే లేత చిగుర్లకు ఎరువు తగలకుండా చూడాలి. ఎందుకంటే ఎరువుల ప్రభావానికి చిగుర్లు మాడిపోయే ప్రమాదముంది. పాలిపోయిన, ఎండిపోయిన పూలను ఎప్పటి కప్పుడు కత్తిరించాలి. ఇలా చేయడం వల్ల మొక్కలు తాజాగా కనిపిస్తాయి. ఎక్కువకాలం పాటు పూలనిస్తాయి. చేమంతి బంతి వంటి మొక్కలకు ప్రతి మూడు కణుపుల కొకసారి చిగుర్లు తుంచడం వల్ల కొమ్మలు పెరిగి ఎక్కువ పూలనిస్తాయి.మొక్కలు అందంగా ఆరోగ్యంగా, పురుగులు, తెగుళ్లు పట్టకుండా జాగ్రత్తలు తీసుకోవాలియ ఎప్పటి కప్పుడు కలుపు మొక్కలు, ఎండిన ఆకులను తీసేస్తూ మొక్కను పరిశుభ్రంగా ఉంచితే పురుగుల బెడద అంతగా ఉండదు.వేపనూనె లేదా వేప పిండి కలిపిన లీటరు నీటికి రెండు మిల్లీ లీటర్ల చొప్పున వారానికి ఓ సారి పిచికారి చేయడం వల్ల మొక్కలకు పురుగు, చీడలు రాకుండా కాపాడుకోవచ్చు.ఇల్లు...పూల సరాగాల హరివిల్లుఇంటి ముందు పూలముక్కలు... పూలతీగలు... కుండీలలో పెరిగేవి కొన్ని, గోడమీదికి, తీగలాగా పైకి పాకేవి కొన్ని... వర్షం పడినప్పుడు, గాలి మంద్ర మంద్రంగా వీచేటప్పుడు పూలమొక్కలు, తీగలు మన ఇంటి ముందు, పైన వేలాడుతుంటే ఆ దృశ్యాన్ని చూసి పలవరించగలమే కాని వర్ణించలేం.

Wednesday, May 11, 2016

అన్వర్ జలల్పూరి

ఉర్దూ లో కి భగవత్ గీత ని అనువాదించింది. అన్వర్ జలల్పూరి.

Monday, April 25, 2016

తనకు నగలు, డబ్బులు ఏమీ వద్దు ... 10,000 మొక్కల్ని నాటించండి

Fb.com/manaurumanachettu.          పెళ్లి కూతురి వింత కోరిక... ఏమి అడిగిందో తెలుసా?
పెళ్లిలో ఆడ పెళ్లివారు అబ్బాయికీ, మగ పెళ్లీ వారు అమ్మాయికీ కానుకలు చదివించడం సహజం. అయితే, 22 ఏళ్ల అమ్మాయి, పెళ్లి పీటలు ఎక్కబోతున్న తరుణంలో తన కాబోయే అత్తమామలను ఒక వింత కోరిక కోరింది. వజ్రాల హారం కొనియ్యమనో లేక పెద్ద కారు కొనియ్యమనో కాదండీ... 10,000 మొక్కల్ని నాటించమని...!! ఆశ్చర్యంగా వుంది కదూ... అవునండీ ఈ ఉదంతం మధ్య ప్రదేశ్ లోని భిండ్ లో చోటు చేసుకుంది. ఆమె ఎవరంటే కిషిపురా అనే గ్రామానికి చెందిన 22 ఏళ్ల ప్రియాంకా భడొరియా.
అక్కడ ఆచారం ప్రకారం వధువుని తనకు కావలసిన నగలో లేక ఇంకోటో పెళ్లి కానుకగా మగపెళ్లి వారు ఇస్తారు. ఇలా మగ పెళ్లివారు వచ్చి ప్రియాంకాను ఏమి కావాలి? అని అడడితే ఆమె తనకు నగలు, డబ్బులు ఏమీ వద్దు ... 10,000 మొక్కల్ని నాటించండి.. అని కోరింది. దీనికి వారు సంతోషంగా అంగీకరించారు. 5,000 మొక్కలని తన తల్లి గారి ఇంటి వద్ద, 5,000 మొక్కల్ని తన అత్త వారి ఇంటి వద్ద ఉంచి అక్కడ చుట్టు పక్కల వారికి పంచి ఇచ్చింది ప్రియాంకా. కరువు వల్ల తన తండ్రి పడిన కష్టాలను చూస్తూ వచ్చిన ప్రియాంకా చిన్నప్పటి నుంచి ఎన్నో మొక్కలను నాటుతూ వచ్చింది. మరో విశేషం ఏమిటంటే, ఆమె వివాహం ఎర్త్ డే రోజునే జరిగింది. ఆమె ముందు చూపు కీ, పర్యావరణం పట్ల అవగాహన చూసి ఆమె భర్త రాజీవ్ చౌహాన్ మురిసిపోయాడట.ఈ మొక్కల లాగే వారి జీవితం కూడా కొత్త చిగురులు వేయాలనీ, మూడు పూవులూ, ఆరు కాయలుగా వర్ధిల్లాలనీ ఆశిద్దాం.

Saturday, April 23, 2016

ప్రవేట్ ఆస్పత్రుల పాపం పండింది.

ప్రవేట్ ఆస్పత్రుల పాపం పండింది. జగిత్యాల. కోరుట్ల  లలో   ప్రముఖ  ఆస్పత్రుల  గుర్తింపు  రద్దు చేసిన dmho.
అనవసరంగా  ప్రసవాలకి ఆపరేషన్స్ చేస్తున్న ఆస్పత్రులపై  కొరడా జులిపించిన DMHO.

Monday, April 18, 2016

Sunday, March 27, 2016

fb.com/mamanaurumanachettu
Guruvugari ashishyulu😊😊😊🙏🙏🙏

Saturday, March 19, 2016

fb.com/manaurumanachettu manaurumanachettu

Monday, March 14, 2016

కుంకుమ పువ్వు

కుంకుమ పువ్వు  

https://www.facebook.com/manaurumanachettu
   కుంకుమ పువ్వు:-  

 ఒక రకమైన ఖరీదైన సుగంధ ద్రవ్యము. ఇరిడాసే కుటుంబానికి చెందిన కుంకుమ పువ్వును ప్రధానంగా శీతలీ ప్రదేశాల్లో పండిస్తారు. కుంకుమపువ్వులో ఉపయోగపడే భాగం - ఎర్ర కేసరాలు మాత్రమే. ఒక కిలో కేసరాలు తయారు చేయాలంటే కనీసం రెండు లక్షల పూలు అవసరమవుతాయి. అందుకే కుంకుమ పువ్వు ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన సుగంధ ద్రవ్యము. కేసరాలు రుచికి కొద్దిగా చేదుగా, తియ్యగా వుంటాయి.

చరిత్ర

కుంకుమ పువ్వు ఒకరకమైన ఖరీదైన సుగంధ ద్రవ్యము. ఈ భూభాగం లో అత్యంత ఆకర్ణీయమైనది , ఖరీదైనది , అద్భుత ఔషధ గుణాలు కలిగినది కుంకుమపువ్వు . ఆ సేతుహిమాచలమే కాదు సీమాంతర భూములు లోను , అరబిక్ ఆచరణలొను , వేదకాలపు సంసృతిలోనూ ప్రాముఖ్యమైన సౌందర్యపోషణ ద్రవ్యమిది . నాటి రాచరికకాలపు దర్పణానికి చిహ్నం ఈ కుంకుమపువ్వు . క్రీ.పూ. 500 సం. ముందే దీని ప్రస్తావం ఉన్నది . కుంకుమ పువ్వును ఇంగ్లీషులో శాఫ్రాన్‌ ఫ్రాన్‌ అంటారు. ఇది జాఫరాన్‌ అనే అరబిక్‌ పదం నుంచి వచ్చింది. అరబిక్‌లో జాఫరిన్‌ అంటే పసుపు అని అర్థం. కుంకుమ పువ్వు అందించే మొక్కలను ప్రత్యేకంగా పెంచుతారు. పువ్వు మధ్య ఉండే రేణువులను తీసి కుంకుమ పువ్వు తయారు చేస్తారు. ఒక కిలో కుంకుమపువ్వు తయారు చేయాలంటే కనీసం రెండులక్షల పూలు అవసరమవుతాయి. అందుకే వీటి ధర చాలా అధికంగా ఉంటుంది. కుంకుమ పువ్వు రుచికి కొద్దిగా చేదుగా, తియ్యగా వుంటుంది.కుంకుమపువ్వు... ఈ పేరు వినగానే కాశ్మీర్‌ గుర్తుకొస్తుంది. ఎందుకంటే మనదేశంలో ఇది కేవలం అక్కడ మాత్రమే పండుతుంది. కానీ నిజానికి దీని స్వస్థలం దక్షిణ ఐరోపా. అక్కడ నుంచే వివిధ దేశాలకు విస్తరించింది. గ్రీసు, స్పెయిన్‌, ఇరాక్‌, ఇటలీ, సిసిలీ, టర్కీ, ఇంగ్లాండ్‌, ఫ్రాన్స్‌ దేశాల్లో దీన్ని ఎక్కువగా పండిస్తారు. అయితే అన్నింటిలోకీ కాశ్మీరీ కేసర్‌ నాణ్యమైనది. మనదేశంలో ఉత్తరాది రాష్ట్రాలంతటా 'కేసర్‌' అంటారు.

కుంకుమ పువ్వు సాగు

కుంకుమ పువ్వును ఇరాన్ దేశం అత్యధికంగా పండిస్తుంది. భారత దేశంలో కుంకుమ పువ్వుని కాశ్మీర్ లో పండిస్తారు. వర్షాకాలం చివరలో కుంకుమ దుంపలను దున్నిన భూమిలో నాటుతారు. ఎండాకాలం ఆరంభానికి కోత కోస్తారు. కుంకుమ పువ్వు పండాలి అంటే వాతావరణంలో అధిక తేమ ఉండరాదు, మట్టి గుల్లగా ఉండాలి, అత్యధికంగా ప్రకృతిసిద్ధమైన ఎరువులు వాడాలి, వర్షపాతం తక్కువగా ఉండాలి. దుంప నాటిన రెండు నెలలకే పుష్పాలు పూస్తాయి. శీతాకాలం చివరలో కుంకుమ పువ్వు పంట కోతకు వస్తుంది. కుంకుమ పువ్వును ఇంటివద్ద కుండీల్లో కూడా పెంచుకోవచ్చు. కుండీ మట్టిలో కొబ్బరి పొట్టు, వానపాముల ఎరువు సమానభాగాలుగా ఉండాలి. కుంకుమపువ్వు మొక్కలను పూర్తి ఎండలోగాని, పాక్షిక ఎండలోగాని పెంచుకోవచ్చు. దక్షిణ భారత దేశంలో అయితే చలి ఎక్కువ ఉండే మెట్టప్రాంతాల్లో పండిచవచ్చు. అయితే దక్షిణ భారత దేశంలో కుంకుమ పువ్వు దుంపలను అక్టోబరు నెలలో నాటితే మంచిది. ఒక్క గ్రాము కాశ్మీర్ కుంకుమ పువ్వు కేసరాలు 230నుండి 240 రూపాయల వరకూ ధర పలుకుతుంది.

పువ్వంటే పువ్వూ కాదు

కుంకుమపువ్వు మొక్క చూడ్డానికి ఉల్లి లేదా ఎర్ర లిల్లీ మొక్కలా ఉంటుంది. చిన్న దుంపవేరు నుంచి ఆకులు పైకి వచ్చి వాటి మధ్యలో పూలు వస్తాయి. కాశ్మీర్‌లో పండించే కుంకుమపువ్వు మొక్కకి పైకి ఆకులు కూడా కనిపించవు. కేవలం వంగపండురంగు పువ్వు మాత్రం కనిపిస్తుంది. కాశ్మీర్‌లోని పాంపోర్‌ ప్రాంతంలోని నేలంతా అక్టోబరు - నవంబరులో విరబూసిన కుంకుమపువ్వుతో నిండిపోతుంది. ముందు మొగ్గ వచ్చి పువ్వు విచ్చుకుంటుంది. అదే కుంకుమపువ్వు అనుకుంటే పొరపాటే. అందులో ముచ్చటగా మూడే అండకోశాలు, రెండు కేసరాలు ఉంటాయి. కిందభాగంలో పసుపు, పైన ఎరుపురంగులో ఉండే ఈ అండకోశాలనే కుంకుమపువ్వుగా పిలుస్తారు. ఈ ఎరుపురంగు భాగమే ఘాటైన వాసననీ రుచినీ రంగునీ ఇస్తుంది. ఉదయాన్నే విచ్చుకునే ఈ పూలను వెంటనే కోసి అందులోని ఎరుపురంగులో ఉండే అండకోశభాగాలను తుంచి ఎండబెడతారు. అప్పుడే అవి మంచి వాసనతో ఉంటాయి. విచ్చుకున్న పూలను కొయ్యడంలో ఒక్కపూట ఆలస్యం చేసినా అవి వెంటనే వాడిపోతాయి. అండకోశాలు రంగునీ రుచినీ కోల్పోతాయి. అందుకే, పూసిన పూలన్నింటినీ ఉదయం పదిగంటలలోపే కోసేస్తారు. కిలో కుంకుమపువ్వు కావాలంటే సుమారు లక్షన్నర పూలను సేకరించాలి. అన్నింటి నుంచీ అండకోశాలను చేత్తోనే వేరుచేయాలి. ఇది ఎంతో శ్రమతో కూడిన పని. శాఫ్రాన్‌ అంత ధర పలకడానికి ఇదీ ఓ కారణమే. మన దగ్గర గ్రాము కుంకుమపువ్వు ధర సుమారు రూ.60 నుంచి 600 వరకూ ఉంటుంది. నాణ్యతనుబట్టి ధర మారుతుంది. మనిషి వాడిన మొదటి సుగంధద్రవ్యం ఇదేనట. సుగంధద్రవ్యాల్లోకెల్లా
https://www.facebook.com/manaurumanachettu

ఉపయోగాలు

  • కుంకుమ పువ్వు రంగు పదార్ధంగాను, సువాసనకారిగాను అనేక తినుబండారాలు, తాంబూలంలోనూ వాడతారు.
  • కుంకుమ పువ్వు నేత్ర వ్యాధులలోను, ముక్కు సంబంధమైన వ్యాధులలోను మందుగా పనిచేస్తుంది.
  • ప్రతిదినం కుంకుమ పువ్వును, తేనెను తెల్లవారుఝామున సేవిస్తే ధాతుపుష్టికి, వీర్యవృద్ధికి పనిచేస్తుంది.
  • కుంకుమ పువ్వు గంధంలా తయారుచేసి ముఖానికి రాస్తే మొటిమలు తగ్గి, చర్మం సున్నితంగా ఆకర్షణీయంగా తయారవుతుంది.
  • గర్భిణులు కుంకుమపువ్వు కలిపిన పాలు తాగితే పిల్లలు తెల్లగా పుడతార'ని అంటుంటారు. ఇది అపోహేనని కొందరు కొట్టిపారేస్తారు. ఏది నిజమో కచ్చితంగా తెలియకపోయినా... రంగూరుచీవాసనా ఉన్న అరుదైన సుగంధద్రవ్యమే కుంకుమపువ్వు. అందుకే అది అందరికీ 'ప్రియమైన' ఎర్ర బంగారం!
కుంకుమ పువ్వులో క్రోసిన్, క్రోసిటిన్, పిక్రో క్రోసిన్ మొదలైన గ్లూకోసైడులు ఉన్నాయి. వీటితో పాటు బీటా, గామా కెరోటిన్ లు, లైకోఫీనులు ఉన్నాయి. ఇంట్లో గర్భిణి ఉంటే కుటుంబసభ్యులు కుంకుమ పువ్వును కొనితెస్తారు. ఇదే కాదు, అదనపు రంగు కోసం దీన్నివంటకాల్లోనూ వినియోగిస్తారు. ఈ రెండు ఉపయోగాలు అందరికీ తెలిసినవే. తెలియనిది మరొకటుంది. ఏంటంటే, దానివల్ల కంటికి చాలా మేలు. వృద్ధాప్యం మీద పడుతున్న కొద్దీ కంటి చూపు తగ్గుతుంది. కంకుమ పువ్వులో దీనినిమెరుగుపరిచే కారకాలున్నాయి. అందుకే యాభైకి పైబడుతున్న వారంతా తరచూ ఆహారంలో కుంకుమపువ్వునుతీసుకుంటే మంచిదని సూచిస్తున్నారు వైద్యనిపుణులు.

కుంకుమ పువ్వు వైద్య పరంగా ఉపయోగాలు...

కుంకుమ పువ్వు జీర్ణశక్తిని పెంచుతుంది.రక్తప్రసరణను మెరుగుపరిచి రక్తపోటును తగ్గి స్తుంది.కుంకుమ పువ్వును పూర్వం చైనీయుల వైద్యంలో విరివిగా వాడేవారు. వారు ఎక్కు వగా కాలేయ సామార్థ్యాన్ని పెంచేందుకు ఉపయోగించేవారు.ఆయుర్వేదంలో ఉదరం పని తీరును మెరుగుపరిచేందుకు,జీర్ణక్రియ సంబంధిత సమస్యల నివారణకు ఉపయోగి స్తారు.ఆలిని క్రమబద్ధీకరించేందుకు, జీర్ణరసాల ప్రసరణకు, మోనోపాజ్‌ సమస్యల చికి త్సకు కూడా కుంకుమపువ్వును వినియోగిస్తారు. దగ్గు, కడుపుబ్బరం చికిత్సకూ వాడతారు. శారీరక రుగ్మతలతో పాటు డిప్రెషన్‌ను కూడా కుంకుమ పువ్వు తొలగిస్తుంద శరీరంలో కామోద్ధీపనలను పెంచే న్యూరో-ట్రాన్స్‌మిటర్లను, డోపమైన్‌ ఫైన్లను వృద్ధి చేస్తుంది. దీనిలో క్యాన్సర్‌ను నివారించే కీమో-ప్రివెంటివ్‌ లక్షణాలున్నట్లు కూడా తాజా పరిశో ధనలో గుర్తించారు. అయితే కిడ్నీ, నరాలకు ఇబ్బంది కలిగించే టాక్సిన్‌ దీనిలో వుంది కాబ ట్టి ఎక్కువ మోతాదులో వినియోగించవద్దని వైద్యుల సూచన. గర్భవతులు అయిన స్త్రీలు కుంకుమపువ్వు పాలల్లో వేసుకుని తాగితే పుట్టబోయే పిల్లలు మంచి రంగుతో పుడతారని అంటారు. అది వాస్తవమే అయినప్పటికీ కేవలం గర్భవతులే కాదు. కుంకుమ పువ్వును ఎవ్వరైనా తీసుకోవచ్చు. కుంకుమ పువ్వు తీసుకోవడం వలన ఆరోగ్యం మరింత మెరుగవుతుంది . గర్భిణులు మొదటి నెలనుండీ కుంకుమపువ్వు వాడవచ్చును ... కానీ మొదటి మూడు నెలలు వేవుళ్ళు (వాంతులు) ఉంటాయి కాబట్టి ... అనుకూలత బట్టి వాడాలి . తేనె , పాలు , పటికి పంచదార లతో కుంకుమ పువ్వు కలిపి తినవచ్చును . కుంకుమ పువ్వు తో గాఢనిద్ర : రాత్రివేళ ఆహారములోనో , ఏదో ఒక పానీయములోనో కొద్దిపాటి రేకులు వేసుకుంటే గాఢమైన నిద్ర పడుతుంది . నిజానికి కుంకుమ పువ్వులో ఈ గుణాలు రోమన్ల కాలము నాడే గుర్తించారు . ధనవంతులైన రోమన్లు గా్ఢముగా నిద్రించేందుకు గాను తమ దిండ్లు పై కుంకుమ పువ్వు ఫిలమెంట్లను కుట్టించుకునేవారట .

https://www.facebook.com/manaurumanachettu

నకిలీ కుంకుమ పువ్వు

నాణ్యమైన కుంకుమపువ్వు ధర కిలో సుమారు ఆరు లక్షల రూపాయలు. అందుకే దీనికి నకిలీ ఉత్పత్తులు కూడా ఎక్కువే. కొందరు నాణ్యత, ధర తక్కువగా ఉన్న పర్షియన్‌ కుంకుమపువ్వునే కాశ్మీరీ శాఫ్రాన్‌ పేరుతో అమ్ముతారు. దానిమ్మ పూరేకుల్నీ బీట్‌రూట్‌ తురుముల్నీ కూడా శాఫ్రాన్‌గా అమ్మేవాళ్లూ ఉన్నారు. కొనేది మంచిదా కాదా అన్నది చూడాలంటే ఓ రేకుని కాసిని గోరువెచ్చని నీళ్లు లేదా పాలల్లో వేయాలి. అవి వెంటనే రంగు మారితే అది కచ్చితంగా నకిలీదే. స్వచ్ఛమైన కుంకుమపవ్వు కనీసం 15 నిమిషాలు నానిన తరువాతగానీ అందులోనుంచి రంగు దిగదు. అప్పుడే వాసన కూడా మొదలవుతుంది. పొడిరూపంలో కేసర్‌ని అస్సలు కొనకూడదు. ఇందులో మోసం మరింత ఎక్కువ.

నకిలి కుంకుమ పువ్వు

కుంకుమపువ్వులానే ఆహార పదార్థాలకు రంగునిచ్చే పూమొక్కలు ఇంకా చాలానే ఉన్నాయి. కానీ అన్నింటిలోకీ కుసుంబా లేదా కుసుమపూల రేకులు చాలావరకూ శాఫ్రాన్‌ మాదిరిగానే రంగునిస్తాయి. కుంకుమపువ్వుని కొనలేనివాళ్లు దీన్ని ప్రత్యామ్నాయంగా వాడతారు. దీన్ని 'పోర్చుగీసు శాఫ్రాన్‌' అని కూడా అంటుంటారు. మార్కెట్‌లో ఇదే అసలు కుంకుమపువ్వు అని అమ్మేవాళ్లూ ఉంటారు. అయితే ఇవేమీ కూడా అసలైన కుంకుమపువ్వుకి సాటి రావు. దానిలా వీటికి ఘాటైన పరిమళం ఉండదు. కంటిని మోసం చేయొచ్చేమోగానీ రుచిని బట్టి కనిపెట్టేయవచ్చు.

మూఢ నమ్మకం

గర్భిణీ స్త్రీలు ప్రతిదినం కొద్దిగా కుంకుమ పువ్వును, పటిక పంచదార కలిపిన ఆవుపాలతో తీసుకుంటే పుట్టబోయే పిల్లలు మంచి తేజస్సుతో పుడతారని చాలా మంది భావన. అయితే పూర్వకాలం నుండి ఉంటున్న ఈ మూఢనమ్మకంలో వాస్తవం లేదు, శాస్త్రీయంగా కూడా ఎటువంటి ఆధారాలు లేవు.
https://www.facebook.com/manaurumanachettu

శంఖపుష్పం

శంఖపుష్పం


శంఖపుష్పం  సంస్కృతం: श्वेतां, विष्णूक्रांता) పుష్పించే మొక్కలలో ఫాబేసి కుటుంబానికి చెందిన ఎగబ్రాకే మొక్క. వీటిని సంస్కృతంలో గిరికర్ణిక అని పిలుస్తారు. విష్ణుక్రాంత పత్రి విష్ణుక్రాంత వృక్షానికి చెందినది. వినాయక చవితి రోజు చేసుకునే వరసిద్ధివినాయక ఏకవింశతి పత్రి పూజా క్రమములో ఈ ఆకు పదవది.
ఈ మొక్కలు ఆసియా ఖండానికి చెందినవి. తర్వాత ప్రపంచమంతా విస్తరించాయి. ఈ ఆకు ముదురు పచ్చ రంగులో ఉంటుంది. ఆకారం సమంగా ఉంటుంది. పరిమాణం మధ్యస్థం. ఈ చెట్టు గుబురుచెట్టు గా పెరుగుతుంది.ఈ ఎగబ్రాకే మొక్క పుష్పాలు మానవ స్త్రీల యోని (Vulva) ఆకారంలో ఉండడం వలన లాటిన్ భాషలో దీని ప్రజాతి పేరు "క్లిటోరియా క్లిటోరిస్ "నుండి ఉత్పన్నమైనది. టెర్నేటియా ఇండోనేషియా దేశంలో ఒక ప్రాంతం పేరు టెర్నేట్నుం డి వచ్చింది. తమిళం, తెలుగు మరియు మళయాళం భాషలలో దీని పేరు శంఖం (Seashell) నుండి వచ్చింది.

https://www.facebook.com/manaurumanachettu

ఉపయోగాలు


  • శంఖపుష్పాల కోసం కొన్ని తోటలలో పెంచుతారు.
  • భూసారాన్ని పెంచడానికి కొన్ని ప్రాంతాలలో వాడుతారు.
  • శంఖపుష్పాలను వివిధ దేవతలకు జరిపే పుష్పపూజలో ఉపయోగిస్తారు.
  • దీనిని చాలా శతాబ్దాలుగా ఆయుర్వేదంలో వివిధ రకాలైన రోగాల చికిత్సలో ఉపయోగిస్తున్నారు.[
  • దీని వేరు విరేచనకారి మరియు మూత్రము సాఫీగా వచ్చుటకు తోడ్పడును.
  • దీని విత్తనములు నరముల బలహీనతను పోగొట్టుటకు వాడెదరు.
  • ఆసియాలో దీని పుష్పాలను కొన్ని రకాల ఆహార పదార్ధాల వర్ణకం గా వాడుతున్నారు.






https://www.facebook.com/manaurumanachettu

అతి వేగంగా పెరిగే ఐదు రకాల గార్డెన్ మొక్కలు


అతి వేగంగా పెరిగే ఐదు రకాల గార్డెన్ మొక్కలు ;-

గార్డెన్ పెంచుకోవాలనుకొనే వారికి మొక్కల మీదా చాలా ఆసక్తి కలిగి ఉంటారు. గార్డెన్ లో కొత్త కొత్త రకాలను మొక్కలను పెంచుకొంటూ ఆనందిస్తుంటారు. వాటిలో ఏవైనా అతివేగంగా చిగురించో .. లేదా మొగ్గ విడిచో .. పువ్వు పూచో కనిపిస్తే ఆ ఆనందానికి అంతే ఉండదు. ఎందుకంటే ప్రకతి సహజంగా మొక్కలు పెరగడం పువ్వులు పూయడం ఓ అద్భుతం కాబట్టి. అయితే కొన్ని మొక్కలు పెరగడానికి ఎక్కువ సమయం తీసుకొంటాయి. అదే మరికొన్ని ముక్కలు అతి త్వరగా పెరుగుతాయి. అలాంటి మొక్కలు మీ గార్డెన్ లో కూడా పెంచుకోవాలంటే, కొన్ని మొక్కల పేర్లను మీ కోసం......
https://www.facebook.com/manaurumanachettu
మ్యారిగోల్డ్(బంతిపూలు): బంతి పూల మొక్కలు అతి వేగంగా, సులభంగా పెరుగుతాయి. రెండు నెలల్లోనే మీ గార్డెన్ లో కలర్ ఫుల్ గా కళకళలాడాలంటే ఈ మొక్కలను తప్పనిసరిగా పెంచుకోవాల్సిందే. బంతిపూల విత్తనాలు లేదా చిన్న మొక్కలను భూమిలో లేదా కుంపటిలో నాటుకొన్నా సరిపోతుంది. మనం సాధారణంగా చూస్తూనే ఉంటాం బంతిపూలు రెండు మూడు కలర్స్ లో పూస్తుంటాయి. ఆరెంజ్, పసుపు, మెరూన్ ఎల్లో మిక్స్ ఇలా కలర్ కలర్ గా గార్డె అంతా కళకళలాడుతుంది. పువ్వులు ఆకారంలో, షేప్ లో కూడా వ్యత్యాసం కలిగి ఉంటాయి. ఈ మొక్కలను కోసం ఎక్కువగా రిస్క్ తీసుకోవనవసరం లేదు. ఇవి ఎటువంటి నేలలోనైనా అతి సులభంగా పెరుగుతాయి. వీటి కోసం ప్రత్యే శ్రధ్ద తీసుకోవలసిన అవసరంలేదు. మొక్కలకు ప్రతి రోజూ నీళ్ళు పడుతూ, సూర్యరశ్మి మొక్కలపై పడేట్లు చూసుకొంటే సరిపోతుంది. ఒక సారి పువ్వులు వికసించడం మొదలు పెట్టిన తరవాత వాటి కుంపట్లను నీడలోనికి మార్చుకోవాలి. ఈ మొక్కలు చాలా చిన్నవిగా ఉండటం వల్ల వీటిని నిర్వహాణ చాలా సులభంగా ఉంటుంది. 
రాయల్ పామ్: మీ గార్డెన్ లో పొడవైన పామ్ ట్రీ పెంచుకోవానుకొంటున్నారా? అతి వేగంగా పెరిగే ఈ మొక్కను కూడా మీ గార్డెన్ లో మొక్కల జాబితాలో చేర్చేయండి. రాయల్ పామ్ మొక్క అతి వేగంగా పెరుగుతుంది. ఇది 50అడుగుల ఎత్తు వరకు పెరుగుతుంది. అలాదే ఈ మొక్క ఆకులు పొడవైన ఆకులను కలిగి ఉంటుంది. రాయల్ పామ్ చెట్లు వివిధ రకాల మట్టిలో పెరుగుతి. వీటికి తప్పనిసరిగా సూర్యరశ్మి పడే ప్రదేశంలోనే నాటుకోవాల్సి ఉంటుంది. ప్రతి రోజూ నీటిని అందించడం వల్ల అతి వేగంగా పెరుగుతుంది.
 స్పైడర్ ప్లాంట్: ఇది కూడా అతి వేగంగా పెరిగే మొక్కే. ఇలాంటి మొక్కలను మనం సాధారణంగా అనేక ఇళ్ళల్లో గమనించే ఉంటాం. ఈ మొక్కలను ఇంటిలోపాల, లేదా ఇంటి బయట కూడా పెంచుకోవచ్చు. స్పైడర్ ప్లాంట్ మట్టిలోనే పెరుగుతాయి. వీటిని ప్రతి రోజూ నీటినందిస్తూ , మూడు నుండి నాలుగు గంటల సేపు సూర్యరశ్మి తగిలేవిధంగా చూసుకోవాలి. ఇది ముఖ్యంగా కుంపట్లో పెరిగే మొక్క. 
క్యాలెండులా: గార్డెన్ మొక్కలలో అతి వేగంగా పెరిగే మొక్కలలో ఈ కలర్ ఫుల్ క్యాండులా మొక్క కూడా ఒకటి. దీన్ని కుండ బంతి పువ్వు లేదా ముద్దబంతి పువ్వు అని పిలుస్తారు. ఇది చిన్నసైజు బంతి పువ్వు. సంవత్సరంలో ఒక సారి మాత్రమే పూచే ఈ మొక్కనిర్వాహణ బాధ్యతలు సులభం. క్యాండులాను చర్మసంరక్షణ ఉత్పత్తులలో కూడా విరివిగా ఉపయోగిస్తుంటారు. 
బ్యాంబు ప్లాంట్: ఈ వెదురు మొక్క కూడా అతి సులభంగా.. అతి త్వరగా కూడా పెరిగే మొక్క! బ్యాంబు లేదా నందినా డొమాస్టికా జాతికి చెందిన మొక్కలు అతివేగంగా పెరుగుతాయి. కొన్ని నెలల్లోనే అతి వేగంగా పెరిగి గార్డెన్ లో ముదురు పచ్చదనంతో ఎప్పుడూ కళకళలాడుతుంటుంది. మీ తోటను అందంగా తీర్చిదిద్దుకోవాలంటే ఈ మొక్కను కూడా పెంచుకోవడం అవసరం. మీ తోటలో అక్కడక్కడా పొదలులాగా గుబురు గుబురుగా కనబడాలంటే ఈ మొక్కలను పెంచుకోవాల్సిందే. ఈ మొక్కలు అతి సులభంగా అతివేగంగా పెరిగే మొక్కలు మరియు పువ్వులు. ఈ మొక్కలకు ఎక్కువ నిర్వాహాణ బాధ్యతలు తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇటువంటి మొక్కలు ఎటువంటి మంటిలోనైన, వాతావరణంలోనై అతి సులభంగా పెరుగుతాయి. కాబట్టి ఈ మొక్కలను మీ గార్డెన్ లో తప్పనిసరిగా ఉండేట్లు చూసుకోండి. ఇంకా ఏవైనా అతి త్వరగా పెరిగే మొక్కలు మీకు తెలుసా...?
https://www.facebook.com/manaurumanachettu


Saturday, March 12, 2016

                                                                                                           ఈ బ్లాగుని ఆదరిస్తున్న ప్రతీ ఒక్కరికి నా హృదయ పూర్వక కృతజ్ఞతలు.         మీ మనఊరుమనచెట్టు 
                                          

Monday, February 15, 2016

నాగ జెముడు

భారతీయ నాగజెముడు లేదా నాగజెముడు ఫికస్ ఇండికా కాక్టేసి కుటుంబానికి చెందిన పుష్పించే మొక్క. ఇది సుదీర్ఘకాలంగా కొన్ని దేశాలలో ఆహార 

కోసం పండించబడుతున్న ముఖ్యమైన వ్యవసాయ మొక్క.
దీని వృక్ష శాస్త్రీయ నామంOpuntia ficus-indica. ఇవి ఎక్కువగా ఇసుక ప్రాంతాలలో పెరుగుతుంటాయి. వీటి కాండం ఆకు రూపాన్ని కలిగి ఉంటుంది. ఇవి తక్కువ నీటితోఎక్కువకాలం బతుకుతాయి.
ప్రపంచం మొత్తం మీద ఎండిన, సారహీనమైన, నిర్జల, ఎడారి వంటి అన్ని నేలలో ఇది పండుతుంది. ఈ మొక్క సుమారు 12 నుంచి 16 అడుగుల ఎత్తు పెరుగుతుంది. ఈ మొక్క యొక్క మూలాలు మెక్సికో కు చెందినవిగా భావిస్తున్నారు.

పండు.

నాగజెముడు ఫికస్ ఇండికా మొక్క యొక్క కాయ ఆకు పచ్చరంగు నుండి బాగా మగ్గిన తరువాత ఎరుపు రంగుకు మారుతుంది.
బాగా మగ్గిన పండ్లను అతి జాగ్రత్తగా దాని పైన ఉన్న తోలును వలచి లోపలి కండను నములుతూ విత్తనాలను అతి జాగ్రత్తగా ఊసివేస్తారు.

భయం.

నాగజెముడు ఫికస్ ఇండికా మొక్క చాలా భయంకరంగా అనేక ముళ్ళను కలిగి ఉంటుంది. అదికాక ఇది నాగ అనే పేరును కలిగి ఉంది.
నాగుపాము పడగ విప్పినపుడు తల భాగం ఏ ఆకారంలో ఉంటుందో ఈ చెట్టు కాండం మొత్తం అదే పద్ధతి లో ఉంటుంది. అందుకే ఈ రకం మొక్కలను నాగజెముడు అని అంటారు.

తీసుకోవాలసిన జాగ్రత్తలు..

ఈ మొక్క యొక్క పండ్లను తినాలనుకునే వారు పెద్దల సలహాను తీసుకోండి. ఈ చెట్లు వుండే ప్రాంతాలలో చీకుగా ఉన్నందువలన పాములు సంచరిస్తుంటాయి.
ఈ చెట్టుంతా ముళ్ళతో ఉంటుంది. చాలా జాగ్రత్తగా పండును తీసుకోవాలి. ఈ పండుకు కూడా వందల సంఖ్యలో అనేక చిన్న ముళ్ళుంటాయి. ఈ ముళ్ళను ఏ మాత్రం కొంచెం తగిలినా అనేక ముళ్ళు గుచ్చుకుంటాయి.
ఈ పండుకు ఉండే కనిపించి కనిపించని సన్నని ముళ్లు అవేమి చేస్తాయిలే అని ఆజాగ్రత్తగా ఉన్నప్పుడు అనేక ముళ్ళు గుంచుకుని విపరీతమైన చురుకును కలుగజేస్తాయి.
ఈ పండును తినడం అనేక సమస్యలతో కూడుకున్నందు వలన ఈ పండును తినడం కన్నా ఊరకుండడం మేలు లేదా తినకూడదనే అభిప్రాయం భారతదేశంలోని అన్ని ప్రాంతాలలో ఉంది.

Friday, January 08, 2016

గులాబి

100 కు పైగా జాతులు కలిగి అనేక రంగులలో లభించే గులాబి , రోసాసీ కుటుంబానికి చెందినది, అన్ని కాలాలలో లభించే ఈ పూపొద లేదా తీగ రోసా జాతికి చెందినది.కాండంపై పదునైన ముళ్ళను కలిగి ఉండే ఈ జాతి తిన్నని పొదలు, పైకి లేదా నేలపై పాకే మొక్కల సముదాయంగా ఉంటుంది.గులాబీలను ముళ్ళు కలిగినవిగా పేర్కొనడం తప్పు. సాధారణంగా రూపాంతరం చెందిన శాఖ లేదా కాండం ముళ్ళు కాగా, గులాబీలో రూపాంతరం చెందిన బాహ్య కణజాలం పదునైన ముందుకు పొడుచుకు వచ్చినట్లు ఉండే భాగాలు[ముళ్ళు]గా మారతాయి.ఎక్కువ జాతులు ఆసియాకి చెందినవైతే, కొన్ని జాతులు మాత్రం యూరోప్, ఉత్తర అమెరికా, వాయవ్య ఆఫ్రికాలకు చెందినవి. సహజమైనవి, సాగుచేయబడేవి, మరియు సంకర జాతులు అన్నీ కూడా సౌందర్యానికి మరియు సువాసనకి విస్తారంగా పెంచబడుతున్నాయి.
కాడకు ఇరువైపులా ఒకదాని తరువాత ఒకటి వరుసగా ఈకవలె ఆకులు ఉండి, అండాకారంలో మొనదేలిన చిన్న పత్రాలు ఉంటాయి.మొక్క యొక్క కాండతో కూడిన తినదగిన భాగాన్ని గులాబీ పండు(రోజ్ హిప్ )అంటారు.గులాబి మొక్కలు వివిధ పరిమాణాలలో అనగా, మరీ చిన్నవి, చిన్నవి నుండి 20 మీటర్ల ఎత్తు వరకు పాకే తీగలు కూడా ఉంటాయి. ప్రపంచంలోని వివిధ ప్రాంతాలకు చెందిన జాతులను తేలికగా సంకర పరచడం వలన అనేక రకాలైన తోట గులాబీలు అభివృద్ధి చెందాయి.
 దక్షిణ ఇటలీలో గ్రీకు వలస ఐన అస్కాన్ నుండి : రోడాన్ (అయోలిక్ పదం: వ్రోదోన్ ), అరామిక్నుండి వుర్ర్డ్ ఎ ,అస్సిరియన్నుండి వుర్టిన్ను , పాత ఇరానియన్ *వర్ద (cf. అర్మేనియన్ వర్డ్ , అవేస్తాన్ వార్డా , సోగ్దియన్ వార్డ్ , మరియు హీబ్రూ ורד = వేరేద్ మరియు అరామిక్ ורדא: వంటి పదాలన్నీ పైన చెప్పిన గ్రీకు పదానికి ముందు వాడబడ్డాయి. పార్థియన్వర ).
గులాబీ పువ్వుల నుండి ఆవిరి ద్వారా తీయబడిన నూనె, గులాబీ అత్తరుని పరిమళ ద్రవ్యాలలో కొన్ని శతాబ్దాలుగా ఉపయోగిస్తున్నారు. గులాబీ నూనె నుండి తయారయ్యే రోజ్ వాటర్ను ఆసియా మరియు మధ్య ప్రాక్ దేశాల వంటలలో విరివిగా వాడుతున్నారు.గులాబీ రేకుల సారం నుండి తీసిన గులాబీ సిరప్కి ఫ్రాన్స్ ప్రసిద్ధి చెందింది. యునైటెడ్ స్టేట్స్ లో ఫ్రెంచ్ గులాబీ సిరప్ ని గులాబీ స్కోన్ తయారీకి వాడతారు.
గులాబీ పండ్లు వాటిలోసి విటమిన్ జెల్లీ, మరియు మర్మలాడ్, మరియు టీ తయారు చేయడంలో వాడబడుతున్నాయి. వాటిని దంచి వడగట్టి గులాబీ పండ్ల రసాన్ని తయారు చేస్తారు.గులాబీ పండ్ల నుండి తయారయ్యే గులాబీ పండు గింజ నూనెను, చర్మ మరియు సౌందర్య సంబంధ ఉత్పత్తులలో వాడతారు.