మనఊరు మనచెట్టు: March 2017

Friday, March 10, 2017

అంటుకట్టుట

మొక్కగా ఉన్నప్పుడు మొదలు వద్దనే మొక్క పై భాగాన్ని అదే జాతికి చెందిన మరో ఉత్తమ రకం లేదా మనకు కావలసిన మొక్కతో మార్పు చేయడాన్ని అంటుకట్టుట అంటారు. కాని మొక్క చెట్టుగా ఎదిగిన తరువాత మొదలు వద్ద మరొక ఉత్తమ రకంతో అంటుకట్టుట సాధ్యం కాని పని లేదా కష్టం. అందువలన చెట్టు యొక్క చిన్న కొమ్మలపై అంటుకట్టుట ద్వారా పై కొమ్మలను మార్చడం వలన ఉత్తమ ఫలాలను అందుకునే ఈ విధానాన్ని తలమార్పిడి అంటారు. ఈ విధానం ద్వారా ఒకే చెట్టు నుండి అదే జాతికి చెందిన అనేక రకాల ఫలాలను పొందవచ్చు. ఉదాహరణకు నాటుమామిడి చెట్టుకు ఒక కొమ్మకు బంగినపల్లి మామిడి కొమ్మను అంటుకట్టుట ద్వారా బంగినపల్లి మామిడి కాయలను అలాగే ఇదే నాటుమామిడి చెట్టు మరొక కొమ్మకు రసాల మామిడి కొమ్మను ఆంటుకట్టుట ద్వారా రసాల మామిడి కాయలను పొందవచ్చు. ఈ విధంగా ఒక రకానికి చెందిన మామిడి చెట్టు నుండి అనేక రకాల మామిడి కాయలను పండించవచ్చు.