మనఊరు మనచెట్టు

Tuesday, June 19, 2018

Manaurumanchettu 4th anniversary celebrations

Challenge of Planting a tree
మనం ఈ ప్రకృతి కి ఇంతవరకూ ఎంతో నష్టం తలపెట్టిన సంగతి తెలిసిందే కనుక మన వంతుగా ఒక మొక్క నాటి ఆ నాటే సమయంలో ఫోటో కానీ వీడియో కానీ తీసి మీ మిత్రుల కి బంధువుల కి ఛాలెంజ్ చేసి వారి పేర్లు ప్రకటించాలి.
మా మీ మనఊరు మనచెట్టు తలపెట్టిన ఈ planting a plant challenge లో ప్రతీ ఒక్కరూ తప్పకుండా పాల్గొనాలని కోరుకుంటుఅన్నాను....


Tag on fb fb/manaurumanchettu_official

Twitter #tag #Challenge_of_tree #manaurumanchettu
instagram #manaurumanchettu
@manaurumanchettu_official 

Monday, June 04, 2018

మనిషిలాంటిదే చెట్టు






చెట్టంత మనిషి అని, చెట్టంత ఎదిగాడు అంటారు.ఈ విశ్వం అంతా పంచ భూతాత్మకమైనదే. చెట్లు తదితరాలలో కూడా మనిషిలో ఉన్నట్లే పంచభూతాలూ ఉన్నాయి. వాటిక్కూడా మనిషికిలాగే వినటం, వాసన చూడటం, రసం, స్పర్శ, దృష్టి అనే ఐదు ఇంద్రియాలూ ఉన్నాయి. అవి ఇతర జంతువులకులాగా పైకి కనిపించక పోవచ్చు. అంతమాత్రం చేత వాటిని లేవు అని అనటానికి వీలు లేదు. వృక్షాల్లోనూ ఆకాశమనేది ఉంది. చెట్లకు స్పర్శను పొందే లక్షణం ఉంది. అలాగే గాలి వీచినప్పడు, పిడుగులు పడ్డప్పుడు కలిగే ధ్వనులకు పువ్వులు, పండ్లు రాలిపడుతుంటాయి. అంటే ఆ ధ్వనిని వినే శక్తి ఆ చెట్లకుంది.తీగలు చెట్లను చుట్టుకొని, లేదంటే పందిరికి ఎగబాకుతూ ముందుకు సాగిపోతుంటాయి. ముందుకు పోవాలంటే, ముందు ఏముందో అర్థం కావాలంటే ఎంతో కొంత దృష్టి ఉండాలి.
Tree Art Faces | Tree face | Tree faces, Tree carving, Tree sculpture

 ఈ తీగలు సాగే స్థితిని చూస్తే దృష్టి కూడా ఉంది అనే విషయం అర్థమవుతుంది. పవిత్రమైన గంధం కానీ, ధూపం కానీ ఆ చెట్లకు సోకినప్పుడు అవి చక్కగా ఎదుగుతుంటాయి.సుఖ దుఃఖాలను పొందే లక్షణాన్ని అవి కలిగి ఉన్నాయి . మనిషిలో ఎలా పరిణామ క్రమం ఉంటుందో వాటిలోనూ అలాంటి పరిణామక్రమమే కనిపిస్తూ ఉంటుంది. మొలకెత్తటం, పెరిగి పెద్దవ్వటం, పుష్పించి ఫలాలను ఇవ్వటం, కొంత కాలానికి వయస్సుడిగి నశించటం ఇవన్నీ చూస్తే ప్రాణం ఉన్న మనిషిలాగే చెట్టు కూడా కనిపిస్తుంది. వాయువును గ్రహించటం, తీసుకున్న ఆహారాన్ని జీర్ణం చేసుకోవటం, ఆహారం మారినప్పుడు తరగటం, పెరగటం ఇవన్నీ చెట్లలో కనిపిస్తుంటాయి. వ్యాధి సోకితే మనిషి బాధపడినట్లే చీడపీడలు సోకిన చెట్టు కూడా బాధ పడుతున్నట్లు నీరసించినట్టు కనపడుతుంది. చీడపీడలు వదలగానే రోగం తగ్గిన మనిషి లాగే నవనవలాడుతూ మళ్ళీ ఆ చెట్టు కనపడుతుంది.

Saturday, October 14, 2017

సీతాఫలము /రామాఫలము

Image result for సీతాఫలముసీతాఫలము /రామాఫలము . శీతాకాలం పండుగా పరిగణించే సీతాఫలం పోషకాల సమాహారం. కొన్ని రకాల అనారోగ్యాల నివారణి. మరెన్నో సుగుణాలున్న ఈ పండు గురించి వివరింగా తెలుసుకుందాం. ఈ కాలంలో మూడు నెలలకు పైగా లభిస్తుంది సీతాఫలం. ఈ పండు రామాఫలం, లక్ష్మణఫలం రకాల్లోనూ దొరుకుతుంది. చూడడానికి ఒకే విధంగా ఉన్నా.. రుచి, వాసనలో కాస్త తేడా ఉంటుంది. సీజన్‌ వస్తోందంటే చాలు... కొన్ని పండ్ల రుచి పదే పదే గుర్తొచ్చేస్తుంటుంది. మార్కెట్లో అవి ఎప్పుడెప్పుడు కనిపిస్తాయా అన్నట్లు ఎదురుచూసేలా చేస్తుంది. ఆ కోవకే చెందుతాయి సీతాఫలం, రామాఫలం, లక్ష్మణఫలాలు. ఈపేర్లు చూస్తే మన పురాణ పురుషులకు ఇష్టమైన పండ్లేవో అనిపించకమానదు. అంతేకాదు, ఇవి అచ్చంగా మనకి మాత్రమే ప్రత్యేకమైన పండ్లేనేవో అనిపిస్తుంది. కానీ వీటి స్వస్థలం మనదేశం కాదు. దక్షిణ అమెరికా, ఐరోపా, ఆఫ్రికన్‌ దేశాల్లో పెరిగే ఈ వెుక్కల్ని మనదేశానికి తొలిసారిగా పోర్చుగీసువాళ్లు పదహారో శతాబ్దంలో తీసుకొచ్చారట. ఆ తరువాత వీటికా పేర్లు ఎవరు పెట్టారో తెలియదుకానీ మనందరికీ ఇష్టమైన రాముడు, సీత, లక్ష్మణ పేర్లు పెట్టేసి తమ భక్తిని చాటుకున్నారు. మనరాష్ట్రంలో ఎక్కువగా పండే సీతాఫలాలతోనే మనకి అనుబంధం ఎక్కువ. కానీ ఉత్తరాంధ్ర, కొన్ని తెలంగాణా జిల్లాల్లోనూ కర్ణాటక, తమిళనాడు, కేరళ, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల్లోనూ రామాఫలాలు, లక్ష్మణఫలాలు ఎక్కువగా పండుతాయి. సీతాఫలం అమృతఫలాన్ని తలపించే సీతాఫలాన్నే కస్టర్డ్‌ యాపిల్‌ అనీ షుగర్‌ యాపిల్‌ అనీ పిలుస్తారు. ఇది దక్షిణ అమెరికా దేశాలతోపాటు మనదేశంలోనూ విరివిగా పండుతుంది. పండుగా తినడంతోపాటు స్వీట్లు, జెల్లీలు, ఐస్‌క్రీములు, జామ్‌లు చేస్తుంటారు. మనందరికీ పండుగానే సుపరిచితమైన ఇది ఛత్తీస్‌గఢ్‌ వాసులకు మాత్రం అద్భుత ఓషధీఫలం.

ఔషధ గుణాలు

దీని ఆకులు, బెరడు, వేరు... ఇలా అన్ని భాగాల్నీ అక్కడ పలు వ్యాధుల నివారణలో వాడతారట. మనదగ్గర కూడా చాలామంది సెగ్గడ్డలకు వీటి ఆకుల్ని నూరి కట్టుకడతారు. వీటి ఆకులకు మధుమేహాన్ని తగ్గించడంతోపాటు బరువు కూడా తగ్గించే గుణం ఉందని ఇటీవల కొందరు నిపుణులు చెబుతున్నారు. బెరడుని మరిగించి తీసిన డికాక్షన్‌ డయేరియాని తగ్గిస్తుందట. అలాగే ఆకుల కషాయం జలుబుని నివారిస్తుందట. పోషకాలు: 100గ్రా. గుజ్జు నుంచి 94 క్యాలరీల శక్తి, 20-25గ్రా. పిండిపదార్థాలు, 2.5గ్రా. ప్రొటీన్లు, 4.4గ్రా. పీచూ లభ్యమవుతాయి. ఇంకా కెరోటిన్‌, థైమీన్‌, రిబోఫ్లేవిన్‌, నియాసిన్‌, విటమిన్‌-సి వంటి విటమిన్లు కూడా సమృద్ధిగా లభిస్తాయి. ఇలా మేలు * ఈ ఫలాన్ని రసంరూపంలో కాకుండా నేరుగా తినడమే మంచిది. ఎందుకంటే గుజ్జు నోటిలోని జీర్ణరసాలను పెంచుతుంది. తద్వారా జీర్ణక్రియ వేగవంతమవుతుంది. * పండు గుజ్జును తీసుకుని రసంలా చేసి.. పాలు కలిపి.. పిల్లలకు తాగించాలి. సత్వర శక్తి లభిస్తుంది. * ఎదిగే పిల్లలకు రోజూ ఒకటి, రెండు పండ్లు తినిపిస్తే మంచిది. బలవర్థకమే కాదు.. ఫాస్పరస్‌, క్యాల్షియం, ఇనుము లాంటి పోషకాలు.. ఎముకల పరిపుష్టికి తోడ్పడతాయి. * మలబద్ధకంతో బాధపడేవారికి ఈ పండు దివ్యౌషధంలా పనిచేస్తుంది. రోజూ తినగలిగితే.. ఎంతో మార్పు కనిపిస్తుంది. * హృద్రోగులు, కండరాలు, నరాల బలహీనత ఉన్నవారు.. దీన్ని అల్పాహారంగా తీసుకుంటే ప్రయోజనం ఉంటుంది. * డైటింగ్‌ నియమాలు పాటించే వారు సైతం ఈ ఫలాన్ని నిరభ్యంతరంగా స్వీకరించవచ్చు. * పండులోని సల్ఫర్‌ చర్మవ్యాధుల్నీ తగ్గిస్తుంది. * సీతాఫలం గుజ్జు శరీరంలోని క్రిములు, వ్యర్థపదార్థాలను వెలుపలికి పంపించి వేస్తుంది. పండే కాదు.. * ఒక్క సీతాఫలం పండే కాదు.. ఆకులు ఉపయోగపడతాయి. ఆకుల్లోని హైడ్రోస్తెనిక్‌ ఆమ్లం చర్మసంబంధ సమస్యల్ని తగ్గిస్తుంది. ఆకుల్ని మెత్తగా నూరి.. కాస్త పసుపు కలిపి.. మానని గాయాలు, గజ్జి, తామర ఉన్న చోట పూతగా రాస్తే సరిపోతుంది. * ఆకుల్ని మెత్తగా నూరి బోరిక్‌ పౌడర్‌ కలిపి మంచం, కుర్చీల మూలల్లో ఉంచితే.. నల్లుల బెడద ఉండదు. * సీతాఫలం బెరడును కాచగా వచ్చిన కషాయాన్ని అధిక విరేచనాలతో బాధపడేవారికి ఔషధంగా ఇస్తుంటారు. * సీతాఫలం గింజల్ని పొడిచేసి తలకు రాసుకుంటే పేల సమస్య ఉండదు. అయితే కళ్లల్లో పడకుండా చూసుకోవాలి. * గర్భిణులు ఈ పండును సాధ్యమైంత తక్కువగా తినాలి. పొరబాటున గింజలు లోపలికి పోతే గర్భస్రావం అయ్యే ప్రమాదముంది. గమనిక: మోతాదుకు మించి తీసుకోకూడదు. కడుపులో మంట, ఉబ్బరం బాధిస్తాయి. అలాంటప్పుడు వేడినీరు తాగినా.. అరచెంచా వాము లేదా ఉప్పు నమిలినా ఉపశమనం లభిస్తుంది. * మధుమేహ వ్యాధి గ్రస్తులు, వూబకాయులు ఈ పండ్లను వైద్యుల సలహాతో తీసుకోవాలి. * జలుబు, దగ్గు, ఆయాసం, ఎలర్జీ సమస్యలో బాధపడేవారు.. సీతాఫలాన్ని పరిమితంగా తీసుకోవడం మంచిది. . సీతాఫలంలో సి విటమిన్‌, కాల్షియం, ఫాస్పరస్‌, పొటాషియం, మెగ్నీషియం సమృద్ధిగా లభిస్తాయి. నోటిలో జీర్ణరసాలను ఊరేలా చేసే శక్తి అధికం ఈ పండుకు. ఇందులో ఉండే మెగ్నీషియం శరీరంలోని కండరాలకు విశ్రాంతినిస్తుంది. గుండె ఆరోగ్యాన్ని పరిరక్షిస్తుంది. కాల్షియం ఎముకల పటుత్వాన్ని పెంచుతుంది. పీచుపదార్థాలు... మలబద్ధకంతో బాధపడేవారికి మంచి మందు. ఇన్ని లాభాలున్నా మధుమేహ రోగులు వీటికి దూరంగా ఉండటమే మేలు. ఎందుకంటే వీటిలో ఉండే చక్కెరల శాతం చాలా ఎక్కువ. ఉబ్బసం రోగులు వైద్యుల సలహా తీసుకుని తినాలి. సీతాఫలాలను ఖాళీ కడుపుతో తినకూడదు, భోజనం చేశాకే తినాలి. తిన్నాక మంచినీళ్లు ఎక్కువగా తాగాలి.
సీతాఫలం (Custard apple) ఒక పండు. ఇది వర్షాకాలం తరువాత విరివిగా దొరుకుతుంది.

లక్షణాలు

  • చిన్న వృక్షం.
  • నిశితాగ్రంతో దీర్ఘవృత్తాకారం లేదా దీర్ఘచరురస్రాకారంలో ఉన్న సరళ పత్రాలు.
  • కాండాగ్రాలలో గాని, పత్రాభిముఖంగా గాని ఏర్పడిన ఏకాంత లేదా నిశ్చిత సమూహాలలో ఏర్పడిన ఆకుపచ్చని రంగుతో కూడిన తెలుపు పుష్పాలు.
  • గుండ్రంగా ఆకుపచ్చగా, నొక్కులున్న సంకలిత ఫలం.
  • భారతదేశం. ఇక్కడ ఆంధ్రప్రాంతములో శ్రీకాకుళం జిల్లా సీతంపేట మండలం లో ఈ ఫలములు అత్యధికంగా లభ్యమవుతాయి. ఇక్కడ నుండి కోల్ కతా, విజయవాడ, రాజమండ్రి, విశాఖపట్నం కు ఎక్కువుగా కొనుగోలు చేసి తీసుకుపోతుంటారు, ముఖ్యంగా కలకత్తా ప్రాంతంలో ఈ పండ్లు కు ఎక్కువ గిరాకీ ఉంది.

ఉపయోగాలు

  • సీతాఫలం మంచి రుచికరమైన ఆహారం. వీనిలో కాల్షియమ్ సమృద్ధిగా ఉంటుంది.
  • దీనిలో విటమిన్ 'సి' సంవృద్దిగా దొరుకుతుంది.
  • ఆహారం తేలిగ్గా జీర్ణమయ్యేటందుకు దీనిలో కల పీచుపధార్ధం తోడ్పడుతుంది.