మనఊరు మనచెట్టు: పుచ్చకాయ (Watermelon)

Saturday, October 10, 2015

పుచ్చకాయ (Watermelon)


పుచ్చకాయ  నే కర్బూజా అని కూడా అంటారు.ఇది ఇండియాలో ఒక ఉద్యాన పంటగా సాగుచేస్తారు.
త్రిభుజాకారపు పుచ్చకాయ ముక్కలు
Image result for (Watermelon) పుచ్చకాయ ఎక్కడ పుట్టిందో ఖచ్చితంగా చెప్పలేకున్నా, ఈజిప్టులో 5 వేల సంవత్సరాల క్రితమే పుచ్చను పండించిన ఆధారాలున్నాయని చెబుతారు.అప్పటి ఫారో చక్రవర్తులకు పుచ్చ కాయ రుచి ఎంతగానో నచ్చడం వలనే ఇవి వాళ్ళ గోడలమీద ఉన్న చిత్రాలలో చోటు చేసుకోగలిగింది. సమాధుల్లోనూ పచ్చకాయల్ని ఉంచేవారట. పుచ్చ 13వ శతాబ్దానికల్లా యూరప్ కు విస్తరించింది. మనదేశానికి క్రీ.శ. 4వ శతాబ్దాంలో వచ్చిందని చరిత్రకారులు చెబుతున్నప్పటికీ ఇది ఇక్కడే పుట్టిందన్న వాళ్ళు లేకపోలేదు. శుశ్రూతుడు తన 'శుశ్రూత సంహిత'లో సింధూ నదీతీరంలో దీన్ని విరివిగా పండించినట్లు పేర్కొన్నాడు. అందులో దీన్ని 'కళింద' లేదా 'కళింగ'గా వ్రాసాడాయన. పొడిగా ఉండే ఉష్ణ వాతావరణంలో పండే పుచ్చ ఎలాంటి నేలతోనయినా ఇట్టే జోడీ కట్టేస్తుంది. అందుకే ఇది ప్రపంచమంతా అల్లుకుపోయింది. అమెరికన్లకు ఇది 17వ శతాబ్దంలో పరిచయం అయ్యింది.

పోషకాలమయం
ఎండలో దాహార్తిని తీర్చుకోవాలంటే మొదట ప్రాధాన్యం ఇచ్చేది ఎర్రని పుచ్చకాయలకే. అన్ని సీజన్లలోనూ ఇవి దొరుకుతున్నా ఈ కాలంలో లభ్యమయ్యే వాటికి నాణ్యత, రుచీ ఎక్కువ. బి విటమిన్లు , పొటాషియం పుష్కలంగా ఉండే పుచ్చకాయ నుంచి ఎలక్ట్రోలైట్లు సమృద్ధిగా అందుతాయి. బి విటమిన్లు శరీరానికి శక్తినందిస్తే.. పొటాషియం గుండెకు మేలు చేస్తుంది. వడదెబ్బ బారినపడి శరీరం నిస్తేజం అయిపోకుండా కాపాడుతుంది. వేడికి కమిలిన చర్మానికి చల్లని పుచ్చకాయ గుజ్జును రాస్తే తిరిగి చర్మం నిగారింపు సంతరించుకుంటుంది.

పుచ్చలో పోషక పదార్థాలు
Image result for (Watermelon)పుచ్చకాయ, edible parts
 Nutritional value per 100 g
Energy 30 kcal 130 kJ
Carbohydrates
 7.6 g
 - Dietary fiber 0.4 g
Fat
 0.2 g
Protein
 0.6 g
 Water 91 g
 Vitamin C 8 mg 13%
Percentages are relative to US
 recommendations for adults.
 Source: USDA Nutrient database

ముదురు ఎరుపు లేక గులాబీ రంగు ఉన్న పుచ్చకాయ గుజ్జులో కెరోటినాయిడ్స్, బీటాకెరోటిన్లు పుష్కలంగా దొరుకుతాయి. వీటిని మన శరీరం ఏ-విటమిన్గా మారుస్తుంది. వీటితో పాటు విటమిన్-బి6, విటమిన్-సీ, పీచు పదార్థాలు కూడా దొరుకుతాయి. మిగిలిన పండ్లకన్నా వీటిలో నీటి శాతం ఎక్కువ. సుక్రోజ్తో పాటు కొంత మేరకు ఫ్రక్టోజ్, గ్లూకోజ్లు ఇందులో లభిస్తాయి.
100 గ్రా. పుచ్చకాయ గుజ్జులో

నీరు - 95.2 గ్రా.
ప్రోటీన్ - 0.3 గ్రా.
కొవ్వు పదార్థాలు - 0.2 గ్రా.
పీచు పదార్థాలు - 0.4 గ్రా.
కెరోటిన్ - 169 మైక్రో గ్రా.
సి విటమిన్ - 26 మి.గ్రా.
కాల్షియం - 32 మి.గ్రా.
ఫాస్ఫరస్ - 14 మి.గ్రా.
ఇనుము - 1.4 మి.గ్రా.
సోడియం - 104.6 మి.గ్రా.
పొటాషియం - 341 మి.గ్రా.
శక్తి - 17 కిలోకాలరీలు

ఆరోగ్యానికి పుచ్చ
కాల్షియం, సోడియం, మెగ్నీషియం, పొటాషియం, క్లోరిన్, కెరోటిన్, రకరకాల విటమిన్లకు నెలవు కర్బూజా పండు.
తన క్షారగుణంతో శరీరంలో ఎక్కువగా ఉన్న ఆమ్లాల్నీ వ్యర్థపదార్థాల్నీ తగ్గిస్తుంది.
శరీరంలో కాల్షియం నిల్వ సామర్థ్యాన్ని పెంచి కీళ్లనొప్పుల్నీ వాతరోగాన్నీ నియంత్రిస్తుంది.
మూత్రంలో యూరిక్ ఆమ్లాన్నీ తగ్గిస్తుంది.
ఎన్నోరకాల ఖనిజలవణాలున్న కర్బూజా పండును బాలింతలకు తినిపిస్తే బాగా పాలు పడతాయి.
గుండెను ఆరోగ్యంగా ఉంచడంలోనూ ఈ ఫలం సాయం చేస్తుంది.

రక్తపోటు
రక్త పోటు ఉన్నవారు పుచ్చకాయ తింటే ఎంతో మేలు. ఇందులో ఉండే పొటాషియం, మెగ్నీషియంలే ఇందుకు కారణం. పుచ్చకాయలో 92 శాతం ఆల్కలైన్‌ వాటర్‌ ఉంటుంది. ఈ నీరు శరీరానికి ఎంతో మేలు చేస్తుంది. మూత్రపిండాలు, మూత్రనాళాల్లో ఇబ్బందులు ఉన్నవారికి పుచ్చకాయ వరం లాంటిది. లోపలంతా గింజలతో నిండి ఉండి ఈ కర్బూజ లో అనేక లాభాలు ఉన్నాయి . టొమాతో ల మాదిరిగా దీనిలో లైకోఫిన్‌ అనే యాంటి ఆక్షిడెంట్ ఉంటుంది . ఒక గ్రాము టమాటో లో 40 మైక్రో గాములుంటే కర్బూజా లో 72 మైక్రోగ్రాములు ఉన్నది .

పుచ్చల్లో రకాలు
ప్రపంచ వ్యాప్తంగా 1200 పుచ్చరకాల్ని పండిస్తున్నారు. వాటిల్లో కొన్ని
నూర్జహాన్
షర్బత్-ఎ-అనార్
అనార్కలీ
షుగర్బేబీ (మహారాష్ట్రలోని అమెరికా రకం)
అసాహీ యమటో (పశ్చిమ బెంగాల్లోని జపాన్ రకం)
నందారి (ఆంధ్రప్రదేశ్ లో పండించే రకం)
రెడ్ టైగర్
ఆల్ స్వీట్
వాల్ పెయింట్

అవీ ఇవీ
అమెరికన్లు పుచ్చను పండించడంలో ఆఫ్రికన్లతో పోటీ పడి రక రకాల ప్రయోగాలు చేస్తూ విత్తుల్లేని పుచ్చని రూపొందించడంల్తో పాటూ, ఎరుపు, పసుపు, గులాబీ రంగుల్లో పుచ్చల్ని పుట్టించారు.
పుచ్చల ఉత్పత్తిలో అమెరికా నాలుగవ స్థానం.
సులభంగా పెట్టెలలో పెట్టవచ్చన్న కారణంగా గాజు పెట్టెల సహాయంతో జపాన్లో చతురస్రాకార పుచ్చల్ని పండిస్తున్నారు[1]. తీగకు పిందె దశలో వున్నప్పుడే కావలసిన పరిమాణంలో ఒక దీర్గ చతురస్రాకారపు చెక్క పెట్టెను తెచ్చి తీగకు వున్న పిందెను ఆ పెట్టెలో వుండేటట్టు అమార్చితె అందులోని చిన్నగా వున్న పుచ్చ కాయ కాలానుగుణంగా పెరిగి పెద్దదై
పెట్టె అంచులు అడ్డంగా వున్నందున క్రమంగా అది పెట్టె ఆకారంలో కి మారి దీర్గ చదరంగా తయారవుతుంది. పక్యానికొచ్చాక వాటిని కోసు కుంటారు. ఇటు వంటివి చూడ డానికి ప్రత్యేకంగా వుండటమే కాకుండా... పెట్టెలలో పెట్టి రవాణా చేయడానికి అనువుగా వుంటాయి. రవాణ సమయంలో కాయల మధ్య ఖాళీ స్థలం వృదా కాదు.
చైనా జపాన్లలో ఇంటికి వచ్చే అతిధులు ఎక్కువగా తెచ్చే బహుమతి పుచ్చకాయ
ఇజ్రయెల్, ఈజిప్టు దేశలలో తియ్య తియ్యని పుచ్చ ముక్కలకు ఉప్ప ఉప్పగా ఉండే చీజ్ ముక్కలు చేర్చి తింటారు
సాదారణ పుచ్చకాయ బరువు 5 - 10 కేజీలకు భిన్నంగా అమెరికాలో ఎక్కువగా 20 కేజీలు ఉండే పుచ్చల్ని పెంచుతారు.
అమెరికాలో ని ఎరింగ్టన్ కు చెందిన బిల్ కార్సన్ 119 కిలోల బరువున్న పుచ్చకాయను పండించాడు
పుచ్చలు ఎక్కువగా డిసెంబరు నుంచి మే వరకు బాగా కాస్తాయి