మనఊరు మనచెట్టు: 2020

Friday, December 25, 2020

ముక్కోటి ఏకాదశి సందర్భంగా రావి మొక్క నాటిన మనఊరు మనచెట్టు బృందం.

 ప్రకృతి ని పూజించే ఏకైక ధర్మం నా సనాతన ధర్మం మాత్రమే...

 మా మీ మనఊరు మనచెట్టు ఆధ్వర్యంలో  *ముక్కోటి ఏకాదశి* సందర్భంగా జగిత్యాల జిల్లా  మల్యాల మండల కేంద్రం లోని   సాయి బాబా దేవాలయంలో రావి మొక్క నాటడం జరిగింది. ఈ కార్యక్రమంలో మనఊరు మనచెట్టు సంస్థ నిర్వాహకులు కొత్తపల్లి  ప్రణీత్ కుమార్ శర్మ , ముద్దు  సాయికృష్ణ శర్మ , దేవాలయ కమిటీ సభ్యులు మరియు అర్చకులు పాల్గొనడం జరిగింది. 

#manaurumanachettu













 #manaurumanachettu_official 

#manaurumanachettu_instagram #praneethkumarsharma

#manaurumanachettu_planting_challenge

Saturday, December 12, 2020

సపోటా గురించి అద్భుత సమాచారం...

సపోటా చెట్టు 30-40 మీటర్ల ఎత్తు వరకు పెరుగుతుంది. గాలికి తట్టుకోగలదు. చెట్టు బెరడు తెల్లగా జిగురు కారుతూ ఉంటుంది. ఆకులు ఒకమాదిరి పచ్చగా, నునుపుగా ఉంటాయి. 

సపోటా చెట్లు సంవత్సరానికి రెండు కాఫులు కాస్తాయి. పూవులు సంవత్సరం పొడవునా ఉంటాయి. పచ్చి కాయలో latex (జిగురు లేదా పాలు అంటారు.) ఎక్కువ ఉంటుంది. ఈ కాయలు చెట్టున ఉన్నపుడు పండవు. కోశిన తరువాతనే పండుతాయి. ఇదివరకు సపోటా (Sapodilla) ను Achras sapota అనేవారు కాని ఇది సరైన పేరు కాదు. భారతదేశంలో "చిక్కూ" లేదా "సపోటా' అంటాఱు. బెంగాల్ ప్రాంతంలో "సొఫెడా" అంటారు. దక్షిణాసియా, పాకిస్థఅన్‌లలో "చికో" అని, ఫిలిప్పీన్స్‌లో "చికో" అని, ఇండినేషియాలో "సవో" (sawo) అని, మలేషియాలో "చికు" అని అంటారు. వియత్నాంలో hồng xiêm (xa pô chê) అని, గుయానాలో "సపోడిల్లా' అని, శ్రీలంకలో "రత-మి"అని, థాయిలాండ్‌, కంబోడియాలలో లమూత్ (ละมุด) అంటారు. కొలంబియా, నికరాగ్వే వంటి దేశాలలో níspero అని, క్యూబా వంటి చోట్ల nípero అని, Kelantanese Malayలో "sawo nilo" అంటాఱు..

 అవి alternate, elliptic to ovate, 7-15 సెంటీమీటర్ల పొడవుంటాయి, with an entire margin. తెల్లటి, చిన్నవైన పూలు గంట ఆకారంలో ఆరు రేకలు గల corolla తో ఉంటాయి. సపోటా పండు కాస్త సాగదీసిన బంతిలా, 4-8 సెంటీమీటర్లు వ్యాసంతో ఉంటుంది. ఒకో పండులో 2 నుండి 10 వరకు గింజలు ఉంటాయి. పండులోని గుజ్జు పసుపు, గోధుమ రంగుల మధ్యగా, కొంచెం పలుకులుగా ఉంటుంది. సపోటా పండు చాలా తీయగా ఉంటుంది. కాయగా ఉన్నపుడు గట్టిగా ఉండే గుజ్జు భాగం పండినపుడు బాగా మెత్తగా అవుతుంది. పచ్చి కాయలలో సపోనిన్ అనే పదార్థం ఎక్కువగా ఉంటుంది. ఇది tannin లాంటి పదార్ధమే. ఇది తింటే నోరు ఎండుకుపోతుంది. (తడి ఆరుతుంది) గింజలు కొంచెం పొడవుగా ఉండి, ఒక ప్రక్క ములుకుదేరి ఉంటాయి.

వైద్యపరముగా సపోటా  ఉపయోగాలు

శరీరంలో నిస్సత్తువ ఆవహించినప్పుడు, బలహీనంగా ఉన్నప్పుడు రెండు లేదా మూడు సపోటా పండ్లను తింటే.. నిమిషాల తేడాతో శరీరం మళ్లీ శక్తి పుంజుకుంటుంది. పెరటి పండు అయిన సపోటాలో సమృద్ధిగా లభించే ఫ్రక్టోస్ శరీరం త్వరగా శక్తి పుంజుకునేలా చేస్తుంది. ఈ పండు గుజ్జులో అధికంగా లభించే పీచు, పై పొట్టులో ఉండే కెరోటిన్లు మలవిసర్జన సాఫీగా జరిగేలా చూస్తాయి. కాబట్టి మలబద్ధకంతో బాధపడేవారు సపోటాలను వాడవచ్చును . సపోటా పండ్లలో మాంసకృత్తులు, కెరోటిన్లు, నియాసిన్, పిండి పదార్థాలు, ఇనుము, సి విటమిన్, కొవ్వు, పీచు, థయామిన్, క్యాల్షియం, రైబోఫ్లేవిన్లు, శక్తి, ఫ్రక్టోస్ షుగర్లు ఎక్కువగా లభిస్తాయి. ఈ పండ్లు పాలిఫినోలిక్ అనే శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్.. యాంటీ వైరల్, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ పారాసిటిక్(Anti parasitic) సుగుణాలను మెండుగా కలిగి ఉన్నాయి. ఇవి హానిచేసే సూక్ష్మక్రిములను శరీరంలోకి ప్రవేశించకుండా అడ్డుకట్ట వేస్తాయి. ఇక పోషకాల విషయానికి వస్తే.. విటమిన్‌ 'ఏ 'కంటిచూపును మెరుగుపరుస్తుంది. విటమిన్‌ 'సీ 'శరీరంలోని హానికర ఫ్రీరాడికల్స్‌ను తొలగిస్తుంది. తాజా పండులోని పొటాషియం, రాగి, ఇనుము, లాంటి పోషకాలు.. ఫోలేట్‌, నియాసిన్‌, పాంథోయినిక్‌ ఆమ్లాలు జీవక్రియను మెరుగుపరుస్తాయి. అందుకే ఎదిగే పిల్లలకు ఈ పండును తినిపించాలి. ఆరోగ్యంతోపాటు బరువూ పెరుగుతారు. అలాగే.. తక్కువ బరువున్నవారు సపోటాను అవసరమైన మోతాదులో తీసుకుంటే బరువు పెరిగే అవకాశం ఉంది.. గర్భిణులు, వృద్ధులు, రక్తహీనతతో బాధపడేవారు సపోటాలను మితంగా స్వీకరిస్తే రక్తహీనత క్రమబద్ధీకరణ అవుతుంది. బాలింతలు ఈ పండును ఫలహారంగా తీసుకుంటే పిల్లలకు పాలు పుష్కళంగా వృద్ధి చెందుతాయి. తియ్యగా ఊరిస్తూ, భలే రుచిగా ఉన్నాయికదా అని సపోటా పండ్లను అదేపనిగా తినటం మంచిది కాదు. అలా చేస్తే అజీర్ణంతోపాటు పొట్ట ఉబ్బరం కూడా చేస్తుంది. ఇక గుండె జబ్బులతో బాధపడేవారు మాత్రం రోజుకు ఒక పండును మించి తీసుకోకూడదు. ఒబేసిటీ, మధుమేహంతో బాధపడేవారు వైద్యుని సలహా మేరకే తీసుకోవాల్సి ఉంటుంది. సపోటా తినటం వల్ల చర్మం సౌందర్యం కూడా మెరుగుపడుతుంది. తాజాపండ్లను ప్యాక్‌ రూపంలో కాకుండా ఆహారంగా స్వీకరించడం వల్ల విటమిన్లు చర్మ సౌందర్యాన్ని మెరుగుపరుస్తాయి. ముఖ్యంగా విటమిన్‌- 'ఎ', 'సి' లు చర్మానికి కొత్త నిగారింపునిస్తాయి. అలాగే సపోటా గింజలను మెత్తగా నూరి ముద్దలా చేసి, దానికి కొంచెం ఆముదం నూనె కలిపి తలకు రాసుకోవాలి. మర్నాడు తలస్నానం చేస్తే శిరోజాలు మృదువుగా మారుతాయి. చుండ్రు సమస్య కూడా తగ్గుతుంది. సపోటా పళ్ళు తేనెతో కలిపి తీసుకుంటే శీఘ్రస్ఖలనం తగ్గి, రతి సామర్థ్యం పెరుగుతుందంటున్నారు వైద్యులు.

                          *************** Source: Wikipedia.org (Internet) *******************

                                             [manaurumanachettu]

సపోటా  రకాలు 

మన రాష్ట్రంలోని సపోటా కొనుగోలుదారులు పాల రకాన్ని బాగా ఇష్టపడతారు. మహారాష్ట్రలో కాలి పత్తి రకాన్ని, కర్ణాటకలో క్రికెట్ బాల్ రకాల్ని ఇష్టంగా తింటారు. పాల రకంలో దిగుబడి ఎక్కువ. పండు కోలగా, చిన్నదిగా ఉంటుంది. పలచని తోలుతో కండ మృదువుగా ఉంటుంది. పండ్లు బాగా తీయగా ఉంటాయి. అయితే ఈ పండ్లు నిల్వకు, రవాణాకు, ఎగుమతికి అనుకూలంగా ఉండవు. క్రికెట్ బాల్ రకం సపోటా పండ్లు గుండ్రంగా, పెద్దగా ఉంటాయి. ఒక మోస్తరు తీపి కలిగి ఉంటాయి. సముద్ర మట్టం నుండి వెయ్యి అడుగుల ఎత్తు వరకూ ఉన్న ప్రాంతాల్లోనూ, పొడి వాతావరణంలోనూ దిగుబడి బాగా వస్తుంది. కాలి పత్తి రకం పండ్లు కోలగా, మధ్యస్త పరిమాణంలో ఉంటాయి. తోలు మందంగా, కండ తీయగా ఉంటుంది. ఈ రకం పండు నిల్వ, రవాణా, ఎగుమతికి అనుకూలమైనది. అయితే ఈ రకం సపోటాలో దిగుబడి తక్కువ. ఇవి కాక ద్వారపూడి, కీర్తి బర్తి, పీకేయం-1, 3, డీహెచ్‌యస్ 1, 2 రకాలు కూడా అనువైనవే. వీటిలో డీహెచ్‌యస్ 1, 2 హైబ్రిడ్ రకాలు.


          ఆహార పోషక విలువలు170g

శక్తి - Calories: 141 నీరు -Water: 132.60g పిండిపదార్ధము -Carbs: 33.93g మాంసకృత్తులు --Protein: 0.75g పీచుపదార్థం -Fiber: 9.01g మొత్తం కొవ్వుపదార్ధము -Total Fat: 1.87g సాచ్యురేటెడ్ కొవ్వు -Saturated Fat: 0.33g చెడ్డ కొవ్వు -Trans-fats: Not known (or 0)

ఖనిజలవణాలు

కాల్సియం -Calcium: 35.70 mg ఐరన్‌-Iron: 1.36 mg మెగ్నీషియం -Magnesium: 20.40 mg భాష్వరము -Phosphorus: 20.40 mg పొటాసియం-Potassium: 328.10 mg సోడియం-Sodium: 20.40 mg జింక్ -Zinc: 0.17 mg కాఫర్ -Copper: 0.15 mg మాంగనీష్ -Manganese: Not known సెలీనియం -Selenium: 1.02mcg

విటమిన్లు

విటమిన్‌'ఏ'-Vitamin A: 102.00IU థయమిన్‌-Thiamine (B1): 0.00 mg రైబోఫ్లెవిన్‌-Riboflavin (B2): 0.03 mg నియాసిన్‌-Niacin (B3): 0.34 mg పాంథోనిక్ యాసిడ్-Pantothenic acid (B5): 0.43 mg విటమిన్‌ ' బి 6' -Vitamin B6: 0.06 mg ఫోలిక్ యాసిడ్-Folic acid/Folate (B9): 23.80mcg సయనోకొబాలమైన్‌-Vitamin B12: 0.00mcg విటమిన్‌ 'సీ'-Vitamin C: 24.99 mg విటమిన్‌' ఇ '-Vitamin E (alpha-tocopherol): Not known వి్టమిన్‌' కె ' -Vitamin K (phylloquinone): Not known

Miscellaneous:

ఆల్కహాల్ -Alcohol: 0.00g కెఫిన్‌-Caffeine: Not known


Essential Amino Acids

ఐసోలూసిన్‌-Isoleucine: 0.03g లూసిన్‌-Leucine: 0.04g లైసిన్‌-Lysine: 0.07g మితియోనిన్‌-Methionine: 0.01g ఫినైల్ అలమిన్‌-Phenylalanine: 0.02g థియోనిన్‌-Threonine: 0.02g ట్రిప్టోఫాన్‌-Tryptophan: 0.01g వాలిన్‌-Valine: 0.03g


Saturday, August 01, 2020

పిస్తా గురించి రహస్యాలు మీ కోసం 😍👌

పిస్తా లో పోషక పదార్థం ఎక్కువ . పొటాసియం అత్యధికం గా లబిస్తుంది-శరీరము లో ద్రవాల నియంత్రణకు పొటాషియం పనికొస్తుంది . దీనిలో ఉండే బి 6 ప్రోటీన్ల తయారీ , శోషణము లో ఉపయోగపాడుతుంది .మిగిలిన ఎందు పండ్ల తో పోలిస్తే పిస్తా లో కేలరీలు ఎక్కువ . anti-oxidants ఉన్నందున ఇవి గుండె జబ్బులను తగ్గించే గుణం కలిగి ఉన్నాయి . కాన్సర్ రాకుండా కాపాడతాయని తేలినది . పిస్తా లో మోనో శాచ్యురేతేడ్ క్రొవ్వులు అధికం గా ఉన్నందున ఎక్కువగా తినకూడదు ... వారం లో 15 - 20 గ్రాములు మించి తీసుకోకూడదు . రక్తం లో కొలెస్టిరాల్ ను తగ్గిస్తాయి , అతి తక్కువ తిన్నా కడుపు నిండినట్లు గా ఉంటుంది . అందువల్ల ఆహారము తక్కువగా తీసుకోవడం జరుగుతుంది . పొట్టను పెరగ నీయదు . ఏం తింటే మన శరీరానికి తక్కువ కేలరీలతో తక్షణశక్తి సమకూరుతుందో దాని పేరే 'పిస్తా'! ఒక ఔన్సు పిస్తా తింటే మన శరీరానికి160 కేలరీల శక్తి సమకూరుతుంది. 30గ్రాముల పిస్తాకు 87 కేలరీల శక్తి మాత్రమే వస్తుంది.                                  
                              
  • ఇందులో మిగతా నట్స్‌కన్నా ఎక్కువ ప్రోటీన్‌శాతం ఉంది.
  • Pistacchio di Bronte.jpg                              Pistachio macro whitebackground NS.jpg
    ...........
  • ఇందుళొ ఫైబర్‌ ఎక్కువే. మనం తింటే కాదనదు.
  • పిస్తాలో విటమిన్‌ బి6 సమృద్ధిగా ఉందని 'శాస్త్రం' ఘోషిస్తోంది. దాంతోపాటూ చర్మానికి మేలు చేస్తానంటూ విటమిన్‌ ఇ సైతం ఉంది.
  • అసలే కొత్త కొత్తరకాల వ్యాధులు వ్యాపిస్తున్న ఈరోజుల్లో ఇవితింటే రోగనిరోధకశక్తి పెరుగుతుందట!
  • పిస్తాలో పొటాషియం(శరీర సమతుల్యతను కాపాడేది), ఫాస్ఫరస్‌(ఎముకలకు, పళ్లకు బలాన్నిచ్చేది), - మెగ్నీషియం(శరీరశక్తిని సమకూర్చేది) దండిగా కలవు * జీర్ణశక్తిని మెరుగుపరిచే థియామిన్‌ పిస్తాలోనే కొలువుతీరిందిట!
  • ఇవి ఎక్కువగా తిన్నా కొలెస్ట్రాల్‌ పెరగదట. మామూలుగా నట్స్‌ తినాలంటే కొలెస్ట్రాల్‌ పెరుగుతుందనే కదా దూరంగా ఉంటాం?! మరి ఆ దోషం ఇందులో లేనేలేదట!
  • కంటికి అత్యంత అవసరమైన 'ల్యూటిన్‌', 'జియాజాంథిన్‌' ఇందులో ఉందని పరిశోధకులు చెప్పుతున్నారు.
  • హానికారక కొవ్వు అంటూ ఆమడదూరానికి పరుగెత్తుతామే, అది ఇందులో దాదాపు శూన్యమట!
  • మరి ఆరోగ్యపరమైన కొవ్వు సంగతో! సందేహంలేకుండా సరిపడా కలదు. అందుకే సాయం సమయాలు పకోడీ, చిప్స్‌ల వెంట పడకుండా కాసిని పిస్తా పప్పులు నోటిలో వేసుకుంటే ఇన్ని లాభాలు పొందొచ్చు! ఎవరైతే పిస్తా తింటారో వారికి నిండైన ఆరోగ్యం, పొందికైన సౌందర్యం చిక్కుతుంది .
                                                                    


Monday, June 22, 2020

మునగ ఆకు కాదు 300 రకాల వ్యాధులకు దివ్య ఔషధం

మానవ శరీరంలో ఒక్కో భాగానికి ఒక్కోరకం పోషకాలు అవసరమవుతాయి అంటున్నారు ఆరోగ్య నిపుణులు. మరి అన్ని పోషకాల లభించే ఆహారం తీసుకోవాలంటే.. రకరకాల ఆకుకూరలు, కాయగూరలు తినాల్సి ఉంటుంది కదా అని అనుకుంటున్నారా! అన్ని రకాల కూరగాయలు తీసుకోవటం మా వల్ల కాదు.. అన్ని పోషకాలు సమకూర్చే ఒకే శాకాహారం ఏదైనా ఉంటే భలేగా ఉంటుంది కదా అని ఆలోచిస్తున్నారా.. అయితే మీకోసం ఓ బ్రహ్మాండమైన ఆకు గురించి చెబుతా.. కాకపోతే మనమే దానిని తక్కువగా వాడుతాం. ఇంతకీ ఆ దివ్యపోషిణి మరేదోకాదు మనకు బాగా తెలిసిన మునగ. మునగ కాయలతో పాటు ఆకు ఎంతో విలువైనది. అందులో ఏమేమి పోషకాలున్నాయి, దానివల్ల ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలున్నాయో ఇప్పుడు చూద్దాం.. అసలు 4, 5 వేల ఏళ్ల నుంచే మన పూర్వీకులు మునగాకును మెడిసిన్ తయారీలో వినియోగిస్తున్నారంటే ఆ మునగ ఆకు గొప్పతనం ఇట్టే అర్థమవుతుంది. ఆయుర్వేదంలో 300లకు పైగా వ్యాధులను నయం చేయడానికి ఈ మునగాకును ఉపయోగిస్తారు. * మునగాకుల్లో విటమిన్స్, ఎమినో యాసిడ్స్, మినరల్స్ సమృద్ధిగా ఉంటాయి అంటున్నారు ఆరోగ్య నిపుణులు. కళ్ల వ్యాధులకు సంబంధించిన మెడిసిన్‌లో మునగాకును ఎక్కువగా వాడతారు. * పాల నుంచి లభించే క్యాల్షియం 17 రెట్లు అధికంగా మరియు పెరుగు నుంచి పొందే ప్రోటీన్లను 8 రెట్లు అధికంగా మునగాకు నుంచి పొందవచ్చు. * అరటిపండ్ల నుంచి పొందే పొటాషియం 15 రెట్లు అధికంగా ఎండిన మునగాకు నుంచి పొందవచ్చు అంటున్నారు నిపుణులు. * మహిళలు రోజుకి 7 గ్రాముల మునగాకు పొడిని 3 నెలల పాటు రెగ్యులర్‌గా తీసుకుంటే 13.5 శాతం బ్లడ్ షుగర్ లెవల్స్ తగ్గాయంటున్నారు ఆరోగ్య నిఫుణులు. * మునగాకులో ఉండే క్లోరోజెనిక్ యాసిడ్ ద్వారా బ్లడ్‌లో షుగర్ లెవల్స్‌ని కంట్రోల్ చేస్తుందట. * మునగాకుల రసాన్ని పాలలో కలపి పిల్లలకు అందిస్తే వారి ఎముకలు బలంగా తయారవుతాయి. * పాలిచ్చే తల్లులకు మునగాకును కూరగా వండి పెడితే పాలు పెరుగుతాయి అంటున్నారు 
munagaku hashtag on Twitter                                             
నిపుణులు. * గుప్పెడు మునగాకులను వంద మిల్లీలీటర్ల నీటిలో వేసి ఐదు నిమిషాలు ఆ నీటిని కాచి చల్లారనివ్వాలి. ఆ నీటిలో కొంచెం ఉప్పు, మిరియాలపొడి, నిమ్మరసం కలిపి తాగితే ఆస్థమా, టీబీ, దగ్గు తగ్గే అవకాశం ఉంది. * మునగాకు రసం ఓ టీ స్ఫూన్ తీసుకుని దాన్ని గ్లాసు కొబ్బరినీళ్ళలో కలిపి, కాస్తంత తేనె కలిపి ఇస్తే విరోచనాలు ఇట్టే తగ్గిపోతాయట. * ముఖ్యంగా కాల్షియం లోపాన్ని ఎదుర్కొనే మహిళలకు మునగాకు వరప్రదాయిని. అలాంటి వారు విరివిగా మునగాకును ఏదో ఒక రూపంగా ఉపయోగిస్తూ ఉంటే వారిలోని కాల్షియం పెరుగుతుంది.

                                             

Sunday, June 21, 2020

MANAURUMANACHETTU 6TH anniversary


మనఊరు మనచెట్టు బ్లాగ్ పాఠకులకు   సభ్యులకు మరియు  మమ్మల్ని వెన్నుతట్టి ప్రోత్సహిస్తున్న  మా శ్రేయోభిలాషుల కు మనఊరు మనచెట్టు ఆరవ వార్షికోత్సవ శుభాకాంక్షలు.. 🌱🙏💐🌸    

Friday, May 15, 2020

నాలుగు సంవత్సరాల క్రితం హైదరాబాద్ KBR పార్క్ సాక్షిగా ప్రారంభం అయిన Tree day లక్ష్యం ఏమిటి❔లక్ష్యం నెరవేరిందా?

కేబీఆర్ నేషనల్ పార్క్ చుట్టూ వేలాది చెట్లను నరికేయాలన్న ప్రభుత్వ ప్రణాళికను నిరసిస్తూ 15 మే 2016 న భారత నగరమైన హైదరాబాద్‌లో చెట్ల దినోత్సవం ప్రారంభమైంది  తెలంగాణ ప్రభుత్వం వ్యూహాత్మక రహదారి అభివృద్ధి ప్రణాళిక (ఎస్‌ఆర్‌డిపి) ను ప్రతిపాదించింది, దీని కింద మొత్తం కెబిఆర్ పార్క్ అంచును కెబిఆర్ పార్క్ ఎకో-సెన్సిటివ్ జోన్ అని కూడా పిలుస్తారు ఇది 600 కంటే ఎక్కువ జాతుల మొక్కలు, వందలాది జాతుల జంతువులు మరియు పక్షులను కలిగి ఉన్న ఉద్యానవనం యొక్క వృక్షజాలం మరియు జంతుజాలంపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతుంది. ఏప్రిల్ చివరి వారంలో ఒక చిన్న నిరసన ర్యాలీకి కలిసి వచ్చిన పక్షపాతరహిత, రాజకీయేతర ప్రకృతి ప్రేమికుల బృందం "హైదరాబాద్ రైజింగ్" అనే బృందం ట్రీ డేను నిర్వహించింది.  ఇది క్రమంగా ఒక ఉద్యమం యొక్క ఆకృతిని ప్రారంభించింది, హైదరాబాద్ యొక్క వందల నుండి వేల మంది నివాసితులు చేరారు.
Lore Raymond: How Will You Celebrate National Love a Tree Day? ట్రీ డే, మదర్స్ డే, టీచర్స్ డే మరియు ఫాదర్స్ డే నుండి ప్రేరణ పొందిన పదం హైదరాబాద్ రైజింగ్. చెట్లను కౌగిలించుకోవడం, వాటికి నీళ్ళు పెట్టడం, వాటిపై పవిత్రమైన భారతీయ దారాన్ని కట్టడం మరియు వారితో సెల్ఫీలు తీసుకోవడం వంటి లక్ష్యంతో ట్రీ డే నిర్వహించారు ఈ కార్యక్రమంలో రన్నర్లు, వాకర్స్, యోగా ts త్సాహికులు, చెట్టు ప్రేమికులు, ప్రకృతి ప్రేమికులు, పర్యావరణ పరిరక్షణకారులు, నగర ప్రణాళికలు మరియు రవాణా సలహాదారుల నుండి పాల్గొనడం జరిగింది. రహదారి వెడల్పు మరియు ఫ్లైఓవర్ల కోసం చాలా చెట్లను నరికివేసే ప్రభుత్వ చర్యను వారందరూ ప్రశ్నించారు, పీటర్ జె. పార్క్ వంటి ప్లానర్లు ఫ్లైఓవర్లు ట్రాఫిక్ సమస్యలను పరిష్కరించవని నొక్కిచెప్పారు. పాల్గొనేవారు స్థిరమైన అభివృద్ధి విధానాలను అవలంబించాలని ప్రభుత్వాన్ని కోరారు.
పర్యావరణవేత్త ప్రొఫెసర్ పురుషోత్తం రెడ్డి "హైదరాబాద్ ప్రజలు నగరంలోని చెట్ల కోసం నిలబడి చరిత్ర సృష్టించారు మరియు దేశవ్యాప్తంగా ప్రజలు ప్రతి సంవత్సరం జరుపుకునే" ట్రీ డే "ను కూడా ప్రవేశపెట్టారు. 

                                            -------References-------
  1.  "Road project to uproot 3,100 trees in Hyderabad"The Times of India. 19 April 2016. Retrieved 16 May 2016.
  2. ^ Rahul Devulapalli. "Breather for KBR Park trees"The Hindu. Retrieved 16 May 2016.
  3. ^ "Save Tree - Save KBR - Protest Against Tree Felling at KBR Park - V6 News Channel Live"v6news.tv. Retrieved 16 May 2016.
  4. ^ "Tree chopping plan at KBR: Present tense, future uncertain"The Times of India. 16 May 2016. Retrieved 16 May 2016.
  5. ^ Staff Reporter. "One last hug for the trees at KBR park"The Hindu. Retrieved 16 May 2016.
  6. ^ "People called to `bond with trees' at KBR Park"The Times of India. 14 May 2016. Retrieved 16 May 2016.
  7. ^ "Flyovers not a solution for traffic jams says US planner"The Times of India. 14 December 2013.
  8. ^ "`SAVE KBR' fight intensifies"The Times of India. 16 May 2016. Retrieved 16 May 2016



                                        100 Best Images, Videos - 2020 - manaurumanachettu - WhatsApp ...

Thursday, May 14, 2020

చిలగడదుంప


చిలగడదుంప (Sweet Potato) ఒక విధమైన దుంప. దీని శాస్త్రీయ నామము ఐపోమియా బటాటాస్. దీనినే కొన్ని ప్రదేశములలో గెనసుగడ్డలు, మొహర్రంగడ్డ, ఆయిగడ్డ, రత్నపురిగడ్డ, కంద గడ్డ అని కూడా అంటారు. ఇవి రకరకాల  లేత పసుపు ,  నారింజ,  గులాబి రంగు రంగులలో లభిస్తున్నాయి. manaurumanachettu


ఉపయోగాలు:- చిలగడ దుంపలను చాలామంది పెద్దగా పట్టించుకోరు గానీ వీటిల్లో పోషకాలు దండిగా ఉంటాయి. ఉడికించుకునో, ఆవిరిపై ఉడికించో, కాల్చుకునో, కూరగా వండుకునో.. రకరకాలుగా వీటిని తినొచ్చు. సలాడ్లకూ ఇవి మరింత రుచిని తెచ్చిపెడతాయి. కాబట్టి వీటిని వారానికి కనీసం రెండు సార్లయినా తినటం మేలని నిపుణులు సూచిస్తున్నారు. ---

పీచు:-బంగాళాదుంప కన్నా చిలగడదుంపల్లో పీచు మోతాదు చాలా ఎక్కువ. దీంతో నెమ్మదిగా జీర్ణమవుతూ ఎక్కువసేపు కేలరీలు విడులయ్యేలా చేస్తాయి.

విటమిన్‌ బీ6:- 

చిలగడదుంపల్లో విటమిన్‌ బీ6 దండిగా ఉంటుంది. రక్తనాళాలు బలంగా ఉండేందుకు తోడ్పడే హోమోసిస్టీన్‌ను విటమిన్‌ బీ6 విడగొడుతుంది. అందువల్ల వీటితో గుండె, రక్తనాళాల సమస్యలు దూరంగా ఉంటాయి.

పొటాషియం    

ఒంట్లో ఎక్కువగా ఉన్న ఉప్పును తొలగించి, నీటి మోతాదును నియంత్రిస్తూ అధిక రక్తపోటును తగ్గించటంలో పొటాషియం కీలకపాత్ర పోషిస్తుంది. చిలగడదుంపల్లో పొటాషియం మోతాదూ అధికంగానే ఉంటుంది.

Sweet Potato of Salem.jpg

విటమిన్‌ ఏ

చిలగడదుంపల్లో విటమిన్‌ ఏ లేదా బీటా కెరటిన్‌ ఎక్కువ. ఇది ఎండకు చర్మం దెబ్బతినకుండా కాపాడుతుంది. చూపు తగ్గిపోకుండా చూస్తుంది.

మాంగనీసు

పిండి పదార్థాల జీవక్రియల్లో చాలా కీలమైన మాంగనీసు కూడా వీటిల్లో అధికం. అందువల్ల ఇవి రక్తంలో గ్లూకోజు మోతాదులు సాధారణ స్థాయిలో ఉండేలా తోడ్పడతాయి.

విటమిన్‌ సి, ఈ

వీటిల్లోని విటమిన్‌ సి రోగనిరోధకశక్తిని పెంచితే.. విటమిన్‌ ఈ మన చర్మం ఆరోగ్యంగా, నిగనిగలాడేందుకు తోడ్పడుతుంది.

సహజ చక్కెరలు

చిలగడదుంపల్లో దండిగా ఉండే సహజ చక్కెరలు రక్తంలో నెమ్మదిగా కలుస్తాయి. అందువల్ల రక్తంలో ఒకేసారి చక్కెర మోతాదు పెరగకుండా చూస్తాయి. ఇలా బరువు పెరగకుండా, నిస్సత్తువ రాకుండా కాపాడతాయి. నలుపు మరకలు లేని, గట్టి దుంపలు మంచి రుచిగా ఉంటాయి

           -----------------------------------   Raw Sweet Potato     ---------------------------------
                  
                                                     Nutritional value per 100 g (3.5 oz)
                                                            శక్తి 360 kJ (86 kcal)
కార్బోహైడ్రేట్లు 20.1 g 
చక్కెరలు 4.2 g
 పీచు పదార్థం 3.0 g
 కొవ్వు 0.1 g
 ప్రోటీన్ 1.6 g
                                               విటమిన్లు         Quantity      %DV† 
  విటమిన్ - ఎ                 709 μg               89%
థయామిన్ (B1)          0.1 mg         9% 
 రైబోఫ్లావిన్ (B2)          0.1 mg        8%
నియాసిన్ (B3)           0.61 mg    4%                       
 పాంటోథెనిక్ ఆమ్లం (B5)   0.8 mg  16%
 విటమిన్ బి6              0.2 mg 15%
 ఫోలేట్ (B9)                11 μg  3%

                                      విటమిన్ సి                2.4 mg   3%
                  
                                       ఖనిజములు      Quantity             %DV  

కాల్షియం                      30.0 mg                   3%  
ఇనుము                         0.6 mg                    5%
మెగ్నీషియం                 25.0 mg                   7% 
ఫాస్ఫరస్              47.0 mg                     7%
పొటాషియం              337 mg                       7%
 జింక్                    0.3 mg                         3% 
                  Units μg = micrograms •mg = milligrams IU = International units
                                   †Percentages are roughly approximated using US recommendations for adults.
                                                                                 Source: USDA Nutrient Database 


      #