మనఊరు మనచెట్టు: June 2014

Sunday, June 22, 2014

చెట్ల వలన మనం పొందే లాభాలు



చెట్లు మన నేస్తాలు..... చెట్ల వలన మనం పొందే లాభాలు.....
మానవ జాతికి చెట్లు ఎంత మేలు చేస్తున్నాయో తెలుసుకుంటే చాలా ఆశ్చర్యం వేస్తుంది .చెట్ల వలన మనం పొందే లాభాలు తెలుసుకోండి మరి .
1.రెండు పెద్ద చెట్లు రోజుకు నలుగురున్న కుటుంబానికి సరిపడా ప్రాణ వాయువు నిస్తాయి .
2.ఒక పెద్దచెట్టుకు రెండు నుండి నాలుగు లక్షల ఆకులు ఉంటాయి.ఇవన్నీ కూడా వడబోసే filters లాగా పనిచేస్తాయి.అంటే గాలిని శుభ్ర పరుస్తాయి. 
3.ఒక ఎకరం విస్తీర్ణం లో దట్టంగా ఉండే చెట్లు ఏటా 13 టన్నుల దుమ్ము,ధూళిలను తొలగిస్తాయి.
4.చెట్లు లేని రోడ్ల దగ్గర లీటరు గాలిలో 10 నుండి 12 వేల ధూళి కణాలు ఉంటె చెట్లు ఉన్న రోడ్ల దగ్గర కేవలం 3 వేలే ఉంటాయి
5.చెట్టు సహజ మయిన aircondition లాగా పనిచేస్తుంది.ఒక చెట్టు తన ఆకుల ద్వారా రోజుకు 100 gallons నీటిని గాలి లోకి తేమ రూపంలో వదులుతుంది.అందుకే చెట్టు నీడ చాలా చల్లగా ఉంటుంది.
6.ఒక చెట్టు ఇచ్చే చల్లదనాన్ని అయిదు రూం ఎయిర్ కండీషనర్స్ రోజుకు ఇరవై గంటల వంతున పని చేస్తేనే గాని ఇవ్వలేవు.
7.ఒక ఎకరం విస్తీర్ణం లోని చెట్లు ఏడాదికి 2.6 టన్నుల కార్బన్ డై ఆక్సైడ్ ను వాతావరణం నుండి తొలగిస్తాయి.
8.చెట్ల వేళ్ళు భూగర్భ జలాలనుండి ప్రమాద కరమైన కాలుష్యాలను తొలగించి శుద్ధి చేస్తాయి.
9.ఒక football ground ఆవరణలో ఉండే చెట్లు (సుమారు 400 ) వాహనం ఏడాది పాటు వదిలే కాలుష్యాన్ని వాతావరణం నుండి తొలగించ గలవు.
10. 50 ఏళ్లలో ఒక చెట్టు 37,500 డాలర్ల (సుమారు 2,175,000) విలువైన ఆక్సిజన్ ను ఇస్తుంది.
ఇంత మేలు చేసే చెట్లను మనం కాపాడుకోవాలి.