మనఊరు మనచెట్టు: July 2016

Saturday, July 16, 2016

కాబేజీ

కాబేజీ (Cabbage)  ప్రాంతములో కనిపించే ఆకులు మెండుగా ఉన్న అడవి ఆవాల మొక్క నుండి 100 వ సంవత్సరము ప్రాంతములో ఉద్భవించినది. కాబేజీ అన్న పదము నార్మన్-పికార్డ్ పదము కబోచే ("తల") నుండి వచ్చినది.

క్యాబేజీ ఒక ఆకుకూర

ఎందుకంటే సాధారణముగా కాబేజీ మొక్కలో ఆకులతో నిండిన శీర్ష భాగము మాత్రమే తింటారు. ఇంకా ఖచ్ఛితముగా చెప్పాలంటే వృత్తాకారములో ఉండలా ఉండే లేత ఆకులు మాత్రమే ఉపయోగిస్తారు. విచ్చుకొని ఉన్న బయటి ముదురు ఆకులను తీసేస్తారు. ఈ క్యాబేజీ తలను పచ్చిగా, ఉడకబెట్టి లేదా ఊరబెట్టి అనేక వంటకాలలో ఉపయోగిస్తారు. పచ్చి కాబేజీని చేత్తోనే తినేస్తారు కానీ కానీ చాలా ఇతర ఉపయోగాలకు దీన్ని చిన్న ముక్కలుగా లేదా పట్టీలుగా తురుముతారు. కాబేజీ పైన ఉన్న తొక్కలు గట్టిగా అంటుకొని ఆకులు పచ్చగా ఉండవలె, పగుళ్ళు ఉన్న క్యాబేజీ త్వరగా చెడిపోతుంది. ఎరుపురంగు క్యాబేజీ కొన్ని ప్రదేశాలలో మాత్రమే లభిస్తుంది. ముదురు ఆకుపచ్చ రంగు బాగుంటుంది. రక్తములో చెక్కెరస్థాయి సమతుల్యము చేస్తుంది . శరీరములొ కొవ్వు నిల్వలు పేరుకు పోకుండాచేస్తుంది . రక్తములో చెక్కెర స్థాయిని అదుపు చేసేందుకు గ్లూకోజ్ టోలరెన్స్ (glucose tolarence) లో భాగమైన ' క్రోమియం ' ఈ లెట్యూస్ లో పుష్కలముగా ఉంటుంది . నిద్ర పట్టేందుకు దోహదం చేసే " లాక్ట్యుకారియం (Lactucarium)" అనే పదార్ధము ఇందులో ఉంటుంది .

పోషక విలువలు, ప్రతి 100 గ్రాములకు

శక్తి 20 kcal 100 kJ పిండిపదార్థాలు 5.8 g చక్కెరలు 3.2 g పీచుపదార్థాలు 2.5 g కొవ్వు పదార్థాలు 0.1 g మాంసకృత్తులు 1.28 g థయామిన్ (విట. బి1) 0.061 mg 5% రైబోఫ్లేవిన్ (విట. బి2) 0.040 mg 3% నియాసిన్ (విట. బి3) 0.234 mg 2% పాంటోథీనిక్ ఆమ్లం (B5) 0.212 mg 4% విటమిన్ బి6 0.124 mg 10% ఫోలేట్ (Vit. B9) 53 μg 13% విటమిన్ సి 36.6 mg 61% కాల్షియమ్ 40 mg 4% ఇనుము 0.47 mg 4% మెగ్నీషియమ్ 12 mg 3% భాస్వరం 26 mg 4% పొటాషియం 170 mg 4% జింకు 0.18 mg 2%

ఔషధ గుణాలు

కాయగూరల్లో క్యాబేజీ అతి శ్రేష్టమైనదనీ ముఖ్యంగా క్యాన్సర్‌ను నిరోధించటంలో ఇది క్రియాశీలకంగా పనిచేస్తుందని వైద్యులు సూచిస్తున్నారు. క్యాబేజీ ద్వారా శరీరానికి అవసరమైన "ప్లేవనాయిడ్స్" సమృద్ధిగా అందుతాయనీ, తద్వారా "పాంక్రియాటిక్ గ్రంథి క్యాన్సర్" ప్రభావాన్ని తగ్గించవచ్చునని వారు చెబుతున్నారు. ఈ క్యాన్సర్ రావటం అరుదుగా సంభవిస్తుందనీ, అయితే క్యాబేజీతో దానికి చెక్ పెట్టవచ్చు క్యాబేజీని ఆహారంలో క్రమం తప్పకుండా తీసుకున్నట్లయితే అధిక బరువుకు చెక్ పెట్టవచ్చునని వైద్యులు చెబుతున్నారు. అంతేగాకుండా.. పిల్లలకు పాలిచ్చే తల్లులు ఎక్కువగా క్యాబేజీని తిన్నట్లయితే పాలు బాగా పడతాయి. క్యాజేజీ దగ్గుకు కూడా మంచి మందుగా పనిచేస్తుంది. క్యాబేజీ ఆకులను నమిలినా లేదా క్యాబేజీ ఆకుల రసం తీసి తాగిన దగ్గు మటుమాయమవుతుంది. క్యాబేజీ ఆకుల రసాన్ని అలాగే తాగలేనివారు కాస్త పంచదార కలుపుకుంటే సరి. అదే విధంగా అతిగా పొగతాగే పొగరాయుళ్లను ఆ అలవాటునుంచి మాన్పించేందుకు నానా కష్టాలు పడేవారికి క్యాబేజీ సాయపడుతుంది. అయితే వారిని పూర్తిగా పొగతాగటం మాన్పించటం కాదుగానీ.. పొగ తాగినప్పుడు శరీరానికి కలిగే దుష్ఫలితాల తీవ్రతను తగ్గించుకోవాలంటే మాత్రం తప్పనిసరిగా క్యాబేజీ తినాల్సిందే.

https://www.facebook.com/manaurumanachettu

ఇతర ఉపయోగాలు

క్యాబేజీ ఒక ఆకుకూర. ఎందుకంటే సాధారణముగా కాబేజీ మొక్కలో ఆకులతో నిండిన శీర్ష భాగము మాత్రమే తింటారు. ఇంకా ఖచ్ఛితముగా చెప్పాలంటే వృత్తాకారములో ఉండలా ఉండే లేత ఆకులు మాత్రమే ఉపయోగిస్తారు. విచ్చుకొని ఉన్న బయటి ముదురు ఆకులను తీసేస్తారు. ఈ క్యాబేజీ తలను పచ్చిగా, ఉడకబెట్టి లేదా ఊరబెట్టి అనేక వంటకాలలో ఉపయోగిస్తారు.
పచ్చి కాబేజీని చేత్తోనే తినేస్తారు కానీ కానీ చాలా ఇతర ఉపయోగాలకు దీన్ని చిన్న ముక్కలుగా లేదా పట్టీలుగా తురుముతారు. కాబేజీ పైన ఉన్న తొక్కలు గట్టిగా అంటుకొని ఆకులు పచ్చగా ఉండవలె, పగుళ్ళు ఉన్న క్యాబేజీ త్వరగా చెడిపోతుంది. ఎరుపురంగు క్యాబేజీ కొన్ని ప్రదేశాలలో మాత్రమే లభిస్తుంది. ముదురు ఆకుపచ్చ రంగు బాగుంటుంది.
https://www.facebook.com/manaurumanachettu

పాల కూర

మనం తీసుకునే ఆహారంలో ప్రతిరోజూ ఆకుకూరలను తప్పనిసరిగా తీసుకోవాలి. ముఖ్యంగా పాలకూర. పోషకాహార నిధి అయిన పాలకూరలో లభించే ఫ్లేవనాయిడ్స్ వయసుతోపాటు వచ్చే మతిమరపును దూరం చేస్తాయి. పాలకూరలో పదమూడు రకాల యాంటీ ఆక్సిడెంట్‌లు ఉన్నాయి. ఇవి యాంటీ క్యాన్సర్ ఏజెంట్లుగా పనిచేస్తాయి. పాలకూర , spinach—ఇది భారతీయులు అహారానికి ఉపయోగించే ఆకు కూరలలో ఒకటి. విటమిన్‌ ' కె ' సమృద్ధిగా ఉంటుంది . * ఆకు కూరలు వండే ముందు శుభ్రముగా కడగాలి. * మొక్కలోని ఆకులను ఆహార పదార్ధాలుగా ఉపయోగించే మొక్కలను ఆకు కూరలు అంటారు. * దాదాపు వెయ్యికి పైగా ఆహారయోగ్యమైన ఆకులు గల మొక్కలు ఉన్నాయి * ఆకు కూరలు సాధారణముగా పొట్టిగా,గుబురుగా పెరిగే, స్వల్పకాల పరిమితి గల చిన్న చిన్న మొక్కలు ఉన్నాయి. * కొన్ని కొన్ని సార్లు ఈ మొక్కలలోని ఆకులతో పాటు కాండాలను, లేత ఆకుకాడలను కూడా తినటానికి ఉపయోగిస్తారు. పాలకూరలో లభించే విటమిన్ సి, ఏలు మరియు మెగ్నీషియం, ఫోలిక్ యాసిడ్లు క్యాన్సర్‌ను నివారించటంలో తోడ్పడతాయి. ముఖ్యంగా ఊపిరితిత్తులు, బ్రెస్ట్ క్యాన్సర్‌ను అదుపు చేయటంలో ఇవి ప్రముఖ పాత్ర పోషిస్తాయి. గుండె జబ్బులు రాకుండా అడ్డుకుంటాయి. ఈ కూరలో ఇంకా క్యాల్షియం, సోడియం, క్లోరిన్, ఫాస్ఫరస్, ఇనుము, ఖనిజ లవణాలు, ప్రొటీన్లు, విటమిన్ ఏ, విటమిన్ సీ‌ తదితరాలుంటాయి.

ఔషధ ఉపయోగాలు

పాలకూరను ఆహారంలో ఎక్కువగా తీసుకునే వారికి ఒవేరియన్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు తక్కువని ఇటీవలి పరిశోధనల్లో సైతం వెల్లడయ్యింది. శరీరానికి అవసరమైన ఇనుము పుష్కళంగా ఉండే పాలకూర రక్తహీనతను తగ్గిస్తుంది. రోగ నిరోధక శక్తిని కూడా పెంచుతుంది, జ్వరం, పిత్త, వాయు శ్వాస సంబంధిత రోగాలను కూడా పాలకూర దూరం చేస్తుంది. పాలకూరకు రక్తాన్ని శుద్ధి చేసే తత్వం కూడా అధికంగా ఉంది. స్త్రీల సౌందర్యానికి కూడా పాలకూర ఎంతగానో తోడ్పడుతుంది. పాలకూరను వెజిటబుల్ సూప్‌లోనూ, చపాతీలు చేసుకునే పిండిలోనూ, పకోడీల పిండిలోనూ, పన్నీర్‌తో కలిపి వండే కూరల్లోనూ.. అనేక రకాలుగా వాడుకోవచ్చు. ఇతర ఆకుకూరల్లాగా పాలకూరను కూరలాగా, వేపుడు చేసుకుని కూడా తినవచ్చు. ఎలాగైనా సరే ప్రతిరోజూ తినే ఆహార పదార్థాలలో పాలకూరను భాగం చేసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచి చేస్తుందని చెప్పక తప్పదు ఆకుకూరలతో కలిగే మేలు: * ఆకుకూరల్లో పోషక పదార్ధాలు సమృద్ధిగా ఉంటాయి. అందుకే శరీర పెరుగుదల, దృఢత్వానికి, చక్కని ఆరోగ్యానికి ఇవి చాలా ముఖ్యమైనవి. * భారతదేశంలో అనేక రకాల ఆకుకూరలు వినియోగంలో ఉన్నాయి.వీటిలో పాలకూర, తోటకూర, గోంగూర, మెంతికూర, మునగాకులు, పుదీన తదితరాలు ప్రముఖమైనవి. * ఆకుకూరలు ఎక్కువగా ఖనిజ పోషకాలు, ఇనుముధాతువు కలిగిఉంటాయి.శరీరంలో ఇనుములోపం కారణంగా అనీమియా వ్యాధికి గురవుతారు. గర్భవతులు, బాలింతలు(పాలిచ్చే తల్లులు), పిల్లలు ఈ వ్యాధికి ఎక్కువగా గురవుతారు. * ప్రతిరోజూ తీసుకొనే ఆహారంలో ఆకుకూరలను తప్పకుండా చేర్చాలి. తద్వారా అనీమియాను నివారించి, చక్కని ఆరోగ్యాన్ని పొందవచ్చు. * ఆకుకూరల్లో కాల్షియం, బీటాకెరోటిన్, విటమిన్ - సి కూడా పుష్కలంగా ఉంటాయి. * విటమిన్-ఎ లోపం కారణంగా భారతదేశంలో ప్రతీ యేటా ఐదేళ్ళ లోపు వయస్సు పిల్లలు సుమారు 30 వేల మంది కంటిచూపును కోల్పోతున్నారు. ఆకుకూరలద్వార లభించే కెరోటిన్ మనశరీరంలో విటమిన్-ఎ గా మారి అంధత్వం రాకుండా చేస్తుంది. * విటమిన్-సి ఆరోగ్యకరమైన ఎముకలు, దంతాలకు చాలా అవసరమైన పోషకం. వంటచేసేటపుడు ఆకుకూరలను ఎక్కువసేపు మరిగిస్తే, వీటిలో ఉన్న విటమిన్ సి ఆవిరైపోతుంది. దీన్ని నివారించటానికీ అకుకూరలను స్వల్ప వ్యవధిలోనే వండాలి. ఆకుకూరల్లో కొన్ని రకాల బి- కాంప్లెక్స్ విటమిన్లు కూడాఉంటాయి.

గోరింటాకు

గోరింటాకును ముద్దగా నూరి చేతికి, పాదాలకు పెట్టుకుంటే ఎర్ర్రని రంగుతో అందంగా ఉంటాయి. ఈ పొడిలో లవంగం పొడి కలిపితే ఎరుపు, ఉసిరి పొడిని కలిపితే నలుపు రంగు తల జుట్టుకు వస్తాయి.భారతీయులు పెళ్ళి సమయంలో దీన్ని తప్పనిసరిగా వాడతారు. మెహందీ లేదా హెన్నాఅనేది "మెంధిక" అనేసంస్కృతపదంనుండిఉద్భవించింది. మెహందీ మరియు పసుపులయొక్క ఉపయోగంముల గురించి హిందూమ తవేదకర్మ పుస్తకాల్లోవర్ణించబడింది. హల్దిని(పసుపుముద్ద)అభిరంజనముగా, అలాగే మెహందీని బాహ్య ప్రతీకగా వేదాలలో చెబుతారు. వేద సిద్దాంతమూలలొ ఇది "అంతర్గతంగ కాంతి లేవడం" అనే అర్ధం వస్తుంధి. సాంప్రదాయభారతనమూనాలలో మెహందీని చేతులు మరియు కాళ్ళుగుర్చిఉద్దేశించబడింది.
పాశ్చాత్య ప్రపంచంలో హెన్నా(గోరింట)అని పిలుస్తారు. భారతదేశం మరియు నేపాల్ దేశాలాలో మేహేందిని శరీర అలంకరణగా వాడతారు. భారతీయ సినిమా అయిన బాలీవుడ్, పాకిస్తాన్, బంగ్లాదేశీలు మరియు అలాగే ఇతర దెశాలు కూడా మేహేందిని ఉపయోగిస్తారు. కోఆపరేషన్ కౌన్సిల్ ప్రకారం ఈ సంప్రదాయం గల్ఫ్ జాతీయులు అయిన ఆరబ్ దేశాల మహిళలు ఎక్కువగ ఉపయొగించుట ద్వారా విస్థరించింది.. మెహందీ అలంకరణను వారు కొన్నిసార్లు గోరింట పచ్చబొట్లు(హెన్నాటటూ) అని పిలుస్తుంటారు. 1990 ల చివరిలో పశ్చిమములోఇది ఒక నాగరీకంగా మారింది.
మెహందీని సాధారణంగా వివాహనికి మరియు ఖర్వ చౌత్, ఆషాడ శుద్ద పూర్ణిమ, దీపావళి, భైదూజ్ మరియు తీజ్ వంటి పండుగలు వంటి ప్రత్యేక హిందూ మతం సందర్భాలలో సమయంలో వాడతారు. హిందూ మతం పండుగలలో చాలామంది మహిళలు హెన్నాని వారి చేతులుకు మరియు కాళ్ళుకు అలంకరించుకుంటారు. ఇది చర్మంపై సహజంగా ఉండే అలంకరణగా కనిపిస్తుంధి. హెన్నా నిజానికి ప్రధానంగా హిందూమతం వధువులకు ఒక అలంకరణరూపంగా ఉపయోగించబడింది.ముస్లింలు పండుగలు అయిన ఈద్ ఉల్ ఫితర్ మరియు ఈద్ ఉల్ అధా సమయంలో మెహందీని వాడతారు.
భారత సాంప్రదాయ మెహందీని పెట్టేకళాకారు లుపరిమితసంఖ్యలో ఉండటం కారణముగా,ఆధునిక యుగంలో ప్రజలు రెడీమేడ్ హెన్నాన్ని(హెన్న ఛొనెస్) ఉపయోగిస్తున్నారు. రెడీమేడ్ హెన్నా ఆలంకరణకు సులభంగా ఉంటుంది.అయితే, భారతదేశం లో గ్రామీణ ప్రాంతాల్లో వృత్తిపరంగా దొరికే గోరింట ఆకులుని శుద్ధి చేసి,వీటికి ఆయిల్ కలిపి రాళ్ళుతొ నూరి ఆ మిశ్రమన్ని మెహందీగా వాడతారు. మెహందీని చాలా సందర్భలలో తాత్కలిక పచ్చబొట్లుగా ఉపయోగిస్తారు.దీన్నే గోరింట పచ్చబొట్టు అలంకరనగా పిలుస్తారు. నల్లని పచ్చబొట్టును ధరించడం కొసం,అనేక మంది గోరింటాకుకు కృత్రిమరంగును కలపడం ఆరంబించారు. దీని వల్ల చర్మానికి చాలా హానికరమైన మరియు శాశ్వతగాయాలు,తీవ్రమైన ఇబ్బందులు కలుగుతాయి. ఆలాటా అనే ఒక రకమైన గొరింటను వధువల పాదాల అలకరణకు ఉపయోగిస్తారు. ఈ సంస్క్రుతి ఇప్పటికి బెంగాల్లొ వాడుకలొ ఉన్నధి.

Saturday, July 02, 2016

మొక్కతో సెల్ఫీ

మిత్రులందరికీ నమస్కారములు  అందరికీ తెలియచేయునది  ఏమనగా   మనవంతుగా   ఈ ప్రకృతి కోసం  ఒక్క మొక్క అయినా నాటుదాం.    నాటి  వాటిని చెట్టు చేదాం .  మీరు నాటిన మొక్కతో  సెల్ఫీ తీసుకొని   మీ ముఖ పుస్తకం  యొక్క  ప్రొఫైల్  పిక్  గా  పెట్టండి ఇలా చేయడం  వలన  ఎందరికో  మొక్కలను  నాటాలి  అనీ ఆలోచన  కలగా చేసిన వారము అవుతాము.  ఈ  కార్యక్రమం లో భాగంగా నేను  నా ప్రొఫైల్ పిక్ ని మార్చుతున్నాను. మరి మీరు.........

Friday, July 01, 2016

అశోక చెట్టుని............

🌳అశోక చెట్టుని నాటడం, పూజించడం వలన సోక నాశనమని తెలుస్తుంది. వృక్షాలను తడపడం, రోగాలు లేకుండా కాపాడడం చేస్తే స్వర్గలోక ప్రాప్తి కలుగుతుందని విష్ణుధర్మోత్తర పురాణం ద్వారా తెలుస్తుంది..🌻🌳.. http://manaurumanachettu.blogspot.in/....✍