మనఊరు మనచెట్టు: November 2018

Tuesday, November 27, 2018

మనఊరు-మనచెట్టు

ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టులో ఫ్రెండ్స్ అనిమల్ ట్రస్ట్ వారు కోతులకు పండ్లు పంచడం జరిగింది. అలాగే మనఊరు-మనచెట్టు వారి ఆధ్వర్యంలో పెద్ద హనుమాన్ విగ్రహం పక్కన దానిమ్మ మొక్క నాటడం జరిగింది. 
#manaurumanachettu #duniyastra

Saturday, November 03, 2018

క్యారట్

పండ్లు , కందమూలాలు , కందమూలాలు , కందమూలాలు , మానవుడికి ప్రకృతి ప్రసాదించిన అపురూపమైన వరము .ఆయా సీజన్లలో పండే పండ్లను ఆరగించడం మనకు తరతరాలు గా తెలుసును . అన్నం తో అవసరం లేకుండా ప్రకృతిసిద్ధమైన పండ్లు , కూరగాయలు ఇతర త్రుణధాన్యాలను ఆహారం గా ఆహారముగా తీసుకుని జీవించినట్లయితే శరీరానికి కావససిన అన్నిరకాల పోషకాలు లభిస్తాయి ... ఇదే అసలు ఉత్తమమైన జీవన విధానమని పకృతి వైద్యుల నమ్మకం .
క్యారెట్ల లో అన్ని పోషకాల లోకెల్లా విటమిన్ ఎ ఎక్కువగా ఉంటుంది . విటమిన్ ఎ కంటి చూపును మెరుగుపరుస్తుంది . చర్మ సౌందర్యాన్ని పెంచుతుంది .
 విటమిన్ ఎ లోపము వల్ల వచ్చే వ్యాదులు :
  • రేచీకటి (NightBlindness),
  • జీరప్తాల్మియా(xerophtholmia) (కంటి పొరలు పొడిబారిపోవడం) ,
  • కెరటోమలేసియా (keratomalasia),
  • బైటాట్ స్పోట్స్ (BitotSpotsInEyes) ,
  • ఫ్రెనోడెర్మా (PhrenoDerma) (కీళ్ళ దగ్గర చర్మము ముళ్ళు లా తయారవడం),

క్యారట్లలో ఉండే ఫాల్ కారినాల్ .. కాన్సర్ ను నిరోదిస్తుంది ,-- ఉడక బెట్టి తినాలి . యాంటి ఆక్షిదేంట్ గా పనిచేసి శరీరము లోని చెడు పదార్ధాలను (FreeRadicles) తొలగిస్తుంది , శరీర వ్యాదినిరోధక శక్తి ని పెమ్పొందిస్తుడి , బంగారం స్వచ్ఛతను తెలుసుకోవడానికి క్యారట్స్‌లో కొలవాలి. ఆరోగ్యం సరిగ్గా లేకపోతేగంటకో క్యారట్ తినాలి. క్యారట్స్‌లో పోషకాలు పుష్కలం. కంటికి, ఒంటికి మేలు చేసే గుణాలు మెండు. రోజూ వంటలోకి ఓ క్యారట్ తురిమి వేయండి. ఇంకో క్యారట్‌ను తరిగి వండండి. నూనెలో వేసి డీప్ ఫ్రై చే యండి. వేయించకుండానే పెరుగులో కలిపేయండి. కంటిచూపును మెరుగుపరచే విటమిన్-ఎ పుట్టడానికి అవసరమైన బీటా-కెరోటిన్ క్యారట్‌లో పుష్కలంగా ఉంటుంది. క్యారట్ రేచీకటిని నివారిస్తుంది. ఒకవేళ ఆ సమస్య అప్పటికే ఉంటే దానికి చికిత్స చేస్తుంది. క్యారట్ గుండెపోటును, పక్షవాతాన్ని కూడా నివారిస్తుంది. ఎందుకంటే అందులోని యాంటీ ఆక్సిడెంట్స్, కెరొటినాయిడ్స్ కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి. అందుకే క్యారట్ ఓ క్యాన్సర్ పోరాటయోధుడు. ఉత్తమ యాంటీ-క్యాన్సర్ ఉద్యమ కార్యకర్త.
దీంతో పాటు సంతాన సాఫల్యతకు కూడా క్యారెట్ ఎంతో ఉపయోగపడుతుందని, ముఖ్యంగా పురుషుల్లో వీర్య కణాల కదలిక వేగంగా ఉండడానికి క్యారెట్ చాలా మేలు చేస్తుందని హార్వర్డ్ యూనివర్శిటీ పరిశోధకులు గుర్తించారు. దాదాపు 200 మంది యువకుల ఆహార అలవాట్లపై అధ్యయనం చేసిన శాస్త్రవేత్తలు ఈ నిర్ధారణకు వచ్చారు. ఆహారంలో పసుపు, నారింజ రంగు పళ్లు, కూరగాయలు తీసుకునే వారితో పోల్చితే అలాంటివి తీసుకోని వారిలో వీర్య కణాలు కదలిక తక్కువగా ఉందని గమనించారు. ముఖ్యంగా క్యారెట్ తీసుకోవడం వల్ల అండాల వైపు వీర్య కణాల కదలిక చాలా చురుగ్గా ఉందని కనుగొన్నారు. అలాగే, టమాటా తీసుకోవడం వల్ల కూడా ఆరోగ్యకరమైన వీర్యం వృద్ధి చెందుతుందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు.

క్యారెట్ లో మంచివి ;

నిండుగా ఆరెంజ్ కలర్ లో నిగనిగలాడే క్యరెట్లు తింటే మిగగా రంగులవి -- ఆకుపచ్చ , ఎరుపు , తెలుపు , పర్పుల్ వంటివి కంటే ఎక్కువ పరిరక్షణ కలుగుతుందని డచ్ పరిశోదకులు వారి పరిశోధనల వల్ల తెలుపుతున్నారు.