మనఊరు మనచెట్టు: వేపనూనె

Friday, November 27, 2015

వేపనూనె

.fb.com/manaurumanachettu
వేపనూనెకున్న ఔషధగుణం కారణంగా, సబ్బుల తయారీలో విరివిగా వాడుచున్నారు. వేపనూనెతో చేసిన సబ్బు నురుగు ఎక్కువగా ఇచ్చును
వేపనూనె, సబ్బుద్రవం, నీటి మిశ్రమాన్నిమొక్కల చీడ, పీడల నివారిణిగా పిచికారి చేసి వాడెదరుఆయుర్వేద, యునాని మందుల తయారీలో ఉపయోగిస్తారు.
కీళ్ళనొప్పుల నివారణకు మర్దన నూనెగా వాడెదరు.
పేల నివారణకు చాలా బాగా పనిచేస్తుంది. రాత్రి తల వెంట్రుకలకు వేపనూనెను దట్టంగా పట్టించి, గాలి అందకుండగా గట్టిగా వస్త్రాన్నిచుట్టి ఉదయం వరకు ఉంచిన, తలలోని పేలు చనిపోవును.
వేప నూనెను ప్రస్తుతం ఎక్కువగా క్రిమి సంహారకం గా వాడుతున్నారు. రైతులు తమ పంటలపై చీడ పీడల నివారణకు వేప నూనె ఆధారిత మందులను వాడు తున్నారు. దీనిని ప్రభుత్వం కూడ ఎక్కువగా ప్రోత్సహిస్తున్నది. దీనివలన పర్యావరణానికి ముప్పు ఉండదు. భూమి, జల వనరులు కలుషితం కావు. ఇటు వంటి మందులు వాడిన ఆహార పంటల వలన ప్రజల ఆరోగ్యానికి ఎలాంటి హాని ఉండదు .
నేలలోపాతు కర్ర భాగానికి, ఇంటిలోని దూలాలకు,వాసాలకు, గుమ్మాలకు వేపనూనెను రాసిన చెదపట్టదు.
నూనె తీసిన వేపచెక్క (oil cake) ఎరువుగా రసాయనిక ఎరువులతో కలిపి చల్లెదరు. నూనె తీసిన చెక్కలో 5.2-5.6 వరకు నత్రజని ఉన్నది. భాస్వరం 1.9%, పోటాషియం 1.5% ఉన్నది