మనఊరు మనచెట్టు: December 2016

Friday, December 16, 2016

మొక్కలు సజీవసమాధులు అవుతున్నాయి.

మిషన్ భగీరథ పనుల్లో కొంత అలసత్వం వహించడం వల్ల  హరిత హరం లో  మనం నాటిన మొక్కలు అంతరించుకు పోతున్నాయి.
సరిగ్గా హరితహారం లో నాటిన మొక్కలకి దగ్గరగా మిషన్ భగీరథ పనులు జరుగుతూ ఉండటం వల్ల పూడికలు తీసిన మట్టిని మొక్కల పై వేయడం వల్ల మొక్కలు సజీవసమాధులు అవుతున్నాయి. కనుక మనం మొక్కలను ఎంత శ్రద్ధతో నాటామో  అంతే శ్రద్ధతో కాపాడవలసిన భాద్యత కూడా మనపై ఉంది.
           ప్రభుత్వం దీనిపై దృష్టి సారిస్తే బాగుంటుంది.
  •  నేను మిషన్ భగీరథ కు వ్యతిరేకిని కాదు. 
  • ప్రభుత్వ వ్యతిరేకిని  అస్సలు కాదు. 
  • నేను ఎంచుకున్న ప్రభుత్వానికి వీరాభిమానిని. 

Thursday, December 15, 2016

కుండీలలో మొక్కలు పెంచడం ఎలా!?



కుండీలలో మొక్కలు పెంచటం నేడు ప్రతి ఇంట్లో కనిపిస్తుంది. కుండీలలోని మొక్కలకు ఏ మోస్తరు నీరు పోయాలనేది అప్పుడప్పుడు సమస్యగా ఎదురవుతుంది కొందరికి. నీరు తక్కువైతే మొక్క ఎండి పోతుంది. నీరు ఎక్కువైతే కుళ్ళిపోతుంది. అయితే విషయం ఆలస్యంగా బయట పడుతుంది. అప్పటికి మొక్కను తిరిగి బతికించే అవకాశముండదు. అలాంటప్పుడు ఏం చేయాలి....

* మొక్కకు ఏ మాత్రం నీరు పోయాలి అనేది ఆ మొక్కను మీరు ఎక్కడ ఉంచుతారనే దాని మీద ఆధారపడి ఉంటుంది.

* వేడి అధికంగా ఉండే గదిలో పెట్టే మొక్కకు ప్రతి రోజూ కొద్దిగా నీరు పోయాలి. ఆరు బయట కాక పోర్టికోలో వుండే మొక్కలకు రెండు రోజులకు ఒకసారి పోస్తే చాలు.

* కుండీని చేతితో ఎత్తి చూడడం ద్వారా లోపల నీరు ఉన్నదీ లేనిదీ చెప్పవచ్చు.

* కుండీ లోపల పెంకులు, ఇసుక మట్టి ఉంచితే కుండీలో పోసిన అధిక నీటిని పీల్చుకుంటుంది.

* కుండీ కింద మట్టి ప్లేటుంచితే అధికంగా పోసిన నీరు బయటకు వచ్చి అందులో చేరుతుంది.

Sunday, December 11, 2016

Saturday, December 03, 2016