మనఊరు మనచెట్టు: 2021

Wednesday, June 09, 2021

పుదీన లో ఉన్న అద్బుతమైన ఔషధ గుణాలు.


                                  manaooru manachettu

పుదీనా నుండి మెంథాల్ తయారు చేస్తారు. పుదీనానుంచి మెంథాల్‌ను లేదా మెంథా-ఆయిల్‌ను డిస్టిలేషన్ విధానం ద్వారా తీస్తారు. ఇది ఆవిరయ్యే తత్వం కలిగినది. నీళ్ల మాదిరిగా కనిపిస్తుంది. సింథెటికల్ ప్రోసెస్ ద్వారా కూడా మెంథాల్ ను తయారు చేస్తున్నారు . ప్రత్యేకమైన, ఆహ్లాదకరమైన వాసనతో ఉంటుంది. ప్రయోగానంతరం చల్లదనాన్ని ప్రసాదిస్తుంది. మన పరిసరాలలో దొరికే ఎంతో విలువైన మొక్కల్లో పుదీనా ఒకటి. దీని శాస్త్రీయనామం మిన్‌థా లామియేసి. ఇది మెంథా స్పైకాటా జాతికి చెందిన మొక్క. సంస్కృతంలో పూతిహ అంటారు. పూతి అంటే వాసన చూసేది అని అర్ధం. తెలుగులో పుదీనా అనీ, ఇంగ్లీష్‌లో మింట్‌ అని, లాటిన్‌లో మెంతా పైపరేటా అనీ పిలుస్తారు. ఇది చూడడానికి ఎంతో విలక్షణంగా ఉండి, దీని ఆకులు మందంగా, కొసలు రంపం ఆకారంలో ఉండి, చాలా మృధువుగా ఉంటుంది. మంచి వన్నె గల ఆకుపచ్చని రంగులో ఉండి, సంవత్సరమంతా ఆకుపచ్చ గానే ఉంటుంది. దీనికి పువ్వులు, ఫలాలు ఎండాకాలం తరువాత నుంచే ఏర్పడతాయి. వీటి ఫలాలు చాలా చిన్నవిగా ఉంటాయి. అనేక ప్రయోజనాలు కలిగిన పుదీనా నుండి చమురు తీసి దానిని వైద్య పరంగా వినియోగిస్తున్నారు. చాలా రకాల వ్యాధులకి తయారు చేసే ఔషధాల్లో పుదీనా (మింట్‌) ఎక్కువ శాతం వాడకంలో ఉండటం వల్ల ప్రపంచవ్యాప్తంగా దీనికి ఎంతో డిమాండ్‌ ఉంది. అందువల్లనే దీనిని వ్్వ్యవసాయ  పద్ధతిలో తగిన విధంగా తోటలు వేసి వ్యవసా యదారులు తగిన రాబడిని, లాభాలని అందుకుంటున్నారు. పుదీనా మొక్కలో ప్రతి భాగం ఉపయోగపడేదే. ఔషధతత్వాలు కలిగివున్నదే. ఒక కంపెనీ ఉత్పత్తి చేస్తున్న 'పుదీన్‌ హర' అనే ఔషధం దీనికి నిదర్శనం. 

ఔషధ గుణాలు

పుదీనా పూర్తి ఔషధ గుణాలు కలిగివున్న మొక్క. చికిత్సా విధానాల్లో దీనిని జీర్ణ సంబం ధవ్యాధులకి ఉపయోగిస్తారు. పుదీనా ఆకుల రసంలో అల్లంరసం, కలబంద గుజ్జు, ఏలకు లు, దాల్చిన చెక్క కలిపి నూరి, ప్రతి రోజూ, 2-3 చెంచాలు సేవిస్తూవుంటే అరుగుదల పెరుగుతుంది. జీర్ణకోశ వ్యాధులకి, కడుపు నొప్పికి, పుదీనా గింజలు కొన్ని నమిలి తిన్న తరువాత గ్లాసుడు వేడినీళ్ళు తాగితే ఎంతో ఉపశమనం కలుగుతుంది.

కొన్ని పుదీనా ఆకుల్ని గ్లాసుడు నీళ్లతో మరిగించి, ఆ కషా యాన్ని సేవిస్తే, జ్వరం తగ్గిపోవడమే కాక కామెర్లు, ఛాతిమంట, కడుపులో మంట, మూత్ర సంబంధవ్యాధులు సమసిపోతాయి.

నెల తప్పిన స్త్రీలు ఒక చెంచాడు పుదీనా రసంలో చెంచాడు నిమ్మరసం, చెంచాడు తేనె కలిపి, ఆరారగా చేతిలో వేసుకుని సేవిస్తూ వుంటే, వాంతులు, ఎసిడిటీ, వంటి వికారాలు తగ్గుతాయి. అలాగే నిద్రలేమికి, మానసిక వత్తిడికి, నోటి వ్యాధులకి కొన్ని పుదీనా ఆకులు గ్లాసుడు వేడి నీటిలో వేసి, మూతపెట్టి అర్ధగంట తరువాత తాగితే చాలా ఉపశమనం కలగజేస్తుంది. మంచి నిద్ర పడు తుంది.

పుదీనా ఆకులు అరచేతిలో బాగా నలిపి ఆరసాన్ని కణతలకి, నుదుటికి రాసుకుంటే, తలనొప్పి తగ్గిపోయి, చల్లదనా న్నిస్తుంది.

చెవి, ముక్కుల్లో ఏర్పడే ఇన్‌ఫెక్షన్‌కి తాజా పుదీనా ఆకులు కొన్ని రసం తీసి దూదిని ఆరసంలో ముంచి, ముక్కులోను, చెవి లోను డ్రాప్స్‌గా వేసుకుంటే వీటి సమస్య తక్ష ణం పరిష్కారమవుతుంది. పుదీనా ఆకులు ఎండబెట్టి చూర్ణం చేసి, అందులో తగినంత ఉప్పు చేర్చి ప్రతినిత్యం దంతధావనం చేస్తే చిగుళ్ళు గట్టిపడి, దంత వ్యాధులు కుండా అరికడుతుంది. అంతేకాక నోటి దుర్వాసనని కూడా అరికడుతుంది.

ఇక శరీరం మీద ఏర్పడే దురద, దద్దుర్లకి కొన్ని పుదీనా ఆకు ల్ని గ్లాసుడు నీటిలో మరగబెట్టి, తగినంత పటిక బెల్లం పొడిని కలిపి తీసుకుంటే ఈ సమస్యనుంచి త్వరగా బయటపడవచ్చు. చిన్న పిల్లలు కడుపునొప్పి ఉప్పరంతో బాధపడుతుంటే గోరువేచ్చని నీటిలో ఐదు ఆరుచుక్కలు పుదీనా రసం కాచి తాగించడం వలన కడుపు ఉబ్బరం, కడుపు నొప్పి తగ్గుతుంది. చిన్న పిల్లలకు జలుబు చేస్తే పుదీనా నుండి తయారయ్యే మెంథాల్ ముద్ద కర్పూరాన్ని .... కొబ్బరినూనెను కొంచెం తీసుకొని మిశ్రమం చేసి ఛాతికీ వీపునకు రాస్తే జలుబు తగ్గుతుందని ఆయుర్వేద వేద్యం సూచిస్తోంది

Thursday, April 08, 2021

AGRICULTURE CROPS IN INDIA 🇮🇳 || MANAURUMANACHETTU || TELANGANA

                           
AGRICULTURE CROPS IN INDIA 🇮🇳 || MANAURUMANACHETTU || TELANGANA



                           

Saturday, March 13, 2021

ఉలవలు

 ఉలవలు నవధాన్యాలలో ఒకటి.

ఉలవలు:- Dolichos Uniflorus, Dolichos Biflorus. Eng. Horse gram. సం. కుళుత్ధ, తామ్రబీజ, హిం. కుల్తీ. ఇవి తెలుపు ఎరుపు, నలుపు రంగులుగల మూడు జాతులుగ నుండును. ఉలవలు నవధాన్యాలలో ఒకటి. లక్షణాలు * దట్టంగా అమరిన మృదువైన కేశాలతో తిరుగుడు తీగ ద్వారా ఎగబాకే గుల్మము. * అండాకారం నుండి విషమకోణ చతుర్బుజాకార పత్రకాలు గల త్రిదళయుత హస్తాకార సంయుక్త పత్రాలు. * సమూహాలుగా గాని ఏకాంతంగా గాని అమరి ఉన్న పసుపు రంగుతో కూడిన ఆకుపచ్చని పుష్పాలు. వీనిలో నలుపురంగు ఉలవలు ఎక్కువపనిజేయును. పై మూడు జాతులలో ఏజాతి ఉలవయొక్క కషాయము గాని లేక చూర్ణము గాని, వగరుగ, తీపిగ స్వాదుగనుండును. వేడిజేసి యార్చును; మిక్కిలి కాక జేయును, పైత్యము జేయును. వాతము, పీనస, శ్వాస, మూలవ్యాధి, మూత్రకృఛ్రము, ఊపిరిగొట్టునొప్పి, మలబద్ధము వీనిని హరించును; కఫమును లేక శ్లేష్మమును కరిగించును అనగా నీరుజేయును; స్త్రీలు బహిష్టు కావడములోని లోపములను (menstural disorders)పోగొట్టును; ప్రసవ స్త్రీల మైలరక్తమును వెడలించును. గురదాల లోని రాతిని కరిగించును;

                     ******************ఆకలి బుట్టించును*********************



ఎక్కిళ్ళు, నేత్రరోగములు వీని నణచును; మూత్రము గావించును; ఋతురక్తమును జారీజేయును; నల్లదబ్బతో (Spleen)పుట్టెడు కంతులను హరించును; కడుపు నొప్పిని పోగొట్టును; ముల్లంగియాకు రసముతో నిచ్చిన మూత్రపుసంచిలోని (Bladder)రాయి పడిపోవును. ఉలవ కషాయముతో కాచినచారు (ఉలవచారు) పైనచెప్పిన రోగులకు పథ్యముగ నుండును. ఉలవ కట్టు :- Boilings of horse gram. వగరుగా, రుచిగా నుండును. వాతము, తూనివాతము, ప్రతూనివాతము, అనులోమవాతము, గుల్మము, ఉదరరోగము, మధుమేహము, మూత్రాశ్మరి, శ్లేష్మము, శూల, క్షయ, శ్వాస, కాస, గుదరోగము బోగొట్టును ఆయు్ర్వేదము : మూలము : డా. చిరుమామిళ్ల మురళీమనోహర్, ఎం.డి. ఆయుర్వేద ఉలవలతో కులత్థాద్వఘృతం, కులత్థాది ప్రలేపం, కులత్థయూషం వంటి ఆయుర్వేద ఔషధాలు తయారవుతాయి.

        ***********ఉలవల్లో ప్రోటీన్ ఎక్కువ**************

ఉలవల్లో ప్రోటీన్ ఎక్కువ. పెరిగే పిల్లలకు మంచి టానిక్. ఉలవల్లో ఐరన్, మాలిబ్డినం వంటి ఖనిజ సంబంధ పదార్థాలూ ఎక్కువే. పొట్టు తొలగించటం, మొలకెత్తించటం, ఉడికించటం, వేయించటం వంటివి చేయడం ద్వారా ఉలవల్లోని పోషకతత్వాలు గణనీయంగా పెరుగుతాయి. * ఉలవలు ఆకలిని పెంచుతాయి. కఫాన్ని పల్చగా మార్చి వెలుపలకు తెస్తాయి. కళ్లు కన్నీరు కారటం, కళ్లలో పుసులు కట్టడం వంటి సమస్యల్లో వాడవచ్చు. * మూత్రాశయంలో తయారయ్యే రాళ్లను కరిగించి వెలుపలకు రావడానికి ఉలవలు సహకరిస్తాయి. తరచూ ఎక్కిళ్లు వస్తుంటే ఉలవలు తగ్గిస్తాయి. * ఉలవలను తీసుకోవటంవల్ల మలనిర్హరణ సజావుగా, సాఫీగా జరుగుతుంది. ఉలవలను ఆహారంలో వాడేవారికి మూత్ర విసర్జన ధారాళంగా, నిరాటంకంగా జరుగుతుంది. మహిళల్లో బహిష్టురక్తం కష్టం లేకుండా విడుదలవుతుంది. ఉలవలు ప్లీహ వ్యాధులతో బాధపడేవారికి సైతం హితం చేస్తాయి. ఔషధోపయోగాలు స్థూలకాయం: ఉలవలను ఆహార రూపంలో తీసుకుంటే స్థూలకాయం తగ్గుతుంది. ముందుగా ఒక కప్పు ఉలవలకు నాలుగుకప్పులు నీళ్లు కలిపి కుక్కర్‌లో ఉడికించాలి. ఇలా తయారుచేసుకున్న ‘ఉలవకట్టు’ను ప్రతిరోజూ ఉదయంపూట ఖాళీ కడుపుతో, చిటికెడు ఉప్పు కలిపి తీసుకుంటూ ఉంటే క్రమంగా సన్నబడతారు. ఉలవలు తీసుకునే సమయంలో శరీరంలో మంటగా అనిపిస్తుంటే మజ్జిగ తాగితే సరిపోతుంది. బోదకాలు, కాళ్లవాపు: ఉలవల పిండినీ, పుట్టమన్నునూ ఒక్కోటి పిడికెడు చొప్పున తీసుకొని సమంగా కలపాలి. దీనికి కోడిగుడ్డు తెల్లసొనను కలిపి స్థానికంగా లేపనంచేస్తే హితకరంగా ఉంటుంది. లైంగిక స్తబ్ధత: ఉలవలను, కొత్త బియ్యాన్నీ సమంగా తీసుకొని జావ మాదిరిగా తయారుచేయాలి. దీనిని పాలతో కలిపి కొన్ని వారాలపాటు క్రమంతప్పకుండా తీసుకుంటే లైంగిక శక్తి, శృంగారానురక్తి పెరుగుతాయి. దీనిని వాడే సమయంలో మలబద్ధకం లేకుండా చూసుకోవాలి. కాళ్లు, చేతుల్లో వాపులు, నొప్పి: ఉలవలను ఒక పిడికెడు తీసుకొని పెనంమీద వేయించి మందపాటి గుడ్డలో మూటకట్టి నొప్పిగా ఉన్న భాగంలో కాపడం పెట్టుకోవాలి. శరీరంలో వ్రణాలు (అల్సర్లు) తయారవటం: పావు కప్పు ఉలవలను, చిటికెడు పొంగించిన ఇంగువను, పావు టీస్పూన్ అల్లం ముద్దను, పాపు టీ స్పూన్ అతిమధురం వేరు చూర్ణాన్నీ తగినంత నీటిని కలిపి ఉడికించాలి. దీనికి తేనె కలిపి కనీసం నెలరోజులపాటు తీసుకుంటే బాహ్యంగా, అభ్యంతరంగా తయారైన వ్రణాలు (అల్సర్లు) త్వరితగతిన తగ్గుతాయి.


        **********మూత్రంలో చురుకు, మంట***********

ఒక కప్పు ఉలవచారుకి సమాన భాగం కొబ్బరి నీరు కలిపి తీసుకుంటుంటే మూత్రంలో మంట తగ్గుతుంది. మూత్రం జారీ అవుతుంది. మధుమేహం: మూత్రంలో చక్కెర కనిపిస్తున్నప్పుడు ఉలవల కషాయంలో వెంపరి (శరపుంఖ) చెట్టు చూర్ణాన్ని, సైంధవ లవణాన్ని కలిపి తీసుకుంటే లాభదాయకంగా ఉంటుంది. సెగగడ్డలు: ఉలవ ఆకులను మెత్తగా నూరి, కొద్దిగా పసుపుపొడి కలిపి పై పూత మందుగా రాస్తే చర్మంమీద తయారైన సెగ గడ్డలు పగిలి, నొప్పి, అసౌకర్యం తగ్గుతాయి. విరేచనాలు: ఒక టీ స్పూన్ ఉలవ ఆకురసానికి అరటి పండు కలిపి రోజుకు 2-3 పర్యాయాలు తీసుకుంటే విరేచనాలు నియంత్రణలోకి వస్తాయి. చర్మంమీద తయారయ్యే వాపు, నొప్పి, దురదలు: మొలలమీద ఉలవల ముద్దను లేపనం చేస్తే నొప్పి, వాపు, దురదలు తగ్గుతాయి. ముఖ చర్మం కాంతి లేకుండా తయారవటం: ఉలవల పిండిని ఫేస్ ప్యాక్‌గా ప్రయోగిస్తే చెక్కిలి, బుగ్గలు కాంతితో మెరుస్తాయి. తెల్లబట్ట (వైట్ డిశ్చార్జ్): ఉలవచెట్టు కట్టెతో తయారుచేసిన కషాయం తీసుకుంటే మహిళల్లో కనిపించే తెల్లబట్ట సమస్య తగ్గుతుంది. ప్రసవం పూర్తిగా జరగకపోతే : ప్రసవానంతరం గర్భాశయంలో మిగిలిపోయిన మైల సంబంధ రక్తం నిశే్సషంగా వెలుపలకు రావడానికి ఉలవలు సహకరిస్తాయి. ఆయుర్వేద గ్రంథాలు చెప్పిన చికిత్సలు జ్వరం: జ్వరంతో ఇబ్బంది పడుతున్నప్పుడు ఉలవలతో కషాయం తయారుచేసుకొని పెసర కట్టుకు కలిపి తీసుకోవాలి. ఉలవల వల్ల చెమట పట్టి జ్వరం దిగుతుంది. పెసర కట్టు తేలికగా జీర్ణమై శక్తిని ఇస్తుంది. ఎక్కువగా చెమట పట్టడం (స్వేదాదిక్యత): ఉలవలను కొద్దిగా వేయించి, పొడిచేసి చర్మంమీద రుద్దుకోవాలి. దీనిని నలుగు పిండిగా గాని లేదా స్నాన చూర్ణంగా గాని వాడుకోవచ్చు. దగ్గు, ఆయాసం: ఉలవల కషాయం తీసుకుంటే దగ్గు, ఉబ్బసంలో హితకరంగా ఉంటుంది.

 #manaurumanachettu #మనఊరుమనచెట్టు

      ********గుండె జబ్బులు********

బార్లీగింజలతో అన్నం మాదిరిగా వండుకొని ఉలవ కషాయం కలిపి తీసుకుంటే గుండె జబ్బుల్లో హితకరంగా ఉంటుంది. మూత్ర పిండాల్లో రాళ్లు: ఉలవలతో ఘృతపాక విధానంలో ఘృతం తయారుచేసుకొని తీసుకోవాలి. దీనిని కులత్యా కషాయాలు, నువ్వులుమినుములుద్రాక్షతో తయారైన వైన్ వంటివి తీసుకుంటే బహిష్టు రక్తం అడ్డులేదిఘృతం అంటారు. ఉలవల ముద్దకు నాలుగురెట్లు నెయ్యిని, నెయ్యికి నాలుగురెట్లు నీళ్లనూ కలిపి, చిన్న మంట మీద నీరంతా ఆవిరయ్యేవరకూ మరిగించడాన్ని ఘృత పాక విధానం అంటారు. కడుపునొప్పి: ఉలవ కషాయాన్ని సక్రమమైన రీతిలో పులియబెట్టి, సైంధవ లవణం, మిరియాల పొడిని కలిపి తీసుకుంటే కడుపునొప్పిలో హితకరంగా ఉంటుంది. ఆహారం తీసుకున్న తరువాత కడుపునొప్పి వస్తుంటే (అన్నద్రవశూల): ఉలవలు వేయించి, పొడిచేసి వెన్న లేని పాలతో తోడుపెట్టి చేసిన పెరుగుతో కలిపి తీసుకుంటే అన్నద్రవ శూలనుంచి ఉపశమనం లభిస్తుంది. నులిపురుగులు, అంత్రక్రిములు: పాలకు ఉలవ కషాయం చేర్చి తీసుకుంటే అంత్రక్రిములు నశిస్తాయి. దద్దుర్లు (శీతపిత్తం) (అర్టికేరియా): ఉలవలు, ముల్లంగి దుంపల పొడి వంటివి ఆహారంలో తీసుకుంటే దద్దుర్లనుంచి ఉపశమనం లభిస్తుంది. ఆమవాతం (రుమటాయిడ్ ఆర్తరైటిస్): ఉలవలతో సూప్ తయారుచేసుకొని తీసుకుంటే వాపులతో కూడిన కీళ్లనొప్పిలో హితకరంగా ఉంటుంది. గండమాల (సర్వైకల్ లింఫ్ ఎడినైటిస్): తేమ లేని ఆహారానికి ఉలవల కషాయం చేర్చి తీసుకుంటే గండమాలలో హితకరంగా ఉంటుంది. నష్టార్తవం (బహిష్టు సక్రమంగా రాకపోవటం, బహిష్టు ఆగిపోవటం) (ఎమనోరియా): ఉలవలుచేపలు, పుల్లని మజ్జిగ, పుల్లనికుండా సజావుగా స్రవిస్తుంది.

                       *******అర్శమొలలు********

ద్రవ రూప మలంతోపాటు అర్శమొలలు ఇబ్బంది పెడుతున్నప్పుడు ఎండించిన ముల్లంగి దుంపల పొడిని, ఉలవ పొడినీ కలిపి తీసుకోవాలి. వెలగపండు, మారేడు పండ్లు, చెంగల్వకోష్టు వీటితో కషాయం తయారుచేసుకొని మేక మాంసంతో కలిపి తీసుకోవాలి. కఫంవల్ల ఎక్కిళ్లు, ఉబ్బసం వస్తుంటే: ఉలవ కషాయాన్ని, పంచకోలాల కషాయాన్ని నెయ్యికి చేర్చి ఘృత పాకం విధానంలో నెయ్యిని తయారుచేసుకొని తీసుకుంటే ఎక్కిళ్లు, ఉబ్బసం తగ్గుతాయి. శరీరంలో పెరుగుదలలు తయారవటం (గుల్మం): ఉదర భాగంలో ట్యూమర్లు పెరుగుతున్నప్పుడు ఉలవలు, పెసర గింజలు, పిప్పళ్లు, శంఠి కొమ్ములు, ముల్లంగి, మారేడుపండ్లు, ఉలిమిరిపట్ట, చిరబిల్వ లేతాకులు, చిత్రమూలం వేరు, వాము... వీటిని నీళ్లకు కలిపి కషాయం తయారుచేసుకొని తీసుకోవాలి.

                         *******లక్షణాలు********

  • దట్టంగా అమరిన మృదువైన కేశాలతో తిరుగుడు తీగ ద్వారా ఎగబాకే గుల్మము.
  • అండాకారం నుండి విషమకోణ చతుర్బుజాకార పత్రకాలు గల త్రిదళయుత హస్తాకార సంయుక్త పత్రాలు.
  • సమూహాలుగా గాని ఏకాంతంగా గాని అమరి ఉన్న పసుపు రంగుతో కూడిన ఆకుపచ్చని పుష్పాలు.  

                             https://www.instagram.com/manaurumanachettuofficial
                             https://www.facebook.com/manaurumanachettuofficial
                            https://www.youtube.com/channel/UCK_hnGZVt5H1SfOn6e5jVnA

Sunday, January 24, 2021

దోసకాయ గురించి...👌

 చల్లగా చూడగానే తినాలపించే కీరదోస వేసవిలో సాంత్వన నివ్వడమే కాదు దానిలోని పుష్కలమైన పోషకాలు శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. రీహైడ్రేటింగ్‌ ఏజెంట్‌గా పనిచేస్తుంది. పొటాషియంమెగ్నీషియం అధికంగా ఉండటంతో రక్తపోటుతో బాధపడేవారికి ఇది చక్కని ఆహారం. స్వేదం ద్వారా కోల్పోయిన నీటిని, లవణాలను శరీరానికి తిరిగి అందించడంలో కీరదోస చక్కని పాత్ర పోషిస్తుంది. రోజూ కప్పు కీరదోస రసం తాగితే మేని నిగారింపు సంతరించుకుంటుంది. దీని నుంచి ఆవస్యక ఫొలేట్‌తో పాటు విటమిన్‌- ఎ, సిలు పుష్కలంగా లభిస్తాయి.


పోషక విలువలు
శక్తి: 13కి.కెలోరీలు; మాంసకృత్తులు: 0.4గ్రా; కార్బోహైడ్రేట్లు: 2.5గ్రా; కొవ్వు: 0.1 గ్రా; పీచు: 2.6; సోడియం: 10.2మి.గ్రా; పొటాషియం: 50మి.గ్రా

ఉపయోగాలు

రక్తపోటులో తేడా ఏర్పదినవారికి దోసకాయలో ఉన్న "పొటాసియం " రక్తపోటులోని హెచ్చు తగ్గులను సవరిస్తుంది. 

దోస లోని లవణాలు గోళ్ళను అందంగా, చిట్ల కుండా ఉంచుతాయి .

కళ్ళ కింద నల్లటి చారలను కీరదోసకాయ ముక్కలు తొలగించును, కళ్లు ఉబ్బినట్లు ఉంటే వాటిమీద తాజా కీరదోసకాయ ముక్కలను కాటన్ వేసి పెట్టుకుంటే చక్కటి ఫలితమిస్తాయి . శిరోజాల ఎదుగుదలకు దోసలోని సల్ఫర్, సిలికాన్, దోహదపడి జుట్టును ఆరోగ్యంగా ఉంచుతుంది . దోస కడుపులోని మంటను తగ్గిస్తుంది, జీర్ణ క్రియను మెరుగుపరుస్తుంది . దోస తొక్కలో " విటమిన్ 'కే' " సమృద్ధిగా ఉన్నందున చేర్మానికి మేలుచేకురుతుంది. ఒక దోసకాయ ముక్కని 30 సెకన్ల పాటు నాలుకతో నోటి మీద పట్టుకొని ఉంటే చెడు శ్వాసకి కారణమైన బ్యాక్టీరియాను చంపేస్తుంది.



తొక్కతోనే తినాలి
దోసకాయను తోక్కతోనే తినాలి, దోసకాయను ఉరగాయగా చేసి తినకూడదు . ఆరోగ్య ప్రయోజనాలు : ఎసిడిటీ : కీరదోసకాయ జ్యూస్ తాగడం ద్వారా అందులో ఉండే ఖనిజాలలోని ఆల్కలైన్‌ స్వభావమువల్ల రక్త ప్రసరణ చక్కగా జరుగుతుంది. దీంతో ఎసిడిటీ సమస్య తగ్గుతుంది . అలాగే కీరదోసకాయ జ్యూస్ గ్యాస్ట్రిక్, డియోడినం అల్సర్లకు చికిత్సగా ఉపయోగపడి ఉపశయనం కలిగిస్తుంది . రక్తపోటు : ఎటువంటి రంగులు లేని కీరదోసకాయ జ్యూస్ వలన రక్తప్రసరణ క్రమ బద్ధంగా ఉంటుంది . ఇందులోని ఖనిజాలు సోడియాన్ని నియంత్రణకు దోహదపడుతుంది. చలువ : వాతావరణం పొడిగా, వేడిగా ఉన్న రోజుల్లో కీరదోషకాయ జ్యాస్ ఏవైనా ఆకుకూరల రసంతో కలిపి తీసుముంటే చలువ చేస్తుంది. శరీర ఉష్ణోగ్రతను సమతుల్యముగా ఉండేలా చేస్తుంది . మూత్ర విసర్జన : మూత్రపిండాలలో రాళ్ళు కరిగిపోవడానికి, మూత్ర విసర్జన చక్కగా జరగడానికి దోహదపడుతుంది . నొఫ్ఫితో కూడిన వావు : కీళ్ళలో ఉండే యూరిక్ యాసిడ్ ను తొలగించడం వల్ల వాపు, నొప్పి తగ్గిపోతాయి. ఆర్త్రైటిస్, గౌట్ వ్యాధులలో ఇది మంచి చేస్తుది. జట్తు పెరుగుదల : కీరదోసకాయలో గల సిలికాన్‌, సల్ఫర్ ఖనిజలవణాలు జుట్టు పెరుగుదలకు దోహదం చేస్తుంది చర్మం మెరుగుదల: ఇందులోగల అధిక ' సి ' విటమిన్‌ వల్ల చర్మ పరిస్థితిని మెరుగుపరుస్తుంది . సౌందర్య పోషకాలలో కీరదోషకాయ తప్పక ఉంటుంది . ఎగ్జిమ, తామర, సోరియాసిస్ వంటి చర్మ వ్యాదులకు చికిత్సకోసం కీరదోషకాయ వాడవచ్చును . ఎండలో చర్మము కమిలిపోవడం : తీవ్రమైన ఎండవలన చర్మమము కమిలి పోతుంది. అప్పుడు కీరదోషకాయ రసం తీసి కమిలిన చోట రాస్తే చల్లగా ఉండి శరీరానికి ఉపశయనం కలుగుతుంది. శరీరంలో నీటినిల్వ : కీరదోషకాయ రసంలో ఎలక్ట్రోలైట్స్ ఉంటాయి అందువలన శరీరంలో తగిన మోతాదులో నీటి నిల్వకు దోహదం చేస్తాయి. కళ్ళు చలువ : కీరదోషకాయ గుండ్రని ముక్కలుగా తరిగి కళ్ళపై ఉంచితే మంటలు తగ్గి ఉపశయనంతో పాటు కళ్ళు చల్లగా ఉంటాయి. వేడి తగ్గుతుంది. కళ్ళ వాపు తగ్గుతుంది. దోస ఈ దేశమున ప్రాచీన కాలము నుండియూ సాగునందుండిన తీగ జాతి చెట్టు. గట్టిగా చర్మంలో ముడతలు లేనివి చూసి ఎంచుకోవలెను. దోసకాయ మెత్తదైతే పండినదని అర్థము.దోస (cucumber) శాస్త్రీయ నామం - కుకుమిస్ సటైవస్ (Cucumis sativus), కుకుర్బిటేసి (cucurbitaceae) కుటుంబానికి చెందినవి.