మనఊరు మనచెట్టు: వాకల్వికాయ

Saturday, December 22, 2018

వాకల్వికాయ

కలే చెట్టు వృక్ష శాస్త్రీయ నామం Carissa carandas. కలే చెట్టును కరండ, కలే కాయలు, కలేక్కాయలు, కలివి కాయలు అని కూడా అంటారు. ఇవి ఆంధ్రప్రదేశ్ లోని ఆన్ని ప్రాంతాల చిట్టడవులలో, కొండ ప్రాంతాలలో సహజసిద్ధంగా పెరుగుతాయి. ఈ చెట్ల పండ్లు తినవచ్చు. అడవులలో సహజసిద్ధంగా పెరిగే ఈ చెట్ల నుండి పండ్లు వానకాలంలో కొన్నిరోజులు మాత్రమే లభిస్తాయి. ఇది అపోసైనేసి కుటుంబానికి చెందిన పుష్పించే మొక్క. ఇది బెర్రీ పరిమాణంలో పండ్లు ఉత్పత్తి చేస్తుంది, వీటిని సాధారణంగా భారతీయ ఊరగాయలు మరియు సుగంధ ద్రవ్యాలు లో ఒక రుచికోసం కలిపే పదార్థంగా ఉపయోగిస్తున్నారు. ఈ మొక్క కరువు పరిస్థితులను తట్టుకుని నేలల యొక్క విస్తృత శ్రేణిలో బాగా దృఢంగా పెరుగుతుంది.   

వేసవికాలంలో మార్చి నెలనుండి మే-జూన్ వరకు ఈ కరండపండు లభిస్తుంది .కరండపండు చూచుటకు నల్లద్రాక్ష పండును పోలివుండును.పరిమాణంలో ద్రాక్షపండుకన్నకొంచెం చిన్నదిగావుండి,గుండ్రంగా కనిపిస్తుంది. సుమారు 5-6 కాయలున్నగుత్తులు అక్కడక్కడ పెరుగుతాయి.కొన్నిగుత్తులు/గుచ్ఛంలలో ఒకటి-రెండుకాయలుమాత్రమే వుంటాయి.చిన్నకాయలుగా వున్నప్పుడు మొక్కఆకులవలే కాయలు పచ్చగా వుండి,పెరిగెకొలది రంగుమారి పచ్చదనంకలసిన గులాబి-ఎరుపు రంగుగా పరివర్తనం చెందుతుంది.పూర్తిగా పండు అవ్వుటకు ముందుదశలో ముదురుఎరుపురంగుగా మారి,పూర్తిగా మాగి పండైనతరువాత నల్లగా కన్పిస్తుంది. కాయగా వున్నప్పుడు కోసినచో కాయతొడిమ నుండి తెల్లటిపాలవంటి ద్రవం స్రవిస్తుంది.పండుగా అయ్యిన తరువాతకూడా పండునుకోసినప్పుడు కూడా స్వల్ప పరిమాణంలో తొడిమనుండి తెల్లటిద్రవం కారుతుంది.పండులోపల అర్ధచంద్రాకారంలో వుండి,ఒకపక్కనొక్కబడిన విత్తనాలు అనేకం వుండును.


కరండ హిమాలయాలలో 300 నుంచి 1800 మీటర్ల ఎత్తులో, షివాలిక్ కొండలలో, పశ్చిమ కనుమలు మరియు నేపాల్,శ్రీలంక, మరియుఆఫ్ఘనిస్తాన్లలో సహజంగా పెరుగుతుంది.
సాగు :రాజస్థాన్,బీహారు,గుజరాత్,ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాలలో కొందరు రైతులు వ్యవసాయపంటగా సాగు చేస్తున్నారు.
Carissa carandas fruits ready for consumption.JPGకరండ పొదవంటి మొక్క.నేలనుంచి సుమారు 5-7 అడుగులెత్తు పెరుగుతుంది.ఎక్కువ నీటి అవసరంలేనందున ఉష్ణప్రాంతాలు ఈమొక్క పెరుగుటకు అనుకూలం.మొక్క నిడుపాటి కొమ్మలను కలిగివుంటుంది.ఎక్కువ రెండుకొమ్మలను ప్రారంభంలో కలిగివుండును.అతరువాత మిగతా కొమ్మలు పెరుగును.కొమ్మలమీద అక్కడక్కడ సుమారు ఒక అంగుళం పొడవున్న కంటకాలు/ముళ్ళు వుంటాయి.పత్రాలు/ఆకులు రెండునుండి మూడు అంగుళాల పొడవుండును.పత్రాల రంగు లేత పచ్చరంగునుండి-ముదురుపచ్చరంగుకలిగివుండును.కొమ్మలమీదనున్న ముళ్ళ తొడిమలవద్ద పుట్టు ఆకులు ఒకదాకొకటి ఎదురుగా వుండును.ఎటువంటి సంరక్షణ,పోషణ అవసరంలేకుందగానే గుట్తలమీద,గట్టులమీద పెరుగు ఈమొక్కను రైతులు పొలాలకు,కళ్ళాలకు,దొడ్లకు కంచెలా పెంచెదరు.పండ్లనుంచివఛ్చివిత్తానాలను విత్తిన కొత్తమొక్కలను మొలచును.
Bush of Carissa carandas with heavy load of fruits.JPGFruits of Carissa carandas.JPG   
కరండకాయ ఒగరు రుచి కలిగివుండి,తినుటకు అనుకూలంకాదు.కాయ మాగడం మొదలై దోరగా అయ్యినప్పుడు పులుపురుచిని కలిగి తినుటకు యోగ్యంగా వుండును.పూర్తిగా పండినతరువాత మధురమైన తీపి రుచిని కల్గి, కొంచెం పులుపుకలిగి తినుటకు అనుకూలంగా వుండును.పాయను-పండును కోసినప్పుడు తొడిమనుండి కారి పండుకు అంటుకున్న తెల్లనిపాలను నీటితోకడిగివేసి,తినవలెను.

పండులో సి విటమిన్ వున్నది.
పండును తినడం వలన పిత్థమును నివారించవచ్చును.
కాని పండును ఎక్కువగా తిన్నచో అజీర్తిచేసి,కడుపునొప్పి వచ్చును.
కరండ కాయ పుల్లగావుంటుందికావున ,కరండ కాయను ఊరగాయ తయారులో ఉపయోగిస్తారు.కరండకాయ వూరకాయ చాలా రుచికరంగా వుండును.
కరండ పండులో పెక్టిన్అధికంగా వుండటం వలన,జామ్(jam),జెల్లి(jelly)తయారిలో కరండ పండును ఉపయోగిస్తారు.
కాయనుండి తీసిన స్రవం మధుమేహరోగనివారణిగా పనిచేస్తుంది