మనఊరు మనచెట్టు: March 2016

Sunday, March 27, 2016

fb.com/mamanaurumanachettu
Guruvugari ashishyulu😊😊😊🙏🙏🙏

Saturday, March 19, 2016

fb.com/manaurumanachettu manaurumanachettu

Monday, March 14, 2016

కుంకుమ పువ్వు

కుంకుమ పువ్వు  

https://www.facebook.com/manaurumanachettu
   కుంకుమ పువ్వు:-  

 ఒక రకమైన ఖరీదైన సుగంధ ద్రవ్యము. ఇరిడాసే కుటుంబానికి చెందిన కుంకుమ పువ్వును ప్రధానంగా శీతలీ ప్రదేశాల్లో పండిస్తారు. కుంకుమపువ్వులో ఉపయోగపడే భాగం - ఎర్ర కేసరాలు మాత్రమే. ఒక కిలో కేసరాలు తయారు చేయాలంటే కనీసం రెండు లక్షల పూలు అవసరమవుతాయి. అందుకే కుంకుమ పువ్వు ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన సుగంధ ద్రవ్యము. కేసరాలు రుచికి కొద్దిగా చేదుగా, తియ్యగా వుంటాయి.

చరిత్ర

కుంకుమ పువ్వు ఒకరకమైన ఖరీదైన సుగంధ ద్రవ్యము. ఈ భూభాగం లో అత్యంత ఆకర్ణీయమైనది , ఖరీదైనది , అద్భుత ఔషధ గుణాలు కలిగినది కుంకుమపువ్వు . ఆ సేతుహిమాచలమే కాదు సీమాంతర భూములు లోను , అరబిక్ ఆచరణలొను , వేదకాలపు సంసృతిలోనూ ప్రాముఖ్యమైన సౌందర్యపోషణ ద్రవ్యమిది . నాటి రాచరికకాలపు దర్పణానికి చిహ్నం ఈ కుంకుమపువ్వు . క్రీ.పూ. 500 సం. ముందే దీని ప్రస్తావం ఉన్నది . కుంకుమ పువ్వును ఇంగ్లీషులో శాఫ్రాన్‌ ఫ్రాన్‌ అంటారు. ఇది జాఫరాన్‌ అనే అరబిక్‌ పదం నుంచి వచ్చింది. అరబిక్‌లో జాఫరిన్‌ అంటే పసుపు అని అర్థం. కుంకుమ పువ్వు అందించే మొక్కలను ప్రత్యేకంగా పెంచుతారు. పువ్వు మధ్య ఉండే రేణువులను తీసి కుంకుమ పువ్వు తయారు చేస్తారు. ఒక కిలో కుంకుమపువ్వు తయారు చేయాలంటే కనీసం రెండులక్షల పూలు అవసరమవుతాయి. అందుకే వీటి ధర చాలా అధికంగా ఉంటుంది. కుంకుమ పువ్వు రుచికి కొద్దిగా చేదుగా, తియ్యగా వుంటుంది.కుంకుమపువ్వు... ఈ పేరు వినగానే కాశ్మీర్‌ గుర్తుకొస్తుంది. ఎందుకంటే మనదేశంలో ఇది కేవలం అక్కడ మాత్రమే పండుతుంది. కానీ నిజానికి దీని స్వస్థలం దక్షిణ ఐరోపా. అక్కడ నుంచే వివిధ దేశాలకు విస్తరించింది. గ్రీసు, స్పెయిన్‌, ఇరాక్‌, ఇటలీ, సిసిలీ, టర్కీ, ఇంగ్లాండ్‌, ఫ్రాన్స్‌ దేశాల్లో దీన్ని ఎక్కువగా పండిస్తారు. అయితే అన్నింటిలోకీ కాశ్మీరీ కేసర్‌ నాణ్యమైనది. మనదేశంలో ఉత్తరాది రాష్ట్రాలంతటా 'కేసర్‌' అంటారు.

కుంకుమ పువ్వు సాగు

కుంకుమ పువ్వును ఇరాన్ దేశం అత్యధికంగా పండిస్తుంది. భారత దేశంలో కుంకుమ పువ్వుని కాశ్మీర్ లో పండిస్తారు. వర్షాకాలం చివరలో కుంకుమ దుంపలను దున్నిన భూమిలో నాటుతారు. ఎండాకాలం ఆరంభానికి కోత కోస్తారు. కుంకుమ పువ్వు పండాలి అంటే వాతావరణంలో అధిక తేమ ఉండరాదు, మట్టి గుల్లగా ఉండాలి, అత్యధికంగా ప్రకృతిసిద్ధమైన ఎరువులు వాడాలి, వర్షపాతం తక్కువగా ఉండాలి. దుంప నాటిన రెండు నెలలకే పుష్పాలు పూస్తాయి. శీతాకాలం చివరలో కుంకుమ పువ్వు పంట కోతకు వస్తుంది. కుంకుమ పువ్వును ఇంటివద్ద కుండీల్లో కూడా పెంచుకోవచ్చు. కుండీ మట్టిలో కొబ్బరి పొట్టు, వానపాముల ఎరువు సమానభాగాలుగా ఉండాలి. కుంకుమపువ్వు మొక్కలను పూర్తి ఎండలోగాని, పాక్షిక ఎండలోగాని పెంచుకోవచ్చు. దక్షిణ భారత దేశంలో అయితే చలి ఎక్కువ ఉండే మెట్టప్రాంతాల్లో పండిచవచ్చు. అయితే దక్షిణ భారత దేశంలో కుంకుమ పువ్వు దుంపలను అక్టోబరు నెలలో నాటితే మంచిది. ఒక్క గ్రాము కాశ్మీర్ కుంకుమ పువ్వు కేసరాలు 230నుండి 240 రూపాయల వరకూ ధర పలుకుతుంది.

పువ్వంటే పువ్వూ కాదు

కుంకుమపువ్వు మొక్క చూడ్డానికి ఉల్లి లేదా ఎర్ర లిల్లీ మొక్కలా ఉంటుంది. చిన్న దుంపవేరు నుంచి ఆకులు పైకి వచ్చి వాటి మధ్యలో పూలు వస్తాయి. కాశ్మీర్‌లో పండించే కుంకుమపువ్వు మొక్కకి పైకి ఆకులు కూడా కనిపించవు. కేవలం వంగపండురంగు పువ్వు మాత్రం కనిపిస్తుంది. కాశ్మీర్‌లోని పాంపోర్‌ ప్రాంతంలోని నేలంతా అక్టోబరు - నవంబరులో విరబూసిన కుంకుమపువ్వుతో నిండిపోతుంది. ముందు మొగ్గ వచ్చి పువ్వు విచ్చుకుంటుంది. అదే కుంకుమపువ్వు అనుకుంటే పొరపాటే. అందులో ముచ్చటగా మూడే అండకోశాలు, రెండు కేసరాలు ఉంటాయి. కిందభాగంలో పసుపు, పైన ఎరుపురంగులో ఉండే ఈ అండకోశాలనే కుంకుమపువ్వుగా పిలుస్తారు. ఈ ఎరుపురంగు భాగమే ఘాటైన వాసననీ రుచినీ రంగునీ ఇస్తుంది. ఉదయాన్నే విచ్చుకునే ఈ పూలను వెంటనే కోసి అందులోని ఎరుపురంగులో ఉండే అండకోశభాగాలను తుంచి ఎండబెడతారు. అప్పుడే అవి మంచి వాసనతో ఉంటాయి. విచ్చుకున్న పూలను కొయ్యడంలో ఒక్కపూట ఆలస్యం చేసినా అవి వెంటనే వాడిపోతాయి. అండకోశాలు రంగునీ రుచినీ కోల్పోతాయి. అందుకే, పూసిన పూలన్నింటినీ ఉదయం పదిగంటలలోపే కోసేస్తారు. కిలో కుంకుమపువ్వు కావాలంటే సుమారు లక్షన్నర పూలను సేకరించాలి. అన్నింటి నుంచీ అండకోశాలను చేత్తోనే వేరుచేయాలి. ఇది ఎంతో శ్రమతో కూడిన పని. శాఫ్రాన్‌ అంత ధర పలకడానికి ఇదీ ఓ కారణమే. మన దగ్గర గ్రాము కుంకుమపువ్వు ధర సుమారు రూ.60 నుంచి 600 వరకూ ఉంటుంది. నాణ్యతనుబట్టి ధర మారుతుంది. మనిషి వాడిన మొదటి సుగంధద్రవ్యం ఇదేనట. సుగంధద్రవ్యాల్లోకెల్లా
https://www.facebook.com/manaurumanachettu

ఉపయోగాలు

  • కుంకుమ పువ్వు రంగు పదార్ధంగాను, సువాసనకారిగాను అనేక తినుబండారాలు, తాంబూలంలోనూ వాడతారు.
  • కుంకుమ పువ్వు నేత్ర వ్యాధులలోను, ముక్కు సంబంధమైన వ్యాధులలోను మందుగా పనిచేస్తుంది.
  • ప్రతిదినం కుంకుమ పువ్వును, తేనెను తెల్లవారుఝామున సేవిస్తే ధాతుపుష్టికి, వీర్యవృద్ధికి పనిచేస్తుంది.
  • కుంకుమ పువ్వు గంధంలా తయారుచేసి ముఖానికి రాస్తే మొటిమలు తగ్గి, చర్మం సున్నితంగా ఆకర్షణీయంగా తయారవుతుంది.
  • గర్భిణులు కుంకుమపువ్వు కలిపిన పాలు తాగితే పిల్లలు తెల్లగా పుడతార'ని అంటుంటారు. ఇది అపోహేనని కొందరు కొట్టిపారేస్తారు. ఏది నిజమో కచ్చితంగా తెలియకపోయినా... రంగూరుచీవాసనా ఉన్న అరుదైన సుగంధద్రవ్యమే కుంకుమపువ్వు. అందుకే అది అందరికీ 'ప్రియమైన' ఎర్ర బంగారం!
కుంకుమ పువ్వులో క్రోసిన్, క్రోసిటిన్, పిక్రో క్రోసిన్ మొదలైన గ్లూకోసైడులు ఉన్నాయి. వీటితో పాటు బీటా, గామా కెరోటిన్ లు, లైకోఫీనులు ఉన్నాయి. ఇంట్లో గర్భిణి ఉంటే కుటుంబసభ్యులు కుంకుమ పువ్వును కొనితెస్తారు. ఇదే కాదు, అదనపు రంగు కోసం దీన్నివంటకాల్లోనూ వినియోగిస్తారు. ఈ రెండు ఉపయోగాలు అందరికీ తెలిసినవే. తెలియనిది మరొకటుంది. ఏంటంటే, దానివల్ల కంటికి చాలా మేలు. వృద్ధాప్యం మీద పడుతున్న కొద్దీ కంటి చూపు తగ్గుతుంది. కంకుమ పువ్వులో దీనినిమెరుగుపరిచే కారకాలున్నాయి. అందుకే యాభైకి పైబడుతున్న వారంతా తరచూ ఆహారంలో కుంకుమపువ్వునుతీసుకుంటే మంచిదని సూచిస్తున్నారు వైద్యనిపుణులు.

కుంకుమ పువ్వు వైద్య పరంగా ఉపయోగాలు...

కుంకుమ పువ్వు జీర్ణశక్తిని పెంచుతుంది.రక్తప్రసరణను మెరుగుపరిచి రక్తపోటును తగ్గి స్తుంది.కుంకుమ పువ్వును పూర్వం చైనీయుల వైద్యంలో విరివిగా వాడేవారు. వారు ఎక్కు వగా కాలేయ సామార్థ్యాన్ని పెంచేందుకు ఉపయోగించేవారు.ఆయుర్వేదంలో ఉదరం పని తీరును మెరుగుపరిచేందుకు,జీర్ణక్రియ సంబంధిత సమస్యల నివారణకు ఉపయోగి స్తారు.ఆలిని క్రమబద్ధీకరించేందుకు, జీర్ణరసాల ప్రసరణకు, మోనోపాజ్‌ సమస్యల చికి త్సకు కూడా కుంకుమపువ్వును వినియోగిస్తారు. దగ్గు, కడుపుబ్బరం చికిత్సకూ వాడతారు. శారీరక రుగ్మతలతో పాటు డిప్రెషన్‌ను కూడా కుంకుమ పువ్వు తొలగిస్తుంద శరీరంలో కామోద్ధీపనలను పెంచే న్యూరో-ట్రాన్స్‌మిటర్లను, డోపమైన్‌ ఫైన్లను వృద్ధి చేస్తుంది. దీనిలో క్యాన్సర్‌ను నివారించే కీమో-ప్రివెంటివ్‌ లక్షణాలున్నట్లు కూడా తాజా పరిశో ధనలో గుర్తించారు. అయితే కిడ్నీ, నరాలకు ఇబ్బంది కలిగించే టాక్సిన్‌ దీనిలో వుంది కాబ ట్టి ఎక్కువ మోతాదులో వినియోగించవద్దని వైద్యుల సూచన. గర్భవతులు అయిన స్త్రీలు కుంకుమపువ్వు పాలల్లో వేసుకుని తాగితే పుట్టబోయే పిల్లలు మంచి రంగుతో పుడతారని అంటారు. అది వాస్తవమే అయినప్పటికీ కేవలం గర్భవతులే కాదు. కుంకుమ పువ్వును ఎవ్వరైనా తీసుకోవచ్చు. కుంకుమ పువ్వు తీసుకోవడం వలన ఆరోగ్యం మరింత మెరుగవుతుంది . గర్భిణులు మొదటి నెలనుండీ కుంకుమపువ్వు వాడవచ్చును ... కానీ మొదటి మూడు నెలలు వేవుళ్ళు (వాంతులు) ఉంటాయి కాబట్టి ... అనుకూలత బట్టి వాడాలి . తేనె , పాలు , పటికి పంచదార లతో కుంకుమ పువ్వు కలిపి తినవచ్చును . కుంకుమ పువ్వు తో గాఢనిద్ర : రాత్రివేళ ఆహారములోనో , ఏదో ఒక పానీయములోనో కొద్దిపాటి రేకులు వేసుకుంటే గాఢమైన నిద్ర పడుతుంది . నిజానికి కుంకుమ పువ్వులో ఈ గుణాలు రోమన్ల కాలము నాడే గుర్తించారు . ధనవంతులైన రోమన్లు గా్ఢముగా నిద్రించేందుకు గాను తమ దిండ్లు పై కుంకుమ పువ్వు ఫిలమెంట్లను కుట్టించుకునేవారట .

https://www.facebook.com/manaurumanachettu

నకిలీ కుంకుమ పువ్వు

నాణ్యమైన కుంకుమపువ్వు ధర కిలో సుమారు ఆరు లక్షల రూపాయలు. అందుకే దీనికి నకిలీ ఉత్పత్తులు కూడా ఎక్కువే. కొందరు నాణ్యత, ధర తక్కువగా ఉన్న పర్షియన్‌ కుంకుమపువ్వునే కాశ్మీరీ శాఫ్రాన్‌ పేరుతో అమ్ముతారు. దానిమ్మ పూరేకుల్నీ బీట్‌రూట్‌ తురుముల్నీ కూడా శాఫ్రాన్‌గా అమ్మేవాళ్లూ ఉన్నారు. కొనేది మంచిదా కాదా అన్నది చూడాలంటే ఓ రేకుని కాసిని గోరువెచ్చని నీళ్లు లేదా పాలల్లో వేయాలి. అవి వెంటనే రంగు మారితే అది కచ్చితంగా నకిలీదే. స్వచ్ఛమైన కుంకుమపవ్వు కనీసం 15 నిమిషాలు నానిన తరువాతగానీ అందులోనుంచి రంగు దిగదు. అప్పుడే వాసన కూడా మొదలవుతుంది. పొడిరూపంలో కేసర్‌ని అస్సలు కొనకూడదు. ఇందులో మోసం మరింత ఎక్కువ.

నకిలి కుంకుమ పువ్వు

కుంకుమపువ్వులానే ఆహార పదార్థాలకు రంగునిచ్చే పూమొక్కలు ఇంకా చాలానే ఉన్నాయి. కానీ అన్నింటిలోకీ కుసుంబా లేదా కుసుమపూల రేకులు చాలావరకూ శాఫ్రాన్‌ మాదిరిగానే రంగునిస్తాయి. కుంకుమపువ్వుని కొనలేనివాళ్లు దీన్ని ప్రత్యామ్నాయంగా వాడతారు. దీన్ని 'పోర్చుగీసు శాఫ్రాన్‌' అని కూడా అంటుంటారు. మార్కెట్‌లో ఇదే అసలు కుంకుమపువ్వు అని అమ్మేవాళ్లూ ఉంటారు. అయితే ఇవేమీ కూడా అసలైన కుంకుమపువ్వుకి సాటి రావు. దానిలా వీటికి ఘాటైన పరిమళం ఉండదు. కంటిని మోసం చేయొచ్చేమోగానీ రుచిని బట్టి కనిపెట్టేయవచ్చు.

మూఢ నమ్మకం

గర్భిణీ స్త్రీలు ప్రతిదినం కొద్దిగా కుంకుమ పువ్వును, పటిక పంచదార కలిపిన ఆవుపాలతో తీసుకుంటే పుట్టబోయే పిల్లలు మంచి తేజస్సుతో పుడతారని చాలా మంది భావన. అయితే పూర్వకాలం నుండి ఉంటున్న ఈ మూఢనమ్మకంలో వాస్తవం లేదు, శాస్త్రీయంగా కూడా ఎటువంటి ఆధారాలు లేవు.
https://www.facebook.com/manaurumanachettu

శంఖపుష్పం

శంఖపుష్పం


శంఖపుష్పం  సంస్కృతం: श्वेतां, विष्णूक्रांता) పుష్పించే మొక్కలలో ఫాబేసి కుటుంబానికి చెందిన ఎగబ్రాకే మొక్క. వీటిని సంస్కృతంలో గిరికర్ణిక అని పిలుస్తారు. విష్ణుక్రాంత పత్రి విష్ణుక్రాంత వృక్షానికి చెందినది. వినాయక చవితి రోజు చేసుకునే వరసిద్ధివినాయక ఏకవింశతి పత్రి పూజా క్రమములో ఈ ఆకు పదవది.
ఈ మొక్కలు ఆసియా ఖండానికి చెందినవి. తర్వాత ప్రపంచమంతా విస్తరించాయి. ఈ ఆకు ముదురు పచ్చ రంగులో ఉంటుంది. ఆకారం సమంగా ఉంటుంది. పరిమాణం మధ్యస్థం. ఈ చెట్టు గుబురుచెట్టు గా పెరుగుతుంది.ఈ ఎగబ్రాకే మొక్క పుష్పాలు మానవ స్త్రీల యోని (Vulva) ఆకారంలో ఉండడం వలన లాటిన్ భాషలో దీని ప్రజాతి పేరు "క్లిటోరియా క్లిటోరిస్ "నుండి ఉత్పన్నమైనది. టెర్నేటియా ఇండోనేషియా దేశంలో ఒక ప్రాంతం పేరు టెర్నేట్నుం డి వచ్చింది. తమిళం, తెలుగు మరియు మళయాళం భాషలలో దీని పేరు శంఖం (Seashell) నుండి వచ్చింది.

https://www.facebook.com/manaurumanachettu

ఉపయోగాలు


  • శంఖపుష్పాల కోసం కొన్ని తోటలలో పెంచుతారు.
  • భూసారాన్ని పెంచడానికి కొన్ని ప్రాంతాలలో వాడుతారు.
  • శంఖపుష్పాలను వివిధ దేవతలకు జరిపే పుష్పపూజలో ఉపయోగిస్తారు.
  • దీనిని చాలా శతాబ్దాలుగా ఆయుర్వేదంలో వివిధ రకాలైన రోగాల చికిత్సలో ఉపయోగిస్తున్నారు.[
  • దీని వేరు విరేచనకారి మరియు మూత్రము సాఫీగా వచ్చుటకు తోడ్పడును.
  • దీని విత్తనములు నరముల బలహీనతను పోగొట్టుటకు వాడెదరు.
  • ఆసియాలో దీని పుష్పాలను కొన్ని రకాల ఆహార పదార్ధాల వర్ణకం గా వాడుతున్నారు.






https://www.facebook.com/manaurumanachettu

అతి వేగంగా పెరిగే ఐదు రకాల గార్డెన్ మొక్కలు


అతి వేగంగా పెరిగే ఐదు రకాల గార్డెన్ మొక్కలు ;-

గార్డెన్ పెంచుకోవాలనుకొనే వారికి మొక్కల మీదా చాలా ఆసక్తి కలిగి ఉంటారు. గార్డెన్ లో కొత్త కొత్త రకాలను మొక్కలను పెంచుకొంటూ ఆనందిస్తుంటారు. వాటిలో ఏవైనా అతివేగంగా చిగురించో .. లేదా మొగ్గ విడిచో .. పువ్వు పూచో కనిపిస్తే ఆ ఆనందానికి అంతే ఉండదు. ఎందుకంటే ప్రకతి సహజంగా మొక్కలు పెరగడం పువ్వులు పూయడం ఓ అద్భుతం కాబట్టి. అయితే కొన్ని మొక్కలు పెరగడానికి ఎక్కువ సమయం తీసుకొంటాయి. అదే మరికొన్ని ముక్కలు అతి త్వరగా పెరుగుతాయి. అలాంటి మొక్కలు మీ గార్డెన్ లో కూడా పెంచుకోవాలంటే, కొన్ని మొక్కల పేర్లను మీ కోసం......
https://www.facebook.com/manaurumanachettu
మ్యారిగోల్డ్(బంతిపూలు): బంతి పూల మొక్కలు అతి వేగంగా, సులభంగా పెరుగుతాయి. రెండు నెలల్లోనే మీ గార్డెన్ లో కలర్ ఫుల్ గా కళకళలాడాలంటే ఈ మొక్కలను తప్పనిసరిగా పెంచుకోవాల్సిందే. బంతిపూల విత్తనాలు లేదా చిన్న మొక్కలను భూమిలో లేదా కుంపటిలో నాటుకొన్నా సరిపోతుంది. మనం సాధారణంగా చూస్తూనే ఉంటాం బంతిపూలు రెండు మూడు కలర్స్ లో పూస్తుంటాయి. ఆరెంజ్, పసుపు, మెరూన్ ఎల్లో మిక్స్ ఇలా కలర్ కలర్ గా గార్డె అంతా కళకళలాడుతుంది. పువ్వులు ఆకారంలో, షేప్ లో కూడా వ్యత్యాసం కలిగి ఉంటాయి. ఈ మొక్కలను కోసం ఎక్కువగా రిస్క్ తీసుకోవనవసరం లేదు. ఇవి ఎటువంటి నేలలోనైనా అతి సులభంగా పెరుగుతాయి. వీటి కోసం ప్రత్యే శ్రధ్ద తీసుకోవలసిన అవసరంలేదు. మొక్కలకు ప్రతి రోజూ నీళ్ళు పడుతూ, సూర్యరశ్మి మొక్కలపై పడేట్లు చూసుకొంటే సరిపోతుంది. ఒక సారి పువ్వులు వికసించడం మొదలు పెట్టిన తరవాత వాటి కుంపట్లను నీడలోనికి మార్చుకోవాలి. ఈ మొక్కలు చాలా చిన్నవిగా ఉండటం వల్ల వీటిని నిర్వహాణ చాలా సులభంగా ఉంటుంది. 
రాయల్ పామ్: మీ గార్డెన్ లో పొడవైన పామ్ ట్రీ పెంచుకోవానుకొంటున్నారా? అతి వేగంగా పెరిగే ఈ మొక్కను కూడా మీ గార్డెన్ లో మొక్కల జాబితాలో చేర్చేయండి. రాయల్ పామ్ మొక్క అతి వేగంగా పెరుగుతుంది. ఇది 50అడుగుల ఎత్తు వరకు పెరుగుతుంది. అలాదే ఈ మొక్క ఆకులు పొడవైన ఆకులను కలిగి ఉంటుంది. రాయల్ పామ్ చెట్లు వివిధ రకాల మట్టిలో పెరుగుతి. వీటికి తప్పనిసరిగా సూర్యరశ్మి పడే ప్రదేశంలోనే నాటుకోవాల్సి ఉంటుంది. ప్రతి రోజూ నీటిని అందించడం వల్ల అతి వేగంగా పెరుగుతుంది.
 స్పైడర్ ప్లాంట్: ఇది కూడా అతి వేగంగా పెరిగే మొక్కే. ఇలాంటి మొక్కలను మనం సాధారణంగా అనేక ఇళ్ళల్లో గమనించే ఉంటాం. ఈ మొక్కలను ఇంటిలోపాల, లేదా ఇంటి బయట కూడా పెంచుకోవచ్చు. స్పైడర్ ప్లాంట్ మట్టిలోనే పెరుగుతాయి. వీటిని ప్రతి రోజూ నీటినందిస్తూ , మూడు నుండి నాలుగు గంటల సేపు సూర్యరశ్మి తగిలేవిధంగా చూసుకోవాలి. ఇది ముఖ్యంగా కుంపట్లో పెరిగే మొక్క. 
క్యాలెండులా: గార్డెన్ మొక్కలలో అతి వేగంగా పెరిగే మొక్కలలో ఈ కలర్ ఫుల్ క్యాండులా మొక్క కూడా ఒకటి. దీన్ని కుండ బంతి పువ్వు లేదా ముద్దబంతి పువ్వు అని పిలుస్తారు. ఇది చిన్నసైజు బంతి పువ్వు. సంవత్సరంలో ఒక సారి మాత్రమే పూచే ఈ మొక్కనిర్వాహణ బాధ్యతలు సులభం. క్యాండులాను చర్మసంరక్షణ ఉత్పత్తులలో కూడా విరివిగా ఉపయోగిస్తుంటారు. 
బ్యాంబు ప్లాంట్: ఈ వెదురు మొక్క కూడా అతి సులభంగా.. అతి త్వరగా కూడా పెరిగే మొక్క! బ్యాంబు లేదా నందినా డొమాస్టికా జాతికి చెందిన మొక్కలు అతివేగంగా పెరుగుతాయి. కొన్ని నెలల్లోనే అతి వేగంగా పెరిగి గార్డెన్ లో ముదురు పచ్చదనంతో ఎప్పుడూ కళకళలాడుతుంటుంది. మీ తోటను అందంగా తీర్చిదిద్దుకోవాలంటే ఈ మొక్కను కూడా పెంచుకోవడం అవసరం. మీ తోటలో అక్కడక్కడా పొదలులాగా గుబురు గుబురుగా కనబడాలంటే ఈ మొక్కలను పెంచుకోవాల్సిందే. ఈ మొక్కలు అతి సులభంగా అతివేగంగా పెరిగే మొక్కలు మరియు పువ్వులు. ఈ మొక్కలకు ఎక్కువ నిర్వాహాణ బాధ్యతలు తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇటువంటి మొక్కలు ఎటువంటి మంటిలోనైన, వాతావరణంలోనై అతి సులభంగా పెరుగుతాయి. కాబట్టి ఈ మొక్కలను మీ గార్డెన్ లో తప్పనిసరిగా ఉండేట్లు చూసుకోండి. ఇంకా ఏవైనా అతి త్వరగా పెరిగే మొక్కలు మీకు తెలుసా...?
https://www.facebook.com/manaurumanachettu


Saturday, March 12, 2016

                                                                                                           ఈ బ్లాగుని ఆదరిస్తున్న ప్రతీ ఒక్కరికి నా హృదయ పూర్వక కృతజ్ఞతలు.         మీ మనఊరుమనచెట్టు