మనఊరు మనచెట్టు

Monday, March 23, 2020

ఉగాది ఈసారి బాగా రాలేదు. వేప చెట్లకి 5 బిందల నీళ్ళు పోయాలి అనే ప్రచారం వెనుక దాగి ఉన్న రహస్యం ఏమిటి?

ఉగాది ఈసారి బాగా రాలేదు. వేప చెట్లకి 5 బిందల నీళ్ళు పోయాలి అని. ఒక ప్రచారం చేస్తున్నారు.

#manaurumanachettu t#manaurumanachettu_instagram #manaurumanachettu_official

ఉగాది మంచిగనే వచ్చింది.

వేప  చెట్టు కి నీళ్ళు పోస్తే వచ్చె నష్టం ఏమి లేదు. కానీ రాత్రి సమయంలో వృక్షాలు నిద్రావస్థ లో ఉంటాయి కనుక
అంతగా పోయాలనుకుంటే రేపు ఉదయం నీళ్ళు పోయండి.
కరోనా వైరస్ వేగంగా వ్యాపిస్తున్న నేపథ్యంలో  ప్రజలు ఎవరూ కూడా గుంపులు గుంపులుగా వెల్లకండి  ఈ విషయంపై కాస్త ఆలోచించి ఇంటివద్దే ఉండండి..
 👉  గమనించవలసిన విషయం ==>   వేప చెట్టు గాలి మనిషి సోకితే  ఆరోగ్య రిత్యా మంచిది కనుక ఊరికే వెల్లి నీళ్లు పోడండి అంటే వెల్లరు కనుక 5 బిందల నీళ్ళు పోయాలి అని చెప్పారు. మీకు అంతగా పోయాలనుకుంటే  ఎవరి ఇంటి ముందు వారు వేప మొక్క నాటి నీళ్ళు పోయండి.
కాస్త ఆలోచించండి.

 కరోనా వైరస్ ని అరికడుదాం!  కరోనా మహమ్మారి నుండి దేశాన్ని రక్షిద్దాం!!
_____@_____post by  మనఊరు మనచెట్టు టీం ______@___

Friday, March 20, 2020

జనతా కర్ఫ్యూ అంటే ఏమిటి.?


జనతా కర్ఫ్యూ వెనుక అసలు ఉద్దేశ్యం
(జనతా కర్ఫ్యూ పాటించాల్సిన సమయం: 
ఆదివారం ఉదయం 7 గంటల నుండి 
సాయంత్రం 9 గంటల వరకూ!)
ఒక ప్రదేశంలో కరోనా వైరస్ జీవితం 12 గంటలు! 
జనతా కర్ఫ్యూ 14 గంటలు!
కాబట్టి కరోనా బతికి ఉన్న బహిరంగ ప్రదేశాలు, 14 గం.ల తరువాత కరోనా వైరస్ లేని ప్రాంతాలుగా మారతాయి! అప్పుడు మనం ఆ ప్రదేశాలు తాకినా కరోనా వైరస్ అంటుకోదు! 
ఈ విధంగా మనం కరోనా వైరస్ వ్యాపించే లింకును ఛేధిస్తున్నామన్నమాట! అప్పటికే కరోనా సోకిన వారిని గుర్తించి ఏకాంత వైద్య శిబిరాలకు చేరుస్తాము కాబట్టి, మిగిలిన దేశమంతా వైరస్ బారిన పడకుండా క్షేమంగా ఉండాలని... మన ప్రధాని మోడీ గారి ఉద్ధేశ్యం! 
ఇది మన కోసం, మన దేశ ప్రజల క్షేమం కోసం! అందరం భాగస్వాములౌదాం!
సరిగ్గా సాయంత్రం 5 గం.లకు కరోనా మహమ్మారి నిర్మూలనకు ఎంతగానో శ్రమిస్తున్న డాక్టర్లు, నర్సులు, ఇతర అత్యవసర సేవా సిబ్బందికి (అంబులెన్స్ డ్రైవర్ నుండి ఆకుకూరలు, పాల పాకెట్లు వేసే కుర్రాడు వరకూ) కృతజ్ఞతగా ఇంటి వాకిట్లోకి/బాల్కనీలోకి వచ్చి చప్పట్లు కొడుతూ జేజేలు పలికడం మరచిపోవద్దు✊🙏

-----------@  post by మనఊరు మనచెట్ట టీం _@______

ఈ ఆదివారం జనతా కర్ఫ్యూ కి ఇలా సిద్ధం అవండి..!

ఆది వారానికి ఎలా ప్రిపేర్ అవ్వాలి.
1. శనివారం నాదే రెండు రోజులకి సరిపడా పాలు పెరుగు దగ్గర పెట్టుకోండి.
 2. రెండు రోజులకి సరిపడా కూరలు కొనండి.
3. అవుసరమైన మందులు ఉన్నాయా లెవా చూసుకొని ఒకవేళ లేకపోతె శని వారం తెచ్చుకోండి.
 4. పిల్లలకి కావలసిన స్నాక్స్ తెచ్చి పెట్టుకోండి.
 5. ఆదివారం చేద్దాం అనుకున్న బయట పనులు వాయిదా వేసుకోండి. లేకపోతె శనివారం పూర్తి చెయ్యండి.
 6. ఇంట్లో కూడా ఎక్కువమందిని ఆహ్వానించకండి.
7. అందరూ ఇంట్లోనే ఉంటారు కాబట్టి ఇల్లు క్లీనింగ్ పనులు చెయ్యండి ఎందుకంటే నూతన సంవత్సరాది దగ్గర్లోనే వస్తోంది. 8. పారాసెటమాల్ టాబ్లెట్స్ ఒక స్ట్రిప్ దగ్గర ఉంచుకోండి.
9. డోర్ కర్టైన్స్ విండో కర్టైన్స్ అన్నీ బయటకు తీసి వీలయితే వాషింగ్ చెయ్యండి.
 10. బయట నుండి ఫుడ్ ఆర్డర్ ఇవ్వకండి.
11) 22 వ తేదీ నాడు ఇంట్లో ఉన్న టీవీ remote, AC Remote. Lighter,  Door nobs, door handles, Door latches, మీరు వాడే bike లు,.watch strips, bike key s, anni kooda Dettol కలిపిన water lo clean cheyandi.
12) Bike లు కూడా వీలయితే Dettol కలిపిన water tho ఇంట్లోనే clean cheyandi.(Atleast handle grips, etc)
13) పండుగ వస్తుంది కాబట్టి, ఇంట్లో మీ శ్రీమతి కి house cleaning lo సహాయ పదండి.
14) Lunch అందరు కలిసి చేయండి.(ఇంట్లో prepare chesina food మాత్రమే)
15) Only Vig మాత్రమే!
16) After lunch పైన ఉన్న అన్ని రకాల పనులు చేశారు కాబట్టి rest తీసుకోండి.
17) సరిగ్గా 5.00PM కు మీ ఇంటి gate దగ్గర నిలబడి 5 నిమిషాలు, ఇంత కష్ట సమయంలో కూడా ధైర్యంగా వైద్యం అందిస్తున్న వైద్యులకు కృతజ్ఞతలు తెలియచేయండి.
18) Evening 7-10ETV సినిమా లో పాత తరం సినిమా చూసి ఆనందించండి.(మీకు నచ్చిన సినిమా కూడా చూడొచ్చు)
19) జనతా కర్ఫ్యూ విజయ వంతం చేయండి..
         

      _______@_   Post  by_మనఊరు మనచెట్టు టీం----@----

Tuesday, February 11, 2020

ఆవాలు

ఆవాలు కోసం చిత్ర ఫలితంపోపు దినుసుగా ప్రతి ఇంట్లో ఉండే ఆవాలు మన ఆరోగ్యానికి మేలు చేస్తాయి. వీటిలో మెగ్నీషియం, కాల్సియం, మాగనీస్, జింక్, ఒమెగా 3 ఫ్యాటియాసిడ్స్, ప్రోటీన్లు, పీచుపదార్దము ఉంటాయి . ఘాటైన వాసనను కలిగి ఉండే ఆవాలు ఆయుర్వేదంలో ఎంతో బాగా ఉపయోగపడతాయి. పైథోన్యూట్రియంట్లు, ఖనిజ లవణాలు, యాంటీ ఆక్సిడెంట్లు, డైటరీ ఫైబర్‌ ఎక్కువగా లభిస్తాయి. * ప్రతి వందగ్రాముల ఆవాలలో 9-82గ్రా టోకోఫెనాల్‌ అనే పదార్థం (విటమిన్‌ 'ఇ'కి సమానం) శరీరంలో కొవ్వు నిల్వలు పేరుకోకుండా సహాయపడుతుంటాయి. అందుకనే కొంచెంగా ఆవనూనెను కూరల్లో వాడుకోమని వైద్యులు సూచిస్తారు. * ఆవాల్లోని సెలీనియం రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఊపిరితిత్తుల సమస్యలను, వాపులను తగ్గిస్తుంది. పోపుల్లో వాడినప్పుడు ఆకలిని పెంచి.. ఆహారాన్ని అరిగేటట్లు చేస్తుంటాయి. * గొంతునొప్పి, దగ్గు జ్వరం ఉన్నప్పుడు మరుగుతున్న నీళ్లలో చిటికెడు ఆవపోడి, తగినంత తేనె వేసి ఇస్తే సమస్యలు నియంత్రణలో ఉంటాయి. ఘాటైన నూనెలు క్యాన్సర్‌కు వ్యతిరేకంగా పోరాడతాయి. ఇవి రక్తప్రసరణను వేగవంతం చేస్తుంటాయి. ఆవాలను దంచి వాపుగల ప్రదేశం, గౌట్‌ నొప్పిపైన పట్టుగా పెడితే ఉపశమనం ఉంటుంది. అరబకెట్‌ వేడినీళ్లలో చెంచా ఆవాల పొడి వేసి కాళ్లను కొద్దిసేపు ఉంచితే పాదాల నొప్పులు త్వరగా తగ్గుతాయి. * తెల్ల ఆవనూనె చర్మ రంగును మెరుగు పరుస్తుంది. దీన్ని శరీరానికి రాసుకొని, నలుగుపెట్టి స్నానం చేస్తే చర్మ సమస్యలు తగ్గి రంగు తేలుతుంది. అలానే కొబ్బరినూనెలో ఆవనూనెను కలిపి శిరోజాలకు రాస్తుంటే ఫలితం ఉంటుంది.

  • విస్తారమైన శాఖలతో పెరిగే ఏకవార్షిక గుల్మము.       
  • మూల సంబంధ పత్రాలు, పిచ్చాకార నొక్కులుతో, ప్రకాండ సంబంధ పత్రాలు.
అండాకారంగా శాఖాయుత అనిశ్చిత విన్యాసంలో అమరి ఉన్న పసుపు పచ్చని పుష్పాలు. 


పోషకాలు :- 
    ఆవాలు కోసం చిత్ర ఫలితం
  • తేమ- 6.5గ్రా,
  • పొటాషియం- 20.3గ్రా,
  • కొవ్వు- 39.7గ్రా,
  • ఖనిజాలు- 2.4గ్రా,
  • పీచు- 4.8గ్రా,
  • పిండిపదార్థాలు- 23.8గ్రా,
  • శక్తి- 541కిలో కెలోరీలు,
  • క్యాల్షియం- 490మిగ్రా,
  • ఫాస్పరస్‌- 700మిగ్రా,
  • ఇనుము- 7.9.
  • టోకోఫెనాల్‌-9-82గ్రా

ఆవాల గింజల నుంచి మూడు రకాలుగా తయారయిన నూనె లకి ఆవాల నూనె లేదా ఆవ నూనె (ఆంగ్లం: Mustard oil) అనే పదాన్ని ఉపయోగిస్తారు:
  1. విత్తనాలను దంచడం ద్వారా వచ్చే క్రొవ్వుతో కూడిన స్థావర నూనె (ఉద్భిజ్జ తైలం),
  2. విత్తనాలను రుబ్బి, నీటితో కలిపి, స్వేదన ప్రక్రియ ద్వారా ఆవశ్యక నూనెని గ్రహించడం వంటి పద్ధతుల ద్వారా లభించే సుగంధ తైలం.
  3. ఆవాల గింజల లభ్యాన్ని సోయాబీన్ నూనె వంటి వేరే స్థావర నూనెతో కలపడం ద్వారా చేసే నూనె.


ఆవ గింజలు ఆవ మొక్కల నుండి లభించే చిన్న గుండ్రని విత్తనాలు. ఇది సాధారణంగా 1 or 2 మి.మీ. పరిమాణంలో ఉంటాయి. ఇవి పసుపు పచ్చని తెలుపు నుండి నలుపు మధ్య రంగులలో ఉంటాయి. ఇది మూడు రకాల మొక్కలనుండి లభిస్తాయి: నల్లని ఆవాలు నుండి, బ్రౌన్ ఆవాలు  నుండి మరియు తెల్లని ఆవాలు  నుండి తీస్తారు.* ఆవాలను చాలా తక్కువ మోతాదులో తీసుకోవాలి. కారణం వీటిలోని ఘాటైన ద్రవ్యాలు పైత్యాన్ని పెంచుతాయి. కడుపు మంట, చర్మ సమస్యలు ఉన్నవారు పోపులకే పరిమితమైతే మంచిది. * మరీ అధికంగా తీసుకొంటే పైత్యం చేసి శరీర వేడిని పెంచుతాయి. దురదలు మంటలు పెరుగుతాయి, కొన్నిసార్లు కడుపులో రక్తం విరుగుతుంది. ముఖ్యంగా ఎండాకాలం, వేడి శరీరం కలవారు మితంగా తీసుకుంటే మంచిది. విరుగుడు మజ్జిగ, పెరుగు.


     వైద్య పరం గా ఉపయోగాలు          

    ఆవాలు కోసం చిత్ర ఫలితం
  1. పంటి నొప్పి కలిగినపుడు గోరువెచ్చటి నీటిలో ఆవాలు వేసి కొంత సేపు తర్వాత ఆ నీటిని పుక్కలేస్తే నొప్పి తగ్గుతుంది .
  2. ఆవాలపోడితో జుట్టు కడుక్కూంటే .. జుట్టు రాలడం తగ్గుతుంది ..
  3. పేలు తగ్గదానికు తగ్గదనికు ఆవాల పొడి నునే రాసుకోవాలి .
  4. మాడు మీద కురుపులు, దురదలను అవ్వలు తగ్గిస్తయాయి .
  5. ఉబ్బసం వ్యాధి ఉపశమనానికి ఆవాలను కొద్దిగా చెక్కెరతో కలిపి తీసుకోవాలి.
  6. ఆవాల పొడిని తేనేతో కలిపి తీసుకుంటే శ్వాసకోశ సమస్యలను పరిస్కరించవచ్చును .
  7. మందంగా ఉన్న పులిపిరి కాయలమీద ఆవాలు నూరిన ముద్దా రాస్తే పులిపిరులు ఎండి రాలిపోతాయి .
  8. కీళ్ళ నొప్పులతో బాధపడేవారు .. ఆవాల ముద్దా, కర్పూరము కలిపి బాధించే ప్రాంతమము మీద రాయటం వల్ల బాధ తగ్గుతుంది .
  9. ఆవాలులో సెలీనియం అనే రసాయనం వలన మనకు యాంటీ ఇంఫ్లమేటరీ ప్రయోజనాలు ఉన్నాయి. ఆవాలలోని మెగ్నీషియం అస్థమా మరియు కీళ్ళ వాతం మరియు రక్త పోటును తగ్గించును.
  10. ఇవి పార్శవ నొప్పిని తగ్గిస్తాయి. 

    వాడకూడని పరిస్తితులు

  • జీర్ణ కోశ అల్సర్లు, కిడ్నీ జబ్బులు ఉన్నా వారు
  • దీని వేపర్స్ (పొగలు) కంటికి తగిలితే కన్ను ఇర్రిటేట్ అగును .
  • ఆరు సం. లోపు పిల్లలకు ఇవ్వకూడదు .