మనఊరు మనచెట్టు: June 2020

Monday, June 22, 2020

మునగ ఆకు కాదు 300 రకాల వ్యాధులకు దివ్య ఔషధం

మానవ శరీరంలో ఒక్కో భాగానికి ఒక్కోరకం పోషకాలు అవసరమవుతాయి అంటున్నారు ఆరోగ్య నిపుణులు. మరి అన్ని పోషకాల లభించే ఆహారం తీసుకోవాలంటే.. రకరకాల ఆకుకూరలు, కాయగూరలు తినాల్సి ఉంటుంది కదా అని అనుకుంటున్నారా! అన్ని రకాల కూరగాయలు తీసుకోవటం మా వల్ల కాదు.. అన్ని పోషకాలు సమకూర్చే ఒకే శాకాహారం ఏదైనా ఉంటే భలేగా ఉంటుంది కదా అని ఆలోచిస్తున్నారా.. అయితే మీకోసం ఓ బ్రహ్మాండమైన ఆకు గురించి చెబుతా.. కాకపోతే మనమే దానిని తక్కువగా వాడుతాం. ఇంతకీ ఆ దివ్యపోషిణి మరేదోకాదు మనకు బాగా తెలిసిన మునగ. మునగ కాయలతో పాటు ఆకు ఎంతో విలువైనది. అందులో ఏమేమి పోషకాలున్నాయి, దానివల్ల ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలున్నాయో ఇప్పుడు చూద్దాం.. అసలు 4, 5 వేల ఏళ్ల నుంచే మన పూర్వీకులు మునగాకును మెడిసిన్ తయారీలో వినియోగిస్తున్నారంటే ఆ మునగ ఆకు గొప్పతనం ఇట్టే అర్థమవుతుంది. ఆయుర్వేదంలో 300లకు పైగా వ్యాధులను నయం చేయడానికి ఈ మునగాకును ఉపయోగిస్తారు. * మునగాకుల్లో విటమిన్స్, ఎమినో యాసిడ్స్, మినరల్స్ సమృద్ధిగా ఉంటాయి అంటున్నారు ఆరోగ్య నిపుణులు. కళ్ల వ్యాధులకు సంబంధించిన మెడిసిన్‌లో మునగాకును ఎక్కువగా వాడతారు. * పాల నుంచి లభించే క్యాల్షియం 17 రెట్లు అధికంగా మరియు పెరుగు నుంచి పొందే ప్రోటీన్లను 8 రెట్లు అధికంగా మునగాకు నుంచి పొందవచ్చు. * అరటిపండ్ల నుంచి పొందే పొటాషియం 15 రెట్లు అధికంగా ఎండిన మునగాకు నుంచి పొందవచ్చు అంటున్నారు నిపుణులు. * మహిళలు రోజుకి 7 గ్రాముల మునగాకు పొడిని 3 నెలల పాటు రెగ్యులర్‌గా తీసుకుంటే 13.5 శాతం బ్లడ్ షుగర్ లెవల్స్ తగ్గాయంటున్నారు ఆరోగ్య నిఫుణులు. * మునగాకులో ఉండే క్లోరోజెనిక్ యాసిడ్ ద్వారా బ్లడ్‌లో షుగర్ లెవల్స్‌ని కంట్రోల్ చేస్తుందట. * మునగాకుల రసాన్ని పాలలో కలపి పిల్లలకు అందిస్తే వారి ఎముకలు బలంగా తయారవుతాయి. * పాలిచ్చే తల్లులకు మునగాకును కూరగా వండి పెడితే పాలు పెరుగుతాయి అంటున్నారు 
munagaku hashtag on Twitter                                             
నిపుణులు. * గుప్పెడు మునగాకులను వంద మిల్లీలీటర్ల నీటిలో వేసి ఐదు నిమిషాలు ఆ నీటిని కాచి చల్లారనివ్వాలి. ఆ నీటిలో కొంచెం ఉప్పు, మిరియాలపొడి, నిమ్మరసం కలిపి తాగితే ఆస్థమా, టీబీ, దగ్గు తగ్గే అవకాశం ఉంది. * మునగాకు రసం ఓ టీ స్ఫూన్ తీసుకుని దాన్ని గ్లాసు కొబ్బరినీళ్ళలో కలిపి, కాస్తంత తేనె కలిపి ఇస్తే విరోచనాలు ఇట్టే తగ్గిపోతాయట. * ముఖ్యంగా కాల్షియం లోపాన్ని ఎదుర్కొనే మహిళలకు మునగాకు వరప్రదాయిని. అలాంటి వారు విరివిగా మునగాకును ఏదో ఒక రూపంగా ఉపయోగిస్తూ ఉంటే వారిలోని కాల్షియం పెరుగుతుంది.

                                             

Sunday, June 21, 2020

MANAURUMANACHETTU 6TH anniversary


మనఊరు మనచెట్టు బ్లాగ్ పాఠకులకు   సభ్యులకు మరియు  మమ్మల్ని వెన్నుతట్టి ప్రోత్సహిస్తున్న  మా శ్రేయోభిలాషుల కు మనఊరు మనచెట్టు ఆరవ వార్షికోత్సవ శుభాకాంక్షలు.. 🌱🙏💐🌸