మనఊరు మనచెట్టు: లీచీ

Tuesday, October 27, 2015

లీచీ

లీచీ (లీచీ చైనెన్సిస్ , మరియు సాధారణంగా లీచి , లీచీ , లైచీ , లీచు అని పిలుస్తుంటారు) (ఆంగ్లం: Lychee; హిందీ: लीची, līchī) (చైనీస్:荔枝, lizhi) అనేది సాపిండేసియే వర్గంలో సోప్‌బెర్రీ కుటుంబానికి చెందిన లీచీ తరగతిలోని ఒక ఒంటరి వృక్షజాతి. ఉష్ణమండల మరియు ఉపోష్ణమండల ప్రాంతాల్లో పెరిగే ఈ ఫల వృక్షం జన్మస్థలం చైనా అయినప్పటికీ, ప్రస్తుతం దీన్ని ప్రపచంలోని అనేక ప్రాంతాల్లో సాగు చేస్తున్నారు. దీని తాజా ఫలం "సుగంధ పరిమళ" సువాసన ఉన్న ఒక "సున్నితమైన, తెల్లటి కండ కలిగిన ఫలం", ఈ ఫలాన్ని నిల్వచేసిన సమయంలో సువాసన కోల్పోతుంది కాబట్టి చాలావరకు దీన్ని తాజాగా ఉన్నప్పుడే తింటుంటారు.[2]
లీచీ ఒక సతతహరిత వృక్షం, దాదాపు 10–20 మీటర్ల పొడవు పెరగడంతో పాటు 5 సెంమీ (2.0 in) పొడవు మరియు 4 సెంమీ (1.6 in) వెడల్పు కలిగిన కండగల ఫలాలను అందిస్తుంది. ఈ ఫలానికి వెలుపలి భాగం ఊదా-ఎరుపు రంగు, గరుకైన తొక్కను కలిగి ఉంటుంది, ఈ తొక్క తినేందుకు ఉపయోగపడనప్పటికీ, లోపల ఉండే తియ్యని, అపారదర్శక తెల్లని కండగల ఫలాన్ని గ్రహించే దిశగా దీన్ని సులభంగా తీసివేయవచ్చు. లీచీని భోజనం తర్వాత ఆరగించే అనేక ఫలాల రకాల్లో ఒకటిగా తీసుకోవడంతో పాటు ఇవి ప్రత్యేకించి దక్షిణాసియాతో సహా చైనా, ఆగ్నేయాసియాల్లో చాలా ప్రాచూర్యం పొందాయి.[2][3]
లీచీ చైనాలో సాగవడంతో పాటు థాయిలాండ్, ఉత్తర వియత్నాం, మరియు ఉత్తర భారతదేశంలో ప్రత్యేకించి బీహార్‌లో ఎక్కువగా పండుతుంది, ఇక్కడి మొత్తం ఉత్పత్తిలో ఇది 75% వాటాను కలిగి ఉంది.[2][4] వీటితోపాటు దక్షిణాఫ్రికా మరియు యునైటెడ్ స్టేట్స్ (హవాయి మరియు ఫ్లోరిడా) దేశాలు సైతం వాణిజ్యపరంగా లీచీని ఉత్పత్తి చేస్తున్నాయి.[2]
లీచీ సాగుకు చారిత్రక ప్రాశస్త్యం కూడా ఉంది, చైనా రికార్డుల ప్రకారం క్రీ.పూ.2000 వెనుకటి కాలంలోనూ ఈ వృక్షాల ప్రస్తావన ఉంది. అయితే దక్షిణ చైనా, మలేషియా, మరియు ఉత్తర వియత్నాంలలో దీని సాగు ప్రారంభమైంది. మరోవైపు దక్షిణ చైనా మరియు హైనాన్ ద్వీపంలలో ఇప్పటికీ లీచీకి సంబంధించిన వన్యరకం వృక్షాలు పెరుగుతున్నాయి. సున్నితత్వానికి మారుపేరుగా చైనీస్ ఇంపీరియల్ కోర్టులో లీచీ ఫలాలకు సంబంధించిన అనేక వృత్తాంతాలున్నాయి. 1782లో ఇది మొదటిసారిగా పశ్చిమాన వెలుగుచూడడంతో పాటు పరిచయం చేయబడింది.[1]
వర్గీకరణ
లీచీ చైనెన్సిస్ గురించి పియర్ర్ సెన్నెరాట్ తన Voyage aux Indes orientales et à la Chine, fait depuis 1774 jusqu'à 1781 (1782)లో వర్ణించడంతో పాటు నామకరణం కూడా చేశారు. లీచీలో మూడు ఉపజాతులున్నాయి, పుష్పాల అమరిక, శాఖల మందం, ఫలం, కేశరాలను బట్టి వీటిని గుర్తిస్తారు.
లీచీ చైనెన్సిస్ subsp. చైనెన్సిస్ అనేది ఏకైక వాణిజ్యపరమైన లీచీగా ఖ్యాతి వహించింది. వన్యజాతి రూపంలో ఇది దక్షిణ చైనా, ఉత్తర వియత్నాం, మరియు కంబోడియాల్లో పెరుగుతుంది. ఈ జాతిలో పలుచని కొమ్మలు, పుష్పాల్లో విశిష్టమైన రీతిలో ఆరు కేసరాలు ఉండడంతో పాటు ఫలం మెత్తగా లేదా 2 మి.మీ వరకు ఉండే బుడిపెలతో ఉంటుంది.
లీచీ చైనెన్సిస్ subsp. ఫిలిఫైనెన్సిస్ (Radlk.) లీన్. ఫిలిఫ్పైన్స్ మరియు పపువా న్యూ గీనియాలలో ఇది సాధారణంగా వన్యజాతి రూపంలో పెరగడంతో పాటు అరుదుగా మాత్రమే సాగు చేయబడుతుంది. ఇందులో పలుచని కొమ్మలు, ఆరు నుంచి ఏడు కేసరాలతో పాటు 3 మి.మీ వరకు పొడవు కలిగిన ముళ్లుల వంటి బుడిపెలతో నిండిన అండాకార ఫలాలు ఉంటాయి.
లీచీ చైనెన్సిస్ subsp. జావెన్సిస్ . మలేషియా, ఇండోనేషియాల్లో మాత్రమే సాగులో ఉన్న రకంగా ఇది సుపరిచితం. ఇందులో మందమైన కొమ్మలు, ఏడు నుంచి పదకొండు కేశరాలు పీఠం లాంటి ఆధారంపై గుత్తిలా ఉండడంతో పాటు 1 మి.మీ పొడవైన బుడిపెలతో కూడిన మృదువైన ఫలం ఉంటుంది.[5]
వర్ణనసవరించు
లీచీ చైనెన్సిస్ పువ్వులు.
L. చైనెన్సిస్ అనేది ఒక సతతహరిత వృక్షం, ఇది తరచూ 10 మీ (33 అడుగులు) కంటే తక్కువ ఎత్తులోను, కొన్నిసార్లు 15 మీ (49 అడుగులు) కంటే ఎక్కువ ఎత్తులోనూ ఉంటుంది. దీని కాండం బూడిద-నలుపులోను, కొమ్మలు గోధుమ-ఎరుపు వర్ణంలోనూ ఉంటాయి. కొమ్మలు 10–25 సెంమీ (3.9–9.8 in) లేదా అంతకంటే ఎక్కువ పొడవుగా ఉండడంతో పాటు పత్రాలు 2-4 జతలుగా ఉంటాయి.[6] పుష్పాలు పుష్పగుచ్ఛానికి సంబంధించిన ఆధారంపై పెరగడంతో పాటు ఆయా కాలాల వృద్ధిపై ఆధారపడి అనేక పానికిల్స్ ఉంటాయి. పానికిల్స్ అనేవి పది లేదా అంతకంటే ఎక్కువ సమూహాలుగా పెరగడంతో పాటు 10–40 సెంమీ (3.9–15.7 in) లేదా అంతకంటే ఎక్కువ పొడవు కూడా ఉండవచ్చు, వీటిపై వందలకొద్దీ సంఖ్యలో విశిష్టమైన సువాసనతో కూడిన తెల్లటి, పసుపు, లేదా పచ్చని పుష్పాలు ఉంటాయి.[5]
ఫలాలు 80-112 రోజుల్లో పక్వానికి వస్తాయి, అయితే ఇది వాతావరణం, ప్రదేశం, సాగు విధానంపై ఆధారపడి ఉంటుంది. ఫలాలు 5 సెంమీ (2.0 in) వరకు పొడవుతో మరియు 4 సెంమీ (1.6 in) వరకు వైశాల్యాన్ని కలిగి ఉండడంతో పాటు గుండ్రని, అండాకారం, హృదయాకారం లాంటి వివిధ రూపాల్లో ఉంటాయి. ఫలంపై ఉండే పలుచని, కఠినమైన తొక్క తినడానికి ఉపయోగకరంగా ఉండకపోవడంతో పాటు, అపరిపక్వ దశలో పచ్చగానూ, పక్వానికి చేరేకొద్దీ ఊదా-ఎరుపు వర్ణంలోను, మరియు ఉపరితలం నునుపైన లేదా చిన్నపాటి పదునైన బుడిపెలను కలిగి ఉంటాయి. కోత తర్వాత ఫలాన్ని నిల్వ చేసిన పక్షంలో దానిపై ఉండే తొక్క గోధుమ వర్ణంలోకి మారడంతో పాటు ఎండిపోవడం జరుగుతుంది. ఫలంలోని కండతో కూడిన, తినదగిన భాగం ఒక ఏరియల్, 1–3.3 సెంమీ (0.39–1.30 in) పొడవు మరియు .6–1.2 సెంమీ (0.24–0.47 in) వ్యాసం కలిగిన తినడానికి ఉపయోగపడని ఒక గోధుమ వర్ణంలోని గింజ చుట్టూ ఇది ఆవృతమై ఉంటుంది. 'చికెన్ టంగ్స్'గా సుపరిచితమైన తక్కువగా ఎండబెట్టిన విత్తనాల సాయంతో కొంతమంది సాగుదారులు ఎక్కువ శాతం ఫలాలను ఉత్పత్తి చేస్తుంటారు. తినదగిన కండను కలిగి ఉండడం వల్ల ఈ రకమైన ఫలాలు ఎక్కువ ధర కలిగి ఉంటాయి.[5]
చరిత్

భారతదేశంలోని పశ్చిమ బెంగాల్‌లో ఉన్న డార్జిలింగ్‌ జిల్లాలో ఉన్న శాంసింగ్ వద్ద గల పత్రాలు & పుష్పాలు.
దక్షిణ చైనా, మలేషియా, మరియు ఉత్తర వియత్నాం ప్రాంతాల్లో లీచీ సాగు ప్రారంభమైంది. అదేసమయంలో వన్య రకం వృక్షాలు నేటికీ గాంగ్‌డాంగ్ ప్రొవియన్స్ మరియు హైనాన్ ద్వీపంలోని వర్షారణ్యాల్లో పెరుగుతున్నాయి. చైనాకు సంబంధించిన అనధికార రికార్డుల వివరాల ప్రకారం, క్రీ.పూ. 2000 నుంచి కూడా లీచీ సుపరిచితం.[7]
మొదటి శతాబ్దంలో, ఇంపీరియల్ కోర్టులో తాజా లీచీలకు బాగా డిమాండ్ ఉండేది, ఖండాంతరాల నుంచి వీటిని వేగంగా తెప్పించడం కోసం వేగంగా వెళ్లే గుర్రాలతో కూడిన ఒక ప్రత్యేక కొరియర్ సర్వీస్‌ను ఉపయోగించేవారు. ట్సె సియాంగ్ రాసిన లీ చీ పు (లీచీలపై గ్రంథం)లోని వివరాల ప్రకారం సంగ్ రాజ్యం (క్రీ.శ.960-1279)లో లీచీకి గొప్ప డిమాండ్ ఉండేది. చక్రవర్తి అయిన లీ లాంగ్జీ (గ్జున్‌జాంగ్) యొక్క ప్రియమైన ఉంపుడుగత్తె యాంగ్ యువాన్ (యాంగ్ గుఫియే)కు సైతం ఇది అత్యంత ఇష్టమైన ఫలం. అత్యధిక మొత్తాన్ని ఖర్చు చేయడం ద్వారా చక్రవర్తి లీచీ ఫలాన్ని రాజధానికి తెప్పించేవాడు.[2]
చైనీస్ ప్రాచీన కావ్యమైన శాంగ్‌లిన్ ఫు ఈ ఫలానికి సంబంధించి రచించబడినదే, కొమ్మ నుంచి తుంచిన కొద్ది కాలానికే పాడయ్యే ఈ ఫలానికి ఉన్న లక్షణాన్ని పరిగణలోకి తీసుకుని ఈ కావ్యానికి ఈ విధమైన ప్రత్యామ్నాయ పేరు సూచించడం జరిగింది.
పియర్ర్ సెన్నెరాట్ (1748–1814) ద్వారా పశ్చిమాన తొలిసారిగా లీచీ పరిచయంలోకి వచ్చింది, చైనా మరియు ఆగ్నేయాసియాలలో సాగిన తన యాత్ర నుంచి తిరిగివచ్చే సందర్భంగా ఆయన లీచీలను పరిచయం చేశారు. దీని తర్వాత ఇది జోసెఫ్-ఫ్రాంకోయిస్ ఛార్పెంటైర్ డీ కొసైనీ డీ పామా ద్వారా 1764లో రీయూనియన్ ద్వీపానికి పరిచయం చేయబడింది. అటుపై ఇది మడగాస్కర్‌కు సైతం పరిచయం చేయబడడంతో పాటు త్వరలోనే ఆ ప్రాంతం అత్యధికంగా లీచీలను ఉత్పత్తి చేసే ప్రాంతంగా మారింది.
ప్రధాన వేరు కలిగిన మొలకెత్తుతున్న లీచీ విత్తనం.(దాదాపు 3 నెలల వయసున్నది)
దస్త్రం:Lychee seed.jpg
సాదారణ పరిమాణం కలిగిన విత్తనం (ఏడమ) మరియు చిన్న పరిమాణం(చికెన్ టంగ్)కలిగిన విత్తనం (కుడి)
లీచీలు చైనాతో పాటు, ఆగ్నేయ ఆసియా థాయిలాండ్, లావోస్, కంబోడియా, వియత్నాం, పాకిస్థాన్, బంగ్లాదేశ్, భారతదేశం, దక్షిణ జపాన్‌లతో సహా, ఇటీవల కాలిఫోర్నియా, హవాయ్, టెక్సాస్, ఫ్లోరిడా,[8] తడి ప్రదేశాలైన ఆస్ట్రేలియా మరియు ఉప-ఉష్ణమండల ప్రాంతాలైన దక్షిణాఫ్రికా, ఇజ్రాయిల్‌తో పాటుగా సినలోవా మరియు మెక్సికోలోని శాన్ లూయిస్ పోటోసీ (ప్రత్యేకించి లా హువస్టేకా) లాంటి ఇతర ప్రాంతాల్లోనూ పండుతున్నాయి. లీచీ వృక్షాలకు వెచ్చగా ఉండే ఉపోష్ణమండల వాతావరణం మొదలుకుని చల్లగా ఉండే ఉష్ణమండల వాతావరణం వరకు అవసరమైనప్పటికీ, గడ్డకట్టే లేదా -4 °Cకు తగ్గని కేవలం పూర్తిస్థాయి గడ్డకట్టే చలికాలంతో పాటు అత్యధిక ఉష్ణం కలిగిన వేసవి, వర్షపాతం, మరియు తేమ లాంటి వాటినీ ఇవి తట్టుకుంటాయి. చక్కని నీటిపారుదల, సేంద్రియ పదార్థాలతో నిండిన పూర్తి స్థాయి ఆమ్లయుత మృత్తికల్లో ఈ వృక్షాలు చక్కగా పెరుగుతాయి. దీంతోపాటు వరుసగా వెచ్చని మరియు చల్లని వాతావరణాలకు సరిపోయే విధంగా త్వరగానూ మరియు ఆలస్యంగానూ పక్వానికి వచ్చే విభిన్న వృక్ష జాతులు విస్తారమైన స్థాయిలో అందుబాటులో ఉన్నాయి. మరోవైపు లీచీలను పండ్ల కోసమే కాకుండా అలంకార మొక్కలుగానూ పెంచుతుంటారు.
లీచీలను తాజా రూపంలో ఆసియా మార్కెట్లలో విక్రయించడంతో పాటు ఇటీవలి సంవత్సరాల్లో ప్రపంచవ్యాప్తంగా సూపర్‌మార్కెట్లులోనూ విక్రయిస్తున్నారు. లీచీ పండ్లను శీతలీకరించిన సమయంలో దాని ఎర్రటి తొక్క భాగం గోధమ రంగులోకి మారినప్పటికీ, దాని రుచి మాత్రం ఏవిధంగానూ ప్రభావితం కాదు. లీచీలను క్యాన్‌లలో నిల్వచేయడం ద్వారా ఏడాది పొడవునా విక్రయిస్తుంటారు. ఈ పండ్లను తొక్కతో పాటుగా ఎండబెట్టిన సమయంలో దానిలోని కండ భాగం కృశించుకుపోవడంతో పాటు ముదురు రంగులోకి మారుతుంది.[2] ఎండిన లీచీలను తరచూ లీచీ నట్స్‌ అని పిలిచినప్పటికీ, నిజానికి అవి నిజమైన గింజలు కావు.
జానపదగాథల ప్రకారం, లీచీ వృక్షానికి బెరడు తొలగింపు చేస్తే అది ఎక్కువ ఫండ్లను ఉత్పత్తి చేయదు, మరిన్ని ఫండ్ల ఉత్పత్తికి అది దారితీస్తుంది.
విభిన్న వృక్ష సముదాయాలు
    విస్తారమైన సంఖ్యలో లీచీ వృక్ష రకాలు ఉండడం వల్ల వాటి పేర్లు మరియు గుర్తింపుల విషయంలోనూ కావల్సినంత తికమక చోటు చేసుకుంది. ఒకే రకానికి చెందిన వృక్షరకం విభిన్నమైన వాతావరణాల్లో పెరిగినట్టైతే అది పూర్తిగా భిన్నమైన రుచిని కలిగిన ఫలాలను ఉత్పత్తి చేస్తుంది. లీచీ వృక్షజాతులకు ప్రపంచంలోని విభిన్న ప్రాంతాల్లో విభిన్నమైన పర్యాయపదాలు సైతం వాడుకలో ఉన్నాయి. ఆస్ట్రేలియాతో సహా, ఆగ్నేయ ఆసియా దేశాల్లో ప్రధాన వృక్షజాతులకు స్వచ్ఛమైన చైనీస్ పేర్లనే ఉపయోగించడం జరుగుతోంది. భారతదేశంలో డజనుకు పైగా విభిన్న రకాల లీచీ వృక్షాలు పెరుగుతున్నాయి. దక్షిణాఫ్రికాలో ప్రధానంగా 'మౌరిటియస్' వృక్షరకం పెరుగుతోంది. హవాయ్ దేశంలో అభివృద్ధి చేసిన 'గ్రాఫ్' రకాన్ని మినహాయిస్తే యునైటెడ్ స్టేట్స్‌లో పెరుగుతున్న లీచీ వృక్ష రకాల్లో అత్యధిక భాగం చైనా నుంచి దిగుమతి చేసుకున్నవే.[3]

లీచీ వృక్షాలు పెరిగే అనేక రకాల ప్రాంతాలు మరియు దేశాల్లో విభిన్న రకాల వృక్షరకాలు ప్రసిద్ధమైనవి. చైనాకు సంబంధించి ఆదరణ పొందిన వృక్షరకాలు: సెనాయుహాంగ్, బైటాంగియింగ్, బైలా, శుయ్‌డాంగ్, ఫెయ్‌జిక్సియో, డాజౌ, హెయియే, నుయోమిసి, గుయివై, హౌఐజీ, లంజూ, మరియు చెంజీ మొదలుగునవి. వియత్నాంకు సంబంధించి ఆదరణ కలిగిన వృక్షరకాలు: లాంఘ్‌నన్, టైవీ, మరియు జుంగ్‌కమ్‌వాంగ్ మొదలుగునవి. హవాయ్ వృక్షరకంపై ఆధారపడి ఫ్లోరిడా లీచీలను ఉత్పత్తి చేస్తోంది. ఆస్ట్రేలియాకు సంబంధించి కొహాలా, కోంపూ, హేవూ, మరియు బీవ్ కీవ్ లాంటి రకాలను ఎక్కువగా సాగుచేయడం జరుగుతోంది.[5] భారతదేశం విషయానికి వస్తే, షాహీ (అత్యధిక కండ %) ,డెహ్రా డన్, ఎర్లీ లార్జ్ రెడ్, కలకట్టియా, రోస్ సెంటెడ్‌లతో సహా డజనుకు పైగా రకాలు సాగుబడిలో ఉన్నాయి.[3][9]
ఫోషక పదార్థాల వివరాలు.
Lychee (edible parts)
Nutritional value per 100 g (3.5 oz)
Energy
276 కి.J (66 kcal)
Carbohydrates
16.5 g
- Dietary fiber
1.3 g
Fat
0.4 g
Protein
0.8 g
Vitamin C 72 mg (87%)
Calcium 5 mg (1%)
Magnesium 10 mg (3%)
Phosphorus 31 mg (4%)
Edible parts are 60% of total weight
Percentages are relative to
US recommendations for adults.
Source: USDA Nutrient Database
లీచీకి సంబంధించి ప్రతి 100 గ్రాముల ఫలంలో సరాసరిగా 72 మి.గ్రా విటమన్ C ఉంటుంది.[10] సరాసరిగా తొమ్మిది లీచీ ఫలాలను తీసుకుంటే పెద్దవారికి సిఫార్సు చేయబడిన రోజువారీ విటమిన్ C అవసరం నెరవేరినట్టే.
ఇక ఒక కప్పుడు లీచీ ఫలాల ద్వారా ఇతర ఖనిజ లవణాల రూపంలో, 2000 క్యాలరీ డైట్, 14%DV రాగి, 9%DV ఫాస్పరస్, మరియు 6%DV పొటాషియం లాంటివి కూడా లభిస్తాయి.
లీచీలలో సంతృప్తకర కొవ్వు మరియు సోడియం తక్కువగా ఉండడంతో పాటు కొలెస్ట్రాల్ రహితం (అన్నిరకాల వృక్ష-సంబంధిత ఆహారాల వలే)గా ఉంటాయి. లీచీలలోని శక్తి రూపం చాలావరకు పిండిపదార్థం(చక్కెర) రూపంలో ఉంటుంది. పాలీఫెనాల్‌లను అధికంగా కలిగి ఉండే లీచీలు ద్రాక్షతో పోలిస్తే 15% ఎక్కువ పాలీఫెనాల్‌ను కలిగి ఉండడం వల్ల సాధారణంగా వీటిని పాలీఫెనాల్ అత్యధికంగా కలిగిన ఫలా