మనఊరు మనచెట్టు: 2018

Saturday, December 22, 2018

వాకల్వికాయ

కలే చెట్టు వృక్ష శాస్త్రీయ నామం Carissa carandas. కలే చెట్టును కరండ, కలే కాయలు, కలేక్కాయలు, కలివి కాయలు అని కూడా అంటారు. ఇవి ఆంధ్రప్రదేశ్ లోని ఆన్ని ప్రాంతాల చిట్టడవులలో, కొండ ప్రాంతాలలో సహజసిద్ధంగా పెరుగుతాయి. ఈ చెట్ల పండ్లు తినవచ్చు. అడవులలో సహజసిద్ధంగా పెరిగే ఈ చెట్ల నుండి పండ్లు వానకాలంలో కొన్నిరోజులు మాత్రమే లభిస్తాయి. ఇది అపోసైనేసి కుటుంబానికి చెందిన పుష్పించే మొక్క. ఇది బెర్రీ పరిమాణంలో పండ్లు ఉత్పత్తి చేస్తుంది, వీటిని సాధారణంగా భారతీయ ఊరగాయలు మరియు సుగంధ ద్రవ్యాలు లో ఒక రుచికోసం కలిపే పదార్థంగా ఉపయోగిస్తున్నారు. ఈ మొక్క కరువు పరిస్థితులను తట్టుకుని నేలల యొక్క విస్తృత శ్రేణిలో బాగా దృఢంగా పెరుగుతుంది.   

వేసవికాలంలో మార్చి నెలనుండి మే-జూన్ వరకు ఈ కరండపండు లభిస్తుంది .కరండపండు చూచుటకు నల్లద్రాక్ష పండును పోలివుండును.పరిమాణంలో ద్రాక్షపండుకన్నకొంచెం చిన్నదిగావుండి,గుండ్రంగా కనిపిస్తుంది. సుమారు 5-6 కాయలున్నగుత్తులు అక్కడక్కడ పెరుగుతాయి.కొన్నిగుత్తులు/గుచ్ఛంలలో ఒకటి-రెండుకాయలుమాత్రమే వుంటాయి.చిన్నకాయలుగా వున్నప్పుడు మొక్కఆకులవలే కాయలు పచ్చగా వుండి,పెరిగెకొలది రంగుమారి పచ్చదనంకలసిన గులాబి-ఎరుపు రంగుగా పరివర్తనం చెందుతుంది.పూర్తిగా పండు అవ్వుటకు ముందుదశలో ముదురుఎరుపురంగుగా మారి,పూర్తిగా మాగి పండైనతరువాత నల్లగా కన్పిస్తుంది. కాయగా వున్నప్పుడు కోసినచో కాయతొడిమ నుండి తెల్లటిపాలవంటి ద్రవం స్రవిస్తుంది.పండుగా అయ్యిన తరువాతకూడా పండునుకోసినప్పుడు కూడా స్వల్ప పరిమాణంలో తొడిమనుండి తెల్లటిద్రవం కారుతుంది.పండులోపల అర్ధచంద్రాకారంలో వుండి,ఒకపక్కనొక్కబడిన విత్తనాలు అనేకం వుండును.


కరండ హిమాలయాలలో 300 నుంచి 1800 మీటర్ల ఎత్తులో, షివాలిక్ కొండలలో, పశ్చిమ కనుమలు మరియు నేపాల్,శ్రీలంక, మరియుఆఫ్ఘనిస్తాన్లలో సహజంగా పెరుగుతుంది.
సాగు :రాజస్థాన్,బీహారు,గుజరాత్,ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాలలో కొందరు రైతులు వ్యవసాయపంటగా సాగు చేస్తున్నారు.
Carissa carandas fruits ready for consumption.JPGకరండ పొదవంటి మొక్క.నేలనుంచి సుమారు 5-7 అడుగులెత్తు పెరుగుతుంది.ఎక్కువ నీటి అవసరంలేనందున ఉష్ణప్రాంతాలు ఈమొక్క పెరుగుటకు అనుకూలం.మొక్క నిడుపాటి కొమ్మలను కలిగివుంటుంది.ఎక్కువ రెండుకొమ్మలను ప్రారంభంలో కలిగివుండును.అతరువాత మిగతా కొమ్మలు పెరుగును.కొమ్మలమీద అక్కడక్కడ సుమారు ఒక అంగుళం పొడవున్న కంటకాలు/ముళ్ళు వుంటాయి.పత్రాలు/ఆకులు రెండునుండి మూడు అంగుళాల పొడవుండును.పత్రాల రంగు లేత పచ్చరంగునుండి-ముదురుపచ్చరంగుకలిగివుండును.కొమ్మలమీదనున్న ముళ్ళ తొడిమలవద్ద పుట్టు ఆకులు ఒకదాకొకటి ఎదురుగా వుండును.ఎటువంటి సంరక్షణ,పోషణ అవసరంలేకుందగానే గుట్తలమీద,గట్టులమీద పెరుగు ఈమొక్కను రైతులు పొలాలకు,కళ్ళాలకు,దొడ్లకు కంచెలా పెంచెదరు.పండ్లనుంచివఛ్చివిత్తానాలను విత్తిన కొత్తమొక్కలను మొలచును.
Bush of Carissa carandas with heavy load of fruits.JPGFruits of Carissa carandas.JPG   
కరండకాయ ఒగరు రుచి కలిగివుండి,తినుటకు అనుకూలంకాదు.కాయ మాగడం మొదలై దోరగా అయ్యినప్పుడు పులుపురుచిని కలిగి తినుటకు యోగ్యంగా వుండును.పూర్తిగా పండినతరువాత మధురమైన తీపి రుచిని కల్గి, కొంచెం పులుపుకలిగి తినుటకు అనుకూలంగా వుండును.పాయను-పండును కోసినప్పుడు తొడిమనుండి కారి పండుకు అంటుకున్న తెల్లనిపాలను నీటితోకడిగివేసి,తినవలెను.

పండులో సి విటమిన్ వున్నది.
పండును తినడం వలన పిత్థమును నివారించవచ్చును.
కాని పండును ఎక్కువగా తిన్నచో అజీర్తిచేసి,కడుపునొప్పి వచ్చును.
కరండ కాయ పుల్లగావుంటుందికావున ,కరండ కాయను ఊరగాయ తయారులో ఉపయోగిస్తారు.కరండకాయ వూరకాయ చాలా రుచికరంగా వుండును.
కరండ పండులో పెక్టిన్అధికంగా వుండటం వలన,జామ్(jam),జెల్లి(jelly)తయారిలో కరండ పండును ఉపయోగిస్తారు.
కాయనుండి తీసిన స్రవం మధుమేహరోగనివారణిగా పనిచేస్తుంది

Thursday, December 20, 2018

ఉమ్మెత్త

ఉమ్మెత్త  సొలనేసి కుటుంబానికి చెందిన చిన్న పుష్ప జాతి మొక్క.దత్తూర అనే ఈ మొక్క ఉమ్మెత్త వృక్షానికి చెందినది. వినాయక చవితి రోజు చేసుకునే వరసిద్ధివినాయక ఏకవింశతి పత్రి పూజా క్రమములో ఈ ఆకు నాలుగవది.
దత్తురా ఫాస్టుయొసా మరో రకంగా డెవిల్స్ ట్రంపెట్ లేదా మెటల్ అని అంటారు. ఒక పొద లాంటి శాశ్వత మూలిక. ఈ మొక్కలు ప్రపంచంలోని అన్ని వెచ్చని అడవి ప్రాంతాల్లో పెరుగుతాయి. దినిని మొట్టమొదటచ లిన్నియస్ కనుగొన్నారు. ఈ మొక్క మూడు అడుగులు పెరిగె వార్షిక హెర్బ్.వీటి కాండాలు వంకాయి రంగులో వుండి ఆకులు గుండ్రంగా కాండాలకు అత్తుకుని ఉంటాయి.పువ్వులు 6 నుండి 8 వరకు ఉండి సువాసనను వెదజల్లుతాయి. వీటి పువ్వుల రంగులు క్రీమ్ తెలుపు పసుపు , ఎరుపు , మరియు వైలెట్ మొదలుకుని ఉంటాయి. దత్తురా ఫాస్టుయొసాని దాదాపు వెంట్రుకలు లేని ఆకులు మరియు వృత్తాకారంలో ఉంటాయి.బిరుసైన పండ్లు కలిగి ఉంటాయి. వీటి మొక్కలు పెద్ద, నిటారుగా మరియు బలిసిన హెర్బ్ ,ఈ మొక్కలకు బ్రాంచ్డ్ టాప్ రూట్ వ్యవస్థను కలిగి వుంటుంది. వీటి ఆకులు సింపుల్, ప్రత్యామ్నాయంగా ఉంటాయి. మొత్తం లేదా లోతుగా తమ్మెలను వెంట్రుకలు లేకుండా కనిపిస్తాయి.
ఈ ఆకు ముదురు పచ్చ రంగులో ఉంటుంది. ఆకారం సూదికొనలతో నక్షత్ర ఆకారంలో ఉంటుంది. పరిమాణం మధ్యస్థం. ఈ చెట్టు గుబురుచెట్టు గా పెరుగుతుంది. దీని పుష్పాలు తెల్లగా, ఊదారంగు కలగలసి పొడవుగా సన్నగా ఉంటాయి.

ఈ పత్రి యొక్క ఔషధ గుణాలు

వ్యాధిగ్రస్తునికి శిరోముం డనం చేయించి ఈ ఆకుల రసాన్ని రెండు నెల లపాటు రోజూ మర్ధన చేస్తే వ్యాధి తగ్గుతుంది.
ఆస్తమాను తగ్గిస్తుంది
ఊపిరితిత్తుల సంబంధ సమస్యలను తగ్గిస్తుంది
మానసిక వ్యాధి నివారణకు ఇది అద్భు తంగా పనిచేస్తుంది.

వినాయక చవితి రోజు ఉమ్మెత్తను వినాయక వ్రత కల్ప విధానము లోని గణేశ పత్రపూజలో ఉపయోగిస్తారు.
ఉమ్మెత్తలో చాల రకాలున్నాయి. తెల్ల ఉమ్మెత్త/ నల్ల ఉమ్మెత్త అన్ని ఉమ్మెత్తలు విషపూరితాలె. చాల దుర్వాసన కలిగి వుంటాయి. వీటి కాయలు పెద్ద నిమ్మకాయంత పరిమాణం వుండి కాయ చుట్టు దట్టమైన ముళ్ళు కలిగి వుంటుంది. ఈ కాయలను కొన్ని ఔషదాలలో వుపయోగిస్తారు.

Tuesday, November 27, 2018

మనఊరు-మనచెట్టు

ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టులో ఫ్రెండ్స్ అనిమల్ ట్రస్ట్ వారు కోతులకు పండ్లు పంచడం జరిగింది. అలాగే మనఊరు-మనచెట్టు వారి ఆధ్వర్యంలో పెద్ద హనుమాన్ విగ్రహం పక్కన దానిమ్మ మొక్క నాటడం జరిగింది. 
#manaurumanachettu #duniyastra

Saturday, November 03, 2018

క్యారట్

పండ్లు , కందమూలాలు , కందమూలాలు , కందమూలాలు , మానవుడికి ప్రకృతి ప్రసాదించిన అపురూపమైన వరము .ఆయా సీజన్లలో పండే పండ్లను ఆరగించడం మనకు తరతరాలు గా తెలుసును . అన్నం తో అవసరం లేకుండా ప్రకృతిసిద్ధమైన పండ్లు , కూరగాయలు ఇతర త్రుణధాన్యాలను ఆహారం గా ఆహారముగా తీసుకుని జీవించినట్లయితే శరీరానికి కావససిన అన్నిరకాల పోషకాలు లభిస్తాయి ... ఇదే అసలు ఉత్తమమైన జీవన విధానమని పకృతి వైద్యుల నమ్మకం .
క్యారెట్ల లో అన్ని పోషకాల లోకెల్లా విటమిన్ ఎ ఎక్కువగా ఉంటుంది . విటమిన్ ఎ కంటి చూపును మెరుగుపరుస్తుంది . చర్మ సౌందర్యాన్ని పెంచుతుంది .
 విటమిన్ ఎ లోపము వల్ల వచ్చే వ్యాదులు :
  • రేచీకటి (NightBlindness),
  • జీరప్తాల్మియా(xerophtholmia) (కంటి పొరలు పొడిబారిపోవడం) ,
  • కెరటోమలేసియా (keratomalasia),
  • బైటాట్ స్పోట్స్ (BitotSpotsInEyes) ,
  • ఫ్రెనోడెర్మా (PhrenoDerma) (కీళ్ళ దగ్గర చర్మము ముళ్ళు లా తయారవడం),

క్యారట్లలో ఉండే ఫాల్ కారినాల్ .. కాన్సర్ ను నిరోదిస్తుంది ,-- ఉడక బెట్టి తినాలి . యాంటి ఆక్షిదేంట్ గా పనిచేసి శరీరము లోని చెడు పదార్ధాలను (FreeRadicles) తొలగిస్తుంది , శరీర వ్యాదినిరోధక శక్తి ని పెమ్పొందిస్తుడి , బంగారం స్వచ్ఛతను తెలుసుకోవడానికి క్యారట్స్‌లో కొలవాలి. ఆరోగ్యం సరిగ్గా లేకపోతేగంటకో క్యారట్ తినాలి. క్యారట్స్‌లో పోషకాలు పుష్కలం. కంటికి, ఒంటికి మేలు చేసే గుణాలు మెండు. రోజూ వంటలోకి ఓ క్యారట్ తురిమి వేయండి. ఇంకో క్యారట్‌ను తరిగి వండండి. నూనెలో వేసి డీప్ ఫ్రై చే యండి. వేయించకుండానే పెరుగులో కలిపేయండి. కంటిచూపును మెరుగుపరచే విటమిన్-ఎ పుట్టడానికి అవసరమైన బీటా-కెరోటిన్ క్యారట్‌లో పుష్కలంగా ఉంటుంది. క్యారట్ రేచీకటిని నివారిస్తుంది. ఒకవేళ ఆ సమస్య అప్పటికే ఉంటే దానికి చికిత్స చేస్తుంది. క్యారట్ గుండెపోటును, పక్షవాతాన్ని కూడా నివారిస్తుంది. ఎందుకంటే అందులోని యాంటీ ఆక్సిడెంట్స్, కెరొటినాయిడ్స్ కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి. అందుకే క్యారట్ ఓ క్యాన్సర్ పోరాటయోధుడు. ఉత్తమ యాంటీ-క్యాన్సర్ ఉద్యమ కార్యకర్త.
దీంతో పాటు సంతాన సాఫల్యతకు కూడా క్యారెట్ ఎంతో ఉపయోగపడుతుందని, ముఖ్యంగా పురుషుల్లో వీర్య కణాల కదలిక వేగంగా ఉండడానికి క్యారెట్ చాలా మేలు చేస్తుందని హార్వర్డ్ యూనివర్శిటీ పరిశోధకులు గుర్తించారు. దాదాపు 200 మంది యువకుల ఆహార అలవాట్లపై అధ్యయనం చేసిన శాస్త్రవేత్తలు ఈ నిర్ధారణకు వచ్చారు. ఆహారంలో పసుపు, నారింజ రంగు పళ్లు, కూరగాయలు తీసుకునే వారితో పోల్చితే అలాంటివి తీసుకోని వారిలో వీర్య కణాలు కదలిక తక్కువగా ఉందని గమనించారు. ముఖ్యంగా క్యారెట్ తీసుకోవడం వల్ల అండాల వైపు వీర్య కణాల కదలిక చాలా చురుగ్గా ఉందని కనుగొన్నారు. అలాగే, టమాటా తీసుకోవడం వల్ల కూడా ఆరోగ్యకరమైన వీర్యం వృద్ధి చెందుతుందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు.

క్యారెట్ లో మంచివి ;

నిండుగా ఆరెంజ్ కలర్ లో నిగనిగలాడే క్యరెట్లు తింటే మిగగా రంగులవి -- ఆకుపచ్చ , ఎరుపు , తెలుపు , పర్పుల్ వంటివి కంటే ఎక్కువ పరిరక్షణ కలుగుతుందని డచ్ పరిశోదకులు వారి పరిశోధనల వల్ల తెలుపుతున్నారు.

Monday, October 29, 2018

దోమల నియంత్రణకు మన ఇంటి గార్డెన్ లో ఉండాల్సిన 10 మొక్కలు ?

దోమల నియంత్రణకు మన ఇంటి గార్డెన్ లో ఉండాల్సిన 10 మొక్కలు  ?
మనఊరు-మనచెట్టు 

వర్షాకాలంలో బయట శిధిలాలలో ఉండే దోమలు విసుగును కలిగిస్తాయి. దోమ కుట్టటం వలన దురద మరియు మలేరియా వంటి వ్యాధులు వ్యాప్తి చెందుతాయి. ప్రజలు దోమలు కుట్టకుండా ఉండటానికి దోమల కాయిల్స్,దోమ వికర్షక క్రీములు, విద్యుత్ దోమ నిరోధకాలు మరియు హెర్బల్ దోమల లోషన్లు ఉపయోగిస్తారు. కొంత మందికి ఇవి పడక నాసికాకుహరం,చర్మం మరియు గొంతు సమస్యలు వస్తాయి. ప్రజలు దోమలను నియంత్రించడానికి రసాయనాలను ఉపయోగిస్తే ఆరోగ్యం మరియు పర్యావరణం మీద చెడు ప్రభావం కలుగుతుంది. మీరు సహజ మార్గం ద్వారా దోమల నియంత్రణ చేయాలి. అప్పుడు మీ పెరటిలో కొన్ని దోమ వికర్షక మొక్కలను పెంచాలి. ఈ దోమల వికర్షక మొక్కలు దోమలను దూరంగా ఉంచడానికి మరియు మీ యార్డ్ ప్రశాంతంగా ఉండటానికి సహాయపడతాయి. ఇక్కడ దోమలను నియంత్రించడానికి ఇంటిలో ఉండవలసిన కొన్ని మొక్కలు ఉన్నాయి.

రోజ్మేరీ,

రోజ్మేరీ రోజ్మేరీ మూలిక యొక్క నూనె ఒక సహజమైన దోమల నివారిణిగా వ్యవహరిస్తుంది. రోజ్మేరీ మొక్క 4 నుంచి 5 అడుగుల వరకు పొడవు పెరుగుతుంది. అలాగే నీలం పువ్వులు కలిగి ఉంటుంది. రోజ్మేరీ మొక్క వెచ్చని వాతావరణంలో బాగా పెరుగుతుంది. శీతాకాలంలో,ఈ మొక్క తట్టుకోవటానికి వెచ్చని నివాసం ఏర్పాటు చేయాలి. కాబట్టి ఒక కుండ లో రోజ్మేరీని పెంచి,శీతాకాలంలో మాత్రం ఇంట్లో ఉంచాలి. రోజ్మేరీని వంటలలో మసాలా కోసం వాడతారు. వెచ్చని నెలల్లో దోమలను నియంత్రించటానికి పెరటిలో రోజ్మేరీ మొక్క ఉంటే చాలు. అరకప్పు ఆలివ్ ఆయిల్ లో నాలుగు చుక్కల రోజ్మేరీ సుగంధ తైలం కలిపి చల్లని మరియు పొడి ప్రదేశంలో నిల్వ చేయాలి. దానిని అవసరమైనపుడు ఉపయోగించాలి.
తైలము గడ్డి
తైలము గడ్డి తైలము గడ్డి దోమల నియంత్రణ కోసం అద్భుతంగా ఉంటుంది. ఇది ప్రతి సంవత్సరం 2 m పొడవు పెరుగుతుంది. అలాగే లావెండర్ రంగు పువ్వులు పూస్తాయి. ఈ తైలము గడ్డి ఆయిల్ ను కొవ్వొత్తులు, పరిమళ ద్రవ్యాలు,లాంతర్లు మరియు ఇతర హెర్బల్ ఉత్పత్తుల తయారీలో ఉపయోగిస్తారు.దోమల వలన వచ్చే డెంగ్యూ జ్వరం నివారణకు కూడా తైలము గడ్డి సహాయపడుతుంది. దోమల నియంత్రణ కొరకు కొవ్వొత్తులు మరియు లాంతర్లలో క్రిమిసంహారిక తైలము నూనెను పోయాలి. తైలము గడ్డిలో యాంటీ ఫంగల్ లక్షణాలు ఉన్నాయి. తైలము ఆయిల్ చర్మం కోసం సురక్షితం మరియు మీరు ఏ కాలంలోనైనా రాసుకోవచ్చు. దీని వలన ఎటువంటి నష్టం కలగదు.
బంతి పువ్వు

బంతి పువ్వు బంతి పువ్వు అనేక కీటకాలు,మానవులు మరియు జంతువులు ఇష్టపడని విచిత్రమైన వాసన కలిగి ఉంటుంది. బంతి పువ్వు మొక్క 3 అడుగుల 6 అంగుళాలు వరకు పెరుగుతుంది. బంతిలో ఆఫ్రికన్ & ఫ్రెంచ్ అనే రెండు రకాలు ఉన్నాయి. ఇవిరెండు దోమల నివారిణిగా ఉన్నాయి. కూరగాయల మొక్కల సమీపంలో బంతి మొక్కలను వేస్తే అఫిడ్స్ మరియు ఇతర కీటకాలు దూరంగా పోతాయి. బంతి పువ్వు పసుపు, ముదురు నారింజ మరియు ఎరుపు మొదలైన రంగులలో పూస్తుంది. బంతి మొక్క పెరుగుదలకు ఎండ అవసరం ఉంటుంది. దోమల నియంత్రణకు పెరడు,వాకిలి కుండలు మరియు తోటలలో బంతి మొక్కలను పెంచాలి.

కాత్నిప్

కాత్నిప్ కాత్నిప్ అనేది పుదీనా కుటుంబానికి అనుసంధానించబడిన ఒక మూలిక. దీనిని ఇటీవలే దోమల నివారిణిగా ప్రకటించారు. తాజా అధ్యయనం ప్రకారం,ఇది DEET పోలిస్తే 10 రెట్లు ఎక్కువ సమర్థవంతంగా పనిచేస్తుంది. ఈ మొక్క ఎండ లేదా పాక్షిక నీడ ప్రాంతంలో నాటితే 3 అడుగుల ఎత్తు పెరిగే శాశ్వత వృక్షం. ఈ మొక్కకు తెలుపు లేదా లవెందర్ పుష్పాలు పూస్తాయి. దోమలు మరియు ఇతర కీటకాలను నియంత్రించడానికి,పెరడు లేదా డెక్ సమీపంలో వీటిని పెంచాలి. పిల్లులకు ఈ వాసన అంటే చాలా ఇష్టం. అందువల్ల ఈ మొక్క చుట్టూ కంచె వేయాలి. దీనిని దోమలను నియంత్రించడానికి అనేక రూపాల్లో ఉపయోగించవచ్చు. మీరు తాజా ఆకుల చూర్ణం లేదా చర్మంపై ద్రవ రూపంలో ఉపయోగించవచ్చు.

అగేరతుం
అగేరతుం అగేరతుం మొక్క మరొక దోమల నివారిణి వృక్షం. ఈ మొక్కకు కౌమరిన్ సృష్టించే లేత నీలం మరియు తెలుపు పుష్పాలు పూస్తాయి. ఇవి దోమల నివారణకు భయంకరమైన వాసనను కలిగి ఉంటాయి. కౌమరిన్ ను సాధారణంగా కమర్షియల్స్ దోమ నిరోధకాలు మరియు పెర్ఫ్యూమ్ పరిశ్రమలో ఉపయోగిస్తారు. దీనిని చర్మం మీద ఎప్పుడు రుద్దకూడదు. అగేరతుం వేసవి అంతా లేదా పాక్షిక సూర్యుడు ఉన్న ప్రదేశంలో పెరుగుతుంది.
హార్స్ మింట్

హార్స్ మింట్ కూడా దోమలు నియంత్రణకు సహాయపడుతుంది. హార్స్ మింట్ ప్రత్యేక శ్రద్ధ అవసరం లేని శాశ్వత వృక్షం. దీని యొక్క వాసన క్రిమిసంహారిక తైలము వంటిది. ఇది వెచ్చని వాతావరణం మరియు ఇసుక నేలలో బాగా పెరుగుతుంది. ఈ మొక్కకు పింక్ పువ్వులు పూస్తాయి. హార్స్ మెంట్ లో సహజ శిలీంద్ర నిర్మూలన,బాక్టీరియా లక్షణాలు మరియు క్రియాశీల పదార్ధాలు ఉంటాయి. దీనిని ఫ్లూ చికిత్సకు కూడా ఉపయోగిస్తారు.

వేప

వేప వేప మొక్క బలమైన దోమ నివారిణి మొక్క అని చెప్పవచ్చు. వేప మొక్క క్రిమి వికర్షణ లక్షణాలను కలిగి ఉంటుంది. మార్కెట్ లో అనేక వేప ఆధారిత దోమ నిరోధకాలు మరియు బామ్స్ అందుబాటులో ఉన్నాయి. దోమలను నియంత్రించడానికి,మీరు కేవలం మీ పెరటిలో వేప మొక్కను వేయవచ్చు. వేప ఆకులను మండించుట లేదా కిరోసిన్ దీపాలు లేదా క్రిమిసంహారిక తైలము మంటలకు వేప నూనెను జోడించవచ్చు. మీ చర్మం పై వేప నూనెను రాసుకుంటే దోమలు దూరంగా పోతాయి. వేప మొక్కలో సహజ దోమల నివారిణి లక్షణాలు మరియు మలేరియా మీద వ్యతిరేకంగా పోరాడటానికి చాలా ప్రభావవంతమైనది.

లావెండర్
లావెండర్ లావెండర్ దోమల నివారణకు ఒక అద్భుతమైన మొక్క. లావెండర్ మొక్కను అతి తక్కువ రక్షణతో సులభంగా పెంచవచ్చు. ఇది 4 అడుగుల ఎత్తు పెరుగుతుంది. అలాగే వేడి వాతావరణం అవసరం. ఉచిత దోమల ద్రావణం చేయడానికి,నీటిలో కొన్ని చుక్కల లావెండర్ ఆయిల్ వేసి చర్మానికి రాసుకోవాలి. దోమలను నియంత్రించడానికి,సీటింగ్ ప్రాంతాల్లో లావెండర్ మొక్కల కుండలను ఉంచండి. దోమలు దగ్గరకు రాకుండా ఉండటానికి మెడ,మణికట్లు మరియు చీలమండల వంటి ప్రాంతాలలో లవెందర్ ఆయిల్ దరఖాస్తు చేసుకోవచ్చు.

తులసి

తులసి తులసి మొక్క కూడా దోమల నివారిణి మొక్క. తులసిని నలపకుండానే మంచి వాసన వచ్చే మూలికలలోఒకటి. దోమలను నియంత్రించటానికి మీ పెరటిలో తులసి మొక్కను పెంచండి. దోమలు దగ్గరకు రాకుండా తులసి ఆకులను పేస్ట్ చేసి చర్మానికి రాయండి. తులసిని ఆహారంలో వాసన కోసం వాడతారు. మీరు దోమలను నియంత్రించటానికి సిన్నమోన్ తులసి,నిమ్మ తులసి మరియు పెరువియన్ తులసి వంటివి బలమైన వాసన కలిగి ఉత్తమంగా పనిచేస్తాయి.

నిమ్మ ఔషధతైలం

నిమ్మ ఔషధతైలం నిమ్మ ఔషధతైలం కూడా దోమలను దగ్గరకు రాకుండా చేస్తుంది. నిమ్మ ఔషధతైలం మొక్క వేగంగా పెరుగుతుంది. ఇది గదిలో బాగా వ్యాప్తి చెందుతుంది. నిమ్మ ఔషధతైలం ఆకులలో సిత్రోనేల్లాల్ మిశ్రమాలు సమృద్దిగా ఉంటాయి. సిత్రోనేల్లాల్ మిశ్రమాన్ని కమర్షియల్స్ దోమల నివారిణిలో ఉపయోగిస్తారు. 38 శాతం సిత్రోనేల్లాల్ కలిగిన అనేక రకాల నిమ్మ ఔషధతైలం మొక్కలు ఉన్నాయి. దోమల నియంత్రణకు మీ పెరటిలో నిమ్మ ఔషధతైలం మొక్కను పెంచండి. దోమలు దగ్గరకు రాకుండా ఉండాలంటే నిమ్మ ఔషధతైలం మొక్క ఆకుల చూర్ణంను చర్మం పై రాసుకోవాలి.

Thursday, August 30, 2018

మారేడు

మారేడు 8 నుండి 10 మీటర్ల ఎత్తు వరకు పెరిగే వృక్షం. దీని ఆకులు సుగంధ భరితంగా ఏదో దివ్యానుభూతిని కలుగజేస్తూ ఉంటాయి. దీని పువ్వులు ఆకుపచ్చ రంగుతో కూడిన తెలుపు రంగులో ఉండి, కమ్మని వాసనని కలిగి ఉంటాయి. మారేడు కాయలు గట్టిగా ఉంటాయి. విత్తనాలు చాలా ఉంటాయి. మారేడు గుజ్జు కూడా సువాసనగా ఉంటుంది.
ఈ పత్రి ఉల్లేఖన ఆయుర్వేదంలో ఉంది. ఇది అతిసార వ్యాధికి, మొలలకు, చక్కెర వ్యాధి రోగాల నివారణకు ఉపయోగపడుతుంది.
భారతదేశంతో పాటుగా ఆసియా దేశాలలో చాలా వరకూ మారేడు చెట్టు పెరుగుతుంది. ఈ పత్రి చెట్టు యొక్క శాస్త్రీయ నామం మారేడు.
ఈ పత్రి యొక్క ఔషధ గుణాలు :

అతిసార వ్యాధికి దీని పండ్ల రసం చాలా మంచి మందు.
మొలలకు ఇది మంచి ఔషధము.
దీని ఆకుల రసము చక్కెర వ్యాధి నివారణకు చాలా మంచిది

https://twitter.com/Im_chettu
ఈ పత్రి సుగంధభరితంగా ఉంటుంది.

ఖనిజాలు,విటమినులు,చాలా ఉంటాయి. కాల్షియంఫాస్పరస్ఇనుముకెరోటిన్, బి-విటమిన్, సి-విటమిను ముఖ్యమైనవి. మారేడు ఆకులలో, పళ్లలో చాలా ఔషధ గుణాలు ఉన్నాయి.
మారేడు పండ్లు, కాయలు, బెరడు, వేళ్ళు, ఆకులు, పూవులు ఆన్నీ కూడా ఔషధములుగా ఉపయోగపడతాయి. బిల్వ వృక్షములో ప్రతి భాగము మానవాళికి మేలు చేసేదే.
మారేడుదళము గాలిని, నీటిని దోషరహితము చేస్తుంది. ఉపయోగాలు
మారేడు పండ్లు, కాయలు, బెరడు, వేళ్ళు, ఆకులు, పూవులు ఆన్నీ కూడా ఔషధములుగా ఉపయోగపడతాయి.
అతిసార వ్యాధికి దీని పండ్ల రసం చాలా మంచి మందు.
ఆయుర్వేదములో వాడు దశమూలము లలో దీని వేరు ఒకటి.
మొలలకు ఇది మంచి ఔషధము.
దీని ఆకుల రసము చక్కెర వ్యాధి నివారణకు చాలా మంచిది.
బిల్వ ఆకులు జ్వరాన్ని తగ్గిస్తాయి . . . బిల్వ ఆకుల కషాయము తీసి అవసరము మేరకు కొంచం తేనె చుక్కలు కలిపి తాగితే జ్వరము తగ్గుతుంది .
కడుపు లోను, పేగుల లోని పుండ్లు తగ్గించే శక్తి బిల్వ ఆకులకు, ఫలాలకు ఉన్నది,
మలేరియాను తగ్గించే గుణము బిల్వ ఆకులకు, ఫలాలకు ఉన్నది,
Related imageబిల్వ ఫలం నుండి రసం తీసి దానికి కొద్దిగా అల్లం రసం కలిపి తాగితే రక్తసంబంధిత ఇబ్బందులనుండి ఉపశమనం కలుగుతుంది .
బిల్వ వేరు, బెరడు, ఆకులను ముద్దగా నూరి గాయాల మీద అద్దితే త్వరగా మానుతాయి.
క్రిమి, కీటకాల విషానికి విరుగుడుగా పనిచేస్తుంది .
మారేడు లేదా బిల్వము  హిందూ దేవతలలో ఒకడైన శివపూజలో ముఖ్యం. * శివుని బిల్వ పత్రములతో పూజించుట శ్రేష్టము. బిల్వ వృక్షము సాక్షాత్తు శివస్వరూపమని దేవతలు భావించెదరు. శివపురాణంలో బిల్వపత్రం యొక్క మహిమను తెలిపే కథ ఉంది. ఒకనాడు శనిదేవుడు, శివుని దర్శించుటకై కైలాసమునకేగి పార్వతీ పరమేశ్వరులను దర్శించి భక్తితో స్తుతించాడు. అంతట శివుడు శనిదేవుని విధి ధర్మమును పరీక్షించు నెపమున నీవు నన్ను పట్టగలవా? అని ప్రశ్నించాడు. అందుకు శని మరునాటి సూర్యోదయము నుండి సూర్యాస్తమయ కాలము వరకూ శివుని పట్టి ఉంచగలనని విన్నవించాడు. అంత శివుడు మరునాటి ఉషోదయ కాలమున బిల్వవృక్షరూపము దాల్చి, ఆ వృక్షమునందు అగోచరముగా నివసించాడు. మహేశ్వరుని జాడ తెలియక పార్వతీదేవితో సహా దేవతలందరు ముల్లోకములనూ గాలించారు. వారెవ్వరికి ఆ మహేశ్వరుని జాడగానీ, శనిదేవుని జాడగానీ తెలియలేదు. ఆనాటి సూర్యాస్తమయ సంధ్యాకాలము గడచిన పిదప మహేశ్వరుడు బిల్వ వృక్షము నుండి సాకార రూపముగా బయలు వెడలినాడు. మరుక్షణమే శనిదేవుడు అచట ప్రత్యక్షమైనాడు. "నన్ను పట్టుకోలేకపోయావే?" అని పరమేశ్వరుడు ప్రశ్నించగా శనిదేవుడు నమస్కరించి "నేను పట్టుటచేతనే గదా, లోకారాధ్యులు తమరు ఈ బిల్వ వృక్షరూపముగా ఇందులో దాగి వసించినారు" అన్నాడు. శనిదేవుని విధి నిర్వహణకు, భక్తి ప్రపత్తులకు మెచ్చిన శివుడు "ఈశ్వరుడినైన నన్నే కొద్దికాలము పట్టి, నాయందే నీవు వసించి యుండుటచేత నేటినుండి నీవు 'శనీశ్వరుడు' అను పేర ప్రసిద్ధి నొందగలవు. అంతట శని దోషమున్న వారు, ఆ దోషమున్నవారు, ఆ దోషపరిహారార్ధము నన్ను బిల్వ పత్రములలో పూజించిన దోష నివృత్తి జరుగును. బిల్వ పత్ర పూజ చేత శివభక్తులైన వారిని ఈ శనీశ్వరుడు బాధించడు' అని అభయమిచ్చెను.
https://twitter.com/Im_chettu

లక్ష్మీదేవి తపస్సు వలన బిల్వవృక్షము పుట్టినది. ఆమెను 'బిల్వనిలయా' అని పిలుస్తారు. * బ్రహ్మ వర్చస్సు పొందడానికి, సూర్యుని మెప్పుకోసం చేసే కామ్య యాగంలో బిల్వకొయ్యను యూప స్తంభముగా నాటుతారు. అశ్వమేధ యాగములో ఇలాంటి బిల్వయూపములను ఆరింటిని ప్రతిష్టించుతారు.
మారేడు దళాన్ని సోమవారము, మంగళ వారము, ఆరుద్రానక్షత్రము, సంధ్యాసమయము, రాత్రి వేళలందు, శివరాత్రి రోజున, సంక్రాంతి రోజున, పండుగల సమయాన కోయకూడదు. కనుక ఈ దళాలను ముందు రోజు కోసి, భద్రపరచిన దళాలతో పరమశివుని పూజిస్తారు.
మారేడు దళము శివార్చనకు పనికి వచ్చే, శివుడికి అతి ప్రీతికరమైన పత్రము.
మారేడుదళము గాలిని, నీటిని దోషరహితము చేస్తుంది.

మారేడు పండ్లు, కాయలు, బెరడు, వేళ్ళు, ఆకులు, పూవులు ఆన్నీ కూడా ఔషధములుగా ఉపయోగపడతాయి. అతిసార వ్యాధికి దీని పండ్ల రసాయనం చాలా మంచి మందు. ఆయుర్వేదములో వాడు దశమూలము లలో దీని వేరు ఒకటి. మొలలకు ఇది మంచి ఔషధము. దీని ఆకుల రసము చక్కెర వ్యాధి నివారణకు చాలా మంచిది.
మారేడు పండ్ల వాసన చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. దీనిని శరీరానికి చల్లదనాన్నిచ్చే గుణం ఉంది. అలాగే విరేచనకారిగా కూడా పనిచేస్తుంది.
సగం పండిన పండు జీర్ణ శక్తిని పెంచుతుంది. బాగా పండిన పండులోని గుజ్జు రోజూ తింటే దీర్ఘకాలికంగా మలబద్ధ సమస్యతో సతమతమయ్యే వారికి ఎంతో ఉపయోగపడుతుంది.
మారేడు గుజ్జుని పాలు, పంచదారతో కలిపి తీసుకుంటే వేసవి పానీయంగా కూడా బావుంటుంది. ప్రేవులను శుభ్రపరచడమే కాకుండా, వాటిని శక్తివంతంగా కూడా తయారుచేస్తుంది.
మారేడులో ఉన్న విచిత్రం ఏమిటంటే బాగా పండిన పండు విరేచనకారిగా ఉపయోగపడితే, సగంపండిన పండు విరేచనాలు ఆగటానికి ఉపయోగపడుతుంది.
జిగురు విరేచనాలవుతున్నా సగం పండిన మారేడు పండు ఎంతో ఉపకరిస్తుంది.
విరేచనాలు తగ్గడానికి గుజ్జుగా కంటే ఎండబెట్టి, పొడుముగా చేసినది బాగా ఉపకరిస్తుంది.
మారేడు ఆకుల కషాయాన్ని కాచుకుని తాగితే హైపవర్ ఎసిడిటీ లాంటి గ్యాస్ట్రిక్ సమస్యలు తగ్గుతాయి.
మారేడు ఆకుల కషాయాన్ని నువ్వుల నూనెతో కలిపి కాచి, దానిని తలస్నానానికి ముందుగా రాసుకుంటే తలస్నానం చేసిన తర్వాత జలుబు, తుమ్ములు వచ్చేవారికి బాగా ఉపయోగపడుతుంది.
ఈ పత్రితో ఉన్న ఇతర ఉపయోగాలు 
1.మారేడు పండ్ల వాసన చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. దీనిని శరీరానికి చల్లదనాన్నిచ్చే గుణం ఉంది. అలాగే విరేచనకారిగా కూడా పనిచేస్తుంది.
2.సగం పండిన పండు జీర్ణ శక్తిని పెంచుతుంది. బాగా పండిన పండులోని గుజ్జు రోజూ తింటే దీర్ఘకాలికంగా మలబద్ధ సమస్యతో సతమతమయ్యే వారికి ఎంతో ఉపయోగపడుతుంది.
3.విరేచనాలు తగ్గడానికి గుజ్జుగా కంటే ఎండబెట్టి, పొడుముగా చేసినది బాగా ఉపకరిస్తుంది.

https://twitter.com/Im_chettu










Sunday, August 12, 2018

మందారం

Chinese Hibiscus.JPGమందార లేదా మందారం ఒక అందమైన పువ్వుల చెట్టు. ఇదిమాల్వేసి కుటుంబానికి చెందినది. ఇది తూర్పు ఆసియాకు చెందినది. దీనిని చైనీస్ హైబిస్కస్ లేదా చైనా రోస్ అని కూడా అంటారు. దీనిని ఉష్ణ మరియు సమసీతోష్ణ ప్రాంతాలలో అలంకరణ కోసం పెంచుతారు. పువ్వులు పెద్దవిగా సామాన్యంగా ఎరుపు రంగులో సువాసన లేకుండా ఆకర్షణీయంగా ఉంటాయి. వీనిలో చాలా సంకరజాతులు తెలుపు, పసుపు, కాషాయ, మొదలైన వివిధ రంగులలో పూలు పూస్తున్నాయి. ముద్ద మందారం అనే వాటికి రెండు వరుసలలో ఆకర్షక పత్రావళి (petals) ఉంటాయి. అందమైన పుష్పాలున్నా ఇవి మకరందాన్ని గ్రోలే కీటకాలు మరియు పక్షుల్ని ఆకర్షించవు.
    Hibiscus pink.jpg
  • నక్షత్రాకార కేశాలతో పెరిగే సతత హరితమైన పొద.     
  • అండాకారంలో ఉన్న సరళ పత్రాలు.
  • పత్రగ్రీవాలలో ఏకాంతంగా ఏర్పడిన ఎరుపు రంగు పుష్పాలు.
దీర్ఘవృత్తాకార ఫలం.

మందారం మలేషియా దేశపు జాతీయ పుష్పం. దీనిని Bunga Raya అని మలయ లోను, dahonghua 大红花 అని చైనీస్ లోను, Sembaruthi-செம்பருத்தி అని తమిళం లోను, Gurhal/orhul అని హిందీ లోను, Chemparathy అని మళయాళం లోను, Wada Mal అని సింహళం భాషలలో పిలుస్తారు.

మందార పువ్వులు మరియు ఆకులు శిరోజాల సౌందర్య పోషణలో ఉపయోగిస్తారు.
మందార పుష్పాలను పసిఫిక్ ద్వీపాలలో సలాడ్ లో వేసుకొని తింటారు.
భారతదేశంలో పువ్వులను బూట్లు పాలిష్ చేసుకోడానికి మరియు దేవతల పూజలోను వాడతారు.
స్త్రీలకు పువ్వు ఒక ఆభరణము, అలంకారము మరియు శుభసూచికము.

Friday, August 10, 2018

తమలపాకు

తమలపాకు లేదా నాగవల్లి భారతదేశంలో విరివిగా ఉపయోగించే తాంబూలంలో ముఖ్యమైన భాగం. ఈ ఎగబ్రాకే మొక్కను తేమగల వేడి ప్రదేశాలలో పెంచుతారు. ఇది పైపరేసికుటుంబానికి చెందినది. దీని యొక్క ఔషథ ధర్మముల మూలంగా కొద్దిగా ఉద్దీపనలు కలిగించేదిగా ముఖ్యమైనది.

సాగుచేయు విధానం

తమలపాకు దక్షిణ మరియు అగ్నేయ ఆసియాలోనూ, పాకిస్తాన్] నుండి న్యూగినియా
 వరకూ విస్తృతంగా పండిస్తారు. బంగ్లాదేశ్ లో రైతులు దీనిని "బరుయి" అని పిలుస్తారు. ఈ తమలపాకులు పండించే క్షేత్రాన్ని "బరౌజ్" అని పిలుస్తారు. ఈ "బరౌజ్" వెదురు కర్రలతోనూ మరియు కొబ్బరి ఆకులతోనూ కంచె కడతారు.

మే-జూన్ నెలలలో భూమిని బాగా దున్ని చదునుచేసి ఎకరాకు 16-20 కిలోల అవిశ విత్తనాలను సాలుకు సాలుకు మీటరు దూరంలో ఉంచి సాలులో వత్తుగా విత్తాలి. ఈ అవిశ విత్తనాలను ఉత్తరం, దక్షిణం దిక్కులకు మాత్రమే విత్తుకోవాలి.తమలపాకు సంవత్సర వర్షపాతం 750-1500 మి.మీ. కలిగి, 10-40 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత గలిగిన ప్రాంతాలు అనువైనవి. నీరు ఇంకే సారవంతమైన లేటరైట్ మరియు ఎర్ర గరప నేలలు వీటి సాగుకు అనువైనవి ఆంధ్రప్రదేశ్ లో ఎక్కువగా ఆధిక దిగుబడిని ఇచ్చే కపూరి రకాలను పండిస్తున్నారు.
విత్తిన 2 నెలల తర్వాత సాళ్ళ మధ్య మట్టిని చెక్కి అవిశ మొదళ్ళ వద్ద వేసి కయ్యలు చేసి వాటి మధ్య 50 సెం.మీ. లోతు 20 సెం.మీ. వెడల్పు గల గుంతలను 20 సెం.మీ. ఎడంలో తీసి ఎకరాకు 20,000 తమలపాకు తల తీగలను 6-8 కణుపులు ఉండేటట్లు ఎన్నుకొని తీగలను నాటే ముందు 0.5 % బోర్డో మిశ్రమం+250 పి.పి.యం స్ట్రెప్టోసైక్లిన్ మిశ్రమంలో 10 నిమిషాలు శుద్ధిచేసి నాటుకోవాలి. ఈ విత్తనపు తీగలను ఆరోగ్యవంతమైన తోట నుండి సేకరించాలి. నాటడానికి ముందుగా నీరు పెట్టే కాలువలు, మురుగునీరు కాలువలను చేసుకోవాలి. చలి మరియు ఎండాకాలాల్లో తోటల చుట్టూ గాలులు సోకకుండా దడలు కట్టుకోవాలి.
తీగలు నాటిన మొదటి ముడు రోజుల వరకు రెండు పూటలా నీరు కట్టాలి. తర్వాత రోజూ ఒక పూట (సాయంత్రం) మాత్రమే కట్టాలి. ఆ తర్వాత రోజు మార్చి రోజు 3 సార్లు సాయంత్రం వేళ నీరు కట్టాలి. తర్వాత 10 రోజుల కొకసారి ఒక తడి చొప్పున నీరు పెట్టాలి. వేసవి కాలంలో 2-3 రోజులకొకసారి తడి ఇవ్వాలి.
చిగురించిన తీగలను, పెరగడానికి మొదలైన 15 రోజులకు జమ్ముతో అవిశ మొక్కలను కట్టి ప్రాకించాలి. ఈ పనిని 15-20 రోజుల కొకసారి చేయాలి. వేగంగా వీచే గాలులకు అవిశ మొక్కలు వంగే ప్రమాదమం ఉండడం వలన వీటిని ఒకదానికొకటి తాడుతో కట్టి, సాలు చివర నాటిన వెదురు గడలకు కట్టాలి. సరిపడేటంత వెలుతురు, నీడ ఉండేలా అవిశ కొమ్మలను కత్తిరించుకోవాలి. తెగులు సోకిన ఆకులను, తీగలను ఎప్పటికప్పుడు ఏరి కాల్చివేయాలి. రెండు సంవత్సరాల కొకసారి మొక్కజొన్నతో పంట మార్పిడి చేయాలి.
తీగ నాటే ముందు దుక్కిలో ఎకరాకు 40 కిలోల సూపర్ ఫాస్ఫేట్ రూపంలో భాస్వరం, 40 కిలోల పొటాష్ వేయాలి. తీగ నాటిన 2 నెలల నుండి నత్రజనిని ఎకరాకు 80 కిలోలు, వేపపిండి + యూరియా 1:1 నిష్పత్తిలో సంవత్సరానికి 4 నుండి 6 దఫాలుగా వాడాలి. ఎకరాకు ఒక టన్ను చొప్పున జిప్సం వేసుకోవాలి.
నాటిన 2 నెలలకు ఆకులు కోతకు వస్తాయి. తర్వాత ప్రతి నెల ఆకులకు ఇనుప గోరు సహాయంతో కోయాలి. మొదటి సంవత్సరంలో తోట నుండి ఎకరాలు 30,000 నుండి 40,000 పంతాలు (పంతం అంటే 100 ఆకులు), రెండవ సంవత్సరంలో 40,000 పంతాల దిగుబడి వస్తుంది.

తుని తమలపాకు

ఆంధ్ర దేశంలో తుని తమలపాకు సుప్రసిద్ధం. తునికి సమీపంలో ఉన్న సత్యవరంలో ఎన్నో తమలపాకు తోటలు ఉండేవి. ఈ సత్యవరం ఆకులు చిన్నగా, లేతగా (కవటాకులు) మృదువుగా, కొద్దిగా కారంగా ఉండి ఎంతో ప్రాముఖ్యం పొందాయి. కాకినాడ నూర్జహాన్ కిళ్లీలో తుని తమలపాకు లేకపోతే అది నూర్జహాన్ కిళ్లీ కానేకాదు. విజయనగరం ఆకులు కొంచెం పెద్దగా, దళసరిగా, మృదుత్వం తక్కువ కలిగి ఉంటాయి.

హిందూ మతంలో తమలపాకులు

ప్రపంచంలోనే అత్యంత పురాతన మతం హైందవ మతం. హిందూ సంస్కృతి ఏదో రూపంలో ప్రకృతిని పూజించటం. ఆరాధించటానికి ప్రాధాన్యతనిచ్చింది. మనకు సంబంధించిన ఏ పండుగ తీసుకున్నా అందులో ప్రకృతి ఆరాధన మిళితమై వుంటుంది. ఉగాది పండుగకు వేపచెట్టు, సంక్రాంతి పండుగకు ధాన్యరాశులు, పశు సంతతి పట్ల ప్రేమ చూపటం... అలాగే వినాయక చవితి అంటే నానావిధ ఫల.పత్ర, పుష్పాలతో స్వామిని అర్చించటం వుంటుంది. ఇలాంటి విశిష్ట సంస్కృతి మరి ఏ ఇతర మతంలోనూ కనబడదు. ఇక ప్రతి పండుగలో, ప్రతి శుభ సందర్భంలో తాంబూలానికి అగ్రస్థానం ఉంటుంది. హిందూ సంస్కృతిలో తాంబూలానికి - అంటే తమలపాకులకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. కొందరు దేవుళ్ళకి నిర్ణీత సంఖ్యలో తమలపాకులతో పూజలు చేస్తారు. తమలపాకుల తాంబూలం కూడా మన సంస్కృతిలో విశిష్ట స్థానం ఆక్రమించింది. ఇలా ఆయర్వేదం కూడా ఆరోగ్యానికి తమలపాకు సేవనాన్ని సూచిస్తుంది. అందరు దేవుళ్లకి తమలపాకులతో పూజలు చేయటం ఉన్నప్పటికి. ఆంజనేయస్వామికి ఆకు పూజ అత్యంత ప్రీతికరమైనది అని చెబుతారు. శత పత్ర పూజ చేస్తే వివిధ దోషాలకు పరిహారం చెల్లించినట్టే అని ఒక నమ్మకం ఉంది. వివిధ నోములు, వ్రతాలు, శుభ కార్యాలు జరిగినప్పుడు అరటిపళ్ళు. వస్త్రంతో పాటు రెండు తమలపాకులు కూడా ఇస్తారు.

ఉపయోగాలు

  • తమలపాకులను పూజ చేయునప్పుడు దేవునిముందు వుంచు కలశములో ఉంచుతారు.
  • తాంబూలములో ఉపయోగిస్తారు. భోజనానంతరం తాంబూల సేవనము మన సంప్రదాయం.
  • తమలపాకుల రసమును గొంతునొప్పి నివారణకు ఉపయోగిస్తారు.
  • శ్వాసకోశ వ్యాధుల నివారణకై ఈ ఆకులను నూనె రాసి కొద్దిగా వేడిచేసి ఛాతీపై ఉంచుతారు.
  • తమలపాకులకు నేయి రాసి గాయాలకు కట్టుకడతారు.
  • తమలపాకుల రసమును చెవిలో పిండిన చెవినొప్పి తగ్గిపోవును.
  • అపస్మారకమును నివారించుటకు తమలపాకుల రసమును పాలతో కలిపి త్రాగించెదరు.

ఆరోగ్యపరమైనవి

  1. ఆధ్యాత్మిక సంబంధమైన విషయాలను పక్కన పెడితే, శరీరానికి తాంబూల సేవనం చాలా ఉపయోగకరమైనది. ఎముకలకు మేలు చేసే కాల్షియం, ఫోలిక్ యాసిడ్, ఎ విటమిన్. సి.విటమిన్ లు తమలపాకులో పుష్కలంగా ఉన్నాయి. తాంబూలం రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. ఫైబర్ - అంటే పీచు పదార్థం తమలపాకులో చాలా ఎక్కువగా వుంటుంది. ఆకుకూరలు ఏవిధంగా అయితే జీర్ణవ్యవస్థకు మేలు చేస్తాయో తమలపాకులు కూడా అలాగే, అంతకంటే ఎక్కువగా పని చేస్తాయి. సున్నం, వాక్క తదితర కృత్రిమ పదార్థాలను చేరిస్తే మాత్రం తమలపాకు శరీరానికి హానికరంగా మారుతుందని గ్రహించాలి.
  2. తమలపాకు యాంటాక్సిడెంట్‌గా పనిచేస్తుంది. అంటే ముసలితనపు మార్పులను కట్టడి చేస్తుందన్నమాట.
  3. నూనెలూ ఇతర తైల పదార్థాలూ ఆక్సీకరణానికి గురై చెడిపోవడాన్ని ‘ర్యాన్సిడిటి’ అంటారు. తమలపాకు ఈ ప్రక్రియను అడ్డుకుంటుంది- తైల పదార్థాలు చెడిపోవడానికి గురికాకుండా ఉంచుతుంది. నువ్వుల నూనె, ఆవనూనె, పొద్దుతిరుగుడు నూనె, వేరుశనగ నూనె... ఇలాంటి నూనెలు చెడిపోకుండా వుండాలంటే వాటిల్లో తమలపాకులను వేసి నిల్వచేయండి.
  4. తమలపాకులో ‘చెవికాల్’ అనే పదార్థం ఉంటుంది. ఇది బ్యాక్టీరియా పెరుగుదలను కట్టడి చేస్తుందని పరిశోధన.
  5. తమలపాకులో ఉండే స్థిర తైలం (ఎసెంషియల్ ఆయిల్) ఫంగస్ మీద వ్యతిరేకంగా పనిచేసి, అదుపులో ఉంచినట్లు పరిశోధనల్లో తేలింది.
  6. ఒక ముఖ్య విషయం. తమలపాకును తొడిమతో సహా తింటే మహిళల్లో వంధ్యత్వం వచ్చే అవకాశం ఉంటుందని పరిశోధకులు గమనించారు. కాబట్టి సంతానంకోసం ప్రయత్నించేవారు తమలపాకును తొడిమ తొలగించి వాడుకోవాలి.
  7. తమలపాకు ఔషధం లాంటిది. ఔషధాల మాదిరిగానే దీనినీ పరిమితంగానే వాడుకోవాలి. ఈ సందర్భంగా తమలపాకు నేపథ్యంగా జరిగిన ఒక అధ్యయనం గురించి ప్రస్తావించాలి. రోజుకు 5-10 తమలపాకులను 2 ఏళ్లపాటు తినేవారు తమలపాకులకు డ్రగ్స్ మాదిరిగా బానిసలవుతారని ఇటీవల జరిగిన తాజా అధ్యయనంలో తేలింది.
  8. అధిక రక్తపోటు కలిగినవారు తాంబూలాన్ని యధేచ్ఛగా వాడకూడదు- తాంబూలాన్ని తయారుచేసేటప్పుడు సున్నం కలుపుతారు కాబట్టి ఈ పదార్థం రక్తనాళాల మీద, రక్తసరఫరామీద వ్యతిరేక ప్రభావం చూపుతుంది.
  9. తాంబూలానికి పొగాకును కలిపి తింటే ‘సబ్‌మ్యూకస్ ఫైబ్రోసిస్’ వంటి ప్రమాదకరమైన నోటి వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది. సబ్‌మ్యూకస్ ఫైబ్రోసిస్ అనేది నోటి క్యాన్సర్‌కి ముందు స్థితి.
  10. తమలపాకు, సున్నం, వక్క... ఇవి మూడూ చక్కని కాంబినేషన్. సున్నంవల్ల ఆస్టియోపోరోసిస్ (ఎముకలు గుల్లబారటం) రాకుండా ఉంటుంది; తమలపాకు రసం సున్నంలోని క్యాల్షియాన్ని శరీరాంతర్గత భాగాల్లోకి చేరవేస్తే తమలపాకుకు చేర్చి వక్కపొడి లాలాజలాన్ని విడుదలయ్యేలా చేసి అరుగుదలకు సహాయపడుతుంది.
  11. ఔషధంగా తమలపాకుని వాడుకోదలిస్తే, రసం పిండి 1-2 చెంచాల మోతాదులో తీసుకోవాలి.
  12. ప్రతిరోజూ 7 తమలపాకులను ఉప్పుతో కలిపి ముద్దగా నూరి వేడి నీళ్లతో తీసుకుంటే బోధ వ్యాధిలో చక్కని ఫలితం కనిపిస్తుంది.
  13. ప్రతిరోజూ రెండు నెలలపాటు ఒక తమలపాకును పది గ్రాముల మిరియం గింజలను కలిపి తిని వెంటనే చన్నీళ్లు తాగుతుంటే స్థూలకాయులు సన్నగా నాజూగ్గా తయారవుతారు.
  14. స్వర్ణక్షీరి, విడంగాలు, ఇంగిలీకం, గంధకం, చక్రమర్ధ, చెంగల్వకోష్టు, సింధూరం వీటిని ఉమ్మెత్త ఆకులతోనూ, వేప చెట్టు బెరడుతోనూ, తమలపాకుతోనూ కలిపి ముద్దగా నూరి చర్మంమీద లేపనం చేస్తే ఎగ్జిమా, తామర, దురదలు వంటి చర్మవ్యాధుల్లో ఉపశమనం లభిస్తుంది.
  15. తమలపాకు రసం, తేనె సమపాళ్లలో కలిపి కళ్లలో డ్రాప్స్‌గా వేసుకోవాలి. (వైద్య పర్యవేక్షణ అవసరం)
  16. తమలపాకు రసం, తులసి రసం, అల్లం రసం, మిరియాలు పొడి, తేనెలను కలిపి నాకిస్తే పిల్లల్లో జలుబు, దగ్గు తగ్గుతాయి.
  17. చెవుల మీద తమలపాకులను వేసి కట్టుకుంటే తలలో చేరిన వాతం శాంతించి తల నొప్పి తగ్గుతుంది.
  18. తమలపాకు రసాన్ని పాలతో కలిపి తీసుకుంటే మహిళల్లో కనిపించే పిశాచ బాధలు, క్షణికావేశాలు తగ్గుతాయి.
  19. తమలపాకు రసాన్ని రెండు కళ్లల్లోనూ చుక్కలుగా వేస్తే రేచీకటి సమస్య తగ్గుతుంది. (వైద్య పర్యవేక్షణ అవసరం)
  20. గుండె అపసవ్యంగా, అపక్రమంగా కొట్టుకుంటున్నప్పుడు తమలపాకు రసాన్ని టీ స్పూన్ మోతాదుగా తాగుతుంటే హితకరంగా ఉంటుంది.
  21. తమలపాకు షర్బత్‌ని తాగితే గుండె బలహీనత తగ్గుతుంది. కఫం, మందాగ్ని దూరమవుతాయి.
  22. ఏ కారణం చేతనైనా పసిపాపాయికి పాలివ్వలేకపోతే రొమ్ముల్లో పాలు నిలిచిపోయి గడ్డలుగా తయారై నొప్పిని కలిగిస్తాయి. ఇలాంటి సందర్భాల్లో తమలపాకు కొద్దిగా వేడిచేసి స్తనాలమీద కట్టుకుంటే వాపు తగ్గి ఉపశమనం లభిస్తుంది.
  23. చిన్న పిల్లలకు చీటికిమాటికి జలుబు చేసి ఇబ్బంది పెడుతున్నప్పుడు తమలపాకును వేడిచేసి, కొద్దిగా ఆముదాన్ని రాసి, ఛాతిమీద వేసి కడితే హితకరంగా ఉంటుంది.
  24. తమలపాకు కాండాన్ని (కులంజన్), అతిమధురం చెక్కను నూరి తేనెతో కలిపి తీసుకుంటే ఇన్‌ఫెక్షన్‌తో కూడిన జలుబు (దుష్టప్రతిస్యాయం) తగ్గుతుంది.
  25. పాటలు పాడేవారు, ఉపన్యాసాలను ఇచ్చేవారు తమలపాకు చెట్టు కాండాన్ని చిన్న ముక్క తీసుకొని బుగ్గనుంచుకొని చప్పరిస్తుంటే అమితమైన ప్రయోజనం కనిపిస్తుంది. చక్కని శ్రావ్యమైన కంఠం వస్తుంది.
  26. హిస్టీరియాలో కంఠం పూడుకుపోయి మాట పెగలకపోతే తమలపాకు రసం తీసుకుంటే కంఠం పెగులుతుంది. మాట స్పష్టతను సంతరించుకుంటుంది. కఫం తెగి వెలుపలకు వచ్చేస్తుంది. 2-5 తమలపాకులను వేడి నీళ్లకు కలిపి మరిగించి పుక్కిటపడితే కూడా హితకరంగా ఉంటుంది.
  27. తమలపాకును తింటే శ్లేష్మం కరిగి పెద్ద మొత్తాల్లో స్రవిస్తుంది. దీంతో అరుగుదల తేలికగా జరుగుతుంది. నోటి దుర్వాసన తగ్గుతుంది. తిన్న వెంటనే ఆయాసం రాకుండా ఉంటుంది. మాటలో స్పష్టత వస్తుంది. అలాగే చెడు వానలు కురిసే రోజుల్లో, జలవాయు కాలుష్యాలవల్ల చెడిపోయిన ఆహారాన్ని ఇది శుద్ధపరుస్తుంది.
  28. తమలపాకును తినడంవల్ల లాలాజలం విడుదలై దప్పిక తీవ్రత తగ్గుతుంది.
  29. తమలపాకు తొడిమకు ఆముదం రాసి చిన్న పిల్లల్లో మల ద్వారంలోనికి చొప్పిస్తే మలనిర్హరణ జరుగుతుంది. (వైద్య పర్యవేక్షణ అవసరం)
  30. తమలపాకును కడుపులోపలకు తీసుకుంటుంటే ఎరక్టైల్ డిస్‌ఫంక్షన్ (అంగ స్తంభన ) ఇబ్బంది పెట్టదు. తమలపాకు రసాన్ని బాహ్యంగా కూడాప్రయోగించవచ్చు.
  31. తమలపాకు షర్బత్‌ని తీసుకుంటే బలహీనత దూరమవుతుంది.
  32. తమలపాకు రసాన్ని టీ స్పూన్ మోతాదులో మూడుపూటలా మిరియం పొడి కలిపి తీసుకుంటుంటే జ్వరం తగ్గుతుంది.
  33. తమలపాకును వేడిచేసి వాపు, నొప్పి కలిగిన కీలు మీద కడితే నొప్పి తగ్గుతుంది.
  34. మొండి వ్రణం త్వరితగతిన మానాలంటే వ్రణంమీద తమలపాకును అమర్చి కట్టుకట్టుకోవాలి.
  35. తమలపాకు రసాన్ని ముక్కులో డ్రాప్స్‌గా వేసుకుంటే తలనొప్పి తగ్గుతుంది.
  36. తమలపాకు ముద్దను తలకు పట్టించి గంటసేపు ఆగి తల స్నానం చేస్తే చుండ్రు తగ్గుతుంది.

Monday, August 06, 2018

మాంసభక్షణ మొక్కలు

క్రిములను, కీటకాలను మరియు చిన్న జంతువులను తినే మొక్కలను కీటకాహార మొక్కలు లేదా మాంసభక్షణ మొక్కలు (ఆంగ్ల భాష Insectivorous or Carnivorous plants) అంటారు. ఇవి చాలా ఆశ్చర్యకరమైనవి. ఈ మొక్కలు నత్రజని లోపించిన ముఖ్యంగా బురద నేలలలో పెరుగుతాయి. ఇవి తమకు కావలసిన నత్రజనిని తయారుచేసుకోలేవు. అందువల్ల ఈ విధంగా క్రిమికీటకాలలో లభించే మాంసకృత్తుల మీద ఆధారపడతాయి. ఈ మొక్కల పత్రాలు కీటకాలను ఆకర్షించి, పట్టుకొని, చంపి, జీర్ణం చేసుకోవడానికి అనువుగా బోనులుగా రూపాంతరం చెందుతాయి. ఈ పత్రాలను 'బోను పత్రాలు' అంటారు. ఈ పత్రాలు వివిధ ఎంజైములను స్రవించడం వలన కీటకాలలోని ప్రోటీనులు విశ్లేషించి జీర్ణం చేయబడతాయి. జీర్ణం చేయబడిన ప్రోటీనులను ఈ పత్రాలు శోషిస్తాయి. ఇవి ఉత్తర, దక్షిణ కరోలినా (usa), ప్రాంతాల్లో అగుపిస్తాయి.

Image result for carnivorous plantsImage result for carnivorous plants