మనఊరు మనచెట్టు: తలంబ్రాలు చెట్టు

Saturday, October 31, 2015

తలంబ్రాలు చెట్టు

తలంబ్రాలు చెట్టు పేరుకే చెట్టు కానీ నిజానికి ఒక పొద. ఈ మొక్క లాంటానా ప్రజాతికి చెందినది. దీనిలో 150కి పైగా జాతులు కలవు. తలంబ్రాలు చెట్టు స్వస్థలము ఆఫ్రికా మరియు అమెరికా ఖండాలు.
హిమాచల్ ప్రదేశ్ లో లాంటానా పొదలను ఫర్నీచరు మరియు కంచెలు తయారు చేయడానికి ఉపయోగిస్తున్నారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని చిత్తూరు జిల్లాలో మరియు తమిళనాడు లోని నతము వద్ద లాంటానా పొదలను మరియు స్థానికంగా దొరికే కలుపు పొదలను కొన్ని సముదాయాలు బుట్టలు అళ్లడానికి ఉపయోగిస్తున్నారు.
కొన్ని ప్రాంతాల్లో, ఈ చెట్టు ని లంబాడీ చెట్టు, గాజుకంప అని కూడా అంటారు.