మనఊరు మనచెట్టు: అరటి

Saturday, November 28, 2015

అరటి

అరటి ఒక చెట్టులా కనిపించే మొక్క (నిజం చెప్పాలంటే ఇది ఒక హెర్బ్ మాత్రమే). ఇది మూసా అను ప్రజాతికి, మరియూ మూసేసి కుటుంబానికి చెందినది. కూర అరటి కి దగ్గర సంబంధాన్ని కలిగి ఉంటుంది . అరటి చెట్టు కాండము, చాలా పెద్ద పెద్ద ఆకులతో (సుమారుగా రెండు నుండి మూడు మీటర్లు పొడుగు) నాలుగు నుండి ఎనిమిది మీటర్లు ఎత్తు పెరుగును. అరటి పండ్లు సాధారణంగా 125 నుండి 200 గ్రాములు బరువు తూగుతాయి. ఈ బరువు వాటి పెంపకం, వాతావరణము, ప్రాంతముల వారీగా మారుతుంది. ఈ బరువులో 80% లోన ఉన్న తినగల పదార్థము, 20% పైన ఉన్న తోలు.
వ్యాపార ప్రపంచములోనూ, సాధారణ వాడకములోనూ వేలాడే అరటికాయల గుంపును ఓ గెల అంటారు. గెలలోని ఒక్కొక్క గుత్తిని అత్తము(హస్తము) అంటారు. చరిత్ర పరంగా అరటిచెట్లను పశ్చిమ పసిఫిక్, దక్షిణ ఆసియా దేశాలలో, భారత దేశంతో కలిపి, సాగుచేసినారు.
చాలా రకాల అరటి పండ్ల రంగూ, రుచీ, వాసన, అవి పక్వానికి వచ్చే దశలోని ఉష్ణోగ్రతల ఆధారంగా మారుతుంటాయి. తక్కువ ఉష్ణోగ్రతల వద్ద అరటిపండ్లు పాడయిపోయి పాలిపోతాయి, అందువల్లనే వీటిని ఇళ్ళల్లో ఫ్రిజ్జు లలో పెట్టరు, అలాగే రవాణా చేసేటప్పుడు కూడా 13.5 డెగ్రీ సెల్సియసు కన్నా తక్కువ ఉష్ణోగ్రతకు తీసుకొనిరారు.
కేవలం 2002 వ సంవత్సరములోనే 6.8 కోట్ల టన్నుల అరటిపండ్లు ప్రపంచ వ్యాప్తంగా ఉత్పత్తి చేయబడినాయి. ఇందులో 1.2 కోట్ల టన్నులు దేశాల మధ్య వ్యాపారంగా రవాణా చెయ్యబడినాయి. ఈక్వడార్, కోస్టారికా , కొలంబియా, ఫిలిప్పైన్సు దేశాలు ప్రతి ఒక్కటీ పది లక్షల టన్నుల కన్నా ఎక్కువ అరటి పండ్లు ఎగుమతి చేస్తున్నాయి.
అరటిలో పిండిపదార్థాలు/చక్కెరలు (కార్బోహైడ్రేటులు) ఎక్కువ. ప్రతి 100 గ్రాముల అరటి లో 20 గ్రాముల కార్బోహైడ్రేటులు, 1గ్రాము మాంసకృత్తులు (ప్రోటీనులు), 0.2 గ్రాములు కొవ్వు పదార్థాలు, 80 కిలోక్యాలరీల శక్తి ఉన్నవి. అరటి సులభంగా జీర్ణమై, మలబద్ధం రాకుండా శరీరాన్ని కాపాడుతుంది.
భారతదేశములో మొత్తం 50 రకాల అరటిపండ్లు లభిస్తున్నాయి. వాటిలో కొన్ని రకాలు: పచ్చ అరటిపండ్లు, చక్కెరకేళి, పసుపు పచ్చవి, కేరళ అరటిపండ్లు, కొండ అరటిపండ్లు,అమృతపాణి(ముకిరీ),కర్పూరం. వీటినుండి చిప్సు కూడా తయారు చేస్తారు.
అరటిని కూరగా, అలంకరణ వస్తువులను, ఔషధంగా వాడతారు. పచ్చి అరటి కాయలను వివిద రకాల కూరలలో కూడ వాడతారు. అరటి చెట్టు నుండి గెలను కోసిన తర్వాత అరటి బోదేను విడదీస్తే అది అర్ద చంద్రాకరంగల పొడవాటి దళసరిగా వున్న పట్టలు వస్తాయి. వాటినుండి సన్నని పట్టు దారం లాంటి దారాన్ని తీసి దాంటో అందమైన అలంకరణ వస్తువులను తయారు చేస్తారు. అవి చాల మన్నిక కలిగి చాల అందంగా వుంటాయి.
చరిత్రసవరించు
అరటి చెట్ల పుట్టుక అనునది ఆసియా వాయువ్య దేశాలలో సంభవించినది. ఇప్పటికీ కూడా చాలా రకాల అడవి అరటి చెట్లు న్యూ గినియా, మలేసియా, ఇండోనేషియా, ఫిలిప్పైన్సు లలో కనపడతాయి. ఇటివల దొరికిన పురావస్తు, శిలాజవాతావరణ శాస్త్ర ఆధారాలను బట్టి పౌపా న్యూ గినియా లోని పశ్చిమ ద్వీప ఖండములోని కుక్‌ స్వాంపు వద్ద క్రీస్తుకు పూర్వం 8000 లేదా క్రీస్తు పూర్వం 5000 సంవత్సరాల నుండే అరటి తోటల పెంపకం సాగినట్లు నిర్ధారించినారు. దీని వల్ల న్యూ గినియా లో తొలి అరటి తోటల పెంపకం జరిగినట్లు నిర్ధారించవచ్చు. తరువాత తరువాత ఇతర అడవి అరటి జాతులు దక్షిణ ఆసియా ఖండములో పెంపకము చేసినట్లు తోచుచున్నది.
వ్రాత ప్రతులలో మొదటిసారిగా అరటి ప్రస్తావన మనకు క్రీస్తు పూర్వం 600 సంవత్సరములో వ్రాసిన బౌద్ధ సాహిత్యమునందు కనపడుతుంది. అలెగ్జాండరు తొలిసారిగా వీటి రుచిని క్రీస్తు పూర్వం 327 వ సంవత్సరములో భారత దేశం నందు చూసినాడు. చైనాలో క్రీస్తు శకం 200 సంవత్సరము నుండి అరటి తోటల పెంపకం సాగినట్లుగా మనకు ఆధారాలు లభ్యమవుతున్నాయి. క్రీస్తు శకం 650 వ సంవత్సరములో ముస్లిం దండయాత్రల వల్ల అరటి పాలస్తీనా ప్రాంతానికీ, తరువాత ఆఫ్రికా ఖండానికీ వ్యాప్తి చెందింది.
క్రీస్తు శకం 1502 వ సంవత్సరాన పోర్చుగీసు వారు తొలిసారిగా అరటి పెంపకాన్ని కరేబియను, మధ్య అమెరికా ప్రాంతములలో మొదలుపెట్టినారు.
ధర్మాలుసవరించు
'ఆంధ్ర ప్రదేశ్ లో అరటి తోట'
అరటిపండ్లు రకరకాల రంగులలో మరియు ఆకారాల్లో లభిస్తున్నాయి. పండిన పండ్లు తేలికగా తొక్క వలుచుకొని తినడానికీ, పచ్చి కాయలు తేలికగా వంట చేసుకుని తినడానికీ అనువుగా ఉంటాయి. పక్వ దశను బట్టి వీటి రుచి వగరు నుండి తియ్యదనానికి మారుతుంది. మాగని 'పచ్చి' అరటికాయలు, అరటిపండ్లు వండటానికి ఉపయోగిస్తారు. కొన్ని ఉష్ణమండల ప్రాంతాల్లోని ప్రజలకు ఇది ప్రధాన ఆహారం.
నిఖార్సయిన అరటి పండ్లు చాలా పెద్ద పెద్ద విత్తనాలను కలిగి ఉంటాయి, కానీ విత్తనాలు లేకుండా రకరకాల అరటి పండ్లను ఆహారం కోసం అభివృద్ధి చేసినారు. వీటి పునరుత్పత్తి కాండం యొక్క తొలిభాగాల ద్వారా జరుగుతుంది. వీటిని పిలకలు అంటారు. కొన్ని పర్యాయములు ఈ పిలకలను పూలు అనికూడా పిలవడం పరిపాటి. ఒక సారి పంట చేతికి వచ్చిన తరువాత అరటి చెట్టు కాండాన్ని నరికివేసి, ఈ పిలకలను తరువాతి పంటగా వాడుకొంటారు. ఇలా నరికిన కాండం బరువు సుమారుగా 30 నుండి 50 కేజీలు ఉంటుంది.
అరటి శుభ సూచకం అని అందుచేత అరటిని శుభకార్యాలలో తప్పకుండా వినియోగిస్తారు. దీని వెనుక ఒక ఇతిహాస సంబంధమైన కథ కూడా ఉన్నది. ఒకప్పుడు దుర్వాసమహాముని సాయంసంధ్యవేళ కూడా ఆదమరచి నిద్రపోతున్నప్పుడు ఆయన భార్య(కదలీ) సంధ్యావందనం సమయం అయిన కారణమున ఆయనను నిద్ర నుండి మేలుకొల్పుతుంది. దుర్వాసుడు నిద్ర నుండి లేచి చూస్తే ఆయన నేత్రాల నుండి వచ్చిన కోపాగ్నికి ఆవిడ భస్మరాశి అయిపోతుంది. కొన్ని రోజుల తరువాత దుర్వాస మహర్షి మామ గారు తన కూతురు గురించి అడుగగా ఆవిడ తన కోపాగ్ని వల్ల భస్మరాశి అయినది అని చెప్పి, తనమామ గారి ఆగ్రహానికి గురి ఉందేందుకు, దుర్వాసముని భార్య శుభపద్రమైన కార్యాలన్నింటిలో కదలీ ఫలం(సంస్కృత పదానికి తెలుగు అర్థం అరటి) రూపం లో వినియోగించబడుతుంది అని వరాన్ని ఇస్తాడు. ఈ అరటి ఆకులను రక రకాల పనులకు ఉపయోగిస్తారు, ముఖ్యముగా భోజనము చెయ్యడానికీ, పెండ్లిళ్ళలో మండపాల అలంకరణకు వాడతారు.
అరటితో రకరకాలైన వంటకాలు చేసుకోవచ్చు. అరటి కూర,అరటి వేపుడు, అరటి బజ్జీ మెదలైనవి. అరటి తో అల్పాహారాలు, అరటి పండు రసాలు కూడా చేసుకోవచ్చు. బనానా చిప్స్‌ అనునది అరటి కాయ నుండి తయారు చేయు ఓ అల్పాహారం. ఇది ప్రపంచ వ్యాప్తంగా బహు ప్రసిద్ధి. చాలా కంపెనీలు దీని వ్యాపారం లాభదాయకంగా నిర్వహిస్తున్నాయి. భారతదేశంలో, ముఖ్యముగా ఆంధ్ర ప్రదేశ్ లోని నగరాలు, పట్టణాలలో ఇవి చాలా విరివిగా లభిస్తాయి. మామూలు బంగాళదుంప లేదా ఆలూ చిప్స్‌ కన్నా కొద్దిగా మందంగా ఉంటాయి. కేరళ వాళ్ళు వీటిని కొబ్బరి నూనెతో వేయించి తయారు చేస్తారు. అవి ఓ ప్రత్యేకమైన వాసన, రుచి కలిగి ఉంటాయి. అరటి పండ్లను జాం తయారు చెయ్యడంలో కూడా ఉపయోగిస్తారు. అరటి పండ్లను పండ్ల రసాలు తయారు చేయడం లోనూ, ఫ్రూట్‌ సలాడ్‌ లలోనూ, ఉపయోగిస్తారు. అరటి పండ్లలో సుమారుగా 80% నీళ్ళు ఉన్నప్పటికీ, చారిత్రకంగా వీటినుండి రసం తీయడం అసాధ్యంగా ఉండినది, ఎందుకంటే వీటిని మిక్సీలో పట్టినప్పుడు అది గుజ్జుగా మారిపోతుంది. కానీ 2004 వ సంవత్సరంలో భాభా ఆటామిక్‌ పరిశోధనా సంస్థ (బార్క్‌) వారు ఓ ప్రతేకమైన పద్ధతి ద్వారా అరటి పండ్లనుండి రసాలు తయారు చేయడం రూపొందించి, పేటెంటు పొందినారు. ఈ పద్దతిలో అరటి పండ్ల గుజ్జును సుమారుగా నాలుగు నుండి ఆరు గంటల పాటు ఓ పాత్రలో చర్యకు గురిచేయడం ద్వారా పండ్ల రసాన్ని వెలికితీస్తారు.
అరటి పువ్వులు
అరటి చెట్లతో పాటు అరటి పువ్వును (దీనిని తరచూ అరటి పుష్పం లేదా అరటి హృదయం అని అంటారు) బెంగాలీ వంటలలో , కేరళ వంటలలో ఉపయోగిస్తారు. అరటి కాండములోని సున్నితమైన మధ్య భాగం (దూట) కూడా వంటలలో ఉపయోగిస్తారు - ముఖ్యముగా బర్మా , కేరళ, బెంగాలు, ఆంధ్ర ప్రదేశ్ లలో. అరటి పూవు జీర్ణ క్రియ తేలికగా జరిగి సుఖ విరోచనము అగును . ఇందులోని ఐరన్ ,కాల్సియం , పొటాసియం, మెగ్నీషియం , ఫాస్ఫరస్ , వగైరాలు నాడీ వ్యవస్థ మీద ప్రభావంచూపి సక్రమము గా పనిచేసేటట్లు దోదాపడును . ఇందులోని విటమిన్ సి వ్యాధినిరోధక శక్తిని అభివృద్ది చేయును . ఆడువారిలో బహిస్తుల సమయం లో అధిక రక్తస్రావము అరికట్టడానికి ఇది పనికొచ్చును . మగవారిలో వీర్య వృద్ధికి దోహద పడును .
అరటి ఆకులు
అరటి ఆకులు చాలా సున్నితంగా, పెద్దగా సౌలభ్యంగా ఉంటాయి. ఇవి తడి అంటకుండా ఉంటాయి, అందువల్ల వీటిని గొడుగుకు బదులుగా వాడతారు. చైనా, జోంగ్జీ, మధ్య అమెరికా లలో వీటిని వంటకాలు చుట్టడానికి ఉపయోగిస్తారు. మనము ఇంతక్రితమే చెప్పుకున్నట్లు వీటిని ఆంధ్రా లో చక్కని భోజనమునకు పళ్ళెరము బదులుగా ఉపయోగిస్తారు.
కూర అరటిలోని రకాలుసవరించు
అరటిపండ్లు
అరటి కాయలలో రెండు విధాలున్నాయి. ఒక పండించి తినడానికుపడేవి. రెండో రకం కేవలం కూరలలో ఉపయోగించడానికుపయోగ పడేవి. ఇవి కూడ మాగతాయి కాని అంత రుచిగా వుండవు. వీటికి తోలు చాల మందంగా వుండును. వీని కూరలలో మాత్రమే ఉపయోగిస్తారు.
కూర అరటి రకాలు
పచ్చబొంత
బూడిద బొంత
పచ్చబొంత బత్తీసా
బూడిద బొంత బత్తీసా
పచ్చగుబ్బబొంత
పలకల బొంత
నూకల బొంత
సపోటా బొంత
నేంద్రం
సిరుమల అరటి
వామనకేళి

అరటి సాగుసవరించు
చీకటిగల కోసము అరటిచెట్ల పరిశీలన
అరటి పంటకు మంచి సారవంతమైన ఒండ్రునేల కలిగిన డెల్టా భూముల్లో మరియు నీరు బాగా ఇంకిపోయే భూములు అనుకూలం. ఇసుకతో కూడిన గరపనేలల్లో కూడా ఈ పంట పండించవచ్చు. భూమి 1మీ. కంటే లోతుగా ఉండి, 6.5-7.5 మధ్య ఉదజని సూచిక కలిగి, ఎలక్ట్రికల్ కండక్టివిటి 1.0 మీ.మోస్ కంటే తక్కువ కలిగిన భూములు అనుకూలము. నీరుసరిగా ఇంకని భూముల్లో, చవుడు భూములు, సున్నారపు నేలలు, గులక రాల్లు, ఇసుక భూములు ఈ పంటకు పనికి రావు. [1]
అరటికి చీడపీడల బెడద కొద్దిగా ఎక్కువ. దానికి కారణాలలో ఒకటిగా జన్యుపరమైన వైవిద్యములేకపోవడము చెపుతారు. జన్యుపరమైన వైవిద్యము లేకపోవడానికి కారణము ఇవి ఎక్కువగా స్వపరాగసంపర్కము వల్ల వృద్దిపొందటము అని చెపుతారు. కాండము ద్వారా ఫలదీకరణము చేయుపద్దతి వల్ల వైరసులు చాలా తేలికగా వ్యాపిస్తాయి. బనానా బంచీ అనునది ఆసియాలో చాలా ప్రమాదకరమైన బనానా వైరసు. ఇది వ్యాపించిన చేయగలిగినదేమీ లేదు - పంటను తగలబెట్టి మిగిలిన పొలాలకు వ్యాప్తి చెందకుండా చూడటము తప్ప.
పోషక విలువలూ, ఆహార పద్ధతుల మీద ప్రభావముసవరించు
శ్రీలంకలోని ఎర్ర అరటి రకము
అరటిపండులో ముందే చెప్పుకున్నట్లు 74% కన్నా ఎక్కువగా నీరు ఉంటుంది. 23% కార్బోహైడ్రేటులు, 1% ప్రోటీనులు, 2.6% ఫైబరు ఉంటుంది. ఈ విలువలు వాతావరణాన్ని, పక్వదశనుబట్టి, సాగు పద్దతిని బట్టి, ప్రాంతాన్ని బట్టి మారుతుంటాయి. పచ్చి అరటిపండులో కార్బోహైడ్రేటులు స్టార్చ్ రూపములో ఉంటాయి, పండుతున్న కొద్దీ ఇవి చక్కరగా మార్పుచెందబడతాయి. అందుకే పండు అరటి తియ్యగా ఉంటుంది. పూర్తిగా మాగిన అరటిలో 1-2% చక్కర ఉంటుంది. అరటిపండు మంచి శక్తిదాయకమైనది. అంతే కాకుండా ఇందులో పొటాషియం కూడా ఉంటుంది. అందువల్ల ఇది రక్తపోటుతో బాధపడుతున్నవారికి చాలా విలువైన ఆహారం. అరటిపండు, పెద్ద పేగు వ్యాధిగ్రస్తులకు చాలా చక్కని ఆహారం. అందుకే అరటి పండు పేదవాడి ఆపిలు పండు అని అంటారు. ఎందుకంటే, రెండింటిలోనూ పోషక విలువలు సమానంగానే ఉంటాయి. కాని, అరటి పండు చవక, ఆపిలు పండు ఖరీదు.
వందగ్రాముల అరటిలో వున్న పోషకాలు
నీరు - 70.1 గ్రా.
ప్రోటీన్ - 1.2 గ్రా.
కొవ్వుపదార్థాలు - 0.3 గ్రా.
పిండిపదార్థాలు - 27.2 గ్రా.
కాల్షియం - 17 మి.గ్రా.
ఇనుము - 0.4మి.గ్రా.
సోడియం - 37 మి.గ్రా.
పొటాషియం - 88 మి.గ్రా.
రాగి - 0.16 మి.గ్రా.
మాంగనీసు - 0.2 మి.గ్రా.
జింక్ - 0.15 మి.గ్రా.
క్రోమియం - 0.004 మి.గ్రా.
కెరోటిన్ - 78 మైక్రో గ్రా.
రైబోఫ్లెవిన్ - 0.08 మి.గ్రా.
సి విటమిన్ - 7 మి.గ్రా.
థయామిన్ - 0.05 మి.గ్రా.
నియాసిన్ - 0.5 మి.గ్రా.
శక్తి - 116 కిలోకాలరీలు

అరటి వ్యాపారంసవరించు
అరటి ప్రపంచంలో ఎక్కువగా తినే పండు. కానీ చాలామంది అరటి సాగుబడిదారులకు మాత్రం మిగిలేది, లేదా గిట్టుబాటయ్యేది చాలా స్వల్ప మొత్తాలలోనే. మధ్య అమెరికా ఎగుమతులలో అరటి, కాఫీ సింహభాగాన్ని ఆక్రమిస్తున్నాయి. ఎగుమతులలో ఇవి రెండు కలిపి 1960 లో 67 శాతం వాటా కలిగిఉన్నాయి. బనానా రిపబ్లికు అను పదం స్థూలంగా మధ్య అమెరికాలోని అన్ని దేశాలకూ వర్తించినప్పటికీ నిజానికి కోస్టారికా, హోండూరస్, పనామా లు మాత్రమే నిజమైన బనానా రిపబ్లికులు. ఎందుకంటే వీటి ఆర్ధికవ్యవస్థ మాత్రమే అరటి వ్యాపారంపై ఆధారపడి ఉన్నది.
అరటిపండు పట్ల జనాల వైఖరిసవరించు
అరటి పండు చాలా ప్రముఖమైన, ప్రసిద్ది పొందిన పండు. ఇది చాలా మందికి ఇష్టమైన పండు. కానీ కోతులు, కొండముచ్చులు అరటిపండును రకరకాల పద్ధతిలో తినే ఫోటోలు చాలా ప్రసిద్ది పొందటంవల్ల ఈ అరటి పండు అనే పదాన్ని కొన్ని ప్రాంతాలలో జాతిపరమైన అపహాస్యములకు ఉపయోగించినారు. ముఖ్యముగా ఆటగాళ్ళపై అరటిపండు తొక్కలు విసిరివేయడం, కుళ్ళిన టమాటాలు, కోడిగుడ్లు అంత ప్రసిద్ది. మలేషియాలోనూ, సింగపూరులోనూ అరటిపండును చైనీసు భాష రాని, లేదా ఎక్కువగా ఆంగ్లేయుడిలాగా ప్రవర్తిస్తున్న చైనీయునికి పర్యాయపదంగా వాడతారు. ఎందుకంటే అరటిపండుకూడా పైన పసుపు, లోన తెలుపు కాబట్టి.
అరటి తో వైద్యముసవరించు
అరటి కాయలు\పాకాల సంతలో తీసిన చిత్రము
అరటి ఆనారోగ్యానికి ఔషధంగా వాడతారు.
దీనిలో అత్యధికంగా ఉండే పొటాషియం బీపీ, అధిక ఒత్తిడిని తగ్గిస్తుంది.
శరీరంలోని విషపదార్థాల (టాక్సిన్స్)ను తొలగిస్తుంది.
అరటిపండ్లలో ఉండే ట్రిప్టోఫాన్ అనే అమైనో యాసిడ్ శరీరంలో ప్రవేశించగానే సెరటోనిన్‌గా మారి ఒత్తిడిని తగ్గిస్తుంది. అందుకే రాత్రిపూట పాలు, అరటిపండు తీసుకుంటే నిద్ర బాగా పడుతుందని చెబుతారు.
అరటిపండులోని పొటాషియం శరీర కండరాల్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. డైటింగ్ చేస్తున్నవాళ్లు ఒకపూట భోజనం లేదా టిఫిన్ మానేసి అరటిపండు, వెన్న తీసిన పాలు తీసుకుంటే శరీరానికి కావలసిన పోషకాలన్నీ అందుతాయి.
జీర్ణసంబంధమైన సమస్యలకూ అరటిపండు మంచి ఔషధంలా పనిచేస్తుంది. జబ్బుపడినవాళ్లు దీన్ని తింటే తొందరగా కోలుకుంటారు.
పచ్చి అరటి కాయలు విరేచనాలనూ, పండిపోయినవి మలబద్ధాన్నీ అల్సర్ల నూ అరికడతాయి.
అరటిపండ్లలో కణోత్పత్తిని ప్రోత్సహించే గుణం, జీర్ణాశయం గోడలకున్న సన్నటి పొర నాశనం కాకుండా కాపాడుతుంది.
పొట్టలో ఆమ్లాలు ఎక్కువైతే ఓ అరటిపండు తినండని సూచిస్తున్నారు నిపుణులు. ఇవి ప్రకృతిసిద్ధ యాంటాసిడ్‌గా పనిచేస్తాయి. వీటిలో ఉండే యాంటాసిడ్‌ల ప్రభావం పొట్టలో పుండ్లను తగ్గిస్తుంది.
అమెరికాలో పాయిజన్ ఐవీ (poison ivy) అనబడే చెట్లు చర్మానికి తగిలిన వచ్చే ఓ రకమైన చర్మ వ్యాధిని అరటిపండు తోలు లోపలి భాగంతో రుద్ది నయం చేస్తుంటారు
అరటికి ఎయిడ్స్‌ వైరస్‌పై పోరాడే శక్తి ఉంది.అరటిలోఉండే 'బాన్‌లెక్‌' అనే రసాయనం ఎయిడ్స్‌ వైరస్‌పై శక్తిమంతంగా పోరాడుతుందని తేల్చారు. ప్రస్తుతం వైరస్‌ నిరోధానికి వాడుతున్న 'టీ20, మారావిరాక్‌' మందులతో సమానంగా ఈ రసాయనం పని చేస్తుంది..అరటిలోని లెక్టిన్‌ రసాయనం వైరస్‌ను శరీరంలో ప్రవేశించనీయకుండా అడ్డుకుని ఇన్‌ఫెక్షన్‌ను నిరోధిస్తుంది.ఈ రసాయనం ప్రొటీన్‌పై పరచుకుని హెచ్‌ఐవీ జన్యుపదార్థం మూసుకుపోయేలా చేస్తుంది.[2]
అరటిలో పొటాషియం ఎక్కువగా ఉంటుంది. రక్తపోటు తగిన మోతాదులో ఉండేలా చేస్తుంది. గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది. పొటాషియం అధికంగా ఉండే ఆహారపదార్థాలు తీసుకోవడం వల్ల పక్షవాతం ముప్పు తక్కువగా ఉంటున్నట్టు పలు అధ్యయనాల్లో గుర్తించారు.
◾అరటిపండులో పీచు పదార్థాలు అధికంగా ఉంటాయి. ఇవి గుండెజబ్బుల్ని నివారించడమే కాకుండా ఎముకల ఆరోగ్యాన్నీ కాపాడతాయి.
◾అరటి తొక్క లోపల బాగాన్ని దోమ కరచిన దగ్గర రుద్దడం వలన దురద మరియు వాపు తగ్గిపోతుంది.
అంతరించే ప్రమాదంసవరించు
ఓ దశాబ్దంలో ఆహారంగా స్వీకరించు అరటి జాతి అంతరించు ప్రమాదంలో ఉన్నది. ప్రస్తుతము ప్రపంచ వ్యాప్తముగా తిను కావెండిషు అరటి (మన పచ్చ అరటి ?) జన్యుపరంగా ఎటువంటి వైవిద్యాన్నీ చూపలేకపోవడం వల్ల వివిధ రకాల వ్యాధులకు గురిఅవుతుంది. ఉదాహరణకు 1950 లో పనామా వ్యాధి, ఇది నేల శిలీంధ్రము (ఫంగస్) వల్ల వచ్చి ‌బిగ్ మైక్ రకానికి చెందిన అరటి జాతిని పూర్తిగా తుడిచిపెట్టినది. నల్ల సిగటోక (black sigatoka)వ్యాధి. ఇది కూడా మరో రకం శిలీంధ్రము వల్ల వచ్చిన వ్యాధే కానీ చాలా త్వరితగతిన వ్యాపించినది. ముఖ్యముగా మధ్య అమెరికా లోనూ ఆఫ్రికా, ఆసియా ఖండములలో ఇది వ్యాపించినది.
ట్రోపికల్ జాతి 4 అనబడు ఓ క్రొత్త వ్యాధికారకము కావెండిషు (పచ్చ అరటి?) జాతికి చెందిన అరటితోటలపై ఆశించుతుంది. దీని ప్రభావము వల్ల... వాయువ్య ఆసియాలో అందువల్ల ఇక్కడినుండి వచ్చే అరటి ఎగుమతులపై కొద్దిగా జాగ్రత్త వహించడం ప్రారంభం అయినది. ఈ వ్యాధి వ్యాపించకుండా ఇతర దేశాలవాళ్ళు తగిన జాగ్రత్తలు తీసుకొంటూ మట్టినీ, అరటి పండ్లను జాగ్రత్తగా పరిశీలించసాగినారు.
గ్రాస్ మికేలు లేదా బిగ్ మైక్ అను రకానికి చెందిన అరటిది ఒక విషాద కథ. ఇది పనామా వ్యాధి వల్ల 1950 లో పూర్తిగా తుడిచిపెట్టబడినది. ఈ బిగ్ మైక్ రకం సమ శీతల, లేదా శీతల దేశాలకు ఎగుమతి చేయడానికి చాలా అనువుగా ఉండేది. కొంతమంది ఇప్పటికీ దీని రుచిని మరిచిపోలేక ప్రస్తుతము లభిస్తున్న పచ్చ అరటి కన్నా బిగ్ మైక్ రుచికరంగా ఉంటుంది అంటూ వాదిస్తుంటారు! అంతే కాకుండా రవాణాకు కూడా బిగ్ మైక్ చాలా అనుకూలంగా ఉండేది, అదే పచ్చ అరటి రవాణా విషయంలో చాలా శ్రద్ధ తీసుకోవలసిన అవసరం ఉంది.