మనఊరు మనచెట్టు: October 2015

Saturday, October 31, 2015

పారిజాతం



పారిజాతం ఒక మంచి సువాసనగల తెల్లని పువ్వుల చెట్టు. ఇది అక్టోబరు , నవంబరు, డిసెంబర్ మాసాలలో విరివిగా పుష్పించును. ఈ పువ్వులు రాత్రి యందు వికసించి, ఉదయమునకు రాలిపోయి చెట్టు క్రింద తెల్లని తివాచి పరచినట్లు కనిపించును. ఈ పూలనుంచి సుగంధ తైలమును తయారుచేయుదురు. తాజా ఆకుల రసమును పిల్లలకు బేదిమందుగా వాడెదరు.
పురాణము
 శ్రీకృష్ణుడు పారిజాత పుష్పాన్ని స్వర్గలోకము నుండి దొంగలించడానికి ప్రయత్నించి కష్టాలలో పడతాడు. దీని ఆధారంగా పారిజాతాపహరణం కథ నడిచింది.
https://m.facebook.com/manaurumanachettu
శ్రీకృష్ణుడు పరమాత్మ ఇంద్రలోకం నుంచి తెచ్చి సత్యభామ కి బహూకరించిన పారిజాత వృక్షం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో బారబంకి జిల్లాలో లోని కింటూర్ గ్రామంలో ఉంది . ప్రపంచంలోకెల్ల విలక్షణమైన వృక్షంగా శాస్త్రజ్ఞులు దీనిని అభివర్ణించారు. ఇది శాఖ ముక్కలు నుండి పునరుత్పత్తి గాని, పండ్లు గాని ఉత్పత్తి చేయదు. అందుకే ఈ వృక్షం ఒక ప్రత్యేక వర్గం లో ఉంచబడింది. ప్రపంచంలోని ఏ ఇతర చెట్టుకు లేని ప్రత్యేకత ఈ వృక్షం స్వంతం. దిగువ భాగంలో ఈ చెట్టు ఆకులు, చేతి ఐదు వేళ్ళను పోలి ఉంటాయి. పై భాగాన ఆకులు ఏడు భాగాలుగా ఉంటాయి. వీటి పుష్పాలు కూడా చాలా అందంగా బంగారు రంగు మరియు తెలుపు రంగులో కలిసిన ఒక ఆహ్లదకరమైన రంగులో ఉంటాయి. పుష్పాలు ఐదు రేకులు కలిగి ఉంటాయి. https://m.facebook.com/manaurumanachettu చాలా అరుదుగా ఈ వృక్షం వికసిస్తుంది. అదీ జూన్ / జూలై నెలలో మాత్రమే. ఈ పుష్పాల సువాసన చాలా దూరం వరకు వ్యాపిస్తుంది. ఈ వృక్షం యొక్క వయస్సు సుమారు 1000 నుంచి 5000 సంవత్సరాలుగా చెప్పబడుతుంది. ఈ వృక్ష కాండము చుట్టుకొలత 50 అడుగులుగాను, ఎత్తు 45 అడుగుల గాను చెప్పబడింది. ఈ వృక్షం యొక్క మరొక గొప్పతనం దీని శాఖలు గాని ఆకులు గాని కుంచించుకుపోయి కాండంలో కలిసిపోవటమే కాని ఎండిపోయి రాలిపోవటం జరగదు. ఇప్పుడు నిపుణులు ఈ వృక్షం మనుగడ గురించి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
https://m.facebook.com/manaurumanachettu



తలంబ్రాలు చెట్టు

తలంబ్రాలు చెట్టు పేరుకే చెట్టు కానీ నిజానికి ఒక పొద. ఈ మొక్క లాంటానా ప్రజాతికి చెందినది. దీనిలో 150కి పైగా జాతులు కలవు. తలంబ్రాలు చెట్టు స్వస్థలము ఆఫ్రికా మరియు అమెరికా ఖండాలు.
హిమాచల్ ప్రదేశ్ లో లాంటానా పొదలను ఫర్నీచరు మరియు కంచెలు తయారు చేయడానికి ఉపయోగిస్తున్నారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని చిత్తూరు జిల్లాలో మరియు తమిళనాడు లోని నతము వద్ద లాంటానా పొదలను మరియు స్థానికంగా దొరికే కలుపు పొదలను కొన్ని సముదాయాలు బుట్టలు అళ్లడానికి ఉపయోగిస్తున్నారు.
కొన్ని ప్రాంతాల్లో, ఈ చెట్టు ని లంబాడీ చెట్టు, గాజుకంప అని కూడా అంటారు.

Wednesday, October 28, 2015

కొబ్బరి


కొబ్బరి ఒక ముఖ్యమైన పాము కుటుంబానికి చెందిన వృక్షం. దీని శాస్త్రీయ నామం 'కోకాస్ న్యూసిఫెరా' (Cocos nucifera). కోకాస్ ప్రజాతిలో ఇది ఒక్కటే జాతి ఉన్నది. ఇవి ప్రపంచవ్యాప్తంగా విస్తరించి ఉన్నాయి. కొబ్బరి చెట్టు 30 మీటర్ల ఎత్తు పెరుగుతుంది. కొబ్బరి కాయ రూపంలో కొబ్బరి చెట్ల నుండి లభిస్తుంది. హిందువులకు ఒక ముఖ్యమైన పూజా ద్రవ్యం. దీనినే టెంకాయ అని కూడా పిలుస్తాం. దీనిని రకరకాల ఆహార పదార్థాలలో రకరకాల రూపాలలో వినియోగిస్తారు. కొబ్బరి చెట్లనుండి వివిధరకాల పదార్ధాలు అనేకమైన పద్ధతులలో ఉపయోగపడుతున్నాయి.


వివరాలు
కొబ్బరి చెట్లు కోస్తా ప్రాంతాలలోనూ, ఇసుక ప్రాంతాలలోను ఎక్కువగా పెరుగుతాయి. సారవంతం కాని నేలలో కూడా ఇవి పెరుగుతాయి. ఈ చెట్టు సుమారు 100 అడుగుల ఎత్తు వరకు పెరుగుతుంది. ఇవి సుమారు 100 సంవత్సరాలపాటు జీవించి వుంటాయి. 7 సంవత్సరాల వయసు రాగానే ఈ చెట్టు నెలనెలా చిగురిస్తూ, పూతపూస్తూ ఉంటుంది. భారతదేశపు సాంస్కృతిక జీవనంలో కొబ్బరి చెట్టుకు ఒక ముఖ్యమైన స్థానం ఉంది. దీనిని కల్పవృక్షం - స్వర్గానికి చెందిన చెట్టు అంటారు. ఇది మనకు కావలసిన ఆహారాన్నీ, పానీయాన్నీ, తలదాచుకునే చోటునీ, జీవితానికి కావలసిన ఇతర నిత్యావసర వస్తువులనూ ప్రసాదిస్తుంది. ఉష్ణ ప్రాంతంలో నివసించేవారికి ఇదొక శుభకరమైన చెట్టు. పూజలలో, పెళ్ళిళ్ళలో, ఇతర ఉత్సవాల సమయంలో దీనిని వాడడం జరుగుతుంది.

శాస్త్రీయ విశ్లేషణ
కొబ్బరికాయలో నీరు, కండ ఉంటాయి. నీరు, కండ, గట్టితనంగల నారతో కప్పబడి ఉంటుంది. కొబ్బరి బోండాలోని నీళ్ళు చాలా పౌష్టిక గుణాలను కలిగి ఉంటాయి. దీనికి ఔషధగుణాలు కూడా ఉన్నాయి. బలహీనంగా ఉన్న వ్యక్తికి గ్లూకోజ్ దొరకనప్పుడు డ్రిప్స్‌గా కొబ్బరి నీళ్ళను ధారాళంగా వాడతారు. ఈ నీళ్ళు శరీరంలోని వేడిని తగ్గించి కావలసిన చల్లదనాన్ని ఇస్తాయి. ఇది దప్పికను కూడా తీరుస్తుంది. ఇందులో గ్లూకోజ్‌తోపాటు పొటాషియం, సోడియంలాంటి ఖనిజాలు ఉంటాయి. ఆ కారణంగా దీన్ని నెల శిశువు కూడా ఇవ్వవచ్చు. ఇది సులభంగా జీర్ణం అవుతుంది. కొబ్బరి [1]

కొబ్బరి - ఆరోగ్యం:-
ఇందులో ఎలెక్ట్రోలిటిక్ ఉన్నందువల్ల తక్కువ మూత్ర విసర్జన జరుగుతున్నప్పుడు, జలోదరానికీ, మూత్ర విసర్జన ధారాలంగా జరిగేందుకూ, డయేరియా కారణంగా శరీరంలోని నీరు తగ్గిపోయినప్పుడూ, దిగ్భ్రాంతి కలిగినప్పుడూ, లేత కొబ్బరికాయ నీళ్ళను వాడవచ్చు. అతిసారం, చీము రక్తం భేదులు, శూల వల్ల కలిగే పేగుల మంటను చల్లార్చడానికి దీనిని వాడవచ్చును. హైపర్ అసిడిటి ఉన్నప్పుడు కూడా దీన్ని వాడవచ్చును. కొబ్బరి నీరు వాంతులను, తల తిరగడాన్ని ఆపుచేస్తుంది. కలరా వ్యాధికి ఇది మంచి విరుగుడు. కారణం అతిసారం భేదుల వల్ల, వాంతుల వల్ల శరీరంలో తగ్గిపోయిన పొటాషియంను శరీరానికి సరఫరా చేయగలగడమే. మూత్ర విసర్జనను ఎక్కువ చేయగలగడం వల్ల శరీరంలో ఉన్న విష పదార్ధాలను బయటకు గెంటడం వల్ల అంటురోగాల వల్ల కలిగే జ్వరాలకు ఇది వాడబడుతుంది. లేత కొబ్బరికాయ కొంత ముదిరినప్పుడు అందులో ఉన్న నీరు జెల్లీలాగా తయారవుతుంది. దీనిని "స్పూన్ కోకోనట్" అంటారు. రుచికరంగా ఉంటూ ఇది సులభంగా జీర్ణమవుతుంది. ఇందులో నూనె, పిండిపదార్ధాలు, మాంసకృత్తుల వల పేగులలో కుళ్ళిపోవడం అన్నది జరగదు. ఆ కారణంగా ఇది మెరుగైన మాంసకృత్తులతో కూడిన ఆహారంగా భావించబడుతోంది. అంతేకాదు ఇది శరీరంలో ఎలాంటి విషంతో కూడిన వస్తువును చేరనివ్వదు. ఇందులో ఉన్న మెత్తటి కండను గాయాలకు రాయవచ్చును. ఈ కండకు గాయాలను మాపే ఔషధ గుణం ఉంది.
బాగా పండిన కొబ్బరిలో నూనె ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇది భేదిమందుగా, క్రిమినాశనిగా కూడా వాడబడుతుంది. నూనె కడుపులో ఉన్న యాసిడ్ల విసర్జనను అణిచిపెడుతుంది. కాబట్టి అసిడిటికి ఇది మంచి మందు. పొడిదగ్గు, ఎదనొప్పి నుండి ఇది మనిషికి ఉపశమనాన్ని కలిగిస్తుంది. కొబ్బరిని తురిమి కూరలకూ, చట్నీలకూ, తీపిపదార్ధాల తయారీకీ వాడతారు. బెల్లంతో కలిపి కొబ్బరిని తింటే మోకాళ్ళ నొప్పులు రావు. కొలెస్టెరాల్ ఎక్కువై బాధపడుతున్న వారు కొబ్బరి తినకూడదు



కొబ్బరి చెట్టు
ప్రాచీన కాలం లో విశ్వమంతటా ఆరోగ్య పరిరక్షణకు వాడిన సహజ ఫలము కొబ్బరి . నేటి ఆధునిక మేధావి వర్గం కొబ్బరి అనేక ఆరోగ్య సమస్యలకి సమాదానమంటావుంది . సాంకేతికముగా కొబ్బరిని కోకోస్ న్యుసిఫేరా (CocosNeucifera) అంటారు . నుసిఫెర అంటే పొత్తుతో కూడుకున్నదని అర్ధము (Nutbearing) ప్రపంచము లో మూడవ వంతు జనాభా వాళ్ల ఆహారములోను ,ఆర్ధిక సంపత్తులోను, ప్రతి పూజా-పవిత్ర కార్యక్రమములోను చాల భాగము కొబ్బరితోనే ముడిపడి ఉన్నది . కొబ్బరికాయను అందరూ శుభప్రధముగా భావిస్తారు. మనదేశములో శుభకారార్యాలకు కొబ్బరికాయ తప్పనిసరి. కొబ్బరికాయ లేని పండుగ లేదంటే అతిశయోక్తి కాదు. కేరళీయులకైతే రోజూ అన్నింటిలోనూ కొబ్బరికాయ ,కొబ్బరినూనె తప్పనిసరిగా వుండి తీరవలసినదే . వారి ఆరోగ్యమూ ,సంపదా కొబ్బరిపంట మీద అదారపడివున్నాయి . కోట్లాదిమంది జనం కొబ్బరిపంటనే జీవనాదారం చేసుకుని వుంటున్నారు . కొబ్బరికాయలో నలబైతొమ్మిది శాతం లారిక్ యాసిడ్ వుంటుంది . ఇది తల్లి పాలకు దాదాపు సరిసమానం అంట. కొబ్బరినూనెలో వుండే పాటియాసిడ్స్, వైరల్ ,ఫంగల్ ,బ్యాక్టీరియల్ వంటి మానవజాతి ఎదుర్కునే రుగ్మతలను తగ్గించడములో సహాయపడతాయి. పోషకాలతో కూడిన ఆహారాన్ని ,పానీయాన్ని అందిచడముతో పాటు ఆరోగ్యాన్ని కలిగిస్తుంది . కొబ్బరిచెట్టు లో ప్రతీ భాగము అన్నిరకాలగాను ఉపయోగపడుతొంది . అందుకే దీనిని మానవుల పాలిట కల్పవృక్షము అంటారు . మీకు తెలుసా ? కొబ్బరికాయకు కూడా ఒక రోజు ఉందని .అదే ప్రపంచ శ్రీ ఫల దినోత్సవము (కోకోనట్ డే)ప్రతీ సంవత్సరము సెప్టెంబర్ రెండు న జరుపుతారు .

కొబ్బరి నీరు :
ఏ ఋతువులో అయిన తాగదగినవి కొబ్బరి నీరు . లేత కొబ్బరి నీటి లో కార్బోహైడ్రేట్స్ తక్కువ గాను, క్రొవ్వులు అస్సలుండవు ,చెక్కెర పరమితం గాను ఉండును . కొబ్బరి బొండం నీటి లో పొటాసియం ఎక్కువగా ఉంటుంది . శరీరములో నీటి లేమిని (Dehydration) కరక్ట్ చేస్తుంది .

వైద్య పరంగా :
జీర్ణకోశ బాధల తో బాధపడే చిన్నపిల్లలకు కొబ్బరి నీరు మంచి ఆహారము , విరేచనాలు అయినపుడు (diarrhoea)ఓరల్ రి-హైద్రాషన్ గా ఉపయోగపడుతుంది ,(Oral re-hydration), పొటాసియం గుండె జబ్బులకు మంచిది , వేసవి కాలములో శరీరాన్ని చల్లబరుస్తుంది , వేసవిలో చెమట కాయలు , వేడి కురుపులు , అమ్మవారు జబ్బు పొక్కులు తగ్గేందుకు కొబ్బరినీతిని లేపనం గావాడాలి . కొన్ని రకల పొట్టపురుగులు కొబ్బరి నీటివల్ల చనిపోతాయి,, ముత్రసంభందమైన జబ్బులలోను , కిడ్నీ రాళ్ళు సమస్యలలో ఇది మంచి మందు గా పనిచేస్తుంది . మినెరల్ పాయిజన్ కేసులలో పాయిజన్ ని క్లియర్ చేస్తుంది.

కొబ్బరి పాలు:-
పచ్చికోబ్బరిలో పోషక విలువలు అధికము . . కొబ్బరి నీళ్లు , పాలు మంత్ర జలం లా పనిచేస్తాయి. దీనిలో విటమిన్ ఎ,బి , సి, రైబోఫ్లెవిన్ , ఐరన్ , కాలసియం ,
ఫాస్పరస్ , కార్బోహైడ్రేట్లు ,కొవ్వు ,ప్రోటీన్లు సమృద్ధి గా లభిస్తాయి , కొబ్బరి కాయ ముదిరిపోయక లోపల పువ్వు వస్తుంది ... అది గర్భాశాయానికి మేలు చేస్తుంది .బాలింతలము అధిక రక్తస్రావము ఇబ్బందింది పెడుతుంటే కొబ్బరి పువ్వు జ్యూస్ ను తీసుకుంటే సత్వర ఉపశమనం దొరుకుతుంది . నిత్యం కొబ్బరి నీళ్లు తాగితే మూత్రపిండాల సమస్యలు దరిచేరవు .శరీరానికి చల్లదనం లభిస్తుంది గొంతు మంట , నొప్పిగా ఉన్నప్పుడు కొబ్బరిపాలు తాగితే తగ్గుతుంది .

కొబ్బరి నూనె :
కొబ్బరి నూనెలో యాబై శరము లారిక్ ఆసిడ్ ఉంటుంది ...దీన్ని వంటల్లో అధికము గా ఉపయోగిస్తే గుండెకు రక్తప్రసరణ సక్రమము గా జరుగుతుంది . కొవ్వు శాతము పెరగదు , రక్తపోటు నియంత్రణలో ఉంటుంది . కొబ్బరి నూనే లో విటమిన్ 'ఇ ' అధికము... ఇది చర్మాన్ని కొమలముగా తాయారు చేస్తుంది. రోజూ రెండు చెంచాలు నూనే తీసుకుంటే జీర్ణ వ్యవస్తకు మంచిది . . థైరాయిడ్ సమస్యలూ ఉండవు . అందానికి : పొడి చర్మము ఉన్నవారు పచ్చికొబ్బరి తీసుకుంటే శరీరానికి సరిపడా తేమ అందుతుంది , కొబ్బరి పాలు చర్మానికి పట్టిస్తే మృతకనాలు , మురికి తొలగిపోతాయి . మేని ప్రకాశవంతము గా మెరుస్తుంది ... ఇది జుట్టుకు మేలు చేస్తుంది ... కొబ్బరి పాలు తలకు పట్టిస్తే .. . కేశాలు కాంతి వంతము గా తాయారు చేస్తుంది .

లక్షణాలు
◾శాఖారహిత కాండంతో పెరిగే వృక్షం.
◾పొడవుగా దీర్ఘవృత్తాకారంలో పొడిగించిన కొనతో ఉన్న అనేకమైన పత్రకాలు గల సరళ పిచ్ఛాకార సంయుక్త పత్రాలు.
◾సంయుక్త స్పాడిక్స్ పుష్పవిన్యాసాక్ష పీఠభాగంలో అమరిన ఆకుపచ్చరంగు స్త్రీ పుష్పాలు, కొనభాగంలో అమరిన మీగడరంగు పురుష పుష్పాలు.
◾పీచు వంటి మధ్య ఫలకవచం ఉన్న టెంకగల ఫలాలు.

ఉపయోగాలు;-
ఆహారపదార్ధంసవరించు
◾కొబ్బరి కాయలోని తెల్లని గుజురు మంచి ఆహారం. దీని కోరు నుండి కొబ్బరి పాలు తీస్తారు. దీనిలో 17 శాతం కొవ్వు పదార్ధాలు ఉంటాయి. పాలు తీయగా మిగిలిన దానిని పశువుల దానాగా వాడతారు.



లేత కొబ్బరి బొండం పానీయం.◾కొబ్బరి నీరు మంచి పానీయం. ముదురు కొబ్బరిలో కంటే లేత కొబ్బరి బొండంలో ఎక్కువగా నీరు ఉంటాయి. దీనిలోని లవణాలు వేసవికాలంగా చల్లగా దాహం తీరుస్తాయి.
◾కొబ్బరి పుష్పవిన్యాసాల చివరి భాగాన్ని కాబేజీ లాగా వంటలలో ఉపయోగిస్తారు. వీటి మూలం నుండి కల్లు తీస్తారు.
ఇతరమైనవిసవరించు
◾కొబ్బరి పీచు తో తాళ్ళు, చాపలు, పరుపులు తయారుచేస్తారు. ఇది వంటచెరకుగా కూడా ఉపయోగిస్తారు.
◾కొబ్బరి కురిడి నుండి కొబ్బరి నూనె తయారుచేస్తారు.
◾కొబ్బరి ఆకులు చాపలు, బుట్టలు అల్లడానికి, పందిరి, ఇంటిపైకప్పులపైన వేస్తారు. కొబ్బరి ఈనెలను కట్టలు కట్టి చీపురుగా ఉపయోగిస్తారు.
◾కొబ్బరి చెట్టు కాండం కలపగా ఇల్లు కట్టుకోవడంలో దూలాలు, స్తంభాలు క్రింద వాడతారు. ఇవి వంతెనలుగా పిల్ల కాలువల మీద ఉపయోగించవచ్చును.



వ్యక్తిగత ఉపయోగాలు
కొబ్బరి నూనె పొడి చర్మం తో సహాయం, ఒక చర్మం మాయిశ్చరైజర్ గా ఉపయోగిస్తారు మరియు జుట్టు వాడినప్పుడు ప్రోటీన్ నష్టాన్ని తగ్గించడానికి ఒక అధ్యయనంలో చూపబడింది.
విద్యుత్ లైటింగ్ ఆవిష్కరించడానికి ముందు, కొబ్బరి నూనె ప్రధాన చమురు భారతదేశం లో ప్రకాశం కోసం ఉపయోగిస్తారు మరియు నూనె కొచ్చిన్ ఎగుమతి అయింది.
కొబ్బరి నూనె సబ్బు తయారీ కోసం ఒక ముఖ్యమైన స్థావరంగా పదార్ధంగా ఉంది. కొబ్బరి నూనె తో చేసిన సబ్బు అది ఇతర నూనెలు తయారు సబ్బు కంటే ఎక్కువ నీరు నిలుపుకుంది మరియు అందువలన తయారీదారు దిగుబడి పెరుగుతుంది అయితే, కష్టం ఉంటుంది . ఇది హార్డ్ నీరు మరియు మరింత సులభంగా నురుగు అనుమతిస్తూ ఇతర సబ్బులు కంటే ఉప్పు నీటిలో మరింత కరుగుతుంది. కరిగిస్తారు ఉన్నప్పుడు మరియు ఒక ప్రకాశవంతమైన తెల్లని గట్టిపడిన ఉన్నప్పుడు ఒక ప్రాథమిక కొబ్బరి నూనె సబ్బు స్పష్టం.
కొబ్బరి నూనె నుండి తయారయ్యే ఒక వికర్షకం చర్మం చొచ్చుకొనిపోయి నుండి టుంగా పురుగు వలన కలిగిన చర్మ వ్యాధి కారక ఇసుక ఈగలు నివారించడానికి సమర్థవంతమైన ఉండవచ్చు కొబ్బరి నూనే.[2]

సంస్కృతి
◾హిందువుల సంస్కృతి మరియు సంప్రదాయాలలో కొబ్బరి కాయకు చాలా ప్రాముఖ్యత కలదు. ఇవి వివిధ పూజలలో దేవతలకు ముఖ్యంగా సమర్పిస్తారు. ఇంచుమించు అన్ని శుభకార్యాలలో కొబ్బరి కాయను పగుల కొడతారు. దీనిని ఆత్మసమర్పణంతో సమానంగా భావిస్తారు.
◾భారతదేశంలో కేరళ రాష్ట్రం కొబ్బరికాయలకు ప్రసిద్ధి. ఆంధ్రప్రదేశ్ లో కోనసీమ కొబ్బరికి చాలా ప్రసిద్ధి.

Tuesday, October 27, 2015

బొప్పాయి

మన దేశంలోకి బొప్పాయి (Papaya) 400 ఏళ్ల క్రితమే ప్రవేశించింది. మెక్సికో ప్రాంతానికి చెందిన బొప్పాయి అనేక ఇతర ఉష్ణమండలాల్లో ప్రాచుర్యం పొందింది. మనదేశంలో బొప్పాయిని ప్రధానంగా ఆంధ్ర ప్రదేశ్‌, తమిళనాడు, అస్సాం, బీహార్, పంజాబ్ తదితర రాష్ట్రాల్లో విరివిగా పండిస్తున్నారు. 2007 నాటికి ఆంధ్రప్రదేశ్ లో 3 వేల హెక్టార్ల విస్తీర్ణంలో సాగవుతున్నట్లు అంచనా. ముఖ్యంగా కడప, ఆదిలాబాద్, మెదక్ జిల్లాల్లో ఎక్కువగా సాగుచేస్తున్నారు. బొప్పాయి తక్కువ కాలంలో కోతకు వచ్చే ముఖ్యమైన పండ్లతోట. ఆంధ్రప్రదేశ్ లో కొన్ని ప్రాంతాల్లో పరందపుకాయ, పరమాత్ముని కాయ, మదన ఆనపకాయ అని అని కూడా బొప్పాయిని పిలుస్తుంటారు.
వైద్య పరమైన ఉపయోగములు
బొప్పాయి పండులోవున్నన్ని విటమిన్లు మరెందులోను లేవంటారు వైద్యులు. ఈ పండును ఆహారంగా తీసుకుంటే ఆరోగ్యం చాలా బాగుంటుందంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఇందులో విటమిన్ "ఏ", విటమిన్ "బీ", విటమిన్ "సీ", విటమిన్ "డీ"లు తగుమోతాదులోనున్నాయి. తరచూ బొప్పాయిపండును ఆహారంగా తీసుకుంటుంటే శరీరానికి కావలసిన విటమిన్లు పుష్కలంగా లభిస్తాయి. ఇందులో పెప్సిన్ అనే పదార్థం ఉండటం వలన జీర్ణక్రియ సాఫీగా జరుగుతుంది. ఉదర సంబంధమైన జబ్బులను మటుమాయం చేసేందుకు బొప్పాయి పండు చాలా ఉపయోగకరంగా ఉంటుందంటున్నారు ఆరోగ్య నిపుణులు. శరీరంలోని పలు జబ్బులకు ప్రధాన కారణం ఉదరమే. ఆ జబ్బులను మటుమాయం చేసేందుకు తరచూ బొప్పాయి పండును ఆహారంగా సేవించాలంటున్నారు వైద్యులు. ఉదరంలోని పేగులు శుభ్రమైతే శరీరం పూర్తిగా శుభ్రంగానున్నట్లే లెక్క. దీంతో శరీరం ఉల్లాసంగా తయారై తనపని తాను చేసుకుంటూ పోతుంటుంది.
అనువైన వాతావరణం
బొప్పాయి ఉష్ణమండలపు పంట. సముద్ర మట్టం నుంచి 1000 మీ. ఎత్తువరకు పెంచవచ్చు. వేసవిలో 32 డిగ్రీల సెం.గ్రే. నుంచి 38 డిగ్రీల సెం.గ్రే వరకు తట్టుకుంటుంది. చలికాలంలో 5 డిగ్రీల సెం.గ్రే.కి తక్కువ ఉండరాదు. బొప్పాయి సాగుకు సారవంతమైన ఎర్రగరప నేలలు, ఒండ్రు నేలలు అనుకూలం. వీటితోపాటు తేలికగా నీరు ఇంకిపోయే రేగడి నేలల్లో కూడా సాగుచేయవచ్చును. నీరు నిలిచే నేలలు, అధిక చౌడు, ఆమ్ల భూములు, సున్నపురాయి గల నేలలు బొప్పాయి పంటకు పనికిరావు. బొప్పాయికి అధిక గాలుల నుంచి రక్షణ అవసరం.
బొప్పాయి పండ్లు
రకాలు
బొప్పాయిలో అనేక రకాలున్నాయి. వీటిలో ముఖ్యంగా రెండు రకాలు
డయీషియస్‌
ఇవి ఆడ, మగ పుష్పాలు వేరువేరుగా పూసే చెట్ల రకాలు. వీటిలో గుజ్జు పసుపురంగులో ఉంటుంది. ఈ జాతిలో ముఖ్యంగా చెప్పుకోదగ్గ రకాలు
వాషింగ్టన
కో-4
కో-6
హానీడ్యూ
గైనో డయీషియ
ఇవి ఆడపుష్పాలు, ఆడపుష్పాలతోపాటు ద్విలింగ పుష్పాల రకాలు. వీటిలో గుజ్జు ఆరంజి రంగులో తియ్యగా ఉంటుంది. ఈ జాతిలో ముఖ్యంగా చెప్పుకోదగ్గ రకాలు
కూర్గు హనీడ్యూ
సోలో
కో-3
పూసా డెలీషియస్
రెడ్‌ లేడీ (786)
ప్రస్తుతం పండ్ల కోసం భారతదేశంలో ఈ రకాలే ప్రాచుర్యంలో ఉన్నాయి.
ఇతర రకాలు
బొప్పాయి కాయల నుంచి పాలు సేకరించి పపైన్‌ (Papain) తయారీకోసం కో-2, కో-5 రకాలు సాగుచేస్తున్నారు.
పచ్చికాయలు కూరకోసం పూసాజెయింట్‌ రకం అనువుగా ఉంటుంది.
పూసా మెజెస్టీ, రెడ్‌ లేడీ రకాలు ఎక్కువ రోజులు నిల్వ సామర్థ్యాన్ని కలిగి ఉండటంతోపాటు దూర ప్రాంతాల రవాణాకు అనుకూలం.
పెరటి తోటల్లోనూ, ఇంటి ఆవరణలోనూ అందంగా పెంచుకోవటానికి పూసాడ్వార్ఫ్‌ రకం అనుకూలం.
నీటి ముంపునకు గురయ్యే ప్రాంతాల్లో నాటుకోవటానికి పూసా నానా రకం అనుకూలంగా ఉంటుంది.
రంగు, రుచి కలిగిన చిన్న కాయల కోసం 'సోలో', ఆర్క సూర్య రకాలు సాగు చేయవచ్చు.
పోషక విలువలు
Papaya, raw
పోషక విలువలు, ప్రతి 100 గ్రాములకు
శక్తి 40 kcal 160 kJ
పిండిపదార్థాలు
9.81 g
- చక్కెరలు 5.90 g
- పీచుపదార్థాలు 1.8 g
కొవ్వు పదార్థాలు
0.14 g
మాంసకృత్తులు
0.61 g
విటమిన్ A 55 μg 6%
థయామిన్ (విట. బి1) 0.04 mg 3%
రైబోఫ్లేవిన్ (విట. బి2) 0.05 mg 3%
నియాసిన్ (విట. బి3) 0.338 mg 2%
విటమిన్ బి6 0.1 mg 8%
విటమిన్ సి 61.8 mg 103%
కాల్షియమ్ 24 mg 2%
ఇనుము 0.10 mg 1%
మెగ్నీషియమ్ 10 mg 3%
భాస్వరం 5 mg 1%
పొటాషియం 257 mg 5%
సోడియం 3 mg 0%
శాతములు, అమెరికా వయోజనులకు
సూచించబడిన వాటికి సాపేక్షంగా
కెరోటిన్‌, ఎ, బి, సి, ఇ విటమిన్‌లు, ఖనిజాలు, ఫ్లేవొనాయిడ్‌లు, ఫొలేట్‌లు, పాంతోనిక్‌ ఆమ్లాలు, పీచు.వంటి పోషకాలు  బొప్పాయిపండులో పుష్కలం.
మామిడి పండు తర్వాత బొప్పాయిలోనే మనకు అధిక పరిమాణంలో విటమిన్ ఎ లభిస్తుంది. దీనితోపాటు బి1, బి2, బి3, సి-విటమిన్లు, కాల్షియం, ఇనుము, భాస్వరం వంటి ఖనిజ లవణాలు బొప్పాయిలో సమృద్ధిగా లభిస్తాయి.
కంటికి సంబంధించిన రోగాలు రాకుండా ఈ పండులోని బిటాకెరోటిన్‌ (2020 ఐ.యూ.) తోడ్పడుతుంది.
బొప్పాయిలో సమృద్ధిగా లభించే విటమిన్ సి (40 మి.గ్రా.) దంతాల, చిగుళ్ళ ఆరోగ్యానికి, రక్తవృద్ధికి, రోగనిరోధక శక్తికి తోడ్పడుతుంది.
విటమిన్‌ బి (రైబోఫ్లెవిన్‌ 250 మైక్రోగాములు) నోటి పూత, తెల్లమచ్చలు, పెదాల పగుళ్లు రాకుండా కాపాడుతుంది.
బొప్పాయి 'కాయ' జీర్ణానికి తోడ్పడితే, 'పండు' పోషకాలనిస్తుంది.
బొప్పాయి పండును చిన్న పిల్లలకు గుజ్జుగా చేసి నాలుగో నెలనుంచి తినిపించవచ్చు. యుక్తవయస్సులో ఉన్నవారు దోరగా పండిన పండును తినవచ్చు.
100 గ్రాముల బొప్పాయి ముక్కల్లో లభించేవి
40 క్యాలరీలు
1.8గ్రా. పీచు
9.8గ్రా కార్బోహైడ్రేట్లు
0.6గ్రా ప్రోటీన్లు
10మి.గ్రా. మెగ్నీషియం
257మి.గ్రా. పొటాషియం
3 మి.గ్రా. సోడియం
24మి.గ్రా. కాల్షియం
61.8 మి.గ్రా. విటమిన్‌-సి
విటమిన్‌ ఎ(6%)
బీటా కెరోటిన్‌(3%)
విటమిన్‌ బి1(3%)
బి2(3%)
బి3(2%)
బి6(8%)
ఉంటాయి.
కొలెస్ట్రాల్‌ అంటే కొవ్వు లేదు, క్యాలరీలూ తక్కువే. అందుకే స్థూలకాయులు సైతం హాయిగా బొప్పాయిని తినొచ్చు
ఇతర ఉపయోగాలు
బొప్పాయి మంచి సౌందర్యసాధనం కూడా పనిచేస్తుంది.
బొప్పాయిలోని తెల్లని గుజ్జుని మొహనికి రాయడంవల్ల మంచి మెరుపు వస్తుంది.మొటిమలూ తగ్గుతాయి.
బొప్పాయి ఫేస్‌ప్యాక్‌ జిడ్డుచర్మానికి ఎంతో మంచిది. అందుకే సబ్బులు, క్రీముల్లో కూడా ఎక్కువగా వాడుతున్నారు.
బొప్పాయి పండు తింటే హృద్రోగాలూ, కోలన్‌ క్యాన్సర్లూ రావు. పండులోని బీటా కెరోటిన్‌ క్యాన్సర్‌నీ రాకుండా నిరోధిస్తుంది.
ఆస్తమా, కీళ్లవ్యాధుల వంటివి రాకుండా నిరోధిస్తుంది.
మలబద్ధకానికి బొప్పాయి పండు మంచి మందు.
ఆకలిని పుట్టించి నాలుకకు రుచి తెలిసేలా చేస్తుంది.
బొప్పాయిపండులోని పీచు మొలల్నీ రానివ్వదు.
బొప్పాయిపండు తినడంవల్ల జలుబు, ఫ్లూ, చెవినొప్పి... వంటివీ తగ్గుతాయి.
బొప్పాయిపండు తామర వ్యాధిని తగ్గిస్తుంది.
పచ్చికాయ అధిక రక్తపోటుని (హై బీపీ) నియంత్రిస్తుంది.
శృంగారప్రేరితంగానూ పనిచేస్తుంది.
గింజల్లో యాంటీఇన్‌ఫ్లమేటరీ, యాంథెల్‌మింటిక్‌ గుణాలు మెండు. అందుకే కడుపునొప్పికీ ఫంగల్‌ ఇన్ఫెక్షన్లకీ వీటిని మందుగా వాడతారు.
కొన్నిచోట్ల ఆకుల రసాన్ని హృద్రోగాలకు ఔషదంగా ఉపయోగిస్తారు.
బొప్పాయి ఆకుల రసాన్ని డెంగ్యూ జ్వరము వచ్చినపుడు వాడితే ప్లేట్లెట్లు కౌంటు పెరగడానికి పనిచేస్తుంది.
డయాబెటిస్‌ కారణంగా వచ్చే హృద్రోగాల్ని పచ్చి బొప్పాయి తగ్గిస్తుంది.
బొప్పాయిలోని పపైన్‌ను ట్యాబ్లెట్‌గా రూపొందించి జీర్ణసంబంధ సమస్యలకు మందుగా వాడుతున్నారు.
◾ఈ పపైన్‌ గాయాల్ని మాన్పుతుంది. ఎలర్జీల్ని తగ్గిస్తుంది. అందుకే గాయాలమీదా పుండ్లపైనా బొప్పాయి పండు గుజ్జుని ఉంచి కట్టుకడితే అవి త్వరగా తగ్గిపోతాయి.
◾పులియబెట్టిన బొప్పాయి నుంచి పపైన్‌ ఆయింట్‌మెంట్‌ తయారుచేస్తారు.
◾నొప్పి నివారిణిగానూ( పెయిన్‌కిల్లర్‌) పపైన్‌ గొప్పదే. అందుకే నరాలమీద ఒత్తిడిని తగ్గించేందుకూ వెన్నుపూసలు జారినప్పుడూ దీన్ని ఇంజెక్ట్‌ చేస్తారు.
◾బొప్పాయి హెమోగ్లోబిన్ పెంచడానికి సహాయపడుతుంది. 
+ తెలుగు నాట పచ్చి బొప్పయి కాయ తో వంటలు అంతగా ఇష్ట పడరు గాని ఈశాన్య భారతం లో వంటలకు ఈ కాయను విరివిగా వాడతారు. మిగతా కూరగాయలైన వంకాయ, బీరకాయ, సొరకాయల్లాగానె బొప్పాయి కాయిని కూర గాయగా పరిగణించి విరివిగా అమ్ముతారు.
జాగ్రత్తలు
బొప్పాయి కాయలు గర్భస్రావాన్ని కలుగజేస్తాయి. దీనికి ముఖ్యకారణం అందులో ఉండే 'పపైన్‌' (పాలు). ఇది గర్భాశయంలో ప్రారంభదశలో ఉన్న అభివృద్ధి చెందుతున్న పిండం చుట్టూ ఉండే ప్రొటీనులను కరిగించివేస్తుంది. అందువల్ల గర్భిణిస్త్రీలు, పాలిచ్చు తల్లులు బాగా పండిన బొప్పాయి పండు తినటం మంచిది.
◾బొప్పాయి పాలు దురదకు కారణమవుతాయి.అందుకే పచ్చి బొప్పాయి కోసేటప్పుడు ఒంటికి తగలనివ్వకూడదు.
◾పండు, గింజలు, ఆకులు, పాలల్లో కారైశ్బన్‌ అనే యాంథెల్‌మింటిక్‌ ఆల్కలాయిడ్‌ ఉంటుంది.ఇది ఎక్కువయితే ప్రమాదకరం.
◾క్యారెట్‌ మాదిరిగానే బొప్పాయిని ఎక్కువగా తింటే కెరటెనిమియా వ్యాధి వస్తుంది
అపోహలు
బొప్పాయి పండ్ల వినియోగంపై గ్రామీణ, పట్టణ వాసులకు కూడా అనేక అపోహలున్నాయి. బొప్పాయి తింటే వేడి చేస్తుందని, గర్భిణి స్త్రీకి గర్భస్రావం అవుతుందని, పాలిచ్చే తల్లి తింటే బిడ్డకు అజీర్తి చేస్తుందని, బహిస్టు సమయంలో స్త్రీలు తింటే రక్తస్రావం ఎక్కువ అవుతుందని, ముసలివారికి, పిల్లలకు అజీర్ణం చేస్తుందని ఇలా ఎన్నో అపోహలున్నాయి. వీటిలో నిజం లేదని శాస్త్రీయంగా రుజువయ్యింది. అంతేకాకుండా బొప్పాయిలో లభ్యమయ్యే అనేక పోషకాలు మన ఆరోగ్య పరిరక్షణకు చాలా అవసరం ం.
విశేషాలు
◾ఆసియా దేశాల్లోని కొన్ని ప్రాంతాల్లో బొప్పాయి పండులోని గింజల్ని ఎండబెట్టి మిరియాలకు బదులుగా వాడతారు[
◾బొప్పాయి ఆకుల్ని ఉడికించి పాలకూరలా తింటుంటారు
◾శ్రీలంక, భారత్‌, పాకిస్థాన్‌... వంటి దేశాల్లో గర్భనిరోధానికీ, గర్భస్రావానికీ బొప్పాయిని వాడతారు
◾ప్రస్తుతం బొప్పాయిని హవాయ్‌లో ఎక్కువగా పండిస్తున్నారు.
◾మెక్సికన్లు దీన్ని ట్రీ మెలన్‌ అనీ పాపా అనీ పిలుస్తారు.
◾పలకబారిన కాయల్ని గది ఉష్ణోగ్రత దగ్గర ఐదారు రోజులపాటు ఉంచితే బాగా పండుతాయి.
◾మధ్య అమెరికా, దక్షిణ అమెరికాలోని ఉత్తరభాగంలో,మెక్సికోలో ఎక్కువగా పండే బొప్పాయి స్పానిష్‌, పోర్చుగీస్‌ యాత్రికుల ద్వారా ఇతర ప్రాంతాలకు పరిచయమైంది
◾గతంలో బొప్పాయి పండ్లను తినడానికి గాని, వాటిని పెంచ డానికి గాని ప్రజలు/ రైతులు అంతగా ఇష్ట పడే వారు కాదు. ప్రస్తుతం ప్రజలు ఎక్కువగా తింటున్నందున పందిస్తున్నారు.

◾ఎండబెట్టిన బొప్పాయి మొక్కలని కుక్కలు ఇష్టంగా తింటాయి.

లీచీ

లీచీ (లీచీ చైనెన్సిస్ , మరియు సాధారణంగా లీచి , లీచీ , లైచీ , లీచు అని పిలుస్తుంటారు) (ఆంగ్లం: Lychee; హిందీ: लीची, līchī) (చైనీస్:荔枝, lizhi) అనేది సాపిండేసియే వర్గంలో సోప్‌బెర్రీ కుటుంబానికి చెందిన లీచీ తరగతిలోని ఒక ఒంటరి వృక్షజాతి. ఉష్ణమండల మరియు ఉపోష్ణమండల ప్రాంతాల్లో పెరిగే ఈ ఫల వృక్షం జన్మస్థలం చైనా అయినప్పటికీ, ప్రస్తుతం దీన్ని ప్రపచంలోని అనేక ప్రాంతాల్లో సాగు చేస్తున్నారు. దీని తాజా ఫలం "సుగంధ పరిమళ" సువాసన ఉన్న ఒక "సున్నితమైన, తెల్లటి కండ కలిగిన ఫలం", ఈ ఫలాన్ని నిల్వచేసిన సమయంలో సువాసన కోల్పోతుంది కాబట్టి చాలావరకు దీన్ని తాజాగా ఉన్నప్పుడే తింటుంటారు.[2]
లీచీ ఒక సతతహరిత వృక్షం, దాదాపు 10–20 మీటర్ల పొడవు పెరగడంతో పాటు 5 సెంమీ (2.0 in) పొడవు మరియు 4 సెంమీ (1.6 in) వెడల్పు కలిగిన కండగల ఫలాలను అందిస్తుంది. ఈ ఫలానికి వెలుపలి భాగం ఊదా-ఎరుపు రంగు, గరుకైన తొక్కను కలిగి ఉంటుంది, ఈ తొక్క తినేందుకు ఉపయోగపడనప్పటికీ, లోపల ఉండే తియ్యని, అపారదర్శక తెల్లని కండగల ఫలాన్ని గ్రహించే దిశగా దీన్ని సులభంగా తీసివేయవచ్చు. లీచీని భోజనం తర్వాత ఆరగించే అనేక ఫలాల రకాల్లో ఒకటిగా తీసుకోవడంతో పాటు ఇవి ప్రత్యేకించి దక్షిణాసియాతో సహా చైనా, ఆగ్నేయాసియాల్లో చాలా ప్రాచూర్యం పొందాయి.[2][3]
లీచీ చైనాలో సాగవడంతో పాటు థాయిలాండ్, ఉత్తర వియత్నాం, మరియు ఉత్తర భారతదేశంలో ప్రత్యేకించి బీహార్‌లో ఎక్కువగా పండుతుంది, ఇక్కడి మొత్తం ఉత్పత్తిలో ఇది 75% వాటాను కలిగి ఉంది.[2][4] వీటితోపాటు దక్షిణాఫ్రికా మరియు యునైటెడ్ స్టేట్స్ (హవాయి మరియు ఫ్లోరిడా) దేశాలు సైతం వాణిజ్యపరంగా లీచీని ఉత్పత్తి చేస్తున్నాయి.[2]
లీచీ సాగుకు చారిత్రక ప్రాశస్త్యం కూడా ఉంది, చైనా రికార్డుల ప్రకారం క్రీ.పూ.2000 వెనుకటి కాలంలోనూ ఈ వృక్షాల ప్రస్తావన ఉంది. అయితే దక్షిణ చైనా, మలేషియా, మరియు ఉత్తర వియత్నాంలలో దీని సాగు ప్రారంభమైంది. మరోవైపు దక్షిణ చైనా మరియు హైనాన్ ద్వీపంలలో ఇప్పటికీ లీచీకి సంబంధించిన వన్యరకం వృక్షాలు పెరుగుతున్నాయి. సున్నితత్వానికి మారుపేరుగా చైనీస్ ఇంపీరియల్ కోర్టులో లీచీ ఫలాలకు సంబంధించిన అనేక వృత్తాంతాలున్నాయి. 1782లో ఇది మొదటిసారిగా పశ్చిమాన వెలుగుచూడడంతో పాటు పరిచయం చేయబడింది.[1]
వర్గీకరణ
లీచీ చైనెన్సిస్ గురించి పియర్ర్ సెన్నెరాట్ తన Voyage aux Indes orientales et à la Chine, fait depuis 1774 jusqu'à 1781 (1782)లో వర్ణించడంతో పాటు నామకరణం కూడా చేశారు. లీచీలో మూడు ఉపజాతులున్నాయి, పుష్పాల అమరిక, శాఖల మందం, ఫలం, కేశరాలను బట్టి వీటిని గుర్తిస్తారు.
లీచీ చైనెన్సిస్ subsp. చైనెన్సిస్ అనేది ఏకైక వాణిజ్యపరమైన లీచీగా ఖ్యాతి వహించింది. వన్యజాతి రూపంలో ఇది దక్షిణ చైనా, ఉత్తర వియత్నాం, మరియు కంబోడియాల్లో పెరుగుతుంది. ఈ జాతిలో పలుచని కొమ్మలు, పుష్పాల్లో విశిష్టమైన రీతిలో ఆరు కేసరాలు ఉండడంతో పాటు ఫలం మెత్తగా లేదా 2 మి.మీ వరకు ఉండే బుడిపెలతో ఉంటుంది.
లీచీ చైనెన్సిస్ subsp. ఫిలిఫైనెన్సిస్ (Radlk.) లీన్. ఫిలిఫ్పైన్స్ మరియు పపువా న్యూ గీనియాలలో ఇది సాధారణంగా వన్యజాతి రూపంలో పెరగడంతో పాటు అరుదుగా మాత్రమే సాగు చేయబడుతుంది. ఇందులో పలుచని కొమ్మలు, ఆరు నుంచి ఏడు కేసరాలతో పాటు 3 మి.మీ వరకు పొడవు కలిగిన ముళ్లుల వంటి బుడిపెలతో నిండిన అండాకార ఫలాలు ఉంటాయి.
లీచీ చైనెన్సిస్ subsp. జావెన్సిస్ . మలేషియా, ఇండోనేషియాల్లో మాత్రమే సాగులో ఉన్న రకంగా ఇది సుపరిచితం. ఇందులో మందమైన కొమ్మలు, ఏడు నుంచి పదకొండు కేశరాలు పీఠం లాంటి ఆధారంపై గుత్తిలా ఉండడంతో పాటు 1 మి.మీ పొడవైన బుడిపెలతో కూడిన మృదువైన ఫలం ఉంటుంది.[5]
వర్ణనసవరించు
లీచీ చైనెన్సిస్ పువ్వులు.
L. చైనెన్సిస్ అనేది ఒక సతతహరిత వృక్షం, ఇది తరచూ 10 మీ (33 అడుగులు) కంటే తక్కువ ఎత్తులోను, కొన్నిసార్లు 15 మీ (49 అడుగులు) కంటే ఎక్కువ ఎత్తులోనూ ఉంటుంది. దీని కాండం బూడిద-నలుపులోను, కొమ్మలు గోధుమ-ఎరుపు వర్ణంలోనూ ఉంటాయి. కొమ్మలు 10–25 సెంమీ (3.9–9.8 in) లేదా అంతకంటే ఎక్కువ పొడవుగా ఉండడంతో పాటు పత్రాలు 2-4 జతలుగా ఉంటాయి.[6] పుష్పాలు పుష్పగుచ్ఛానికి సంబంధించిన ఆధారంపై పెరగడంతో పాటు ఆయా కాలాల వృద్ధిపై ఆధారపడి అనేక పానికిల్స్ ఉంటాయి. పానికిల్స్ అనేవి పది లేదా అంతకంటే ఎక్కువ సమూహాలుగా పెరగడంతో పాటు 10–40 సెంమీ (3.9–15.7 in) లేదా అంతకంటే ఎక్కువ పొడవు కూడా ఉండవచ్చు, వీటిపై వందలకొద్దీ సంఖ్యలో విశిష్టమైన సువాసనతో కూడిన తెల్లటి, పసుపు, లేదా పచ్చని పుష్పాలు ఉంటాయి.[5]
ఫలాలు 80-112 రోజుల్లో పక్వానికి వస్తాయి, అయితే ఇది వాతావరణం, ప్రదేశం, సాగు విధానంపై ఆధారపడి ఉంటుంది. ఫలాలు 5 సెంమీ (2.0 in) వరకు పొడవుతో మరియు 4 సెంమీ (1.6 in) వరకు వైశాల్యాన్ని కలిగి ఉండడంతో పాటు గుండ్రని, అండాకారం, హృదయాకారం లాంటి వివిధ రూపాల్లో ఉంటాయి. ఫలంపై ఉండే పలుచని, కఠినమైన తొక్క తినడానికి ఉపయోగకరంగా ఉండకపోవడంతో పాటు, అపరిపక్వ దశలో పచ్చగానూ, పక్వానికి చేరేకొద్దీ ఊదా-ఎరుపు వర్ణంలోను, మరియు ఉపరితలం నునుపైన లేదా చిన్నపాటి పదునైన బుడిపెలను కలిగి ఉంటాయి. కోత తర్వాత ఫలాన్ని నిల్వ చేసిన పక్షంలో దానిపై ఉండే తొక్క గోధుమ వర్ణంలోకి మారడంతో పాటు ఎండిపోవడం జరుగుతుంది. ఫలంలోని కండతో కూడిన, తినదగిన భాగం ఒక ఏరియల్, 1–3.3 సెంమీ (0.39–1.30 in) పొడవు మరియు .6–1.2 సెంమీ (0.24–0.47 in) వ్యాసం కలిగిన తినడానికి ఉపయోగపడని ఒక గోధుమ వర్ణంలోని గింజ చుట్టూ ఇది ఆవృతమై ఉంటుంది. 'చికెన్ టంగ్స్'గా సుపరిచితమైన తక్కువగా ఎండబెట్టిన విత్తనాల సాయంతో కొంతమంది సాగుదారులు ఎక్కువ శాతం ఫలాలను ఉత్పత్తి చేస్తుంటారు. తినదగిన కండను కలిగి ఉండడం వల్ల ఈ రకమైన ఫలాలు ఎక్కువ ధర కలిగి ఉంటాయి.[5]
చరిత్

భారతదేశంలోని పశ్చిమ బెంగాల్‌లో ఉన్న డార్జిలింగ్‌ జిల్లాలో ఉన్న శాంసింగ్ వద్ద గల పత్రాలు & పుష్పాలు.
దక్షిణ చైనా, మలేషియా, మరియు ఉత్తర వియత్నాం ప్రాంతాల్లో లీచీ సాగు ప్రారంభమైంది. అదేసమయంలో వన్య రకం వృక్షాలు నేటికీ గాంగ్‌డాంగ్ ప్రొవియన్స్ మరియు హైనాన్ ద్వీపంలోని వర్షారణ్యాల్లో పెరుగుతున్నాయి. చైనాకు సంబంధించిన అనధికార రికార్డుల వివరాల ప్రకారం, క్రీ.పూ. 2000 నుంచి కూడా లీచీ సుపరిచితం.[7]
మొదటి శతాబ్దంలో, ఇంపీరియల్ కోర్టులో తాజా లీచీలకు బాగా డిమాండ్ ఉండేది, ఖండాంతరాల నుంచి వీటిని వేగంగా తెప్పించడం కోసం వేగంగా వెళ్లే గుర్రాలతో కూడిన ఒక ప్రత్యేక కొరియర్ సర్వీస్‌ను ఉపయోగించేవారు. ట్సె సియాంగ్ రాసిన లీ చీ పు (లీచీలపై గ్రంథం)లోని వివరాల ప్రకారం సంగ్ రాజ్యం (క్రీ.శ.960-1279)లో లీచీకి గొప్ప డిమాండ్ ఉండేది. చక్రవర్తి అయిన లీ లాంగ్జీ (గ్జున్‌జాంగ్) యొక్క ప్రియమైన ఉంపుడుగత్తె యాంగ్ యువాన్ (యాంగ్ గుఫియే)కు సైతం ఇది అత్యంత ఇష్టమైన ఫలం. అత్యధిక మొత్తాన్ని ఖర్చు చేయడం ద్వారా చక్రవర్తి లీచీ ఫలాన్ని రాజధానికి తెప్పించేవాడు.[2]
చైనీస్ ప్రాచీన కావ్యమైన శాంగ్‌లిన్ ఫు ఈ ఫలానికి సంబంధించి రచించబడినదే, కొమ్మ నుంచి తుంచిన కొద్ది కాలానికే పాడయ్యే ఈ ఫలానికి ఉన్న లక్షణాన్ని పరిగణలోకి తీసుకుని ఈ కావ్యానికి ఈ విధమైన ప్రత్యామ్నాయ పేరు సూచించడం జరిగింది.
పియర్ర్ సెన్నెరాట్ (1748–1814) ద్వారా పశ్చిమాన తొలిసారిగా లీచీ పరిచయంలోకి వచ్చింది, చైనా మరియు ఆగ్నేయాసియాలలో సాగిన తన యాత్ర నుంచి తిరిగివచ్చే సందర్భంగా ఆయన లీచీలను పరిచయం చేశారు. దీని తర్వాత ఇది జోసెఫ్-ఫ్రాంకోయిస్ ఛార్పెంటైర్ డీ కొసైనీ డీ పామా ద్వారా 1764లో రీయూనియన్ ద్వీపానికి పరిచయం చేయబడింది. అటుపై ఇది మడగాస్కర్‌కు సైతం పరిచయం చేయబడడంతో పాటు త్వరలోనే ఆ ప్రాంతం అత్యధికంగా లీచీలను ఉత్పత్తి చేసే ప్రాంతంగా మారింది.
ప్రధాన వేరు కలిగిన మొలకెత్తుతున్న లీచీ విత్తనం.(దాదాపు 3 నెలల వయసున్నది)
దస్త్రం:Lychee seed.jpg
సాదారణ పరిమాణం కలిగిన విత్తనం (ఏడమ) మరియు చిన్న పరిమాణం(చికెన్ టంగ్)కలిగిన విత్తనం (కుడి)
లీచీలు చైనాతో పాటు, ఆగ్నేయ ఆసియా థాయిలాండ్, లావోస్, కంబోడియా, వియత్నాం, పాకిస్థాన్, బంగ్లాదేశ్, భారతదేశం, దక్షిణ జపాన్‌లతో సహా, ఇటీవల కాలిఫోర్నియా, హవాయ్, టెక్సాస్, ఫ్లోరిడా,[8] తడి ప్రదేశాలైన ఆస్ట్రేలియా మరియు ఉప-ఉష్ణమండల ప్రాంతాలైన దక్షిణాఫ్రికా, ఇజ్రాయిల్‌తో పాటుగా సినలోవా మరియు మెక్సికోలోని శాన్ లూయిస్ పోటోసీ (ప్రత్యేకించి లా హువస్టేకా) లాంటి ఇతర ప్రాంతాల్లోనూ పండుతున్నాయి. లీచీ వృక్షాలకు వెచ్చగా ఉండే ఉపోష్ణమండల వాతావరణం మొదలుకుని చల్లగా ఉండే ఉష్ణమండల వాతావరణం వరకు అవసరమైనప్పటికీ, గడ్డకట్టే లేదా -4 °Cకు తగ్గని కేవలం పూర్తిస్థాయి గడ్డకట్టే చలికాలంతో పాటు అత్యధిక ఉష్ణం కలిగిన వేసవి, వర్షపాతం, మరియు తేమ లాంటి వాటినీ ఇవి తట్టుకుంటాయి. చక్కని నీటిపారుదల, సేంద్రియ పదార్థాలతో నిండిన పూర్తి స్థాయి ఆమ్లయుత మృత్తికల్లో ఈ వృక్షాలు చక్కగా పెరుగుతాయి. దీంతోపాటు వరుసగా వెచ్చని మరియు చల్లని వాతావరణాలకు సరిపోయే విధంగా త్వరగానూ మరియు ఆలస్యంగానూ పక్వానికి వచ్చే విభిన్న వృక్ష జాతులు విస్తారమైన స్థాయిలో అందుబాటులో ఉన్నాయి. మరోవైపు లీచీలను పండ్ల కోసమే కాకుండా అలంకార మొక్కలుగానూ పెంచుతుంటారు.
లీచీలను తాజా రూపంలో ఆసియా మార్కెట్లలో విక్రయించడంతో పాటు ఇటీవలి సంవత్సరాల్లో ప్రపంచవ్యాప్తంగా సూపర్‌మార్కెట్లులోనూ విక్రయిస్తున్నారు. లీచీ పండ్లను శీతలీకరించిన సమయంలో దాని ఎర్రటి తొక్క భాగం గోధమ రంగులోకి మారినప్పటికీ, దాని రుచి మాత్రం ఏవిధంగానూ ప్రభావితం కాదు. లీచీలను క్యాన్‌లలో నిల్వచేయడం ద్వారా ఏడాది పొడవునా విక్రయిస్తుంటారు. ఈ పండ్లను తొక్కతో పాటుగా ఎండబెట్టిన సమయంలో దానిలోని కండ భాగం కృశించుకుపోవడంతో పాటు ముదురు రంగులోకి మారుతుంది.[2] ఎండిన లీచీలను తరచూ లీచీ నట్స్‌ అని పిలిచినప్పటికీ, నిజానికి అవి నిజమైన గింజలు కావు.
జానపదగాథల ప్రకారం, లీచీ వృక్షానికి బెరడు తొలగింపు చేస్తే అది ఎక్కువ ఫండ్లను ఉత్పత్తి చేయదు, మరిన్ని ఫండ్ల ఉత్పత్తికి అది దారితీస్తుంది.
విభిన్న వృక్ష సముదాయాలు
    విస్తారమైన సంఖ్యలో లీచీ వృక్ష రకాలు ఉండడం వల్ల వాటి పేర్లు మరియు గుర్తింపుల విషయంలోనూ కావల్సినంత తికమక చోటు చేసుకుంది. ఒకే రకానికి చెందిన వృక్షరకం విభిన్నమైన వాతావరణాల్లో పెరిగినట్టైతే అది పూర్తిగా భిన్నమైన రుచిని కలిగిన ఫలాలను ఉత్పత్తి చేస్తుంది. లీచీ వృక్షజాతులకు ప్రపంచంలోని విభిన్న ప్రాంతాల్లో విభిన్నమైన పర్యాయపదాలు సైతం వాడుకలో ఉన్నాయి. ఆస్ట్రేలియాతో సహా, ఆగ్నేయ ఆసియా దేశాల్లో ప్రధాన వృక్షజాతులకు స్వచ్ఛమైన చైనీస్ పేర్లనే ఉపయోగించడం జరుగుతోంది. భారతదేశంలో డజనుకు పైగా విభిన్న రకాల లీచీ వృక్షాలు పెరుగుతున్నాయి. దక్షిణాఫ్రికాలో ప్రధానంగా 'మౌరిటియస్' వృక్షరకం పెరుగుతోంది. హవాయ్ దేశంలో అభివృద్ధి చేసిన 'గ్రాఫ్' రకాన్ని మినహాయిస్తే యునైటెడ్ స్టేట్స్‌లో పెరుగుతున్న లీచీ వృక్ష రకాల్లో అత్యధిక భాగం చైనా నుంచి దిగుమతి చేసుకున్నవే.[3]

లీచీ వృక్షాలు పెరిగే అనేక రకాల ప్రాంతాలు మరియు దేశాల్లో విభిన్న రకాల వృక్షరకాలు ప్రసిద్ధమైనవి. చైనాకు సంబంధించి ఆదరణ పొందిన వృక్షరకాలు: సెనాయుహాంగ్, బైటాంగియింగ్, బైలా, శుయ్‌డాంగ్, ఫెయ్‌జిక్సియో, డాజౌ, హెయియే, నుయోమిసి, గుయివై, హౌఐజీ, లంజూ, మరియు చెంజీ మొదలుగునవి. వియత్నాంకు సంబంధించి ఆదరణ కలిగిన వృక్షరకాలు: లాంఘ్‌నన్, టైవీ, మరియు జుంగ్‌కమ్‌వాంగ్ మొదలుగునవి. హవాయ్ వృక్షరకంపై ఆధారపడి ఫ్లోరిడా లీచీలను ఉత్పత్తి చేస్తోంది. ఆస్ట్రేలియాకు సంబంధించి కొహాలా, కోంపూ, హేవూ, మరియు బీవ్ కీవ్ లాంటి రకాలను ఎక్కువగా సాగుచేయడం జరుగుతోంది.[5] భారతదేశం విషయానికి వస్తే, షాహీ (అత్యధిక కండ %) ,డెహ్రా డన్, ఎర్లీ లార్జ్ రెడ్, కలకట్టియా, రోస్ సెంటెడ్‌లతో సహా డజనుకు పైగా రకాలు సాగుబడిలో ఉన్నాయి.[3][9]
ఫోషక పదార్థాల వివరాలు.
Lychee (edible parts)
Nutritional value per 100 g (3.5 oz)
Energy
276 కి.J (66 kcal)
Carbohydrates
16.5 g
- Dietary fiber
1.3 g
Fat
0.4 g
Protein
0.8 g
Vitamin C 72 mg (87%)
Calcium 5 mg (1%)
Magnesium 10 mg (3%)
Phosphorus 31 mg (4%)
Edible parts are 60% of total weight
Percentages are relative to
US recommendations for adults.
Source: USDA Nutrient Database
లీచీకి సంబంధించి ప్రతి 100 గ్రాముల ఫలంలో సరాసరిగా 72 మి.గ్రా విటమన్ C ఉంటుంది.[10] సరాసరిగా తొమ్మిది లీచీ ఫలాలను తీసుకుంటే పెద్దవారికి సిఫార్సు చేయబడిన రోజువారీ విటమిన్ C అవసరం నెరవేరినట్టే.
ఇక ఒక కప్పుడు లీచీ ఫలాల ద్వారా ఇతర ఖనిజ లవణాల రూపంలో, 2000 క్యాలరీ డైట్, 14%DV రాగి, 9%DV ఫాస్పరస్, మరియు 6%DV పొటాషియం లాంటివి కూడా లభిస్తాయి.
లీచీలలో సంతృప్తకర కొవ్వు మరియు సోడియం తక్కువగా ఉండడంతో పాటు కొలెస్ట్రాల్ రహితం (అన్నిరకాల వృక్ష-సంబంధిత ఆహారాల వలే)గా ఉంటాయి. లీచీలలోని శక్తి రూపం చాలావరకు పిండిపదార్థం(చక్కెర) రూపంలో ఉంటుంది. పాలీఫెనాల్‌లను అధికంగా కలిగి ఉండే లీచీలు ద్రాక్షతో పోలిస్తే 15% ఎక్కువ పాలీఫెనాల్‌ను కలిగి ఉండడం వల్ల సాధారణంగా వీటిని పాలీఫెనాల్ అత్యధికంగా కలిగిన ఫలా

గ్రహాలకు సంబందించిన మొక్కలను

క్రింది
గ్రహాలకు సంబందించిన మొక్కలను నాటడము వలన పూజించడము వలన రెట్టింపు ఫలితాన్ని పొందవచ్చు

రవి:-తెల్లజిల్లేడు వాత,కఫ వ్యాదులను తగ్గిస్తుంది.తెల్లజిల్లేడు సమిధలతో ఇంట్లో హోమం చేస్తే వాస్తుదోషాలు నివారణ అవుతాయి.కళ్ళకి సంబంధించిన అనారోగ్యాలు నయమవుతాయి.కోప స్వభావాలు తగ్గుతాయి.తలనొప్పి భాధలు ఉండవు. ఆయుర్వేదం ప్రకారం అర్కలో కుష్టు వ్యాధిని నయం చేసే శక్తి వుంది.
చంద్రుడు:-మోదుగ సమిధలతో హోమం చేస్తే మానసిక సమస్యలు ఉండవు.ఆలోచనావిధానంలో మార్పులుంటాయి. సుఖవ్యాధులు దరిచేరవు.మోదుగాకును మెత్తగా నూరి పాలతో తాగిన స్త్రీలకు ఋతుసంబంధ సమస్యలు,గర్భ సంబంధ సమస్యలు ఉండవు.మోదుగ పువ్వులు,గింజలు ఎండబెట్టి నీటిలో ఒక పావు చెంచా వేసి కాగబెట్టుకొని తాగితే లావుగా ఉన్నవారు సన్నగా అవుతారు. వైద్యపరంగా చూస్తే జీర్ణ వ్యవస్థను అద్భుతంగా పునరుజ్జీవింప చేసే శక్తి మోదుగకు వుంది. రక్తాన్ని శుభ్రపరుస్తుంది.
కుజుడు:-చండ్ర సమిధతో హోమం చేస్తే ఎర్రరక్త కణాల ఇబ్బందులు,ఎముకల బలహీనత ఇబ్బందులను అరికడుతుంది.పచ్చి పోక చెక్కలు కషాయం పెట్టి సేవిస్తే మడుమేహం,కోపస్వభావాలు తగ్గుతాయి.
బుధుడు:-ఉత్తరేణి సమిధను హోమంలో ఉపయోగిస్తే చర్మవ్యాదులు తగ్గుతాయి.జీర్ణ సంభంధ సమస్యలు ఉండవు.ఉత్తరేణి పూల్లతో గాని,వేరుతోగాని రోజూ దంతధావనం చేసుకుంటే దంతదోషాలు తొలగిపోతాయి.ఉత్తరేణి ఆకులు,గింజలు పొగ వేసి పీలిస్తే దీర్ఘ కాలంగా ఉన్న దగ్గు,జలుబు,ఆయాసం తగ్గుతాయి.
గురువు:-రావి సమిధలతో హోమంచేస్తే సంతాన దోషాలు తొలగిపోతాయి.రావి చెక్కకాషాయాన్ని తేనెలో కలిపి తీసుకుంటే వాటా రక్త దోషాలు తగ్గుతాయి.నోటిపూత పోవును. రావి చెక్కకాషాయాన్నిరోజు తీసుకుంటే ఆహారం త్వరగా జీర్ణం అవుతుంది.కాలేయ సమస్యలు ఉండవు. వివిధ కఫ దోషాలను రూపుమాపుతుందని ఆయుర్వేదంలో వుంది.
శుక్రుడు:-మేడి చెట్టు సమిదలతో హోమంచేస్తే వివాహ సమస్యలు,వైవాహిక సంబంద సమస్యలు ఉండవు. గురు దత్తాత్రేయులవారికి అత్యంత ప్రీతికరమైన వృక్షం ఔదుంబర వృక్షం (మేడి చెట్టు). దత్తాత్రేయుల వారు ఎల్లప్పుడు సుక్ష్మరూపంలో సుప్రతిష్టితులై ఈవృక్ష మూలమునందు ఉంటారు. దీని కాయలు, చెట్టు మొదలు నుండి తీసిన రసం వాడితే మధుమేహవ్యాధి నివారించబడుతుంది. దీని విత్తనాలు పొడి చేసి, తేనెతో కలిపి తీసుకున్నా మధుమేహం దరిదాపుల్లో కనిపించకుండా పోతుంది.
శని:-జమ్మి సమిధలతో హోమంచేస్తే అప మృత్యు భయం తొలగి పోతుంది.దీర్ఘకాల అనారోగ్యాలు తొలగిపోతాయి.శమీ వృక్ష గాలి శరీరానికి తగిలిన శారీరక ఇబ్బందులు తొలగిపోతాయి.ప్రతి రోజు శమీ వృక్షానికి ప్రదక్షిణ చేసిన దీర్ఘకాల అనారోగ్యాలు తొలగిపోతాయి.
రాహువు:-గరికలతో హోమంచేస్తే ఇంటిలో నరదృష్టి తొలగిపోయి సర్ప సంభంద దోషాలు తొలగిపోతాయి. గరిక రసాన్ని గజ్జి,చర్మంపైన ఉన్న కురుపులపై పెట్టిన చర్మరోగాలు నివారించబడతాయి. దెబ్బతగిలి రక్తం కారిపోతుంటే గరిక రసాన్ని పిండితే రక్తం ఆగి పోతుంది.
కేతువు:-ధర్భాతో హోమంచేస్తే కాలసర్పదోషాలు తొలగిపోతాయి.మూర్ఛ రోగాలను తగ్గిస్తుంది.
జాతకంలో ఏదైనా సమస్యలు ఉంటే శాంతి ప్రక్రియలో భాగంగా హోమం చేసుకోవాలి అని చెబితే ఇంట్లో స్థలం లేదని దేవాలయంలోనో,మరెవరైనా ఇంట్లోనో నవగ్రహ సమిధలతో హోమం చేస్తే గ్రహభాడలు తొలగిపోవు.. ఇబ్బంది ఏ ఇంట్లో ఉంటే ఆ ఇంట్లోనే హోమం చేస్తే మంచిది. తరచుగా హోమాలను చేసినట్లయితే ఏ రకమైన ప్రమాదాలు, ఇబ్బందులు ఎదురుకావు. హోమంవల్ల అన్ని ప్రయోజనాలు ఉన్నాయి. ప్రత్యక్షంగా మన ఆరోగ్యానికి. పరోక్షంగా నవగ్రహాలపై ప్రభావం చూపుతుంది.
పై గ్రహాలకు సంబందించిన మొక్కలను నాటడము వలన పూజించడము వలన రెట్టింపు ఫలితాన్ని పొందవచ్చు

తలంబ్రాలు చెట్టు

తలంబ్రాలు చెట్టు పేరుకే చెట్టు కానీ నిజానికి ఒక పొద. ఈ మొక్క లాంటానా ప్రజాతికి చెందినది. దీనిలో 150కి పైగా జాతులు కలవు. తలంబ్రాలు చెట్టు స్వస్థలము ఆఫ్రికా మరియు అమెరికా ఖండాలు.

హిమాచల్ ప్రదేశ్ లో లాంటానా పొదలను ఫర్నీచరు మరియు కంచెలు తయారు చేయడానికి ఉపయోగిస్తున్నారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని చిత్తూరు జిల్లాలో మరియు తమిళనాడు లోని నతము వద్ద లాంటానా పొదలను మరియు స్థానికంగా దొరికే కలుపు పొదలను కొన్ని సముదాయాలు బుట్టలు అళ్లడానికి ఉపయోగిస్తున్నారు.
కొన్ని ప్రాంతాల్లో, ఈ చెట్టు ని లంబాడీ చెట్టు, గాజుకంప అని కూడా అంటారు.



మామిడి

మామిడి (ఆంగ్లం: Mango) కి నాలుగు వేల సంవత్సరముల చరిత్ర ఉన్నది. ఇది భారతదేశపు జాతీయ ఫలం. ఇవి మాంగిఫెరా (Mangifera) ప్రజాతికి చెందిన వృక్షాలు. వీటి కాయలను ఊరగాయల తయారీలో ఉపయోగిస్తారు. మామిడిపళ్ల నుండి రసం తీసి తాగుతారు. వీటినుండి మామిడి తాండ్ర తయారు చేసి అమ్ముతారు. ఇందులో కెరోటిన్ , విటమిన్ సి, కాల్షియం ఎక్కువ.దీని ఆకులను "చూత పత్రి" అని కూడా అంటారు. ఈ ఆకు పచ్చ రంగులో ఉంటుంది. ఆకారం కిరీటం ఆకారంలో ఉంటుంది. పరిమాణం పెద్దది. ఈ చెట్టు మహావృక్షం గా పెరుగుతుంది. భారతదేశంలో వంద రకాలకుపైగా మామిడిపళ్ళు దొరుకుతాయి. 
మామిడిచెట్టు 

మామిడి పండ్లు ఎందుకు ...https://www.youtube.com/channel/UCK_hnGZVt5H1SfOn6e5jVnA   
ఇది ఉష్ణదేశపు పండ్ల చెట్టు. తొంభై (90) నుండి నూట ఇరవై (120) అడుగుల ఎత్తు వరకు పెరుగుతుంది. ముప్పై(30) అడుగుల వ్యాసం వరకు విస్తరించి కిరీటం ఆకారంలో ఉంటుంది. ఆకులు పది (10) నుండి (35) సెంటి మీటర్ల పొడవు ఆరు (6) నుండి పది (10) సెంటి మీటర్ల వెడల్పు ఉండి ఎప్పడూ పచ్చగా ఉంటాయి. చిగుళ్లు లేత తేనె రంగు నుండి ముదురు కాఫీ రంగుకు మారి చివరిగా ముదురు ఆకుపచ్చ రంగుకి వస్తాయి. పూల గుత్తులు పది (10) నుండి నలభై (40) సెంటి మీటర్ల పొడవు ఉంటాయి. పూవు చిన్నదిగా ఐదు (5) నుండి (10) మిల్లి మీటర్లు పొడవు ఐదు (5) రెక్కలు కలిగి లేలేత సువాసనతో ఉంటాయి. పుష్పించడం పూర్తి ఐన తరువాత కాయలు రూపు దిద్దుకొని మూడు (3) నుండి ఆరు (6) మాసాలలో పక్వానికి వస్తాయి.
పక్వానికి వచ్చిన పండ్లు పొడవాటి కాడలతో కిందకు వేలాడుతూ ఉంటాయి. ఇవి సూర్యరశ్మి తగిలే వైపు కొంచెం లేత ఎరుపు రంగుతోను ఇంకొక వైపు పసుపు రంగుతోను ఉంటాయి. ఇవి తియ్యని సువాసనతో ఉంటాయి. ఏడు (7) నుండి (12) సెంటి మీటర్ల వ్యాసం, పది (10) నుండి ఇరవై ఐదు (25) సెంటి మీటర్ల పొడవు కలిగి ఉంటాయి. రెండున్నర (2.5) కిలోగ్రాముల వరకు బరువు కలిగి ఉంటాయి. పండు మధ్యలో పీచు తోను, పీచు లేకుండాను ధృడమైన ముట్టె ఉంటుంది. అది ఒకటి(1)నుండి(2) మిల్లీమీటర్లు మందంతో, పల్చటికాగితం లాంటి పొర ఉన్న విత్తనంతో (జీడి) ఉంటుంది. విత్తనం నాలుగు (4) నుండి ఏడు (7) సెంటి మీటర్ల పొడవు, మూడు (3) నుండి నాలుగు (4) సెంటి మీటర్ల వెడల్పు, ఒక (1) సెంటీమీటర్ మందం కలిగి ఉంటుంది.
మామిడి ఉపయోగాలుసవరించు
మామిడి, ముడి
పోషక విలువలు, ప్రతి 100 గ్రాములకు
శక్తి 70 kcal 270 kJ
పిండిపదార్థాలు
17.00 గ్రా.
- చక్కెరలు 14.8 గ్రా.
- పీచుపదార్థాలు 1.8 గ్రా.
కొవ్వు పదార్థాలు
0.27 గ్రా.
మాంసకృత్తులు
.51 గ్రా.
విటమిన్ A 38 μg 4%
థయామిన్ (విట. బి1) 0.058 mg 4%
రైబోఫ్లేవిన్ (విట. బి2) 0.057 mg 4%
నియాసిన్ (విట. బి3) 0.584 mg 4%
పాంటోథీనిక్ ఆమ్లం (B5) 0.160 mg 3%
విటమిన్ బి6 0.134 mg 10%
ఫోలేట్ (Vit. B9) 14 μg 4%
విటమిన్ సి 27.7 mg 46%
కాల్షియమ్ 10 mg 1%
ఇనుము 0.13 mg 1%
మెగ్నీషియమ్ 9 mg 2%
భాస్వరం 11 mg 2%
పొటాషియం 156 mg 3%
జింకు 0.04 mg 0%
శాతములు, అమెరికా వయోజనులకు
సూచించబడిన వాటికి సాపేక్షంగా
Source: USDA పోషక విలువల డేటాబేసు
Index of /pub/wikimedia/images/wikipedia/te/0/0c/ప్రపంచం అంతటా ఇప్పుడు మామిడి పండు తినడం పట్ల మక్కువ పెరిగింది. ఇప్పుడు ఈ పంటను సమశీతోష్ణ పరిస్థితిలో కూడా పండిస్తూ ఉన్నారు భారతద్వీపకల్పం అంతటా, కరేబియన్(Caribbean), మధ్య అమెరికా, మధ్య ఆసియా, దక్షిణ తూర్పు అసియా, మధ్య మరియు దక్షిణ ఆఫ్రికా దేశాలలోను పండిస్తున్నారు. దీనిని ఎక్కువగా తాజాగానే తింటారు. ఇంకా పంటగా వేయని దక్షిణ ఫ్లోరిడాలో కూడా మామిడిచెట్టుని ఇంటి పెరటిలో చూడవచ్చు.
మామిడిపండ్లు ప్రపంచమంతా ఇష్టమైన ఆహారమే అయినా రైతులు తక్కువ ప్రతిఫలం పొందుచున్నారు. అందువలన ఇవి అందరికి అందుబాటులో ఉంటాయి. తాజా మామిడి పండులో పదిహేను శాతం(15%) చక్కెర, ఒక శాతం(1%) మాంసకృత్తులు మరియు గుర్తించ తగిన మోతాదులో ఎ,బి,సి(A,B,C) విటమిన్లు ఉంటాయి. మామిడిపండు ఎక్కువగా తియ్యగా ఉన్నా, కొన్నిజాతుల పండు కొంచెం పుల్లగా ఉంటుంది, ముఖ్యంగా చిలక ముక్కు(బెంగళూరు) మామిడి ఈ కోవకు చెందినదే. అందువలనే భారతదేశంలో చిన్నచిన్న వ్యాపారులు వీటిని సన్నని పోడవైన ముక్కలుగా కోసి ఉప్పుకారం చల్లి బండిమీద అమ్ముతూ ఉంటారు. చాలామందికి నోరూరించే ఆహారం. కొన్ని పండ్లు పీచు ఎక్కువ రసంతో ఉంటాయి. వీటిని రసాలు అంటారు. కొన్ని కరకరలాడే కండతో ఉంటాయి వీటిని మల్ గోవా మామిడి అంటారు. బంగినపల్లి రకం మామిడి కాయలు ఎక్కువ తీయగా మెత్తటి కండ కలిగి ఉంటాయి. నీటిశాతం ఎక్కువ కనుక రసభరితంగా ఉంటాయి. మామిడి కాయలతో దీర్ఘకాలం నిలవ ఉండే పచ్చళ్ళు (ఊరగాయ లు) తయారు చేస్తారు.
ఉత్తర భారతంలో పుల్లని మామిడి ముక్కలను పొడిచేసి ప్యాక్ చేసి అమ్ముతారు. దీనిని వారు విరివిగా వంటలలో వాడుతుంటారు. దీనిని వారు ఆమ్ చూర్ (మామిడి పొడి) అంటారు. ఆంధ్రులు కూడా కొన్ని ప్రదేశాలలో ఇళ్ళలో ఎండపెట్టిన మామిడి ముక్కలను (వీటిని మామిడి ఒరుగు అంటారు) సంవత్సరం అంతా వాడే అలవాటు ఉంది. పచ్చి మామిడి కాయను వివిధ రూపాలలో వంటలలో వాడుతుంటారు. సున్నపు శక్తి (కాల్షియమ్) విటమిన్ బి పుష్కలంగా ఉంది కనుక అమెరికా జనం వీటిని చెక్కుతో చేర్చి తింటారు. పడమటి దేశాలలో పండ్లతో తియ్యటి పచ్చడి చేస్తారు. ఫిలిప్పైన్ లో మామిడి కాయలను ష్రిమ్ప్ అనే చేపల గుజ్జుతో చేర్చి తింటారు. ష్రిమ్ప్ అనే చేపల గుజ్జుతో అక్కడ తీపి, ఉప్పు, మసాలా రుచులను చేర్చి ఇతర వంటల లో వాడుతుంటారు. పీచేస్‌పై అనే ఆహారాన్ని ఇప్పుడు మాంగో పై తో చేస్తున్నారు. థాయ్ లాండ్ లో భోజనానంతర ఆహారం (డిసర్ట్) తో చేర్చి అందిస్తారు.
మామిడి.. క్యాన్సర్‌ నివారిణి  
మామిడి రొమ్ము, పెద్దపేగు క్యాన్సర్‌ కణాల పెరుగుదలను అరికడుతుందని మామిడి పండ్ల నుంచి తీసిన పాలీఫెనోల్‌లో క్యాన్సర్‌ కణాల పెరుగుదలను అరికట్టే గుణం ఉన్నట్టు నిపుణులు కనుగొన్నారు. ఐదు రకాల మామిడి పండ్ల నుంచి తీసిన పాలీఫెనోల్‌ను.. రొమ్ము, పెద్దపేగు, ఊపిరితిత్తులు, ప్రోస్టేట్‌, రక్త క్యాన్సర్ల బాధితులకు ఇచ్చి పరీక్షించారు. క్యాన్సర్‌ కణాల వృద్ధిని అడ్డుకోవటమే కాదు, ఇది రెండు క్యాన్సర్‌ కణాలను చనిపోయే స్థితికీ తెచ్చినట్టు గుర్తించారు.(ఈనాడు22.1.2010)
ఔషదంగా మామిడి ఉపయోగాలుసవరించు
ఔషధోపయోగాలు పాదాల పగుళ్ళు: మామిడి జిగురుకు మూడురెట్లు నీళ్ళు కలిపి పేస్టులాగా చేసి ప్రతిరోజూ పాదాలకు లేపనం చేసుకోవాలి. దీనితోపాటు ప్రతిరోజూ బూట్లు, సాక్సులు ధరించటం ముఖ్యం. పంటినొప్పి, చిగుళ్ళ వాపు: రెండు కప్పులు నీళ్ళు తీసుకొని మరిగించాలి. దీనికి రెండు పెద్ద చెంచాలు మామిడి పూతను వేసి మరికొంతసేపు మరగనివ్వాలి. స్టవ్‌మీద నుంచీ దింపి గోరువెచ్చగా ఉన్నప్పుడు పుక్కిట పట్టాలి. అవసరమనుకుంటే ఇలా రోజుకు రెండుమూడుసార్లు చేయవచ్చు.
కడుపులో పురుగులు: మామిడి టెంకలోని జీడిని వేరుపరచి ఆరబెట్టాలి. దీనికి పెద్ద చెంచాడు మెంతులను కలిపి మెత్తగా నూరాలి. దీనిని ఒక సీసాలో భద్రపరచుకొని కొన్నిరోజులపాటు మజ్జిగతో కలిపి తీసుకోవాలి.
ఆర్శమొలలు (రక్తయుక్తం): అర చెంచాడు మామిడి జీడిని పొడి రూపంలో పెరుగుమీది తేటతో కలిపి తీసుకోవాలి.
జ్వరం: మామిడి వేర్లను మెత్తగా రుబ్బి అరికాళ్ళకు, అరి చేతులకు రాసుకుంటే జ్వరంలో కనిపించే వేడి తగ్గుతుంది.
బట్టతల: ఒక జాడీలో కొబ్బరి నూనెను గాని, నువ్వుల నూనెను తీసుకొని మామిడి కాయలను ఊరేయండి. ఇలా సంవత్సరంపాటు మాగేసి తల నూనెగా వాడుకోవాలి.
చెవి నొప్పి: స్వచ్ఛమైన మామిడి ఆకులనుంచి రసం తీసి కొద్దిగా వేడిచేసి, నొప్పిగా ఉన్న చెవిలో డ్రాప్స్‌గా వేసుకోవాలి. ముక్కునుంచి రక్తస్రావం: మామిడి జీడినుంచి రసం తీసి రెండు ముక్కు రంధ్రాల్లోనూ డ్రాప్స్‌గా వేసుకోవాలి.
కంటినొప్పి: పచ్చి మామిడి కాయను కచ్చాపచ్చాగా దంచి నిప్పులపైన సుఖోష్టంగా ఉండేలా వేడిచేసి మూసి వుంచిన కన్నుపైన ‘పట్టు’ వేసుకోవాలి.
దంత సంబంధ సమస్యలు: మామిడి ఆకులను ఎండించి బూడిద అయ్యేంతవరకూ మండించండి. దీనికి ఉప్పుకలిపి టూత్ పౌడర్‌లా వాడుకోవాలి. ఈ పొడికి ఆవ నూనెను కలిపి వాడుకుంటే ఫలితాలు మరింత మెరుగ్గా ఉంటాయి.
కాలిన గాయాలు: మామిడి ఆకుల బూడిదను ‘డస్టింగ్ పౌడర్’లా వాడితే గాయాలు త్వరగా నయమవుతాయి.
ఎగ్జిమా: మామిడి చెట్టు బెరడును, నల్ల తుమ్మ బెరడును తెచ్చి కచ్చాపచ్చాగా దంచి ఉంచుకోండి. రోజూ పిడికెడంత మిశ్రమాన్ని తీసుకొని అర లీటరు నీళ్ళలో వేసి ఆవిరి వచ్చేవరకూ మరిగించి, ఆవిరిని ఎగ్జిమా సోకిన ప్రదేశానికి తగిలేలా చేయాలి. తడి ఆరిన తర్వాత నెయ్యి రాసుకొని మర్ధనా చేసుకోవాలి.
పుండ్లు: మామిడి బెరడును చిన్న చిన్న పీలికలు అయ్యేంతవరకూ దంచి, నీళ్ళలో వేసి మరిగించండి. ఈ డికాక్షన్‌తో పుండ్లను, వ్రణాలను కడిగితే త్వరగా మానతాయి.
నీరసం: మామిడి ముక్కలకు చెంచాడు తేనెను, పిసరంత కుంకుమ పువ్వును, ఏలకులు, రోజ్‌వాటర్లను చిలకరించి ఆస్వాదించండి.
వడదెబ్బ: పచ్చి మామిడికాయను నిప్పుల మీద వేడిచేసి పిండితే సులభంగా గుజ్జు వస్తుంది. దీనికి కొద్దిగా చన్నీళ్ళను, పంచదారను చేర్చి తాగాలి. దీనివల్ల దప్పిక తీరడమే కాకుండా ఎండల తీక్షణతవల్ల కోల్పోయిన శక్తి తిరిగి వస్తుంది.
చెమట కాయలు: రెండు పచ్చి మామిడి కాయలను గినె్నలో నీళ్ళుపోసి ఉడికించాలి. చల్లారిన తర్వాత గుజ్జును పిండి పంచదార, ఉప్పు కలిపి సేవించండి. దీనివల్ల శరీరంలో వేడి తగ్గి, ఒళ్లు పేలకుండా ఉంటుంది.
మధుమేహం: లేత మామిడి ఆకులను, వేప చిగుళ్ళను సమానభాగాలు తీసుకొని మెత్తగా నూరి ముద్దగా చేయాలి. దీనిని నమిలి మింగేయాలి. ఇలా కొంతకాలం చేస్తే మధుమేహంలో హితకరంగా ఉంటుంది. ఇదే విధమైన యోగం మరోటి వుంది. మామిడి పూతను, మామిడి పిందెలను, ఎండిన నేరేడు గింజలను తీసుకొని మెత్తగా చూర్ణం చేసి భద్రపరచుకోవాలి. దీనిని ప్రతిరోజు చిన్న చెంచాడు మోతాదుగా తీసుకోవాలి. ఇది మధుమేహ రోగులకు ఉపయోగకారి.
స్టీృన్ (ప్లీహం) పెరుగుదల, కాలేయపు సమస్యలు: గుప్పెడు మామిడి గుజ్జుకు చిన్న చెంచాడు తేనెను కలుపుకొని మూడుపూటలా తాగండి. కాలేయపు సమస్యల్లో మామిడి గుజ్జును పాలతో కలిపి తీసుకోవాలి.
విరేచనాలు: మామిడి టెంకను పగులకొట్టి దీనిలోని జీడిని వేరుపరిచి నీడలో ఆరబెట్టాలి. తర్వాత దీని బరువుకు సమానంగా సోపు (శతపుష్ప) గింజలను తీసుకోవాలి. ఈ రెండింటిని విడివిడిగా చూర్ణం చేసుకోవాలి. తర్వాత రెండు చూర్ణాలను బాగా కలిపి పలుచని గుడ్డతో జల్లించాలి. ఈ మిశ్రమాన్ని చిన్న చెంచాడు చొప్పున వేడి నీళ్ళతో తీసుకోవాలి. దీనితోపాటు మామిడి బెరడు లోపలి పొరను పేస్టులాగా చేసి బొడ్డు చుట్టూ రాస్తే ఇంకా మంచిది. మామిడి జీడే కాకుండా మామిడి పూత కూడా విరేచనాలను ఆపడానికి ఉపయోగపడుతుంది. ఎండిన మామిడి పూతను తేనెతో కలిపి తీసుకుంటే సరిపోతుంది. ఇంతే కాకుండా మామిడి పూతను, దానిమ్మ పువ్వులను కలిపి ఎండించి, పొడిచేసి మజ్జిగతో కలిపి కూడా తీసుకోవచ్చు.
“పచ్చి మామిడి” వేసవితాపం భరించలేక వడదెబ్బకు గురయ్యేవారు పచ్చి మామిడికాయను చిన్న చిన్న ముక్కలుగా తరిగి ఒక గ్లాసు నీటిలో వేసి.. దాంట్లోనే కాస్త చక్కెర వేసి బాగా కలపాలి. కాసేపటి తరువాత ఈ ద్రవాన్ని తాగినట్లయితే వడదెబ్బ బారినుంచి బయటపడే అవకాశం ఉంది. అలాగే పచ్చి మామిడి ముక్కలపై కాస్త ఉప్పు వేసి తినటంవల్ల అధిక దాహాన్ని అరికట్టడమేగాకుండా.. చెమట ద్వారా శరీరంలోని లవణాలు, రక్తంలోని ఐరన్ తదితరాలు బయటకు పోకుండా ఆపుతుంది.
వేసవిలో సంభవించే డయేరియా, రక్త విరేచనాలు, పైల్స్, వికారం, అజీర్తి, మలబద్ధకం లాంటి సమస్యలకు టెంక పూర్తిగా ఏర్పడని పచ్చి మామిడికాయను చిన్న చిన్న ముక్కలుగా చేసి వాటికి ఉప్పు, తేనెను కలిపి తింటే అద్భుతమైన ఔషధంలాగా పనిచేస్తుంది. ఇంకా.. పచ్చి మామిడికి మిరియాలు, తేనె కలిపి తిన్నట్లయితే.. జాండీస్ (పచ్చ కామెర్లు) వ్యాధి నుంచి రక్షణ పొందవచ్చు. అంతేగాకుండా మామిడి గుండెకు మంచి టానిక్‌లాగా పనిచేస్తుంది. పచ్చి మామిడికాయలో విటమిన్ సీ పుష్కళంగా లభిస్తుంది. గుండె కండరాలను బిగుతుగా చేసే శక్తి మామిడికి ఉంది. అలాగే చర్మాన్ని మిలమిలా మెరిసేలా చేసే శక్తి కూడా దీనికి అధికంగా ఉంది. అయితే అతి అనేది అన్ని వేళలా సరికాదు కాబట్టి.. ఎక్కువ మోతాదులో పచ్చిమామిడిని తినకూడదు. అలా తిన్నట్లయితే ఆర్ధరైటిస్, కీళ్లవాతం, సైనసైటిస్, గొంతునొప్పి, అసిడిటీ లాంటి వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంటుంది. కాబట్టి మామిడిని పరిమితంగా తినటం మంచి పద్ధతి.
మామిడితో గ్లూకోజు అదుపు!
చూడగానే నోరూరించే మామిడిపండ్ల మాధుర్యమే వేరు. ఇవి వూబకాయుల్లో చక్కెర స్థాయులు మెరుగుపడటానికి దోహదం చేస్తున్నట్టు తాజా అధ్యయనం పేర్కొంటోంది. రొమ్ముకణాల్లో వాపును అదుపుచేయటానికీ తోడ్పడుతున్నట్టూ బయటపడింది.
రోజూ మామిడిని తినటం వల్ల వూబకాయులపై పడే ప్రభావాలపై ఓక్లహామా స్టేట్‌ యూనివర్సిటీ పరిశోధకులు ఇటీవల అధ్యయనం చేశారు. ఒకొకరికి 10 గ్రాముల మామిడి తాండ్రను (ఇది 100 గ్రాముల తాజా మామిడిపండ్లతో సమానం) తినిపించారు. పన్నెండు వారాల తర్వాత పరిశీలించగా.. వీరి రక్తంలోని గ్లూకోజు మోతాదులు గణనీయంగా తగ్గినట్టు తేలింది. అధిక కొవ్వుతో కూడిన ఆహారాన్ని తిన్న ఎలుకల్లో మామిడిపండ్లు గ్లూకోజు మోతాదులను మెరుగుపరుస్తున్నట్టు గత పరిశోధనలో తేలిన అంశాన్ని తాజా అధ్యయన ఫలితాలు బలపరుస్తున్నాయి అని అధ్యయన నేత డాక్టర్‌ లూకాస్‌ చెబుతున్నారు. అయితే మామిడిలోని ఏయే పాలీఫెనోలిక్‌ రసాయనాలు ఇందుకు దోహదం చేస్తున్నాయో తెలుసుకోవటానికి మరిన్ని పరిశోధనలు చేయాల్సి ఉందంటున్నారు. మరోవైపు- మామిడిలోని పాలీఫెనాల్స్‌ రొమ్ముల్లోని క్యాన్సర్‌, క్యాన్సర్‌ రహిత కణాల్లో వాపు ప్రతిస్పందనను అదుపుచేస్తున్నట్టు ఇంకో అధ్యయనంలో బయట పడింది
ఇతర వ్యాపారాలలో మామిడిసవరించు
భారతదేశంలో మామిడి తాండ్ర ను చేసి చిన్నచిన్న బండ్ల మీద అమ్ముతూ ఉంటారు. ఇలాంటిదే పెద్దఎత్తున కొన్ని వ్యాపారసంస్థలు దేశం అంతటా విక్రయిస్తున్నాయి. మామిడి రసాన్ని సీసాలు, మరియు, ప్యాక్ ల రూపంలో వ్యాపారసంస్థలు దేశం అంతటా విక్రయిస్తున్నాయి. మిల్క్ షేక్, లస్సీ పండ్ల రసాల అంగడి లో అమ్ముతుంటారు. మామిడికాయలతో చేసే ఊరగాయలు ఆంధ్రులద్వారా ప్రపంచం అంతటా లభిస్తున్నాయి. ఐస్ క్రీం లో మామిడి గుజ్జును, ఫ్రూట్ సలాడ్ లో మామిడి ముక్కలను వేస్తారు. మామిడి పళ్లను మాగ పెట్టేందుకు కాల్షియం కార్బైడ్‌ ను వినియోగిస్తారు. రైతుల ఆతృత, వ్యాపారుల లాభాపేక్ష వెరసి మామిడి పండ్ల అసలు రంగు, రుచిని పోగొడుతున్నాయి. సరైన రీతిలో పండకుండా కృత్తిమ మార్గాల్లో విష ప్రయోగాలు చేస్తున్నారు.
ఖచ్చితంగా ప్రారంభం ఎక్కడో ఎవరికీ తెలియక పోయినా శిలాజాల ఆధారంగా ఇరవైఐదు(25)నుండి (30)మిలియన్ సంవత్సరాల పూర్వం మామిడి ఉన్నట్లు రుజువులు ఉన్నాయి. పురాణాలలో, వేదకాలంలో ఉన్నట్లు వర్ణనలు ఉన్నాయి. ఇండియా, శ్రీలంక, బర్మా, బంగ్లాదేశ్ మామిడి చెట్టు జన్మ స్థలంగా విశ్వసించ బడుతోంది.
పచ్చి మామిడి కాయలను ఈ సీజన్‌లో రోజూ ...సంప్రదాయంలో మామిడి
భారతీయ సాంప్రదాయంలో మామిడి ఆకుల తోరణం ఉత్తమమైన తోరణంగా విశ్వసిస్తారు. ప్రతి పండుగ లేక శుభకార్యం కాని మామిడి తోరణంతోటే ప్రారంభం అవుతుంది. పూజా కార్యక్రమంలో మామిడి ఆకులు చోటు చేసుకుంటాయి. దుస్తులు, దుప్పట్లు, తివాచీలు మొదలైన బట్టలమీద, నగలు, ముగ్గులు మొదలైన వాటిలోను మామిడి కాయ ఆకారం చోటు చేసుకుంది.
ఇతర ఉపయోగాలుసవరించు
ఈ పత్రితో ఉన్న ఇతర ఉపయోగాలు :
1.ప్రపంచం అంతటా ఇప్పుడు మామిడి పండు తినడం పట్ల మక్కువ పెరిగింది. ఇప్పుడు ఈ పంటను సమశీతోష్ణ పరిస్థితిలో కూడా పండిస్తూ ఉన్నారు భారతద్వీపకల్పం అంతటా, కరేబియన్(Caribbean), మధ్య అమెరికా, మధ్య ఆసియా, దక్షిణ తూర్పు అసియా, మధ్య మరియు దక్షిణ ఆఫ్రికా దేశాలలోను పండిస్తున్నారు. దీనిని ఎక్కువగా తాజాగానే తింటారు. ఇంకా పంటగా వేయని దక్షిణ ఫ్లోరిడాలో కూడా మామిడిచెట్టుని ఇంటి పెరటిలో చూడవచ్చు.
2.మామిడిపండ్లు ప్రపంచమంతా ఇష్టమైన ఆహారమే అయినా రైతులు తక్కువ ప్రతిఫలం పొందుచున్నారు. అందువలన ఇవి అందరికి అందుబాటులో ఉంటాయి. తాజా మామిడి పండులో పదిహేను శాతం(15%) చక్కెర, ఒక శాతం(1%) మాంసకృత్తులు మరియు గుర్తించ తగిన మోతాదులో ఎ,బి,సి(A,B,C) విటమిన్లు ఉంటాయి. మామిడిపండు ఎక్కువగా తియ్యగా ఉన్నా, కొన్నిజాతుల పండు కొంచెం పుల్లగా ఉంటుంది, ముఖ్యంగా చిలక ముక్కు(బెంగళూరు) మామిడి ఈ కోవకు చెందినదే. అందువలనే భారతదేశంలో చిన్నచిన్న వ్యాపారులు వీటిని సన్నని పోడవైన ముక్కలుగా కోసి ఉప్పుకారం చల్లి బండిమీద అమ్ముతూ ఉంటారు. చాలామందికి నోరూరించే ఆహారం.
3.సున్నపు శక్తి (కాల్షియమ్) విటమిన్ బి పుష్కలంగా ఉంది కనుక అమెరికా జనం వీటిని చెక్కుతో చేర్చి తింటారు. పడమటి దేశాలలో పండ్లతో తియ్యటి పచ్చడి చేస్తారు. ఫిలిప్పైన్ లో మామిడి కాయలను ష్రిమ్ప్ అనే చేపల గుజ్జుతో చేర్చి తింటారు.
ఆయుర్వేదంలోసవరించు
1.మంగళకరమైన మామిడి దీని మరో నామము. లేత మామిడి ఆకును పెరుగులో నూరి దానిని సేవిస్తే అతిసారం తగ్గుతుంది. మామిడి జిగురులో ఉప్పు చేర్చి వేడి చేసి ఔషధంగా పూస్తే కాళ్ళ పగుళ్ళు, చర్మవ్యాధులు నశిస్తాయి.
2.నిద్రలేమి : నిద్రలేమితో బాధపడేవారు రాత్రి పడుకునేముందు ఓ మామిడి పండును తినండి. హాయిగా నిద్రపడుతుందని వైద్యులు అంటున్నారు.
3.శరీరం కాలినప్పుడు : మామిడి ఆకులను కాల్చి, బూడిద చేసి ఈ భస్మాన్ని కాలినగాయాలపై చిలకరించండి. దీంతో కాలిన గాయం మానుతుంది.
4.దంతాలు గట్టిగా ఉండాలంటే : మామిడి తాజా ఆకులను బాగా నమలండి. నమిలినప్పుడు నోట్లో లాలాజలం ఊరుతుంది. దీనిని ఉమ్మేయండి. ఇలా నిత్యం చేస్తుంటే దంతాలు కదులుతుంటే దృఢంగా తయారవుతాయి. అలాగే చిగుళ్ళనుంచి రక్తం కారుతుంటేకూడా తగ్గుదల కనపడుతుందంటున్నారు వైద్యులు.
పేరు పుట్టుపూర్వోత్తరాలుసవరించు
తమిళంలోని మాంగాయ్, లేక మళయాళంలోని మాంగా అనే పేరు. పోర్చుగీసులు ఇండియాకు వచ్చిన తరువాత పోర్చుగీసుల వలన వ్యాపించినదని గుర్తించారు. పొర్చుగీసు వాళ్లు దీనిని మాంగా పిలవడం దీనికి కారణం.
చిత్రమాలికసవరించు
మామిడి పూత
మామిడిపండ్లు
నిండు పూతతో ఉన్న మామిడి చెట్టు.
అందంగా కోయబడ్డ మామిడి పండు (ఎడమ). మామిడి నిలువుకోత (కుడి).
A mango tree in full bloom in Kerala, India
మామిడి పళ్ళు
మామిడి జాతులుసవరించు
మామిడి రకాలుసవరించు
1.బంగినపల్లి
2.నీలం
3.చందూరా
4.రుమానియా
5.మల్గోవా
6.చక్కెర కట్టి
7.అంటు మామిడి లేక చిలక ముక్కు మామిడి లేక బెంగుళూరు మామిడి.
8.రసాలు.
9.చిన్న రసాలు
10.పెద్ద రసాలు
11.చెరుకు రసాలు
12.షోలాపూరి
13.అల్ఫాన్సా
14.నూజివీడు రసం
15.పంచదార కలశ
16.కోలంగోవా
17.ఏండ్రాసు
18.సువర్ణరేఖ
19.పండూరివారి మామిడి
20.కలెక్టరు
21.అంపిరేడు లేక కొండమామిడి.
22.ఇమాం పసంద్
23.దసేరి
24.జహంగీర్
25.ఢిల్లీ పసంద్
26.నూర్జహాన్
27.బేనీషా
28.హిమాని
29.నీలీషాన్ (బేనీషా + నీలం ను కలిపి అభివృద్ది చేసినది)
30.పుల్లూర
31.ఇంటి పెరడులో మామిడి చెట్టు
32.కొబ్బరి మామిడి
33.చాకులు
34.ఆచారి
35.జలాలు
ఒకే చెట్టుకు అనేక రకాల మామిడి కాయలను కాయించడం ఒక మామిడి చెట్టుకే సాధ్యం ఇంటి లోని పెరడు లో పెంచే చెట్టుకు ఈ విధంగా ఒకే చెట్టుకు అనేక రకాల మామిడి కాయలను కాయిస్తే అన్ని రకాలాను తిన్నట్టు ఉంటుంది. "ట్రీ టాప్ గ్రాఫ్టింగ్" ద్వారా ఇది సాధ్యం. బాగా ఎదిగిన పెద్ద మామిడి చెట్టుకున్న పెద్ద కొమ్మలను కొట్టి వేయాలి. మూడు నెలలకు, కొట్టిన ప్రతి కొమ్మకు కొన్ని చిగుర్లు వస్తాయి. అవి చేతి వేలు ప్రమాణం వచ్చి నపుడు వాటిని సన్నటి పదునైన చాకుతో ఏట వాలుగా కోయాలి. మనకు కావలసిన అనేక రకాల మామిడి రకాల చెట్టు కొమ్మల నుండి చేతి వేలి లావున్న కొమ్మలను ఏటవాలుగా కోసి ( నాలుగు అంగుళాల పొడవు) ఈ చెట్టుకు కోసిన కొమ్మలకు అతికించి గట్టిగా కట్టాలి. ఆవిధంగా అన్నికొమ్మలకు కావలసిన రకాల కొమ్మలను అతికించి కట్టాలి. కొంత కాలానికి కొత్తగా అతికించిన కొమ్మ చిగుర్లు వేసి పెద్దదై దానికి సంబంధించిన కాయలను కాస్తుంది. ఎన్ని రకాల కొమ్మలను అతికించామో అన్ని రకాల కాయలు కాస్తుంది. ప్రతి ఏడు ఇలా కావలసిన రకాల కొమ్మలను అంటు కట్టి రకరకాల కాయలను కాయించ వచ్చు.
అంపిలేపి(కొండమామిడి)సవరించు
అంపిలేపి(కొండ మామిడి)చెట్టు దాదాపు 27 మీటర్ల ఎత్తు పెరుగుతుంది.ఈ చెట్టు బెరడు మరియు కాయలను ఆయుర్వేద ఔషధాలలోను వివిధ మెడిసిన్ల తయారిలోను విరివిగా వినియోగిస్తున్నారు.