ఉమ్మెత్త సొలనేసి కుటుంబానికి చెందిన చిన్న పుష్ప జాతి మొక్క.దత్తూర అనే ఈ మొక్క ఉమ్మెత్త వృక్షానికి చెందినది. వినాయక చవితి రోజు చేసుకునే వరసిద్ధివినాయక ఏకవింశతి పత్రి పూజా క్రమములో ఈ ఆకు నాలుగవది.
ఈ ఆకు ముదురు పచ్చ రంగులో ఉంటుంది. ఆకారం సూదికొనలతో నక్షత్ర ఆకారంలో ఉంటుంది. పరిమాణం మధ్యస్థం. ఈ చెట్టు గుబురుచెట్టు గా పెరుగుతుంది. దీని పుష్పాలు తెల్లగా, ఊదారంగు కలగలసి పొడవుగా సన్నగా ఉంటాయి.
ఈ పత్రి యొక్క ఔషధ గుణాలు
వ్యాధిగ్రస్తునికి శిరోముం డనం చేయించి ఈ ఆకుల రసాన్ని రెండు నెల లపాటు రోజూ మర్ధన చేస్తే వ్యాధి తగ్గుతుంది.
ఆస్తమాను తగ్గిస్తుంది
ఊపిరితిత్తుల సంబంధ సమస్యలను తగ్గిస్తుంది
మానసిక వ్యాధి నివారణకు ఇది అద్భు తంగా పనిచేస్తుంది.
వినాయక చవితి రోజు ఉమ్మెత్తను వినాయక వ్రత కల్ప విధానము లోని గణేశ పత్రపూజలో ఉపయోగిస్తారు.
ఉమ్మెత్తలో చాల రకాలున్నాయి. తెల్ల ఉమ్మెత్త/ నల్ల ఉమ్మెత్త అన్ని ఉమ్మెత్తలు విషపూరితాలె. చాల దుర్వాసన కలిగి వుంటాయి. వీటి కాయలు పెద్ద నిమ్మకాయంత పరిమాణం వుండి కాయ చుట్టు దట్టమైన ముళ్ళు కలిగి వుంటుంది. ఈ కాయలను కొన్ని ఔషదాలలో వుపయోగిస్తారు.