మనఊరు మనచెట్టు: 2017

Saturday, October 14, 2017

సీతాఫలము /రామాఫలము

Image result for సీతాఫలముసీతాఫలము /రామాఫలము . శీతాకాలం పండుగా పరిగణించే సీతాఫలం పోషకాల సమాహారం. కొన్ని రకాల అనారోగ్యాల నివారణి. మరెన్నో సుగుణాలున్న ఈ పండు గురించి వివరింగా తెలుసుకుందాం. ఈ కాలంలో మూడు నెలలకు పైగా లభిస్తుంది సీతాఫలం. ఈ పండు రామాఫలం, లక్ష్మణఫలం రకాల్లోనూ దొరుకుతుంది. చూడడానికి ఒకే విధంగా ఉన్నా.. రుచి, వాసనలో కాస్త తేడా ఉంటుంది. సీజన్‌ వస్తోందంటే చాలు... కొన్ని పండ్ల రుచి పదే పదే గుర్తొచ్చేస్తుంటుంది. మార్కెట్లో అవి ఎప్పుడెప్పుడు కనిపిస్తాయా అన్నట్లు ఎదురుచూసేలా చేస్తుంది. ఆ కోవకే చెందుతాయి సీతాఫలం, రామాఫలం, లక్ష్మణఫలాలు. ఈపేర్లు చూస్తే మన పురాణ పురుషులకు ఇష్టమైన పండ్లేవో అనిపించకమానదు. అంతేకాదు, ఇవి అచ్చంగా మనకి మాత్రమే ప్రత్యేకమైన పండ్లేనేవో అనిపిస్తుంది. కానీ వీటి స్వస్థలం మనదేశం కాదు. దక్షిణ అమెరికా, ఐరోపా, ఆఫ్రికన్‌ దేశాల్లో పెరిగే ఈ వెుక్కల్ని మనదేశానికి తొలిసారిగా పోర్చుగీసువాళ్లు పదహారో శతాబ్దంలో తీసుకొచ్చారట. ఆ తరువాత వీటికా పేర్లు ఎవరు పెట్టారో తెలియదుకానీ మనందరికీ ఇష్టమైన రాముడు, సీత, లక్ష్మణ పేర్లు పెట్టేసి తమ భక్తిని చాటుకున్నారు. మనరాష్ట్రంలో ఎక్కువగా పండే సీతాఫలాలతోనే మనకి అనుబంధం ఎక్కువ. కానీ ఉత్తరాంధ్ర, కొన్ని తెలంగాణా జిల్లాల్లోనూ కర్ణాటక, తమిళనాడు, కేరళ, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల్లోనూ రామాఫలాలు, లక్ష్మణఫలాలు ఎక్కువగా పండుతాయి. సీతాఫలం అమృతఫలాన్ని తలపించే సీతాఫలాన్నే కస్టర్డ్‌ యాపిల్‌ అనీ షుగర్‌ యాపిల్‌ అనీ పిలుస్తారు. ఇది దక్షిణ అమెరికా దేశాలతోపాటు మనదేశంలోనూ విరివిగా పండుతుంది. పండుగా తినడంతోపాటు స్వీట్లు, జెల్లీలు, ఐస్‌క్రీములు, జామ్‌లు చేస్తుంటారు. మనందరికీ పండుగానే సుపరిచితమైన ఇది ఛత్తీస్‌గఢ్‌ వాసులకు మాత్రం అద్భుత ఓషధీఫలం.

ఔషధ గుణాలు

దీని ఆకులు, బెరడు, వేరు... ఇలా అన్ని భాగాల్నీ అక్కడ పలు వ్యాధుల నివారణలో వాడతారట. మనదగ్గర కూడా చాలామంది సెగ్గడ్డలకు వీటి ఆకుల్ని నూరి కట్టుకడతారు. వీటి ఆకులకు మధుమేహాన్ని తగ్గించడంతోపాటు బరువు కూడా తగ్గించే గుణం ఉందని ఇటీవల కొందరు నిపుణులు చెబుతున్నారు. బెరడుని మరిగించి తీసిన డికాక్షన్‌ డయేరియాని తగ్గిస్తుందట. అలాగే ఆకుల కషాయం జలుబుని నివారిస్తుందట. పోషకాలు: 100గ్రా. గుజ్జు నుంచి 94 క్యాలరీల శక్తి, 20-25గ్రా. పిండిపదార్థాలు, 2.5గ్రా. ప్రొటీన్లు, 4.4గ్రా. పీచూ లభ్యమవుతాయి. ఇంకా కెరోటిన్‌, థైమీన్‌, రిబోఫ్లేవిన్‌, నియాసిన్‌, విటమిన్‌-సి వంటి విటమిన్లు కూడా సమృద్ధిగా లభిస్తాయి. ఇలా మేలు * ఈ ఫలాన్ని రసంరూపంలో కాకుండా నేరుగా తినడమే మంచిది. ఎందుకంటే గుజ్జు నోటిలోని జీర్ణరసాలను పెంచుతుంది. తద్వారా జీర్ణక్రియ వేగవంతమవుతుంది. * పండు గుజ్జును తీసుకుని రసంలా చేసి.. పాలు కలిపి.. పిల్లలకు తాగించాలి. సత్వర శక్తి లభిస్తుంది. * ఎదిగే పిల్లలకు రోజూ ఒకటి, రెండు పండ్లు తినిపిస్తే మంచిది. బలవర్థకమే కాదు.. ఫాస్పరస్‌, క్యాల్షియం, ఇనుము లాంటి పోషకాలు.. ఎముకల పరిపుష్టికి తోడ్పడతాయి. * మలబద్ధకంతో బాధపడేవారికి ఈ పండు దివ్యౌషధంలా పనిచేస్తుంది. రోజూ తినగలిగితే.. ఎంతో మార్పు కనిపిస్తుంది. * హృద్రోగులు, కండరాలు, నరాల బలహీనత ఉన్నవారు.. దీన్ని అల్పాహారంగా తీసుకుంటే ప్రయోజనం ఉంటుంది. * డైటింగ్‌ నియమాలు పాటించే వారు సైతం ఈ ఫలాన్ని నిరభ్యంతరంగా స్వీకరించవచ్చు. * పండులోని సల్ఫర్‌ చర్మవ్యాధుల్నీ తగ్గిస్తుంది. * సీతాఫలం గుజ్జు శరీరంలోని క్రిములు, వ్యర్థపదార్థాలను వెలుపలికి పంపించి వేస్తుంది. పండే కాదు.. * ఒక్క సీతాఫలం పండే కాదు.. ఆకులు ఉపయోగపడతాయి. ఆకుల్లోని హైడ్రోస్తెనిక్‌ ఆమ్లం చర్మసంబంధ సమస్యల్ని తగ్గిస్తుంది. ఆకుల్ని మెత్తగా నూరి.. కాస్త పసుపు కలిపి.. మానని గాయాలు, గజ్జి, తామర ఉన్న చోట పూతగా రాస్తే సరిపోతుంది. * ఆకుల్ని మెత్తగా నూరి బోరిక్‌ పౌడర్‌ కలిపి మంచం, కుర్చీల మూలల్లో ఉంచితే.. నల్లుల బెడద ఉండదు. * సీతాఫలం బెరడును కాచగా వచ్చిన కషాయాన్ని అధిక విరేచనాలతో బాధపడేవారికి ఔషధంగా ఇస్తుంటారు. * సీతాఫలం గింజల్ని పొడిచేసి తలకు రాసుకుంటే పేల సమస్య ఉండదు. అయితే కళ్లల్లో పడకుండా చూసుకోవాలి. * గర్భిణులు ఈ పండును సాధ్యమైంత తక్కువగా తినాలి. పొరబాటున గింజలు లోపలికి పోతే గర్భస్రావం అయ్యే ప్రమాదముంది. గమనిక: మోతాదుకు మించి తీసుకోకూడదు. కడుపులో మంట, ఉబ్బరం బాధిస్తాయి. అలాంటప్పుడు వేడినీరు తాగినా.. అరచెంచా వాము లేదా ఉప్పు నమిలినా ఉపశమనం లభిస్తుంది. * మధుమేహ వ్యాధి గ్రస్తులు, వూబకాయులు ఈ పండ్లను వైద్యుల సలహాతో తీసుకోవాలి. * జలుబు, దగ్గు, ఆయాసం, ఎలర్జీ సమస్యలో బాధపడేవారు.. సీతాఫలాన్ని పరిమితంగా తీసుకోవడం మంచిది. . సీతాఫలంలో సి విటమిన్‌, కాల్షియం, ఫాస్పరస్‌, పొటాషియం, మెగ్నీషియం సమృద్ధిగా లభిస్తాయి. నోటిలో జీర్ణరసాలను ఊరేలా చేసే శక్తి అధికం ఈ పండుకు. ఇందులో ఉండే మెగ్నీషియం శరీరంలోని కండరాలకు విశ్రాంతినిస్తుంది. గుండె ఆరోగ్యాన్ని పరిరక్షిస్తుంది. కాల్షియం ఎముకల పటుత్వాన్ని పెంచుతుంది. పీచుపదార్థాలు... మలబద్ధకంతో బాధపడేవారికి మంచి మందు. ఇన్ని లాభాలున్నా మధుమేహ రోగులు వీటికి దూరంగా ఉండటమే మేలు. ఎందుకంటే వీటిలో ఉండే చక్కెరల శాతం చాలా ఎక్కువ. ఉబ్బసం రోగులు వైద్యుల సలహా తీసుకుని తినాలి. సీతాఫలాలను ఖాళీ కడుపుతో తినకూడదు, భోజనం చేశాకే తినాలి. తిన్నాక మంచినీళ్లు ఎక్కువగా తాగాలి.
సీతాఫలం (Custard apple) ఒక పండు. ఇది వర్షాకాలం తరువాత విరివిగా దొరుకుతుంది.

లక్షణాలు

  • చిన్న వృక్షం.
  • నిశితాగ్రంతో దీర్ఘవృత్తాకారం లేదా దీర్ఘచరురస్రాకారంలో ఉన్న సరళ పత్రాలు.
  • కాండాగ్రాలలో గాని, పత్రాభిముఖంగా గాని ఏర్పడిన ఏకాంత లేదా నిశ్చిత సమూహాలలో ఏర్పడిన ఆకుపచ్చని రంగుతో కూడిన తెలుపు పుష్పాలు.
  • గుండ్రంగా ఆకుపచ్చగా, నొక్కులున్న సంకలిత ఫలం.
  • భారతదేశం. ఇక్కడ ఆంధ్రప్రాంతములో శ్రీకాకుళం జిల్లా సీతంపేట మండలం లో ఈ ఫలములు అత్యధికంగా లభ్యమవుతాయి. ఇక్కడ నుండి కోల్ కతా, విజయవాడ, రాజమండ్రి, విశాఖపట్నం కు ఎక్కువుగా కొనుగోలు చేసి తీసుకుపోతుంటారు, ముఖ్యంగా కలకత్తా ప్రాంతంలో ఈ పండ్లు కు ఎక్కువ గిరాకీ ఉంది.

ఉపయోగాలు

  • సీతాఫలం మంచి రుచికరమైన ఆహారం. వీనిలో కాల్షియమ్ సమృద్ధిగా ఉంటుంది.
  • దీనిలో విటమిన్ 'సి' సంవృద్దిగా దొరుకుతుంది.
  • ఆహారం తేలిగ్గా జీర్ణమయ్యేటందుకు దీనిలో కల పీచుపధార్ధం తోడ్పడుతుంది.

Monday, October 02, 2017

దేశీయ ఆవు లేకపోతే సేంద్రియ వ్యవసాయం చేయలేమా?


దేశీయ ఆవు పేడ మాత్రమే వాడాలనే మాట మనకు తరచూ వినిపిస్తూ ఉంది. మిగతా జీవాలు వున్నా వాటి పేడ ఉపయోగపడదేమో అని చాలా మంది రైతులు సేంద్రియ వ్యవసాయానికి మారటానికి భయపడుతున్నారు. నిజానికి ఆవు అయినా, గేదె అయినా.. , పచ్చి గడ్డి మీద ఎక్కువగా ఆధారపడినవైతే వాటి పేడని రైతులు నిరభ్యంతరంగా వాడుకోవచ్చు. అయితే, కష్టమైన వాతావరణంలో కూడా దేశీయ ఆవు తట్టుకుంటుంది కాబట్టి, కొత్తగా పశువులు కొనుక్కునే వాళ్లు దేశీయ ఆవును కొనుక్కుంటే మంచిది. మార్కెట్‌లో దొరికే బయో ఫెర్టిలైజర్లన్నిటిలో ఉన్న సూక్ష్మజీవులు పశువుల పేడలో ఉన్నవే.

Friday, August 18, 2017

బంగాళాదుంప (ఆలుగడ్డ)

బంగాళదుంప (Potato) అనేది దుంప జాతికి చెందిన ఒక కూరగాయ. ఒక్కో ప్రాంతములో ఒక్కోక పేరుతో ఈ దుంప కూర పిలవబడుతున్నది. కొన్ని చోట్ల ఆలు గడ్డ అని లేదా ఉర్ల గడ్డ అని మరికొన్ని ప్రాంతములలో బంగాళదుంప లేదా బంగాల్ దుంప అని పిలుస్తారు. ఈ మొక్క సొలనేసి కుటుంబానికి చెందిన గుల్మము
బంగాళదుంప చరిత్ర 
Potato and cross section.jpg ఐరోపాలో దాదాపు ఒకటిన్నర రెండు శతాబ్దాలవరకు ఈ దుంపకూరను ఆదరించలేదు. ఇంగ్లాండులో నయితే, ఈ దుంపను "స్పడ్" (SPUD - Society for Pevention of Unhealthy - అనారోగ్య ఆహార అలవాట్ల నిరోధనా సంఘము) గా వ్యవహరించారట. కాని కొంతకాలమునకు, ఈ విధమయిన విపరీత వర్ణనల ప్రభావంనుండి బయటపడి, బంగాళాదుంప ఒక ముఖ్య భోజ్య పదార్థముగా మారినది. చరిత్రకారులు చెప్పిన ప్రకారం, పారిశ్రామిక విప్లవం విజయవంతము కావటానికి ఈ దుంపకూర ఎంతగానో దోహదపడినదట. బవేరియన్ యుద్ధాన్ని "పొటాటో యుద్ధం"గా అభివర్ణించారు. కారణం, యుద్ధం జరుపుతున్న దేశాల దగ్గర బంగాళాదుంపల నిల్వలు ఉన్నంతవరకే ఆ యుద్ధం జరిగినదట. అలాగే, దక్షిణ అమెరికాలో జరిగిన "ఇంకా" తెగల యుద్ధాలలో కూడ, మధ్యలో కొంత విరామం తీసుకుని, ఈ దుంపకూర పంటను ఇళ్ళకు చేర్చిన తరువాత మళ్ళీ కొనసాగించేవారట.17వ శతాబ్దము వరకు బంగాళదుంప అనే కూరగాయ ఉన్నదని ఒక్క దక్షిణ అమెరికా ఖండంలో తప్ప మిగిలిన ప్రపంచానికి తెలియదు. స్పానిష్ వారు దక్షిణ అమెరికా ప్రాంతమును ఆక్రమించి వారి దేశానికి వలస దేశాలుగా తమ అధీనము లోనికి తీసుకువచ్చిన తరువాత, ఈ కొత్త కూరగాయ గురించి ముందు ఐరోపా వాసులకు ఆ తరువాత వారి ద్వారా ఇతర ప్రాంతములకు తెలిసింది. భారతదేశానికి బంగాళాదుంప ఐరోపా వలసవారి నుండి వచ్చినదే. వారు మన దేశమును వారి అధీనములోనికి తెచ్చుకున్న సందర్భములో తమ తమ దేశాలనుండి ఇక్కడకు తెచ్చిన అనేకమైన వాటిలో బంగాళాదుంప ముఖ్యమయినది. అసలు మొట్టమొదటి బంగాళదుంప మొక్కను ఐరోపాకు తెచ్చినది ఎవరు అన్న విషయంమీద ఇదమిద్దమైన ఆధారాలతో కూడిన సమాచారం లేదు. కొంతమంది వాదన ప్రకారం, అనేక యాత్రా విశేషాలను తన పర్యటనల ద్వారా ప్రపంచానికి తెలియచేసిన సర్ వాల్టర్ రాలీ (Sir Walter Raleigh) ఈ మొక్కను మొదట ఐరోపాకు తెచ్చాడని అనిపిస్తుంది. ఈ విషయంలో 20 సంవత్సరాలకు పైగా ఎంతగానో కృషిజరిపిన డేవిడ్ స్పూనర్ (David Spooner) మరొక విచిత్రమైన విషయం చెప్పాడు. అదేమిటంటే, స్పానిష్ ఆక్రమణాక్రమంలో, 1568లో గొంజాలో జిమెనెజ్ దే కేసడా (Gonzalo Jimenez de Quesada) అనే సైనికాధికారిని, ప్రస్తుతం కొలంబియా దేశంగా పిలవబడుతున్న ప్రాంతాన్ని తమ అదుపులోనికి తీసుకురావటానికి, స్పెయిన్ ప్రభుత్వం 2000 మంది సైనికులనిచ్చి పంపింది. అతను, తన అనుచరులతో, అక్కడి బంగారాన్ని దోచుకురావచ్చని చాలా ఉత్సాహంగా బయలుదేరాడు. కాని, నాలుగు సంవత్సరాల తరువాత అతను ఖాళీ చేతులతో, 60 మంది తన మిగిలిన అనుచరులతో చాలా డీలా పడి ఓటమి భారంతో తమ దేశానికి తిరిగి వచ్చాడు. ఆ దెబ్బతో అతని పరువు పోయింది, అతని పై అధికారులు అతన్ని చాలా నిరసించారు. అతని ఓటమి మీద అనేక వ్యంగ రచనలు కూడా జరిగినవట. కాని, అతను బంగారానికి బదులు, దక్షిణ అమెరికా ఖండము నుండి, అక్కడి మొక్కలలో ఒకటయిన "పప" లేదా "పొటాటొ" మొక్కలను తీసుకుని వచ్చాడు. అతనికి తెలియకుండానే, బంగారాన్ని మించిన సంపదను స్పెయిన్ దేశానికి తీసుకుని వచ్చాడు. అక్కడనుండి ఈ మొక్క మొదట స్పెయిన్, ఆ తరువాత ఇతర ఐరోపా దేశాలకు, వారి వలసవాద దురాక్రమణల వల్ల ఇతర దేశాలకు వ్యాప్తి చెందినదట.
బంగాళాదుంప ఐరోపా ప్రాంతానికి ఎలా వచ్చింది అన్న విషయం మీద అనేక వాదనలు ఉన్నాయి, అందులో ప్రధానమైనవి, పైన ఉదహరించటం జరిగింది. భారతదేశంలోకి బంగాళాదుంప దాదాపు 17వ శతాబ్దపు మొదటి అర్ధ భాగములోనే వచ్చిందనటానికి కొంత ఆధారాలు ఉన్నాయి. అందులో ప్రధానమయినది, సర్ థామస్ రో (Sir Thomas Roe) 1615లో ఇంగ్లాడ్ రాయబారిగా మొఘల్ వంశస్తుడు జహంగీర్ పరిపాలిస్తున్న సమయంలో భారతదేశానికి వచ్చాడు. అతనితో పాటుగా అతని స్వంత పూజారి ఎడ్వర్డ్ టెర్రీ (Edward Terry) కూడా వచ్చాడు. అతనికి కొత్త ప్రదేశాలలో తను చూసిన విషయాలమీద వ్రాయటం ఒక అభిరుచి. అతని "తూర్పు భారతావని యాత్ర " (Voyage to East India) అనే పుస్తకాన్ని వ్రాశాడు. ఆ పుస్తకంలో అతను అప్పటికే భారతదేశంలో బంగాళదుంప ఉన్నట్టు వ్రాశాడు. భారతదేశంలో ఈ దుంపకూర గురించి చెయ్యబడ్డ మొట్టమొదటి ప్రస్తావన ఇదే. అప్పట్లో, ఈ మొక్కని పెరటి తోటలలో వేడుకగా పెంచేవారట. పూర్తిగా ఒక పంటగా 1822 వరకు పండించబడలేదు. మనదేశంలో సిమ్లా నగరంలో కేంద్రీయ బంగాళదుంప పరిశోధనా సంస్థ (Central Potato Research Institute-CPRI) ఉంది. ఈ సంస్థకు చెందిన ఎస్.కె.పాండె (S.K.Pandey) చెప్పిన ప్రకారం, 1822వ సంవత్సరమువరకు, మనదేశములో బంగాళదుంపను ఒక పంటగా పండించలేదట. మొట్టమొదట, సల్లివాన్ అనే అంగ్లేయుడు, మద్రాసుకు దగ్గరలో తన వ్యవసాయ క్షేత్రంలో పంటగా మొదలు పెట్టాడట.
బంగాళాదుంప పంట నుండి 2006వ సంవత్సరములో మొత్తం ప్రపంచములో 315 మిలియన్ టన్నుల దిగుబడి వచ్చింది. ఈ విధంగా చూస్తే, మొత్తం పంటలలో బంగాళదుంప నాలుగవ స్థానాన్ని అక్రమిస్తుంది - వరి, గోధుమ, మొక్కజొన్న తరువాత. ప్రపంచవ్యాప్త బంగళాదుంప పంటలో నాలుగవ వంతు చైనా దేశంలో పండించబడుతున్నదట

రకరకాలైన వంటలు

బంగాళదుంపతో రుచికరమైన వంటలు, కూరలు, చట్నీలు, ఫలహారాలు మరియు ఇతర ఆహార పదార్ధాలు తయారుచేయవచ్చును. ఉడకబెట్టిన కూర, వేపుడు, కుర్మా వంటివి తరచు తెలుగు నాట చేసే కూరలు. ఇంకా బజ్జీల వంటి తినుబండారాలు చేస్తారు. ఊరగాయలు కూడా పడుతుంటారు. బంగాళదుంప చిప్స్ వంటి తినుబండారాలు మార్కెట్లో లభిస్తాయి. పాశ్చాత్య దేశాలలో బంగాళ దుంపతో చేసే పదార్ధాలు అక్కడి అలవాట్లకు తగినవిగా ఉంటాయి. ఇవి భారతీయ వంటకాలకంటే భిన్నమైనవి. ఏమైనా బంగాళ దుంపను తరిగి, లేదా ఉడకబెట్టి లేదా వేయించి అనేక రకాలైన, రుచికరమైన పదార్ధాలు తయారు చేయడం చాలా సమాజాలలో సర్వసాధారణం అయింది.
  • బంగాళదుంప వేపుడు
  • బంగాళదుంప ఇగురు కూర
  • బంగాళదుంప చట్నీ

పౌష్టిక విలువలు



ఆహార పౌష్టికత పరంగా బంగాళదుంపలలో పిండి పదార్ధాలు (కార్బోహైడ్రేటులు) ప్రధానమైన ఆహార పదార్థం. ఒక మధ్య రకం సైజు దుంపలో 26 గ్రాములు పిండిపదార్థం ఉంటుంది. ఇది ముఖ్యంగా స్టార్చ్ రూపంలో ఉంటుంది. ఈ స్టార్చి‌లో కొద్ది భాగం పొట్టలోను, చిన్న ప్రేవులలోను స్రవించే ఎంజైములు వలన జీర్ణం కాదు. కనుక ఈ జీర్ణం కాని స్టార్చి భాగం పెద్ద ప్రేవులోకి తిన్నగా వెళ్ళిపోతుంది. ఈ జీర్ణం కాని స్టార్చి వలన శరీరానికి ఆహార పీచు పదార్ధాలు (Dietary fiber) వల్ల కలిగే ఉపయోగాలవంటి ప్రయోజనాలే కలుగుతాయని భావిస్తున్నారు (శరీర పౌష్టికత, కోలన్ క్యాన్సర్ నుండి భద్రత,  గ్లూకోజ్ఆధిక్యతను తట్టుకొనే శక్తి,  కొలెస్టరాల్ తగ్గింపు, ట్రైగ్లిజరైడులు తగ్గింపు వంటివి. దుంపను ఉడకపెట్టి ఆరబెడితే ఇలా జీర్ణంకాని స్టార్చి ఎక్కువవుతుంది. ఉడికిన వేడి దుంపలో ఉండే 7% జీర్ణంకాని స్టార్చి, దానిని ఆరబెట్టినపుడు 13%కు పెరుగుతుంది.
బంగాళ దుంపలలో పలువిధాలైన విటమిన్‌లు, ఖనిజ లవణాలు  ఉన్నాయి. 150 గ్రాముల బరువుండే ఒక మాదిరి బంగాళ దుంపలో 27 మిల్లీగ్రాముల విటమిన్-సి (ఒక రోజు అవసరంలో 45%), 620 మి.గ్రా. పొటాషియం ( అవసరంలో 18%), 0.2 మి.గ్రా. విటమిన్-B6 (అవసరంలో 10%) మాత్రమే కాకుండా కొద్ది మోతాదులలో థయామిన్, రైబోఫ్లావిన్, ఫోలేట్, నియాసిన్, మెగ్నీషియం, ఐరన్, జింక్ వంటి పదార్ధాలు లభిస్తాయి. ఇంతే కాకుండా బంగాళదుంప తొక్కలో ఉన్న పీచు పదార్థం కూడా చాలా ఉపయోగకరం. ఒక మాదిరి బంగాళ దుంప తొక్క బరువు 2 గ్రాములు ఉంటుంది. ఇందులో ఉన్న పీచు ఎన్నో ధాన్యపు గింజల ద్వారా వచ్చే పీచుకు సమానం. ఇంకా బంగాళదుంపలో కార్టినాయిడ్స్ మరియు పాలీఫినాల్స్ వంటి ఫైటో రసాయనాలుఉన్నాయి. బంగాళ దుంపలో లభించే ఇన్ని పోషక పదార్ధాల వినియోగం దానిని ఉడకపెట్టే విధానంపై బాగా ఆధారపడి ఉంటుంది.

అందానికి బంగాళాదుంప 

బంగాళాదుంప తినేందుకు రుచిగా ఉండటమే కాదు, అందానికి అడ్డుగా నిలిచే ఎన్నో సమస్యల్ని తీరుస్తుంది. కళ్ల నుంచి జుట్టు వరకు అందాన్ని పెంపొందించడంలో ముందుటుంది.
కళ్లకి మెరుపు : ఎవరి ముఖంలోనైనా మొదట ఆకర్షించేవి కళ్లే. అయితే కళ్ల చుట్టూ నల్లటి వలయాలు రావడం, కళ్లు ఉబ్బడం లాంటివి ఇబ్బంది పెట్టే సమస్యలు. బంగాళాదుంపని ముక్కలుగా చేసి జ్యూసర్‌లో వేస్తే కొంచెం జ్యూస్‌ వస్తుంది. దానిలో దూది ముంచి, కళ్లపై పావుగంట సేపు ఉంచుకోండి. ఇలా రోజూ చేస్తూ ఉంటే నల్లని వలయాలు తగ్గుతాయి.
ముడతలు పోయేలా : బంగాళాదుంప రసంతో రోజూ ముఖాన్ని కడుక్కుంటే ముడతలు రావడం తగ్గుతుంది. ముఖంపై వచ్చే తెల్లమచ్చల్లాంటివి కూడా పోతాయి. ఎండకి కమిలిపోయి బొబ్బలెక్కిన చర్మానికి బంగాళాదుంప రసాన్ని రాసిన చర్మం మళ్లీ మామూలు స్థితికి వచ్చేస్తుంది.
చక్కని ఛాయకి : బంగాళాదుంపని మిక్సీలో వేసి మెత్తగా చేసేయండి. ఆ పేస్టుని ముఖానికి రాసుకుని అరగంటపాటు వదిలేయండి. ఇలా చేయడం వల్ల చర్మం మృదువు అవడంతో పాటు, ఛాయ పెరుగుతుంది. చర్మంపై ఉన్న జిడ్డుని కూడా అది పీల్చేసుకుంటుంది. దాంతో ముఖం తాజాగా మారుతుంది. అలాగే బంగాళాదుంప రసానికి కొద్దిగా నిమ్మరసం, తేనె కలిపి ముఖానికి పట్టించి, పావుగంట తరువాత కడిగేసుకుంటే చర్మం రంగు తేలుతుంది. .
ఫేస్‌మాస్క్‌లు : ఒక స్పూను బంగాళాదుంప రసానికి స్పూను ముల్తానీ మట్టిని కలపండి. ఆ మిశ్రమాన్ని ముఖానికి రాసుకుని ఆరే వరకూ ఉంచండి. మొదట గోరువెచ్చటి నీళ్లతో, తరువాత చన్నీళ్లతో కడిగేసుకోండి. అలాగే బంగాళాదుంపని బాగా ఉడకబెట్టి ముద్దలా చేయండి. చల్లారాక ఒక స్పూను పాల పౌడర్‌ని, ఒక స్పూను బాదం నూనెని కలిపి పేస్టులా చేయండి. దానిని ముఖానికి రాసుకుని పావుగంట తరువాత శుభ్రపరుచుకోండి.
పొడి చర్మము ఉన్నవాళ్ళు తురిమిన బంగాళాదుంప మరియు అర చెంచా పెరుగు కలిపి దానిని మూకానికి రాసుకొని 20 నిమిషాల తరువాత కడుగుకుంటే మృదువుగా తయారవుతుంది

ఐక్య రాజ్య సమితి 2008 సంవత్సరాన్ని అధికారికంగా అంతర్జాతీయ బంగాళాదుంప సంవత్సరం గా ప్రకటించింది. వర్ధమాన దేశాలలో బంగాళాదుంప యొక్క ఆహారపు ప్రాముఖ్యతను చాటి చెప్పడానికే ఈ ప్రయత్నం. గతంలో 2004 సంవత్సరాన్ని అంతర్జాతీయ వరి సంవత్సరంగా ప్రకటించింది. ఒక సంవత్సరానికి బంగాళదుంప పేరు పెట్టి గుర్తించడంలో విశేష కారణాలు ఈ విధంగా ఉన్నాయి:

Thursday, April 06, 2017

జలావరణం

 అటవీ నిర్మూలన వలన జల చక్రం కూడా ప్రభావితమవుతుంది. చెట్లు వాటి యొక్క వేర్లు ద్వారా భూగర్భజలాలను గ్రహించి, వాతావరణంలోకి విడిచిపెడతాయి. అటవీ ప్రాంతం నిర్మూలించబడినప్పుడు, చెట్లు నీటిని గాలిలోకి చేర్చలేవు, దీని వలన పొడి వాతావరణం ఏర్పడుతుంది. అటవీ నిర్మూలన వలన వాతావరణంలో తేమ తగ్గిపోవడంతోపాటు, భూమిలో నీటి శాతం మరియు భూగర్భజలాల పరిమాణం కూడా తగ్గిపోతుంది.అటవీ నిర్మూలన భూమి సంయోగాన్ని కూడా తగ్గిస్తుంది, దీని వలన క్రమక్షయం, వరదలు, కొండచరియలు విరిగిపడటం వంటి ప్రమాదాలు జరుగుతాయి.కొన్ని ప్రదేశాల్లో అడవులు జలాశయాలకు తిరిగి నీరు చేరే అవకాశాలను విస్తరిస్తాయి, అయితే అనేక ప్రదేశాల్లో జలాశయాల క్షీణతకు అడవులు ప్రధాన కారణమవుతున్నాయి. 
అడవులు కుచించుకుపోవడం వలన సంభవించే అవక్షేపణాన్ని నిరోధించే నేల యొక్క సామర్థ్యం కూడా దెబ్బతింటుంది. అవక్షేపణం కోరల్లో చిక్కుకున్న ప్రాంతంలో భూగర్భ జల వ్యవస్థలు నాశనమవుతాయి, అటవీ నిర్మూలన జరిగిన ప్రాంతంలో క్రమంగా ఉపరితల జలాలు పూర్తిగా ఖాళీ అవుతాయి, ఉపఉపరితల ప్రవాహాల కంటే ఇవి బాగా వేగంగా క్షీణిస్తాయి. ఉపరితలంపై నీరు వేగంగా రవాణా అయ్యేందుకు అవకాశం ఏర్పడటం వలన అకస్మాత్తుగా వరదలు ముంచెత్తుతాయి, అడవులు ఉన్నప్పటి కంటే లేనప్పుడు వరదలు ఎక్కువగా సంభవిస్తుంటాయి. అటవీ నిర్మూలన వలన శ్వేదన ప్రక్రియ (చెట్లు ద్వారా, భూమి నుంచి నీరు ఆవిరి రూపంలో గాలిలో కలిసే ప్రక్రియ) కూడా క్షీణిస్తుంది, దీని వలన వాతావరణంలో నీటి ఆవిరి పరిమాణం తగ్గిపోతుంది, ఇది కొన్ని సందర్భాల్లో అవపాతన స్థాయిలను ప్రభావితం చేస్తుంది. ఒక ప్రాథమిక అధ్యయనం ప్రకారం, ఉత్తర, వాయువ్య చైనాలో అటవీ నిర్మూలన జరిగిన ప్రాంతంలో 1950వ దశకం మరియు 1980వ దశకం మధ్యకాలంలో సగటు వార్షిక అవపాతనం మూడింట ఒక వంతు మేర క్షీణించింది.
సాధారణంగా చెట్లు మరియు మొక్కలు జల చక్రాన్ని గణనీయంగా ప్రభావితం చేస్తాయి:
  • వాటి యొక్క ప్రస్తారాలు ఒక వంతు అవక్షేపణాన్ని అడ్డుకుంటాయి, ఇది తరువాత వాతావరణంలోకి ఆవిరి రూపంలో తిరిగి ప్రవేశపెట్టబడుతుంది (ప్రస్తార అవక్షేపణం);       
  • వాటి చెత్తచెదారం, కాండం మరియు మోడు ఉపరితలం కోతను తగ్గిస్తాయి;
  • వాటియొక్క వేళ్లు భూమిలో మాక్రోపోర్‌లను - పెద్ద జలదారులను - సృష్టిస్తాయి, ఇవి నీరు భూమిలోకి చొచ్చుకపోవడానికి ఉపయోగపడతాయి;
  • అవి భూమిలోని నీరు బాష్పీభవనం చెందడానికి ఉపయోగపడతాయి మరియు పత్రశ్వేదనం ద్వారా అవి భూమిలో తేమను తగ్గిస్తాయి;
  • చెట్లు యొక్క చెత్తచెదారం మరియు ఇతర కర్బన వ్యర్థాలు మట్టి గుణాలను మారుస్తాయి, దీనిద్వారా నీటిని నిల్వచేసుకునే భూమి సామర్థ్యాన్ని అవి ప్రభావితం చేస్తాయి.
  • వాటి ఆకులు శ్వేదనప్రక్రియ ద్వారా వాతావరణంలోని ఆర్ద్రతను (గాలిలో తేమ) నియంత్రిస్తాయి. వేర్లు గ్రహించే 99% నీరు పత్రాలకు చేరి శ్వేదనప్రక్రియలో ఉపయోగించబడుతుంది.
దీని ఫలితంగా, చెట్లు ఉండటం లేదా లేకపోవడం ద్వారా భూఉపరితలంపై, మట్టి లేదా భూగర్భం లేదా వాతావరణంలో నీటి పరిమాణం ప్రభావితమవుతుంది. మరో విధంగా క్రమక్షయం రేట్లను మారుస్తుంది మరియు వాతావరణవ్యవస్థ పక్రియలు లేదా మానవ సేవలకు నీటి లభ్యతను కూడా చెట్లు ప్రభావితం చేస్తాయి.
భారీ వర్షం కురిసిన సందర్భంలో వరదలపై అడవులు అతికొద్ది ప్రభావం చూపుతాయి, భూములు సంతృప్తీకరణ స్థాయిలో లేదా దానికి దగ్గరగా ఉంటే అటవీ భూభాగం యొక్క నిల్వ సామర్థ్యం భారీ వర్షపాతాన్ని నిలువరించలేదు.
భూమిపై 30 శాతం స్వచ్ఛమైన నీటిని ఉష్ణమండలాల్లోని సతత హరితారణ్యాలు సృష్టిస్తున్నాయి.

Friday, March 10, 2017

అంటుకట్టుట

మొక్కగా ఉన్నప్పుడు మొదలు వద్దనే మొక్క పై భాగాన్ని అదే జాతికి చెందిన మరో ఉత్తమ రకం లేదా మనకు కావలసిన మొక్కతో మార్పు చేయడాన్ని అంటుకట్టుట అంటారు. కాని మొక్క చెట్టుగా ఎదిగిన తరువాత మొదలు వద్ద మరొక ఉత్తమ రకంతో అంటుకట్టుట సాధ్యం కాని పని లేదా కష్టం. అందువలన చెట్టు యొక్క చిన్న కొమ్మలపై అంటుకట్టుట ద్వారా పై కొమ్మలను మార్చడం వలన ఉత్తమ ఫలాలను అందుకునే ఈ విధానాన్ని తలమార్పిడి అంటారు. ఈ విధానం ద్వారా ఒకే చెట్టు నుండి అదే జాతికి చెందిన అనేక రకాల ఫలాలను పొందవచ్చు. ఉదాహరణకు నాటుమామిడి చెట్టుకు ఒక కొమ్మకు బంగినపల్లి మామిడి కొమ్మను అంటుకట్టుట ద్వారా బంగినపల్లి మామిడి కాయలను అలాగే ఇదే నాటుమామిడి చెట్టు మరొక కొమ్మకు రసాల మామిడి కొమ్మను ఆంటుకట్టుట ద్వారా రసాల మామిడి కాయలను పొందవచ్చు. ఈ విధంగా ఒక రకానికి చెందిన మామిడి చెట్టు నుండి అనేక రకాల మామిడి కాయలను పండించవచ్చు.

Friday, January 13, 2017

మొక్కలనే నోము ఇవ్వండి (మనఊరు-మనచెట్టు)

ముఖపుస్తక మిత్రులకి  మరియు మా బ్లాగుని ఆదరిస్తున్న ప్రతిఒక్కరికి సంక్రాంతి శుభాకాంక్షలు.




మన లో చాలా మంది ఇళ్లలో సంక్రాంతి అనగానే పిండి వంటలు మరియు కొత్తగా పెళ్లి అయినవారి చేత మన హిందూ ధర్మం లో భాగంగా సంక్రాంతి నోములు పట్టిస్తుంటారు. ఈ నోములో భాగంగా పసుపు, కుంకుమ , మొదలగు సుమంగళి వస్తువులు తోపాటు ఏవైనా విభిన్న వస్తువులు/ బొమ్మలు/తీపిపదార్థం తో చేసిన బొమ్మలు (ఆకృతులు ) / నూతన వధువుతో ముతైదువులకి ఇప్పిస్తారు.
అయితే మనం సంక్రాంతి అనగానే ప్రకృతి తో అనుసంధానించుకొని చేసుకొనే పండుగ కనుక నోములలో భాగంగా వస్తువులు / బొమ్మలు / కాకుండా <<5... 11...... 21..... 41...>> చొప్పున మీ శక్తి ని అనుసరించి మొక్కలనే నోములో భాగంగా నొమించి ముతైదువులకి నోమివ్వడం వలన మనం ప్రకృతికి ఎంతో మేలు చేసినవారిమీ అవుతామని న ఉదేశ్యం. ఎందుకంటే మానవుడి మనుగడకి ప్రకృతి తల్లి వంటిది కదా... నచ్చితే పాటించండి. లేదా కనీసం ఒక మొక్కైనా నాటండి నాటి మొక్కని #manaurumanachettu కి హాష్ టాగ్ చేయండి.
వృక్షో రక్షతి రక్షితః
* అలాగే మీరు ఈ సరి దేనిని నోముగా ఇస్తున్నారు. కామెంట్ లో రాయండి.